పేరు (ఆంగ్లం) | Puranam Suryaprakasharao |
పేరు (తెలుగు) | పురాణం సూర్యప్రకాశరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | కథలు : జీవనగంగ, లేమిలో లేమ, వంకరగీతలు, కామేశ్వరమ్మ, చదువు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పురాణం సూర్యప్రకాశరావు ఆరినకుంపటి |
సంగ్రహ నమూనా రచన | భళ్లున తెల్లవారింది. అప్పుడే రైలువచ్చి స్టేషన్లో ఆగింది. బండిదిగిన ప్రయాణీకులతోనూ, వాళ్లకోసం ఒకళ్లనివొకళ్లు తోసుకుంటూ ముందుకువచ్చే బళ్లవాళ్ళతోనూ నిండిపోయింది కూడలి. బైట వీధిలో సందడికి మెలుకువ వచ్చిన గడ్డంతాత లేచి కళ్ళు నులుపుకుంటూ వీధిలోకొచ్చి పంపుదగ్గర ముఖం కడుక్కుని మళ్లీస్తంభంచాటుకెళ్లి చతికిలబడి ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. అదో చిన్న సత్రవులాంటిది. గడ్డంతా నాలుగు రోజుల్నుంచీ అందులోనే పడుకుంటున్నాడు. అంతకు ముందు అయిదురోజులు ఆ పంచనీ పంచనీ కాలక్షేపం చేశాడు. రోజూ ఎవరో కొత్త వాళ్లు వస్తుంటారు పోతుంటారు. ఈ నాలుగు రోజుల్లోనూ అనేక తరహాల వ్యక్తలు తారసిల్లి వింతవింత విషయాలెన్నో స్ఫురింపచేసి మెరుపులా మాయమయారు. చిలిపికళ్ల పొట్టిపిల్ల రాత్రికి రాత్రి నిద్రలో జేబులో వున్న నాలుగణాలూ కాజేసి తెల్లారేసరికి మాయమయి ఊరుకుంది. |
పురాణం సూర్యప్రకాశరావు
ఆరినకుంపటి
భళ్లున తెల్లవారింది. అప్పుడే రైలువచ్చి స్టేషన్లో ఆగింది. బండిదిగిన ప్రయాణీకులతోనూ, వాళ్లకోసం ఒకళ్లనివొకళ్లు తోసుకుంటూ ముందుకువచ్చే బళ్లవాళ్ళతోనూ నిండిపోయింది కూడలి.
బైట వీధిలో సందడికి మెలుకువ వచ్చిన గడ్డంతాత లేచి కళ్ళు నులుపుకుంటూ వీధిలోకొచ్చి పంపుదగ్గర ముఖం కడుక్కుని మళ్లీస్తంభంచాటుకెళ్లి చతికిలబడి ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. అదో చిన్న సత్రవులాంటిది. గడ్డంతా నాలుగు రోజుల్నుంచీ అందులోనే పడుకుంటున్నాడు. అంతకు ముందు అయిదురోజులు ఆ పంచనీ పంచనీ కాలక్షేపం చేశాడు. రోజూ ఎవరో కొత్త వాళ్లు వస్తుంటారు పోతుంటారు. ఈ నాలుగు రోజుల్లోనూ అనేక తరహాల వ్యక్తలు తారసిల్లి వింతవింత విషయాలెన్నో స్ఫురింపచేసి మెరుపులా మాయమయారు. చిలిపికళ్ల పొట్టిపిల్ల రాత్రికి రాత్రి నిద్రలో జేబులో వున్న నాలుగణాలూ కాజేసి తెల్లారేసరికి మాయమయి ఊరుకుంది. మోసగించిందనుకోవటానికి అతని మనసు వొప్పుకోవటం లేదు. ఆమనిషి తనకి కలిగించినతృప్తి అటువంటిది. కేవలం కొన్ని గంటలూ, నిముషాల్లో ఆ మనిషిరూపం తన