పేరు (ఆంగ్లం) | Kanchanapalli Kanakamma |
పేరు (తెలుగు) | కాంచనపల్లి కనకమ్మ |
కలం పేరు | – |
తల్లిపేరు | కాంచనపల్లి రంగమ్మ |
తండ్రి పేరు | కాంచనపల్లి రంగారావు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 9/3/1893 |
మరణం | 1/1/1988 |
పుట్టిన ఊరు | దుర్గి, గుంటూరు జిల్లా |
విద్యార్హతలు | బి. ఏ ఆంగ్లము |
వృత్తి | ఆంధ్రోపన్యాసకురాలు |
తెలిసిన ఇతర భాషలు | ఆంధ్రము మరియు ఆంగ్లము |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | 1912లో కాశీయాత్రాచరిత్ర, 1916లో రంగశతకం, 1917లో అమృతవల్లి (నవల),1919లో జీవయాత్ర, 1927లో పద్యముక్తావళి, 1931లో రామాయణ కథా సంగ్రహం (సంస్కృత గద్య), ఆనందసారము. అమృతసారము, హంసవిజయం – తెలుగు నాటకం, గౌతమ బుద్ద చరిత్ర, పాండవోదంతం, చక్కని కథలు. వీరు కాళిదాసు ”అభిజ్ఞాన శాకుంతలము” సంస్కృత నాటకాన్ని కూడా ఆంధ్రీకరించారు. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | వీరికి “కవితా విశారద”, “కవితిలక” అనే బిరుదులు మరియు కేసరి గృహలక్ష్మి స్వర్ణకంకణం అందుకున్నారు |
ఇతర వివరాలు | బాల్యవితంతువైన కనకమ్మగారు తన తండ్రి ఇంటిపేరే జీవితాంతం ఉంచుకొన్నది ఈమె బి.ఎ. ఆంగ్లములో పట్టభద్రురాలై కొంతకాలం నెల్లూరు, చెన్నైలలో లేడీ వెల్లింగ్టన్ ఉన్నత పాఠశాలలోను, క్వీన్ మేరీస్ కళాశాల లోను ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు. మాక్విలన్ కంపెనీ వంటి విద్యాసంస్థల కోసం తెలుగు పుస్తకాలు రచించారు. ఆనాటి అన్ని స్త్రీల పత్రికలలోను వీరి రచనలు చురించబడ్డాయి. పద్యం, కథ, నవల, నాటకం, జీవితచరిత్ర, యాత్రాచరిత్ర వంటి ప్రక్రియలన్నిటిలోను రచనలు సారు.వీరు కొంతకాలం మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగు పాఠ్యగ్రంథ నిర్ణాయక సమితి సభ్యులుగా పనిచేశారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కాంచనపల్లి కనకమ్మ |
సంగ్రహ నమూనా రచన | శ్రీమతి కాంచనపల్లి కనకమ్మ గారు ”అభిజ్ఞాన శాకుంతలము” అనే సంస్కృత నాటకాన్ని ఆంధ్రీకరించారు. ఈ విధంగా ఆధునిక తెలుగు నాటక సాహిత్యంలో స్త్రీలు కూడా తమవంతు బాధ్యతను నిర్వహిస్తూ నాటకాలు, ఏకాంక నాటకాలు, నాటికలు రచించిన విశేష ఆదరణను పొందారనడంలో అతిశయోక్తి లేదు |
కాంచనపల్లి కనకమ్మ
శ్రీమతి కాంచనపల్లి కనకమ్మ గారు ”అభిజ్ఞాన శాకుంతలము” అనే సంస్కృత నాటకాన్ని ఆంధ్రీకరించారు. ఈ విధంగా ఆధునిక తెలుగు నాటక సాహిత్యంలో స్త్రీలు కూడా తమవంతు బాధ్యతను నిర్వహిస్తూ నాటకాలు, ఏకాంక నాటకాలు, నాటికలు రచించిన విశేష ఆదరణను పొందారనడంలో అతిశయోక్తి లేదు
బాల్యవితంతువైన కనకమ్మ తన తండ్రి ఇంటిపేరే జీవితాంతం ఉంచుకొన్నది.[1] ఈమె బి.ఎ. ఆంగ్లములో పట్టభద్రురాలై కొంతకాలం నెల్లూరు, చెన్నైలలో లేడీ వెల్లింగ్టన్ ఉన్నత పాఠశాలలోను, క్వీన్ మేరీస్ కళాశాల లోను ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు. మాక్విలన్ కంపెనీ వంటి విద్యాసంస్థల కోసం తెలుగు పుస్తకాలు రచించారు. ఆనాటి అన్ని స్త్రీల పత్రికలలోను వీరి రచనలు ప్రచురించబడ్డాయి. పద్యం, కథ, నవల, నాటకం, జీవితచరిత్ర, యాత్రాచరిత్ర వంటి ప్రక్రియలన్నిటిలోను రచనలు చేసారు.
కనకమ్మ పద్యం, కథ, నవల, నాటకం, జీవితచరిత్ర, యాత్రాచరిత్ర వంటి ప్రక్రియలన్నిటిలోను రచనలు చేసారు. “రంగ శతకము” ఈమె మొదటి రచన. “గౌతమ బుద్ధ చరిత్రము, “పాండవోదంతము” అను గద్య కావ్యములు, “కాశీయాత్ర చరిత్రము”, “పద్య ముక్తావళి” మున్నగు గ్రంధములను రచించెను. “అమృతసారము” లో కొన్ని అమూల్యమైన సంగతులను సులభమైన రీతిలో తేలికైన మాటలలో వివరించినారు.
———–