కొడవగంటి కుటుంబరావు (Kodavatiganti Kutumbarao)

Share
పేరు (ఆంగ్లం)Kodavatiganti Kutumbarao
పేరు (తెలుగు)కొడవగంటి కుటుంబరావు
కలం పేరు
తల్లిపేరుసుందరమ్మ
తండ్రి పేరురామచంద్రయ్య
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1909
మరణం1/1/1980
పుట్టిన ఊరుతెనాలి , గుంటూరు జిల్లా
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుచదువు , అరుణోదయం , వారసత్వం ,గడ్డురోజులు ,ఎండమావులు ,బ్రతుకు భయం ,ప్రేమించిన మనిషి ,చెదిరిన మనుషులు , జీవితం ,తార ,అనామిక , కులం లేని మనిషి ,సరితా దేవి డైరి , మృత జీవులు ,ఇల్లరికం ,తల్లి లేని పిల్ల , కామినీ హృదయం ,రాజుగారి తలనొప్పి ,సుస్వాగతం ,కథా వాహిని , స్వగతం , కారుణ్యం ,దీపావళి రాజకీయాలు , అనుభవం ,కొత్త అల్లుడు , కొత్త కోడలు ,నిలువ నీరు ,మహా ఇల్లాలు ,మొండిగాడు ,ఆడజన్మ , తిండి దొంగ , దత్త పుత్రుడు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకొడవగంటి కుటుంబరావు
చెడిపోయిన మనిషి
సంగ్రహ నమూనా రచనపట్టుదల ముందు పుట్టి తరవాత మా పార్వతీశం పుట్టాడు “ అంటూండేది ఆయన తల్లి . ఒకసారి కాదు , ఒకరితో కాదు ; లక్ష మందితో లక్షన్నరసార్లు .
పట్టుదల అన్నది పార్వతీశానికి బుద్ధి తెలిసినప్పటి నుంచీ ఒక బిరుదన్న భావం ఏర్పడి పోయింది . లోకం నీకు రూపం ఇస్తుంది . నువ్వెలాటి వాడివని లోకం కోడై కూస్తే అలాటి వాడివిగానే తయారు కావటానికి నువు నీ జీవశక్తిని ధారపోస్తావు

కొడవగంటి కుటుంబరావు
చెడిపోయిన మనిషి

పట్టుదల ముందు పుట్టి తరవాత మా పార్వతీశం పుట్టాడు “ అంటూండేది ఆయన తల్లి . ఒకసారి కాదు , ఒకరితో కాదు ; లక్ష మందితో లక్షన్నరసార్లు .
పట్టుదల అన్నది పార్వతీశానికి బుద్ధి తెలిసినప్పటి నుంచీ ఒక బిరుదన్న భావం ఏర్పడి పోయింది . లోకం నీకు రూపం ఇస్తుంది . నువ్వెలాటి వాడివని లోకం కోడై కూస్తే అలాటి వాడివిగానే తయారు కావటానికి నువు నీ జీవశక్తిని ధారపోస్తావు . మహా దాతలూ , మహా వీరులూ చాలా మంది ఆ విధంగా తయారైన వాళ్లేనేమో ? మహా కవులూ , మహా మేధావులు మొదలైన మటుకు ఈ విధంగా తయారు కాలేదు . అందుకు ‘కండిషనింగ్ ‘ ఒకటే చాలదు . మనిషిలో స్వతహాగా కొంత ‘పిండి ‘ ఉండాలి . అయినా మరొక మహాకవి అనీ , మహామేధావి అనీ , మహా పురుషుడనీ ఇతరులు అనుకునేట్టుగా కండిషనింగ్ జరగవచ్చు – జరుగుతూనే ఉన్నది కూడా .
మనకు ప్రస్తుతం కావలసింది పార్వతీశం పట్టుదల . అవును చాలా దశాబ్దాలుగా పార్వతీశం పట్టుదల లోక ప్రసిద్ధమయింది – పార్వతీశం జీవించిన చిన్న లోకంలోనే అనుకోండి . అచ్చంగా తల్లి యిచ్చిన కితాబు వల్లనే పార్వతీశం పట్టుదల మనిషి అయినాడనుకో నవసరం లేదు . అతని మేనమామ లిద్దరూ ‘మొండి వాళ్లు ‘ అనే కీర్తి తెచ్చుకున్నారు . వాళ్ల మొండితనాన్ని పట్టుదల అని ముద్దుగా చెప్పుకునే వాళ్లు లేకపోయారు .