మనోనేత్రంలో ముద్రవేసుకుని శాశ్వతంగా తిష్ఠవేసుకుని కూర్చుంది. ఆ రోజల్లా తన కర్తవ్యాన్నే మరిపింపచేసిన ఆ చిలిపికళ్లు తన్ని మోసం చేశాయిన తెలిసినప్పుడు కోపంకంటె జాలే ఎక్కువగా బాధపెట్టింది. ‘‘నాలుగణాలకోసం ఎంతినాటకం ఆడింది. నిజాయితీగా అడిగితే ఇస్తానని అంత భారీగా, నా దృష్టితో చూడగలగటం అనుకున్నంత సులువు కాదు… హు అయినా ఇప్పుడా గొడవెందుకు?’’ గడ్డం మనిషి ముకంలో హాసరేఖలు వికృతంగా మెలికలు తిరిగాయి. లోతుకు పోయిన కళ్లు, నలుపెక్కిన కంటిగూళ్లు, అట్టలుకట్టిన జుట్టూ అన్నీ అతని సహజమైన అందాన్ని నాశనం చేశాయి. ఇటీవల మరీ ఇలా మారిపోయాడు కడుపులో ప్రేగులు అరుస్తున్నాయి. వెన్నుపూస తన వ్యక్తిత్వం లాగానే వంగిపోయి పాతికేల్ళ వయ్సుకు మరో పాతిక సంవత్సరాలుకలిపి పెద్దవాడ్ని చేసింది అందుకనే పిల్లలు కొంతమంది అప్పుడే అతడ్ని ‘‘తాతా తాతా’’ అని పిలుస్తూంటారు. కొత్తలో చర్రుమని అరికాలు మంట నెత్తికెక్కేది.
గడ్డంతాత నెత్తి బరుక్కుంటూ స్తంభానికి చారబడి ఆలోచిస్తున్నాడు. దూరంగా పిల్లలు డుకుంటున్నారు. కంటిముందు కనిపించే ప్రతిప్రాణినీ తనతో పోల్చుకోవటం అతనికి ఇటీవల బాగా అలవాటయిపోయింది. ఆ అలవాటు ప్రకారమే ఇప్పుడూ ఆ పిలలలతో తన్ని పోల్చుకుంటున్నాడు. ‘‘వాళ్లకీ తనకిమల్లేనే ఆకలీ ఉంటుంది. వాళ్ళకీ సమస్యలుంటాయి. అయితే ఏ సమస్యకీ ఎక్కువసేపు వాళ్ళని బాధపెట్టగల శక్తిలేదు. చంచలమైన మనస్సులు, తను?…’’ అతను నవ్వుకున్నాడు. ఆ నవ్వు నవ్వులామటుకు లేదు.
సాయంత్రం పార్క్ లో కూర్చున్నప్పుడు కూడా నెత్తిమీంచి అరుచుకుంటూ ఎగిరిపోయే రకరకాల పక్షుల్ని ఇలాగే తనతో పోల్చుకుంటూంటాడు. ఈ సృష్టిలో తనుతప్ప అం సుఖపడుతున్నట్టే భావిస్తూంటాడు. ఇలా భావిస్తున్నప్పుడు మనసులో ఏదోకసిగా, క్రోధంగా ఉన్నట్టు ఫీలవుతూంటాడు. ఎవరిమీద? ఏమో? అతనికే స్పష్టంగా తెలియదు. వీధినపడితే ఎక్కేగుమ్మం, దిగేగుమ్మం, విసుగూ విరామంలేకుండా రాత్రి పదిందాకా తిరిగి తిరిగి ఆ సత్రవుకు చేరుకుంటాడు. కడుపునిండా మంచి నీళ్ళు తాగినిద్రకి జారుకుంటే రాత్రి అడపా దడపా క్షుద్బాధకి మెలుకువ వచ్చేస్తుంటుంది. అలాగే మూలుగుతూ ముక్కుతూ ఈ పదిరోజులూ ఎలాగో గడిపేశాడు. ఇన్నాళ్ళూ బొత్తిగా నిరాహారంగా గడపకపోయినా మొత్తానికి ఈ పద్ధతిని ఇంకో నాలుగురోజులు సాగితే ఈ ప్రమిదలో చమురు హరించుకుపోయి దీపం ఆరిపోతుందనటానికి ఏవీ సందేమం లేదు. బ్రతుకుమీద మమత, కోరికలు సిద్ధించాలనే అభిలాషా అతనిలో ఏమాత్రం చావలేదు.
