పేరు (ఆంగ్లం) | Elchuri Subrahmanyam |
పేరు (తెలుగు) | ఏల్చూరి సుబ్రహ్మణ్యం |
కలం పేరు | – |
తల్లిపేరు | సుబ్బాయమ్మ |
తండ్రి పేరు | రామయ్య |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 8/26/1920 |
మరణం | 2/25/1995 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | బి.ఎ. |
వృత్తి | పాత్రికేయుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | “శాంతిపత్రంమీద సంతకం చేసిన చెయ్యి” కావ్యం “మాఘ్యమాల” కవితా సంపుటం, 1943. నవ్యకళాపరిషత్ ఆధ్వర్యంలో పలువురు ప్రముఖ కవుల కవితాసంకలనం. నయాగరా కవితాసంపుటి. కుందుర్తి ఆంజనేయులు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు రాసిన ఖండికల సంపుటి. 1944, 1975. “నవంబరు 7” తొలి దీర్ఘకవిత. 1956లో విశాలాంధ్ర’లో వెలువడింది. కథలు : నా ప్రేయసి, చతురస్రం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | ప్రసిద్ధ కవి, రచయిత, పాత్రికేయుడు. ఆయన తెలుగు సాహిత్యంలో ప్రాముఖ్యత వహించిన అభ్యుదయ కవిత్వోద్యమానికి ఆద్యుల్లో ఒకరు. నయాగరా కవులుగా ప్రసిద్ధి పొందిన ముగ్గురిలో ఒకరు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ఏల్చూరి సుబ్రహ్మణ్యం |
సంగ్రహ నమూనా రచన | పారతంత్ర్య భారంతో కుంగుతున్న భరతావని కుసుమించిన రక్తారుణ కుసుమం! అఖండ భరతావని ఆరక వెలిగే మణి దీపం మా ఠాకూర్ చంద్ర సింగ్! |
ఏల్చూరి సుబ్రహ్మణ్యం
ఠాకూర్ చంద్రసింగ్ (జులై 43)
(18వ గార్వాల్ రైఫిల్ నాయకుడు.
దండి సత్యాగ్రహోద్యమంలో తన దళంతో పాల్గొన్నాడు.
యావజ్జీవ శిక్ష విధించింది ప్రభుత్వం.)
పారతంత్ర్య భారంతో
కుంగుతున్న భరతావని
కుసుమించిన రక్తారుణ కుసుమం!
అఖండ భరతావని
ఆరక వెలిగే మణి దీపం
మా ఠాకూర్ చంద్ర సింగ్!
పున్నమి వెన్నెలలై పొంగిన
బానిస సంద్రంలో పొర్లిన
మబ్బుల కెరటం
సామ్రాజ్యపు చెలియలి కట్టను
ఛేదించిన రక్త తరంగం!
పొగలు చిమ్ము తుపాకి గుండ్లను
ప్రతిఘటించు బానిస గుండెల
మెరసిన ఆదర్శద్యుతి
చంద్రసింగ్ విప్లవ దీక్ష!
300ల ఏండ్ల క్రితం
నాటుకున్న విషవృక్షం
చీకట్లను చిమ్ముతుంటె
విరిసిన చంద్రుడు చంద్రసింగ్!
స్వాతంత్ర్యం సాధించను
ప్రజలంతా సాగించిన
సమరంలో చంద్రసింగ్
అరుణారుణ జయ పతాక!
ముస్లిములను చంపమన్న
రాజాజ్ఞను నిరసించిన
చంద్రసింగ్ నేరస్థుడు!
నల్లకోటు వేసుకున్న
తెల్లటి న్యాయం
చంద్రసింగ్ చేతికి
తగిలించెను సంకెళ్లు!
ద్రోహి కాడు చంద్రసింగ్
స్వతంత్ర జన రక్తం పిండిన
అధమాధమ పాలక వర్గం పాలిట
భూతమ్మై ఘోషించే
సాగర శంఖం!
కటకటాల వెనుకన
పగిలే రగిలే అగ్నిపర్వతం
స్వతంత్ర భారత భువిలో
ఘణ ఘణమని మ్రోగు ఘంట!
హిందూ ముస్లిం ఐక్యతకై
కట్టిన జ్వాలారుణ తోరణమే
చంద్రసింగ్ సైనిక దళ వీర దీక్ష!
కలకాలం గిలగిల వలలో
తన్నుకునే చేపలు కావివి
బానిసలం, పుటుక తోటి
సైనికులం
మా చంద్రసింగ్
వీరభూమి భరతావని
యుగయుగాల చీకటిలో
నిలువలేక నిలువలేక
తెరచిన విప్లవ నేత్రం!
విజయముద్ర (మార్చి 41)
వినువీధిలో
వికార ప్రేత జీవాలు
కారు మేఘాల బారు
ఆకలో
ఆకలోయని
గోడు గోడుగ
రోదించి
డొక్కలెండి
కనుగుడ్లు
పీక్కుపోయి
కణికెడు కూటికి
ఘూర్ణిల్లిరి!
ముష్టిమూక
ముష్టిమూక
పదండి
పదండి
మెతుక్కు
మూగిన
కుక్కల్లారా!
పదండి
పదండి
కడుపు నిండిన
మెరుపు
ఉరుముతూ
వచ్చింది
గుడ్లురిమి
చూచింది
ధగ ధగ ధగ
భుగ భుగ భుగ
వెన్నాడి
వెన్నాడి
తరిమి కొట్టింది
మెరుపు
బిచ్చగాళ్లను
తరిమి కొట్టింది!
పరుగెత్తి పరుగెత్తి
కాలువిరిగి
సడి తప్పగ
బరువెక్కిన
కనురెప్పలు
మూతల పడి
సోలిపోయి
కుప్పైకూలిరి
బిచ్చగాళ్లు
కుప్పైకూలిరి
కూలిన జీవుల
లోహపాదముల
కసకస
త్రొక్కుచు
విలయముగా
జ్వలియించెను
మెరుపు!
చిందిపోసె
రక్తం!
పడగ చితికిన
పాము లాగున
పైకి దూకి
బిచ్చగాళ్లు
ఒక్కటై
ఒక కేక పెట్టిరి!
మెరుపును మింగిరి!
చల్లారని ఆకలి
చల్లారని చిచ్చుకు
శాంతి శాంతి!
పిడుగులు
పిడుగులు!
విప్లవం విప్లవం
పైకి చిందిన
పచ్చి రక్తం
పురిటి వాకిట
పేద జీవుల
విజయ ముద్రగ
ఎగురుచున్నది
ఎర్ర జెండా!
———–