పేరు (ఆంగ్లం) | A.S.Raman |
పేరు (తెలుగు) | ఎ.ఎస్.రామన్ |
కలం పేరు | అవధానం సీతారామమ్మ |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 4/19/1909 |
మరణం | 6/24/ 2001 |
పుట్టిన ఊరు | కడపజిల్లా ప్రొద్దుటూరు |
విద్యార్హతలు | అర్థశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | అవధానం సీతారామమ్మ పేరుతో గృహలక్ష్మి పత్రికలో వ్యాసాలు వ్రాశారు. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ఎ.ఎస్.రామన్ |
సంగ్రహ నమూనా రచన | ఎ.ఎస్.రామన్ గా ప్రసిద్ధి చెందిన అవధానం సీతారాముడు కడపజిల్లా ప్రొద్దుటూరులో 1909, ఏప్రిల్ 19న జన్మించాడు.ఇతడు ప్రఖ్యాత శాస్తవ్రేత్త సి.వి.రామన్ స్ఫూర్తిగా అవధానం సీతారాముడనే తన పేరును ఎ.ఎస్.రామన్‌గా మార్చుకున్నాడు. దీనికి సి.వి.రామన్ ఆమోదం కూడా ఉంది. |
ఎ.ఎస్.రామన్
ఎ.ఎస్.రామన్ గా ప్రసిద్ధి చెందిన అవధానం సీతారాముడు కడపజిల్లా ప్రొద్దుటూరులో 1909, ఏప్రిల్ 19న జన్మించాడు.ఇతడు ప్రఖ్యాత శాస్తవ్రేత్త సి.వి.రామన్ స్ఫూర్తిగా అవధానం సీతారాముడనే తన పేరును ఎ.ఎస్.రామన్‌గా మార్చుకున్నాడు. దీనికి సి.వి.రామన్ ఆమోదం కూడా ఉంది. ఇతని తండ్రి అవధానం కృష్ణముని బ్రహ్మానందిని అనే పత్రికను నడిపాడు. వాల్తేరులోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఇతడు అర్థశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. 1936లో రచనావ్యాసంగాన్ని ప్రారంభించిన ఎ.ఎస్.రామన్ వివిధ తెలుగు, ఇంగ్లీషు పత్రికలకు రచనలు చేశాడు. అవధానం సీతారామమ్మ పేరుతో గృహలక్ష్మి పత్రికలో వ్యాసాలు వ్రాశాడు. ఇతడు 1943లో న్యూఢిల్లీ లోని హిందుస్తాన్ టైమ్స్ పత్రికలో అసిస్టెంట్ ఎడిటర్‌గా తన పాత్రికేయ వృత్తిని ప్రారంభించాడు. ఆ తర్వాత ఇతని పాత్రికేయ జీవితం స్టేట్స్‌మన్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా మొదలైన పత్రికలలో 1960వరకు సాగింది. 1953లో బొంబాయిలోనిఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో సంపాదకునిగా చేరాడు. ఆ పత్రికకు మొట్టమొదటి భారతీయ సంపాదకుడు ఇతడే. లండన్ నుండి వెలువడే ది స్టూడియో మేగజైన్‌కు ప్రత్యేక ఆర్ట్ కన్సల్టెంట్‌గా వ్యవహరించాడు. 1960నుండి 1970ల వరకు ఇతడు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా వుండి తర్వాత మద్రాసులో స్వరాజ్య పత్రికకు సంపాదకుడిగా చేరాడు. 2001లో ఇతనికి పద్మ శ్రీ పురస్కారం లభించింది. ఇతడు తంజావూరులోని తమిళ విశ్వవిద్యాలయంలో కొంతకాలం ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్‌కు డీన్‌గా వ్యవహరించాడు. ఇతడు 2001 , జూన్ 24 తేదీన చెన్నైలో మరణించాడు.
———–