‘‘నాయనా నువ్వెవరవు?’’ అని అతన్ని ఎవరూ పలకరించరు. ఎవరికీ పలకరించబుద్ధిపుట్టదు. ‘‘తనతో వాళ్ళకి ఏం పనుంటుంది గనక పలకరించటానికి?’’ అనుకుని మొదట మొదట సర్దుకోబోయినా ఇటీవల అందరూ తనవైపు అదోమాదిరిగా పిచ్చివాడివైపు చూస్తున్నట్టుగా చూస్తూండటం బట్టి వీళ్లందరికీ తనంటే ఓవిధమైన సానుభూతి (ఆసానుభూతి తన కేవిధంగానూ ఉపయోగించక పోయినా) తప్పించి ఒక మామూలు మనిషికిచ్చే గౌరవం తనకివ్వటం లేదని అతను గ్రహించాడు. అతని మనస్సు చివుక్కుమన్నా ఆ తలంపు అతని హృదయాన్ని శాశ్వతంగా అంటిపెట్టుకొని బాధించలేదు. ఉన్నట్టుండి అతడి దృష్టి తన తల్లి దండ్రులవైపుకు మళ్లింది. అతని కళ్లు చెమ్మగిల్లాయి. పాతికేళ్లు నెత్తిమీద కొచ్చి ఇన్నాళ్లూ వాల్ళ రెక్కల కష్టం తింటూ కూర్చుంటే తన కర్తవ్యం, తన బాధ్యత తను నెరవేర్చుకోవాలనే పట్టుదల రేకెత్తించాడు తండ్రి. తండ్రి ఎగిరిపడి ఇంట్లోంచి పొమ్మంటే తల్లి అడ్డుపడినా (తనకింకా ఆత్మాభిమానం చావని రోజులు) చరచరా వీధిలోకి నడిచాడు. దగ్గరి కొంతపైకం ఉణ్నా టిక్కెట్ లేకుండా రైలెక్కి వాళ్లెక్కడ దింపితే అక్కడ దిగి మళ్లీ మరోబండి ఎక్కి అలా వంద మైళ్లు ప్రయాణంచేసి ఈ ఊరులో అడుగుపెట్టాడు. ఈ ఊరు తనకి ఆశ్రయమిస్తుందనే నమ్మకం కలిగింది. వచ్చి పది రోజులయింది. అనుకున్నట్టుగా యేది జరుగలేదు. అయినా ఇంకో నాలుగురోజులు ఓపిక పడదామని మనసులో ఉంది. కాని… ఆకలి… ప్రేగులు తెగిపోయే బాధ… మొదట్లో కేవలం తండ్రిమాటలకు కోపం వచ్చి, పౌరుషం వచ్చి పారిపోయినా చివరి కది పట్టుదలగా పరిణమించి ఉద్యోగం చెయ్యటం తనధర్మం, కర్తవ్యం అనేభావన లోకి వచ్చాడు. అందుకనే తండ్రంటే ఇప్పుడంత కోపం లేదు కాని పట్టుదల. తల్లిముఖం మనస్సులో మెదిలితే హృదయం కరిగిపోతుంది. కాని పట్టుదల.
