పైడిమర్రి వెంకటసుబ్బారావు (Paidimarri Venkata Subbarao)

Share
పేరు (ఆంగ్లం)Paidimarri Venkata Subbarao
పేరు (తెలుగు)పైడిమర్రి వెంకటసుబ్బారావు
కలం పేరు
తల్లిపేరుపైడిమర్రి రాంబాయమ్మ
తండ్రి పేరుపైడిమర్రి వెంకట్రామయ్య
జీవిత భాగస్వామి పేరువెంకట రత్నమ్మ
పుట్టినతేదీజూన్ 10, 1916
మరణంఆగష్టు 13, 1988
పుట్టిన ఊరునల్గొండ జిల్లా, అన్నెపర్తి
విద్యార్హతలు
వృత్తివిశాఖపట్నం డిటివొ
తెలిసిన ఇతర భాషలుతెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్, అరబిక్
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకాలభైరవుడు( నవల)
దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు (పద్యకావ్యాలు)
బ్రహ్మచర్యము, గృహస్థ జీవితము, స్త్రీ ధర్మము, ఫిరదౌసి, తార, శ్రీమతి( నాటకాలు)
అనేక అనువాద రచనలు కూడా చేశారు.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికపైడిమర్రి వెంకటసుబ్బారావు
సంగ్రహ నమూనా రచనఆయన 1962లో విశాఖపట్నం ట్రెజరీ అధికారిగా ఉన్నపుడు ఈ ప్రతిజ్ఞ తయారు చేశాడు. భారత్-చైనా యుద్ధం జరుగుతున్న సమయమది. ఆ యుద్ధం పూర్తయిన తర్వాత చైనా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అక్కడి ప్రజల్లో ప్రాథమిక దశ నుంచే దేశభక్తి భావం నూరిపోయాలని..! ఆ మేరకు ప్రత్యేకంగా కొన్ని దేశభక్తి గేయాలను రాయించి, పాఠశాల విద్యార్థులతో చదివించడం మొదలుపెట్టింది.

