పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి (P.V. Vasudeva Parabrahma Sastry)

Share
పేరు (ఆంగ్లం)P.V. Vasudeva Parabrahma Sastry
పేరు (తెలుగు)పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి
కలం పేరు
తల్లిపేరురుక్మిణమ్మ
తండ్రి పేరువెంకటేశ్వర్లు
జీవిత భాగస్వామి పేరుమహాలక్ష్మి
పుట్టినతేదీ1/1/1921
మరణం7/28 2016
పుట్టిన ఊరుగుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామం
విద్యార్హతలుబీఎస్సీ
వృత్తిపురావస్తు శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్‌గా వివిధ హోదాలలో పనిచేశారు.
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుప్రాచీనాంధ్ర దేశ చరిత్ర – గ్రామీణజీవనం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికపుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి
ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర – గ్రామీణజీవనం
సంగ్రహ నమూనా రచనప్రాచీనాంధ్ర దేశ చరిత్ర – గ్రామీణజీవనం డాక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి రచించగా తెలుగులోకి అనువాదమైన చారిత్రిక గ్రంథం. ఈ పుస్తకంలో పన్నెండవ శతాబ్దిలోని తొలికాలపు కాకతీయుల ఉత్థానం వరకూ ఆంధ్ర గ్రామీణ జీవనాన్ని చిత్రించారు.
ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర – గ్రామీణజీవనం గ్రంథంలో రాతియుగం నుంచి ప్రారంభించి కాకతీయుల కాలం ప్రారంభమయ్యే వరకూ సాగిన గ్రామజీవనం, గ్రామీణ వ్యవస్థల చరిత్ర రచన చేశారు. అందులో భాగంగా ప్రాచీన భూవిభాగాలు, కొత్త రాతియుగపు గ్రామీణ జీవనం, తొలికాలంలో గ్రామీణ జీవితం నుంచి ప్రారంభించారు.


పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి
ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర – గ్రామీణజీవనం

ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర – గ్రామీణజీవనం డాక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి రచించగా తెలుగులోకి అనువాదమైన చారిత్రిక గ్రంథం. ఈ పుస్తకంలో పన్నెండవ శతాబ్దిలోని తొలికాలపు కాకతీయుల ఉత్థానం వరకూ ఆంధ్ర గ్రామీణ జీవనాన్ని చిత్రించారు.
ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర – గ్రామీణజీవనం గ్రంథంలో రాతియుగం నుంచి ప్రారంభించి కాకతీయుల కాలం ప్రారంభమయ్యే వరకూ సాగిన గ్రామజీవనం, గ్రామీణ వ్యవస్థల చరిత్ర రచన చేశారు. అందులో భాగంగా ప్రాచీన భూవిభాగాలు, కొత్త రాతియుగపు గ్రామీణ జీవనం, తొలికాలంలో గ్రామీణ జీవితం నుంచి ప్రారంభించారు. ఆపై ప్రదేశాల పేర్లు, పట్టణ కేంద్రాల గురించి, రాజకీయ అధికారం ప్రాదుర్భావమైన పద్ధతి, దాని కాల క్రమం గురించీ రచించారు. సమాజ నిర్మాణాన్ని గురించి, గ్రామపాలన ఉద్యోగుల గురించీ రాశారు. గ్రామాధికారుల చరిత్ర, గ్రామాలలోని సంఘజీవనం, న్యాయవ్యవస్థల గురించి, భూమిని, పన్నుల గురించి రచన చేశారు. గ్రామీణవ్యవస్థకు సంబంధించిన వర్తక-వాణిజ్య మార్గాలు, నాణేల వ్యవస్థ వంటి వాటి గురించి సవిస్తరంగా రచించారు.
పీవీ పరబ్రహ్మ శాస్త్రి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో పుచ్చా వెంకటేశ్వర్లు, రుక్మిణమ్మ దంపతులకు 1921 జూన్‌లో జన్మించారు. 1938లో ఓల్డ్ మద్రాస్ ప్రెసిడెన్సీలో పాఠశాల విద్యను, 1948లో బీఎస్సీ డిగ్రీని పూర్తి చేశారు. పిఠాపురంలో వ్యాకరణ, తర్క, వేదాల్లో నిష్ణాతులైన వారణాసి సుబ్రమణ్యశాస్త్రి దగ్గర శిష్యరికం చేశారు. 1948లో పోలీస్ యాక్షన్ తర్వాత వరంగల్ జిల్లా జనగాంకు వచ్చి అక్కడ తెలుగు మీడియం హైస్కూల్‌లో హెడ్ మాస్టర్‌గా చేరారు. మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌కు వచ్చి కేశవ మెమోరియల్ హైస్కూల్‌లో గణితం, సైన్స్ ఉపాధ్యాయుడిగా సేవలందించారు. 1955లో బెనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి సంస్కృతంలో డిగ్రీ పొందారు. 1959లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంలో ఎపిగ్రఫీ అసిస్టెంట్ ఉద్యోగంలో చేరారు. పురావస్తు శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్‌గా వివిధ హోదాలలో పనిచేసిన ఆయన 1981 పదవీ విరమణ పొందారు.
ఆయన ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖలో 25 సంవత్సరాలపాటు సేవలందించారు. ఆయన 2 వేలకు పైగా శాసనాలను పరిష్కరించారు. శాసనగ్రంథాల రచనతోపాటు చరిత్ర రచన చేసిన ఆయన భారత చరిత్రకారులకు మార్గదర్శకుడిగా నిలిచారు. ఖమ్మంజిల్లా బయ్యారం చెరువు వద్ద లభించిన కాకతీయ శాసనాన్ని పరిష్కరించి, కాకతీయ చక్రవర్తుల వంశక్రమణికను పునర్నిర్మించారు. వరంగల్‌లో లభించిన శాసనం ఆధారంగా రాయగజకేసరి బిరుదు కాకతీయ చక్రవర్తులలో రాణీ రుద్రమదేవికే వర్తిస్తుందని తేల్చిచెప్పారు. గణపతి దేవుడు వేయించిన బయ్యారం చెరువు శాసనం కాకతీయ చరిత్రకు ఒక ముఖ్యమైన ఆధారం. కాకతీయులు ఎలా అవిర్భవించారు, పశ్చిమ చాళుక్యుల సామంతులుగా ఎలా హనుమకొండలో స్థిరపడ్డారనే విషయాన్ని ఈ శాసనం చెప్తుంది. వెయ్యిస్తంభాల గుడి శాసనంలో రెండో ప్రోలరాజు అతడి కుమారుడు రుద్రదేవునికి సంబంధించిన సమాచారాన్ని అంతకుముందు శాసన పరిశోధకులు సరిగా వ్యాఖ్యానించలేదని ఆయన భావించారు. పీవీ శాస్త్రి ఆ శాసనాన్ని పరిష్కరించి కాకతీయ రుద్రదేవుడు క్రీశ 1163లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడానికి దారితీసిన పరిస్థితులను వివరించగలిగారు. పరబ్రహ్మశాస్త్రి తెలంగాణ చరిత్రకు ఇచ్చిన అత్యంత ముఖ్యమైన కానుక రుద్రమదేవి మరణానికి సంబంధించిన శాసనాన్ని పరిష్కరించడం. నల్గొండ జిల్లా చందుపట్ల శాసనాన్ని బట్టి రుద్రమదేవి క్రీ.శ.1290 నవంబరులో మరణించారని ప్రకటించారు. కాయస్త అంబదేవుని తిరుగుబాటును అణచడానికి స్వయంగా రుద్రమదేవి కదనరంగానికి వెళ్లింది. ఆ యుద్ధంలోనే 80 ఏళ్ల వయసులో ఆమె మరణించిందని చెప్పారు. కాకతీయులపై పరిశోధనకు కర్నాటకలోని ధార్వాడ్ వర్శిటీ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖలో 25 సంవత్సరాలపాటు సేవలందించిన పీవీ పరబ్రహ్మశాస్త్రి 2 వేలకు పైగా శాసనాలను పరిష్కరించారు. శాసనగ్రంథాల రచనతోపాటు చరిత్ర రచన చేసిన పీవీ పరబ్రహ్మశాస్త్రి భారత చరిత్రకారులకు మార్గదర్శకుడిగా నిలిచారు. ఖమ్మంజిల్లా బయ్యారం చెరువు వద్ద లభించిన కాకతీయ శాసనాన్ని పరిష్కరించి, కాకతీయ చక్రవర్తుల వంశక్రమణికను పునర్నిర్మించారు. వరంగల్‌లో లభించిన శాసనం ఆధారంగా రాయగజకేసరి బిరుదు కాకతీయ చక్రవర్తులలో రాణీ రుద్రమదేవికే వర్తిస్తుందని తేల్చిచెప్పారు. గణపతి దేవుడు వేయించిన బయ్యారం చెరువు శాసనం కాకతీయ చరిత్రకు ఒక ముఖ్యమైన ఆధారం. కాకతీయులు ఎలా అవిర్భవించారు, పశ్చిమ చాళుక్యుల సామంతులుగా ఎలా హనుమకొండలో స్థిరపడ్డారనే విషయాన్ని ఈ శాసనం చెప్తుంది. వెయ్యిస్తంభాల గుడి శాసనంలో రెండో ప్రోలరాజు అతడి కుమారుడు రుద్రదేవునికి సంబంధించిన సమాచారాన్ని అంతకుముందు శాసన పరిశోధకులు సరిగా వ్యాఖ్యానించలేదని ఆయన భావించారు. పీవీ శాస్త్రి ఆ శాసనాన్ని పరిష్కరించి కాకతీయ రుద్రదేవుడు క్రీశ 1163లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడానికి దారితీసిన పరిస్థితులను వివరించగలిగారు. పరబ్రహ్మశాస్త్రి తెలంగాణ చరిత్రకు ఇచ్చిన అత్యంత ముఖ్యమైన కానుక రుద్రమదేవి మరణానికి సంబంధించిన శాసనాన్ని పరిష్కరించడం. నల్గొండ జిల్లా చందుపట్ల శాసనాన్ని బట్టి రుద్రమదేవి క్రీ.శ.1290 నవంబర్‌లో మరణించారని ప్రకటించారు. కాయస్త అంబదేవుని తిరుగుబాటును అణచడానికి స్వయంగా రుద్రమదేవి కదనరంగానికి వెళ్లింది. ఆ యుద్ధంలోనే 80 ఏళ్ల వయసులో ఆమె మరణించిందని చెప్పారు. కాకతీయులపై పరిశోధనకు కర్నాటకలోని ధార్వాడ్ వర్శిటీ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