ఇలా పారిపోయి రావటానిక మరో దిలాసా అతన్ని ఇలా ప్రోత్సహించింది. ఇన్నాళ్ళూ తిని తిరిగి వేళకి గూటికి చేరుకునే పద్దతి అతని మెదడున బాగా తుప్పుపట్టించేసింది. ఈ ప్రపంచంలో ఏమూల ఏమిజరుగుతూందో ఈ ప్రజలమధ్య సమస్యలేమిటో, బ్రతకటమంటే ఏమిటో, అతని కంతవరకూ ఏమీపట్టలేదు. ‘‘హూ ఇంత విశాలమైన ప్రపంచంలో నొఒక్క పొట్టకి ఇంత అన్నం దొరకదా?’’ అనే దిలాసా అతన్ని వెనకచూపూ, ముందు చూపూ లేకుండా ఆ అర్థరాత్రి ముసురులో ఈదురుగాలిలో బండెక్కించింది. తను వెళ్లటంయేవిటి పట్నంలో ఏదో పనిలో ప్రవేశించి హాయిగా కాలుమీద కాలువేసుకుని గడిచిపోయిన రోజులకంటె హెచ్చుగా గడపవచ్చని అతను ఊమించాడు. ‘‘మొదటి నెలజీతం రాగానే కొంత తండ్రిపేర మనియార్డర్ చేస్తాను. క్రింద రాస్తాను. ‘‘నేనంత అసమర్థుడ్ని కానని ఋజువు చేసుకున్నాను’’ అని. తండ్రి నివ్వెరబోతాడు. క్షమాపణ చెప్పుకుంటూ జాబురాస్తాడు. అప్పుడు తను కనికరించి వాళ్లనికూడా తీసుకొచ్చి తన దగ్గరే పెట్టుకుంటాడు….’’ ఇలా సాగిపోయాయి అతని ఆలోచనలు రైల్లో కూర్చున్నంతసేపూను. ఈ ప్రపంచంలో బ్రతకగలగటం అన్నది కేవలం తన అసమర్థత, సమర్థలకి సంబంధించినదే అనుకున్న అతను యీ అభిప్రాయం తప్పని తెలుసుకోవటానికి యెక్కువకాలం పట్టలేదు. ఉదాహరణకు తను దచవగలడు రాయగలడు. అయినా తనకి ఏ ఆఫీసులోనూ ఉద్యోగం దొరకలేదు. శారీరకంగా యెంతటి కష్టమైనా సునాయాసంగా నిర్వహించగలడు. ఐనా ఏ ఫ్యాక్టరీలోనూ తనకు పని దొరకలేదు. ఇవన్నీ తన అభిప్రాయాన్ని నిర్దాక్షిణ్యంగా ఖండిస్తున్నాయి. మొదట్లో అంటే వచ్చిన కొత్తలో నోరు తెరచి ‘‘ఏదైనా ఉద్యోగం ఉంటే యిప్పిసాతరా’’ అని అడగటానికి కూడా అభిమానపడ్డాడు. ‘‘ఏమైనా ఖాళీలున్నాయా?’’ అని ఘరానాగా అడిగాడు. అధికారి కస్సుమని లేచి బయటికి పొమ్మన్నాడు. అతని మనసులో తండ్రి బింబం చెరిగిపోయి ఆ స్థానాన్ని యీ అధికారి ఆక్రమించాడు. ‘‘తను యెప్పుడో వొక ప్పుడు బుద్ధిచెప్పాల్సిన మనుష్యుల్లో ఇతను రెండవవాడు’’ అని కసిగా అనుకున్నాడు మనసులో. ఓరగా అతని వైపుచూస్తూ ఇవతలికి వచ్చాడు. ఇది అతని ఉద్యోగాన్వేషణలో మొదటిఘట్టం. ఈ అనుభవాన్ని ఆధారం చేసుకుని అతను ముందు జరగబోయేదాన్ని అంచనావెయ్యలేక పోయాడు. ఆ తర్వాత నాలుగయిదు రోజుల్లో ఇటువంటి అనుభవాలు ఎన్నో జరిగాయి. జేబులో పైకంకూడా ఖాళీ అయిపోగానే ప్రపంచం గురించి రెండో వైపునించి