మందుముల నరసింగరావు (Mandumula Narasingarao)

Share
పేరు (ఆంగ్లం)Mandumula Narasingarao
పేరు (తెలుగు)మందుముల నరసింగరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ3/17/1896
మరణం3/12/1976
పుట్టిన ఊరురంగారెడ్డి జిల్లా చేవెళ్ళ
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలుపర్షియన్
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు50 సంవత్సరాల హైదరాబాదు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమందుముల నరసింగరావు
సంగ్రహ నమూనా రచనపాలమూరు జిల్లా కు చెందిన సమరయోధులలో ప్రముఖుడైన మందుముల నరసింగరావు మార్చి 17, 1896 న ప్రస్తుత రంగారెడ్డి జిల్లాచేవెళ్ళ లో జన్మించాడు. తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన నరసింగరావు న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. పర్షియన్ భాషలో కూడా ఇతను గొప్ప పండితుడు మరియు ప్రముఖ పత్రికా రచయితగా పేరుపొందారు

మందుముల నరసింగరావు

పాలమూరు జిల్లా కు చెందిన సమరయోధులలో ప్రముఖుడైన మందుముల నరసింగరావు మార్చి 17, 1896 న ప్రస్తుత రంగారెడ్డి జిల్లాచేవెళ్ళ లో జన్మించాడు. తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన నరసింగరావు న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. పర్షియన్ భాషలో కూడా ఇతను గొప్ప పండితుడు మరియు ప్రముఖ పత్రికా రచయితగా పేరుపొందారు. 1921లో ఆంధ్రజనసంఘాన్ని స్థాపించిన వారిలో ఒకరు. 1927లో న్యాయవాదవృత్తికి స్వస్తి చెప్పి పత్రికారచన, రాజకియాలుచేపట్టారు. 1927లో రయ్యత్ అనే ఉర్దూ వార్తాపత్రిక స్థాపించి సంపాదక బాధ్యతలు చేపట్టారు. మందుముల సమరరంగంలో కూడా కీలకపాత్ర వహించి 1937లో ఇందూరు (నిజామాబాదు) లో జరిగిన 6వ ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించారు. 1938-42 కాలంలో నిజాం లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు. 1947లో జాయిన్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టు అయ్యారు. ఇవేకాక బాల్యవివాహాల రద్దుకు, వితంతు వివాహాలకు బాగా కృషిచేశారు. 1952లో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున హైదరాబాదు శాసనసభకు ఎన్నికయ్యారు. 1957-62 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేశారు. నిజాం కాలంలోని దుష్పరిపాలనను వర్ణిస్తూ “50 సంవత్సరాల హైదరాబాదు” గ్రంథాన్ని స్వీయజీవిత చరిత్రగా రచించారు.

———–

You may also like...