బహుగ్రంధ కర్త: ప్రకాశం జిల్లా బబ్బేపల్లిలో లభించిన పల్లవరాజుల శాసనం ఆధారంగా పల్లవ రాజవంశానుక్రమణికను రూపొందించారు. చైతన్యపురిలో లభించిన ప్రాకృత శాసనం విష్ణుకుండిన మూలపురుషుడిదేనని తేల్చిచెప్పారు. శాసనాల పరిష్కారంతోపాటు వాటిని ప్రచురించడానికి ఆయన కృషి చేశారు. కరీంనగర్, వరంగల్, కడప జిల్లాల శాసన సంపుటాలను ఆయన ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర సంకలనాలకు, 1964 నుంచి 69 వరకు పురావస్తుశాఖ వార్షిక శాసన గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. కాకతీయులు, కాకతీయుల శాసన సాహిత్యం, ప్రాచీనాంధ్ర చరిత్రలో గ్రామీణ జనజీవనం, తెలుగు భాష – పుట్టుపూర్వోత్తరాలు, ఎపిగ్రాఫీయా ఆంధ్రికా గ్రంథాలు రచించారు. భారతీయ ఇతిహాసిక పరిశోధనా మండలి ప్రచురించిన ఆంధ్రప్రదేశ్‌లో విజయనగర శాసనాలు గ్రంథాన్ని రాశారు. శాసన పరిశోధన, చరిత్ర రచనలో విస్తృతంగా సేవలందించిన పీవీ పరబ్రహ్మశాస్త్రి అనేక అవార్డులు అందుకున్నారు. ఇండోర్‌లోని కుంద కుండాచార్య జ్ఞానపీఠం ఆయనకు ప్రతిష్టాత్మకమైన కుంద కుండాచార్య అవార్డు, తామ్ర ప్రశంసాపత్రంతో గౌరవించింది.

———–

You may also like...