ఆలోచించటం మొదలుపెట్టాడు. తండ్రిమాటల్ని మనసుకు పట్టించుకోక ఆ యింట్లోనే, వాళ్ళమధ్యనే ఉండి ఉంటే తెలుసుకోలేనంతటి బ్రహ్మాండమైన ప్రపంచ జ్ఞానాన్ని ఈ వారం రోజుల్లోనూ అతను సేకరించుకున్నాడు. ఇప్పుడతని మనసులో తండ్రిగాని, కస్సుమని ఎగిరిపడిన అధికారి గాని ఎవరూ లేరు. వారిద్దరిస్థానే ఇప్పుడ భయం ఆక్రమించింది. గుండెల్ని నమిలిమింగే భయం. తర్వాత తర్వతాబాధ ఆక్రమించింది. బాధ క్షుద్బాధ. కండలు తిరిగిన దండలతో, కోరమీసంతో, నునుపుతేరిన శరీరాన్ని పీల్చి పిప్పిచేసి ఎండబెట్టిన ఒరుగులాచేసిన క్షుద్బాధ. తర్వతా ఆత్మాభిమానమే ఆహారంగా ఎంతకాలమో గడపలేకపోయాడు. కొద్దిరోజుల్లో అది కాస్తా ఖర్చయిపోయింది. చివరికి ఆత్మాభిమానం చంపుకోవటం వల్లకూడా ఏమంత ప్రయోజనం కనిపించలేదు. నోరుతెరిచి చెయియ చాపితే పెట్టేదాత కనిపించలా. వీధి అరుగుమీద కూర్చుని అడుక్కునే కుంటి తాతయ్యని కసిరికొట్టినఘట్టాలు జ్ఞప్తికొచ్చాయి. ఏడవలేక నవ్వుకున్నాడతను. ఇటువంటి క్లిష్టపరిస్థితుల్లోనే ‘‘పోనీ ఇంటికి పోతేనో’’ అని మనస్సు వెనక్కి పీకింది. కాని ఎవరో వెన్ను తట్టి చెప్పినట్టుగా తనమటుకు తనకే ఆ పని సబబుగా తోచలేదు. ‘‘అక్కడమటుకు యేముంది తినటానికి? తను బాగుపడాలి. అంటే సంపాదించాలి. అదీ తనధర్మం. తల్లిదండ్రుల్ని పోషించేశక్తి గలవాడుగా కాకపోయినా తన పొట్ట తను పోషించుకోగలిగివుండాలి.
‘‘గడ్డంతాత’’ అని అతనికి వోచిన్న పిల్లవాడు పేరుపెట్టాడు. వాడల్లాగేతన్ని పిలుస్తుంటాడు. వాడ్ని బట్టి అందరూను. మిగతాపిల్లలు వాడల్లా పిలుస్తుంటే కిలకిలా నవ్వుతూంటారు. అతనూ నవ్వుతూంటాడు గడ్డం సవరించుకుంటూను. వాళ్లతో గడిపే ఆకాసేపూ ఏ చీకూచింతా లేకుండా వుంటుంది. తలుపులన్నీ బంధించబడి చీకటిగయ్యారంగా వున్న అతని హృదయ మందిరంలోకి యీ పిల్లలు కిటికీ రెక్కలు కొద్దిగా తెరిచి సన్నని వెలుగు జీర ప్రసరింపచేశారు. మళ్లీ టప్పున ఆకిటికీ రెక్కలు మూపి మెరుపులా పిల్లలు మాయమైపోతుంటారు. చీకటి ఆకాస్త వెలుతురునూ కబళించి యెపటిమాదిరిగా రాజ్యంచేస్తుంది. సముద్రానికి కూడా అవతలిగట్టు అంటూ ఉండకుండా వుంటుందా? కాకపోతే మనకంటికి కనిపించనంతటి దూరంలో వుంటుంది. అలాగే యీ అన్వేషణ అనంతమైనది కాదేమో. అని ఆశగా అనుకుంటాడు అతను. నిజానికి ఆశ లేకపోతే జీవితం ఏముంది? కష్టపడ్డా సుఖపడ్డా దానికి కారణభూతం ఆశ.