తన యాభై అయిదేళ్ల జీవితంలోనూ పార్వతీశం తన మొండితనాన్ని ఒక పతకంలాగా , అనడరికీ కనిపించేటట్టు ధరించి తిరిగాడు . వీలయిన చోట తన మాట నెగ్గించుకుని వీరుడనిపించుకున్నాడు . వీలుకాని చోట తన పంతం చెడకుండా దక్కించుకుని నష్టపోయిన మహా వీరుడనిపించుకున్నాడు – కనీసం తనకు తాను అనుకున్నాడు .
పై వాళ్లదేమిటిలెండి ! లోకులు పలుగాకులు ? కొందరు పార్వతీశాన్ని మూర్ఖుడన్నారు . ఇంకా కొందరు రాక్షసుడూ , బండరాయి , కర్కోటకుడూ అని కూడా అన్నారు . పై వాళ్లే కాదు , దగ్గిర వాళ్లు కూడా ఆయనను అటువంటి మాటలన్నారు .
తన అత్తవారిళ్ళతో కూడా పేచీ వచ్చి పార్వతీశం తన భార్యను ఒక కాలు శతాబ్దం పాటు పుట్టింట గడప తొక్క నివ్వకపోతే ఆ ఇల్లాలు తన భర్తను తన మనసులో కర్కోటకుడనే తిట్టుకున్నది .
పార్వతీశం కొడుకు లిద్దరూ తండ్రి మూలకంగా కత్తి మీద సాము చేసి , తండ్రికి అన్ని రకాల శాపనార్ధాలు పెట్టి , చివరకు రెక్కలు రాగానే ఎగిరి చక్కా పోయారు .
పుష్కలంగా డబ్బు గలవాడై ఉంటే పార్వతీశం పట్టుదల నలుగురికీ నదరుగా కనిపించేది . రాణింపుకూ వచ్చేది , కాని చింతపండు వీశె బేడా అర్ధణాకు అమ్మిన రోజుల్లోనే పార్వతీశం బీదతనానికి కూత వేటు దూరంలో ఉంటూ వచ్చాడు . స్కూలు ఫైనల్ దాకా చదివి టైపింగ్ , షార్ట్ హాండ్ పరీక్షల్లో జిల్లా కంతకూ పెద్ద మార్కు తెచ్చుకున్నాడు . ఆ యేడే పదేళ్ల పిల్లను పెళ్లాడి అత్త వారిచ్చిన కట్నంతో ఒక ఇన్ స్టిట్యూట్ ప్రారంభించినాడు . దాన్ని నడుపుతూనే పెద్ద పరీక్షలు పాసై , టైపింగ్ లో అసాధారణ శక్తి గలవా డనిపించుకున్నాడు .
‘ఎట్లాగైనా పార్వతీశందే పట్టుదల అంటే !’ అని చాలా మంది మెచ్చుకున్నారు .
పట్నంలో ఏదో పెద్ద కంపెనీ వాళ్లు స్టెనో కోసం ప్రకటన వేశారు . ‘ నీ కా ఉద్యోగం సునాయాసంగా దొరుకుతుంది ‘ అని నలుగురూ ఉబ్బేసిన మీదట ఆ ఉద్యోగం కోసం అప్లయి చేశాడు . ఇంటర్వ్యూకి వెళ్లాడు . దొరచెప్పిన డిక్టేషను తీసుకుని , ఒక్క తప్పు లేకుండా టైప్ చేసి ఇచ్చి , వెంటనే ఉద్యోగం సంపాదించాడు . నెల తిరగకుండానే దొరతో పోట్లాడి , ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి , ఇంటికొచ్చేసాడు .
ఉద్యోగానికి దరఖాస్తు పెట్టమన్న వాళ్లే ‘మూర్ఖుడు ‘అన్నారు .
ఒక సిద్ధాంతానికి నిలబడిన వాడు తన సిద్ధాంతం ద్వారా లోకానికి మహోపకారం చెయ్యలేని వాడు అనేక మందికి హాని మాత్రమే చేస్తాడు . కాని అందుకు లక్ష్య పెట్టడు . పట్టుదల అన్నది కేవలము వ్యక్తిపరంగా ఉన్నప్పుడది లోకానికి చెయ్యగల మహోపకారమేమీ ఉండదు .
పార్వతీశం తన దగ్గిర వాళ్ళలో ఏ ఒక్కరికీ ఏనాడూ ఆవగింజంత సుఖాన్ని తన పట్టుదల ద్వారా కలిగించలేదు .కానీ కష్టాలూ , మనః క్లేశమూ పుష్కలంగా కలిగించాడు .