పైడిమర్రి వెంకటసుబ్బారావు

ఆయన 1962లో విశాఖపట్నం ట్రెజరీ అధికారిగా ఉన్నపుడు ఈ ప్రతిజ్ఞ తయారు చేశాడు. భారత్-చైనా యుద్ధం జరుగుతున్న సమయమది. ఆ యుద్ధం పూర్తయిన తర్వాత చైనా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అక్కడి ప్రజల్లో ప్రాథమిక దశ నుంచే దేశభక్తి భావం నూరిపోయాలని..! ఆ మేరకు ప్రత్యేకంగా కొన్ని దేశభక్తి గేయాలను రాయించి, పాఠశాల విద్యార్థులతో చదివించడం మొదలుపెట్టింది. అప్పటికే పలు భాషల్లో ప్రావీణ్యం ఉన్న పైడిమర్రి ఈ విషయం గుర్తించాడు. మన విద్యార్థుల్లోనూ దేశభక్తిని పెంపొందించడానికి గేయాలుంటే బాగుంటుందని భావించాడు. పలు రచనలు చేసిన అనుభవంతో ఆ ఆలోచనకు రూపమివ్వడం మొదలుపెట్టాడు. ప్రతిజ్ఞకు పదాలు కూర్చాడు. విశాఖ సాహితీ మిత్రుడు తెన్నేటి విశ్వనాధంతో చర్చించాడు. ‘వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలము’ అన్న వాక్యాన్ని అదనంగా చేర్చాడు. అంతాబాగానే ఉంది కానీ, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. పాఠ్యపుస్తకాల్లో చేర్చడం ఎలా..?
అది కాసు బ్రహ్మానందడ్డి ప్రభుత్వం. అప్పటి విద్యాశాఖ మంత్రి విజయనగరం రాజాగా పేరుగాంచిన పీవీజీ రాజు. ఆయన సాహితీవేత్త కావడం వారికి కలిసొచ్చింది. తేన్నేటి సాయంతో ప్రతిజ్ఞను పీవీజీ రాజు దృష్టికి తీసుకెళ్లాడు. దాని విలువను, అవసరాన్ని వివరించి ఓ ప్రతిని అందజేశారు. 1964లో బెంగుళూరులో ప్రముఖ న్యాయనిపుణుడు మహ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహామండలి సమావేశం జరిపినపుడు జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరించారు. తరువాత దీన్ని అన్ని భాషల్లోకి అనువాదం చేయించి జనవరి 26, 1965 నుంచి దేశమంతటా చదువుతున్నారు.[1]
పైడిమర్రి రాసిన ప్రతిజ్ఞలో కాలానుగుణంగా కొన్ని స్వల్ప మార్పులు మాత్రం జరిగాయి. గ్రాంథికంలో కొన్ని పదాల స్థానంలో వాడుక భాష వాడారు. ఇతర భాషల్లోకి అనువదించి 1963 నుంచి దేశ ప్రతిజ్ఞగా అమలులోకి వచ్చింది.
భారత ప్రభుత్వం ప్రతిజ్ఞను ఆమోదించి 50 సంవత్సరాలు పూర్తయ్యింది.2011లో ప్రముఖ సంపాదకుడు ఎలికట్టె శంకర్రావు నల్గొండ కవుల కథలు రాస్తున్న సందర్భంగా పైడిమర్రి ప్రస్తావన వచ్చింది. ఆయన పైడిమర్రి కుమారుడు పి.వి సుబ్రమణ్యాన్ని కలవగా ప్రతిజ్ఞను తన తండ్రి గారు రచించారని శంకర్రావుకు తెలిపారు. ఒక మహనీయుడి మూలాలను ప్రపంచానికి తెలియజేయాలనే తాపత్రయంతో ఎలికట్టె కొంతమంది తెలంగాణా సాహిత్య మిత్రులతో కలిసి “ప్రతిజ్ఞ పదశిల్పి పైడిమర్రి” పేరుతో ఒక ప్రత్యేక సంచికను ప్రచురించారు. పైడిమర్రి పేరును పాఠ్య పుస్తకాలలో ముద్రింపచేయాలని ఉత్తరాంధ్ర రక్షణ వేదిక, తెన్నేటి ఫౌండేషన్ ప్రయత్నించాయి. ఆ తర్వాత జనవిఙ్ఞాన వేదిక (గంపలగుడెం శాఖ, కృష్ణాజిల్లా) ప్రతిజ్ఞ అంశాన్ని క్షేత్ర స్థాయిలోకి విస్తృతంగా తీసుకు వెళ్ళింది. మందడపు రాంప్రదీప్ ఆధ్వర్యంలో తిరువూరు నియోజిక వర్గ పరిధిలో చదువుతున్న 25 వేల మంది విద్యార్థుల సంతకాలు సేకరించి సి.డి రూపంలో పొందుపరిచి విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని నాని ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపడం జరిగింది. జనవిఙ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కృష్ణా, గుంటూరు, ఒంగోలు జిల్లాల్లో ప్రతిజ్ఞ ప్రాముఖ్యతపై అవగాహన సదస్సులు నిర్వహించబడ్డాయి. పైడిమర్రి జీవిత చరిత్రతో కూడిన కర పత్రాలు ముద్రించి పంపిణీ చేయడం జరిగింది. విజయవాడలోని అన్నపూర్ణా దేవి ఉన్నత పాఠశాల ప్రతిజ్ఞకు ప్రాముఖ్యతనివ్వడానికి కృషి సల్పింది. ఎమ్.రాంప్రదీప్ (ఆర్లపాడు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు) పలు పాఠశాలలను సందర్శించి వేలాది మంది విద్యార్థులను కలుసుకొని పైడిమర్రి జీవిత చరిత్రను వివరించారు.ఎట్టకేలకు జనవిఙ్ఞాన వేదిక మరియు పలువురు ఇతర అభ్యుదయవాదులు చేసిన కృషి ఫలితంగా తెలుగు రాష్ట్రాలలో నూతనంగా ముద్రించిన పాఠ్య పుస్తకాలలో ప్రతిజ్ఞ ఎగువన పైడిమర్రి పేరు చేర్చడం జరిగింది. జాతీయ సమైక్యతకు, సమగ్రతకు ప్రతిజ్ఞ దోహదపడుతుంది. ప్రజలలో సోదర భావాన్ని పెంచుతుంది.పైడిమర్రి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని జనవిఙ్ఞాన వేదిక డిమాండ్ చేస్తుంది.
1945లోనే ఉషస్సు కథల సంపుటిని వెలువరించారు. 1945-46 లలో నల్లగొండలో జరిగిన ఆంధ్రసారస్వత పరిషత్తు సభలలో ప్రముఖ పాత్ర వహించారు. వీరి పదవీ విరమణ తర్వాత సర్వేలు గురుకుల పాఠశాలలో కొంతకాలం స్వచ్ఛందంగా పనిచేశారు. 1977 నుండి 1988 వరకు నల్లగొండ గాంధీ పార్కులో ఉచిత హోమియో వైద్య సేవలందించారు.
పైడిమర్రి రచనలను భవిష్యత్ తరాలకు అందించాలన్న ఉద్దేశంతో ఆయన లైబ్రరీని తన కుమారులు నల్లగొండలోని గీత విజ్ఞాన్ ఆంధ్ర కళాశాలకు అందించారు. ప్రస్తుతమది మూతపడింది. ఆ పుస్తకాలను జిల్లా గ్రంథాలయానికి మార్చే ప్రయత్నంలో ఉన్నారు.
వీరు వ్రాసిన ప్రతిఙ అన్ని భారతీయ భాషలలోనూ ప్రచురితమైననూ, వీరి పేరు ఎక్కడా ప్రచురించలేదు. ఈ విషయం గురించి, విజయవాడలోని అన్నపూర్ణ నగరపాలక ఉన్నత పాఠశాల విద్యార్థుల బహుళ ప్రయత్నాల వలన రచయిత పేరును తెలుగు రాష్ట్రల పాఠ్యపుస్తకాలలో ప్రచురించారు. రెండు తెలుగు రాష్ట్రాల పాఠ్యపుస్తకాలలోనూ వీరి పేరును ముద్రించిన సందర్భంగా, 2016, జనవరి-8వ తేదీనాడు, విజయవాడలోని కొత్తపేట అన్నపూర్ణాదేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో, విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు శ్రీ రామకృష్ణ, శ్రీ బుడ్డా వెంకన్నల సమక్షంలో, శ్రీ పైడిమర్రి కుమారుడు శ్రీ వేంకటసుబ్రహ్మణ్యం, శేషుకుమారి, కుమార్తె నాగలక్ష్మి, అల్లుడు శ్రీ పోతావఝ్ఝుల వేంకటేశ్వరశర్మ దంపతులను ఘనంగా సత్కరించారు. జాతీయస్థాయిలో గూడా అన్ని భాషల పాఠ్యపుస్తకాలలోనూ ఈ ప్రతిఙ రచయిత పేరును ప్రచురింపజేటట్లు ప్రయత్నం చేసెదమని ఈ సందర్భంగా ఈ శాసనమండలి సభ్యులు ఇద్దరూ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా, కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలోని ఆర్లపాడు గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ మందడపు రాంప్రసాద్, శ్రీ పైడిమర్రి వెంకటసుబ్బారావు జీవిత చరిత్ర పుస్తకం ఆవిష్కరించారు.

———–

You may also like...