ఆ ఉదయమే గడ్డాలతాత మరోకొత్త సహచరుని సంపాదించాడు. అతనొక్కడే తన్ని ఇన్నాళ్లకి ‘‘నువ్వెవరవు?’’ అని అడిగినవాడు. ప్రాణం లేచివొచ్చినట్టయింది తనకి.
‘‘నీ పేరు?’’ ది ఆ కొత్తవ్యక్తి వేసిన రెండోప్రశ్న.
గడ్డాలతాత తన చరిత్రనంతా పూసగుచ్చినట్టుగా అతని చెవిని వేశాడు. విని అతను జాలిపడ్డటుటగా కనిపించలేదు. ‘‘ఒకే తరగతికి చెందినవాళ్ళం తమాషాగా కలిశాం’’ అన్నాడతను.
‘‘అంటే?’’ అయోమయంగా ప్రశ్నించాడు గడ్డాలతాత.
‘‘నా థ్యేయం కూడా అదే.’’
అమాంతం రెండుచేతులూ అతని చుట్టూ వేసి కౌగలించుకన్నడు గడ్డాలతాత. తన్ని నోరువిప్పి ఆప్యాయంగా పలకరించే మనిషి కోసం ముఖం వాచిపోయిన గడ్డాలతాత ఆ కాసేపూ అన్ని సమస్యలూ మర్చిపోగలిగాడు. చిన్న పిల్లల సమక్షంలో తను పొందగలిగిన సంతృప్తి, విశ్రాంతి ఇప్పుడు మళ్లీ పొందగలిగాడు. ఆత్మీయుడు ముందు మసులుతున్నట్టుగా అనిపించింది. ‘‘నువ్వెవరవు? నీ పేరేమిటి?’’ అని అడిగాడు గడ్డంతాత.
ఈ ఇద్దర్నీ వింతగా చూస్తూ నిలబడ్డ చిన్న కుర్రాడొకడు వెకిలిగా నవ్వుతూ ‘‘పిల్లికళ్ల బూచి’’ అంటూ పారిపోయాడు.
ఆ కొత్తమనిషికి కోపంవచ్చి చర్రుమని లేచాడు. గడ్డాలతాత అతన్ని వారించి ‘‘వాళ్ళే నాకు గడ్డాలతాత అని పేరు పెట్టారు. మొదట్లో నీకుమల్లేనే నాకూ కోపంవచ్చింది. కాని రానురాను వాళ్ళే నాకు ఆపుతలయ్యారు. పసిపిల్లలు’’ అన్నాడు.
అలాగా అన్నట్టుగా పిల్లికళ్లబూచి గడ్డం తాత ముఖంలోకి చూసి అంతకోపం దిగమింగుకుని నవ్వేశాడు. ‘‘నా పేరు… ఏదైతేనేంలే వాళ్లు పెట్టారుగా. ‘‘పిల్లికళ్లబూచీ’’ అని. అలాగే పిలు అంటూ ఆ నవ్వు పొడిగించాడు. గడ్డాలతాత నవ్వుతో శృతి కలిపాడు.
ఆ డు కంఠాలూ నవ్వుకు మొహం వాచిపోయినట్టుగా నాలుగు గోడలూ ప్రతిధ్వనించేలా పగలబడ్డాయి.
‘‘నీ దే వూరు?’’ గడ్డంతాత ప్రశ్నించాడు.
‘‘అబ్బో చాలాదూరం.’’
‘‘ఇంతూదరం దేనికొచ్చినట్టు?’’