అసలు పార్వతీశం భార్య వదిలి పెట్టి లోకాంతరాలకు వెళ్లిపోయింది . అంతకు ముందే కొడుకులు ఆయనను వదిలి పెట్టి దేశాంతరాలకు అంటే ఆంద్ర ప్రదేశాంతరాలకు వెళ్ళిపోయారు . వాళ్లు తమ భార్య బిడ్డలతో ఎట్లా కాపురం చేస్తున్నారో పార్వతీశానికి తెలీదు . వాళ్లు బాగానే సంపాదించుకుంటున్నారని మాత్రం విన్నాడు . వాళ్లు ఆయనకు ఏనాడూ ఎర్రని ఏగానీ పంపలేదు . పట్టుదలే ఒక పెట్టని అలంకారంగా గల పార్వతీశం వారిని ఒక రోలీ యాచించనూలేదు.
పట్టుదలే పెట్టని అలంకారంగా గల వాడిలో కూడా ఏ మూలో మానవ దౌర్బల్యం ఉంటుంది . పార్వతీశంలో అది కూతురి చుట్టూ గూడు కట్టుకుంది . తన చిన్నతనంలో తల్లిమీద ఉండిన మమకారంమంతా కూతురి మీదికి తిప్పుకున్నాడాయన . కూతురికి ‘వర్ధిని ‘ అన్ని తల్లి పేరే పెట్టుకున్నాడు .
వర్దినిని పార్వతీశం గారాబం చేసి చెడగొట్టాడనడం అతిశయోక్తి అవుతుంది . పార్వతీశం గుండెలో ఒకరిని గారాబం చేసేటంత ‘చెమ్మ ‘ఏనాడూ లేదు . కాని తమ కొడుకులల్లే వర్ధని తనను ద్వేషించదనీ , తన పట్టుదలను గౌరవిస్తుందనీ నమ్మేడు . ఆ నమ్మకానికి విఘాతం కలిగేటట్టుగా వర్ధని వాక్కాయ కర్మలేవీ ప్రదర్శింపలేదు .
వర్ధని స్కూలు ఫైనలు దాకా చదువుకున్నది . అప్పుడు పార్వతీశానికి ఆమె పెళ్లి గురించి ఆలోచన వచ్చింది . ఎరిగున్న వాళ్లను కొందరిని కదిపి చూశాడు . ఆడపిల్ల కట్నాలతో కూడుకున్నదని వాళ్లన్నప్పుడు పార్వతీశానికి మండిపోయింది . కట్నాల విషయం తెలియక కాదు . తనను , పార్వతీశాన్ని కూడా కట్నాలివ్వమని సలహా ఇవ్వగల ధైర్య సాహసాలు ఇతరుల కుండటం తల తీసేసినట్టనిపించింది .
“కట్నాలు తీసుకోకుండా పిల్లలను చేసుకుంటున్న వాళ్లు బోలెడుమంది ఉన్నారు “ అన్నాడు పార్వతీశం .
“ఎక్కడున్నారు ? కాస్త చూపించి పుణ్యం కట్టుకోండి “ అన్నాడు ఆయన హితైషులు .
నిజానికి పార్వతీశానికి కట్నం ధారపోసి సత్తాలేదు . పెళ్లి ఖర్చులు అవినా తేలికలో పోయేటట్టుంటే భరించగలడు . ఆ పైన ఆయన వల్ల కాదు . కాని ‘ నా దగ్గిర లక్ష రూపాయాలున్నా కట్నం పోసి నా కూతురికి మొగుణ్ణి తీసుకురావడం అవమానకరం !’ అని తనను తాను నమ్మించుకుని అటు తరవాత అదే తన నిర్ణయం అయినట్లుగా ప్రవర్తించాడు .
చిత్రమేమిటంటే , వర్ధనికి కట్నాలు కోరని సంబంధాలు వచ్చాయి . ‘కట్నం ఇవ్వను ‘అన్న తన నియమాన్ని అవహేళన చెయ్యడానికి వచ్చినట్టుగా అవి వచ్చాయి . ఒకడు వయసు మళ్ళిన రెండో పెళ్లివాడు . ఒకడు వయసు అంతగా మళ్ళని మూడో పెళ్లివాడు . ఇంకొకడు పెళ్లాంతో బాటు మామగారింట తిష్ట వేసి రెండు పూటలా ఇంత తిండి పెడితే చాలునన్న వాడు .
“ఛీ ఛీ , ఇంత కన్నా నా కూతురు పెళ్లి కాకుండా ఉండటం లక్ష రెట్లు మేలు “ అన్నాడు పార్వతీశం .
వర్ధని కూడా ఆ మాటే అన్నది . పార్వతీశం ఆశ్చర్యపడలేదు .’ఎవరో ఒకణ్ణి పెళ్లి చేసెయ్యి నాన్నా ?” అని ఆమె అని వుంటే ఆయన నిర్ఘాంతపోయి ఉండేవాడు.
వర్ధని అలా అనక ,”నా పెళ్లి కోసం ఎందుకు హైరానపడుతున్నావు నాన్నా ! ఓపిక వుంటే చదివించు “ అన్నది .
“బాగా అన్నావే అమ్మాయ్ ! లేకపోతే ఏమిటి ?” అని పార్వతీశం తన కూతురిని కాలేజీలో చేర్పించాడు .
వర్ధని బియ్యే పాసయింది . ట్రైయినింగు పొందింది . పంతులమ్మ ఉద్యోగం సంపాదించి తండ్రిని కూడా పోషిస్తూ వచ్చింది .
ఒక ఏడాది పార్వతీశానికి నిశ్చంతగా గడిచింది . ఆ తరువాత ఒక స్నేహితుడు లాంటి శత్రువు ఆయన తలలో విశాబీజం వేశాడు .
పార్వతీశానికి సహజ శత్రువులు కొందరు లేకపోలేదు . ప్రతి నియమ వ్రతుడికీ కొందరు శత్రువులు అనుకోకుండానే ఏర్పడతారు . పార్వతీశం ‘పట్టుదల ‘వల్ల ఆయన భార్యా , బిడ్డలూ పడినంత హింస ఇతరులు పది ఉండక పోవచ్చుగాక , కాని దాని వల్ల అవమానం పొందిన వాళ్లు చాలా మంది ఉన్నారు . అవమానం పొందటానికి ఎంత కావాలి ? నువు బాగుందన్న సినిమాగాని , పుస్తకం గాని మరొకడు ఏమీ బాగా లేదనీ , వట్టి చెత్త అనీ అంటే నీకు చచ్చే అవమానం ! నా సలహా ఎంతో ఆప్యాయంగా ఇచ్చినది నువు తోసి పారేస్తే నాకు తీరని అవమానం ! పార్వతీశం తానెరిగిన వారికి దాదాపు అందరికీ ఇలాటి అవమానాలు చాలా చేశాడు . కాని వాళ్లు తమ ఆగ్రహాన్ని పైకి చూపలేదు ;
పైకి స్నేహంగానే ఉంటూ లోపల కాసిని దాచుకున్నారు .
అటువంటి స్నేహితుడొకడు ఒకనాడు పార్వతీశం దగ్గరికి పని పెట్టుకుని వచ్చి , “మరేం లేదు గాని , ఇంత కాలమా బతికి ఇంటి వెనక చచ్చాడన్నట్టు , నీ పౌరుషమంతా ఈనాడు మంట గలిసింది . ఈ వృద్ధాప్యంలో భగవంతుడు నీకు ఏడుపు కూడా రాసి పెట్టినందుకు నాకు మహా విచారంగా ఉంటున్నది “ అని వెళ్ళిపోవటానికి లేచాడు .
పార్వతీశానికి “స్ట్రోక్ “వచ్చినంత పని అయింది .
“ఉండు ! ఆగు ! ఏమిటి నువ్వనేది ?” అన్నాడాయన .
“ఎందుకు నా నోటి మీదుగా అనిపిస్తావు ?” అంటూ ఆ పెద్ద మనిషి , చురుకు నిప్పంటించి ఆ ఛాయలు లేకుండా వెళ్లిపోయే గృహ దాహకుడిలాగా నిష్క్రమించాడు .
ఆ తరవాత పార్వతీశం నిజంగా పార్వతీశుడే అయిపోయి , ఆ గరళాన్ని తన కంఠంలో ఉంచుకుని తన కుమార్తెను అతి శ్రద్ధగా గమనించసాగాడు . వెంటనే రుజువు దొరకలేదు .
“అసలు రుజువులేందుకు ? ఆ మాధవయ్య ఉన్న మాటే చెప్పి వుంటాడు . ఇంత అబద్దం కల్పించి చెప్పడానికి వాడికెన్ని గుండెలు ?” అన్నది పార్వతీశం అహంకారం .

సేకరణ :బంగారు కథలు ……..కథా సంకలనం నుంచి………………….

———–

You may also like...