బూచి నవ్వుతూ పొట్టకొట్టుకున్నాడు.
అర్థం అయిందన్నట్టుగా తలూగించాడు గడ్డం తాత.
‘‘అయితే ఎక్కడన్నా దొరికిందా ఉద్యోగం?’’ గడ్డంతాత ప్రశ్నించాడు.
‘‘లేదు’’ ఆ కంఠస్వరంలో ఏదో కసీ, కోపం ధ్వనించాయి.
‘‘ఏం చేద్దాం అనుకుంటున్నావు?’’
‘‘నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు?’’
గడ్డాలతాత కన్నీరు ఆపుకుందామని చేసిన ప్రయత్నాలు వ్యర్థమైపోయాయి. బావురుమని రెండుచేతుల్తో ముఖం కప్పుకుని ఏడ్చాడు. అంతలో నవ్వు. అంతలో ఏడ్పు. బూచీ కొంత కంగారుపడ్డాడు. ‘‘ఏడవకు ప్రయత్నిద్దాం. దొరక్క పోతుందా’’ అంటూ ఓదార్చాడు.
‘‘మా అమ్మా నాన్నా అందర్నీ వదిలేసి వచ్చాను. ముందూ వెనకాదారి కానరావటంలేదు’’ అంటూ మళ్లీ రాగాలుతీశాడు గడ్డాలతాత.
‘‘నూనూ అంతే.’’
‘‘ఆ నువ్వూ మీ అమ్మా నాన్నా వాళ్లని వదిలేసి వచ్చావా?’’ అని ఆశ్చర్యముగా అడిగాడు గడ్డాలతాత.
‘‘తల్లీ తంరడీ లేరుగాని భార్యా పిల్లలూ ఉన్నారు.’’
‘‘ఎలాగైతేనేం. అయితే వాళ్లనెందుకు వదిలేసి వచ్చావు?’’
‘‘నేను వట్టి అసమర్థుడ్నని నా భార్య అభిప్రాయపడింది. ఓ రాత్రిపూట పిల్లలిన తీసుకుని పారిపోయింది. చుట్టుపక్కల ఊళ్లన్నీ గాలించాను. ప్రయోజనం లేక పోయింది. ఇలా వచ్చేశాను.’’
గడ్డాల తాత నవ్వాడు. ‘‘నువ్వు జరిగిందంతా పూర్తిగా చెప్పటంలేదు. కొంత దాస్తున్నావు కదూ?’’ అన్నాడు.
బూచి ఆశ్చర్యంగా అతని ముఖంలోకి చూశాడు.
‘‘నీ సమర్థతని ఋజువు చేసుకుందుకోసమని ఆమెని చిత్తుగా తన్నివుంటావు. అందుకే ఆమె పారిపోయి ఉంటుంది. అంతేనా?’’ గడ్డాల తాత ప్రశ్నార్థకంగా అతని ముఖంలోకి చూశాడు.
బూచీముకం ఎఱ్ఱబడింది. తర్వాత తెప్పరిల్లి ‘‘నీ కెలా తెలుసు?’’ అని అడిగాడు.
గడ్డాలతాత భయంకరంగా నవ్వాడు. ఆ నవ్వు పొడిగిస్తూనే ‘‘ఆమాత్రం ఊహించలేనూ. నీ చెప్పే తీరే చెబుతోంది’’ అన్నాడు.
‘‘నువ్వు చాలా తెలివైనవాడివిలా గున్నావు. ఇట్టే గ్రహించేశావు. నువ్వు చెప్పింది నిజమే. కొట్టాను. అందుకే పారిపోయింది. ఎలాగున్నారో? యెక్కడున్నారో?’’
‘‘పోనీలే బూచీ బాధపడకు. ఎప్పుడో ఒకప్పుడు మీరంతా కలుసుకుంటారు. నాకా నమ్మకం ఉంది’’ అంటూ ఓదార్చాడు గడ్డాలతాత.
———–