పేరు (ఆంగ్లం) | Sayyed Ahmedulla Khadri |
పేరు (తెలుగు) | సయ్యద్ అహ్మదుల్లా ఖాద్రి |
కలం పేరు | – |
తల్లిపేరు | సయ్యిదా మహబూబ్ బేగం ఖాద్రి |
తండ్రి పేరు | సయ్యద్ షామ్సుల్లా ఖాద్రి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 8/9/1909 |
మరణం | 10/5/1985 |
పుట్టిన ఊరు | హైదరాబాదు |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ముహమిద్ ఎ ఒస్మాన్, తన్ఖిద్-ఇ-ఖామస్-ఉల్-మషాహిర్, మిర్ హసన్ దెహెల్వి , ఖాముస్-ఉల్-మషాహిర్, నవీద్ ఎ మస్సారత్ ,ఉస్మాన్ నమః , మంజిర్ (కలాం – ఎ – మజ్ముయా), మెమొరీస్ ఆఫ్ చాంద్బీబీ, సావనే చాంద్బీబీ, అజీం ముజాహిద్ ఎ అజాదీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | సయ్యిద్ అహ్మదుల్లా ఖాద్రి |
సంగ్రహ నమూనా రచన | సయ్యిద్ అహ్మదుల్లా ఖాద్రి ( 9 ఆగస్టు 1909 – 5 అక్టోబరు 1985) (లిసాన్-ఉల్-ముల్క్ గా సుపరిచితుడు) భారతీయ రచయిత,విమర్శకుడు, ఛీఫ్ ఎడిటర్, భారత స్వాతంత్ర్యసమరయోధుడు, భారత రాజకీయవేత్త మరియు హైదరాబాదు ప్రముఖుడు. ఆయన “లుట్ఫుదుల్లా ఓరియంటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్” యొక్క అధ్యక్షులుగా తన సేవలనందించాడు.ఆయన హైదరాబాదు జర్నలిస్టు అసోసియేషన్ అద్యక్షులుగా కూడా ఉన్నాడు.ఆయన ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ కౌన్సిల్ సభ్యుడు. |
సయ్యిద్ అహ్మదుల్లా ఖాద్రి
సయ్యిద్ అహ్మదుల్లా ఖాద్రి ( 9 ఆగస్టు 1909 – 5 అక్టోబరు 1985) (లిసాన్-ఉల్-ముల్క్ గా సుపరిచితుడు) భారతీయ రచయిత,విమర్శకుడు, ఛీఫ్ ఎడిటర్, భారత స్వాతంత్ర్యసమరయోధుడు, భారత రాజకీయవేత్త మరియు హైదరాబాదు ప్రముఖుడు. ఆయన “లుట్ఫుదుల్లా ఓరియంటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్” యొక్క అధ్యక్షులుగా తన సేవలనందించాడు.ఆయన హైదరాబాదు జర్నలిస్టు అసోసియేషన్ అద్యక్షులుగా కూడా ఉన్నాడు.ఆయన ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ కౌన్సిల్ సభ్యుడు.
ఖాద్రి 1966 లో భారతదేశ పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన సాహిత్యం మరియు విద్యలో చేసిన కృషికి గానూ ఈ పురస్కారం వరించింది. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యుడుగా కూడా ఉన్నాడు.ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హాజ్ కమిటీ కి చైర్మన్ గా కూడా వ్యవహరించాడు.ఆయన ఉర్దూ దినపత్రికలైన అయిన సల్తానత్ మరియు పైసా అక్బర్ కు ఛీఫ్ ఎడిటరుగా కూడా పనిచేసాడు. అంతకు ముందు ఆయన తండ్రి 1929లో స్థాపించిన తరిఖ్ పబ్లికేషన్స్ కు ఎడిటరుగా కూడా ఉన్నారు.
ఆయన హైదరాబాదు రాష్ట్రంలో ఆగష్టు 9, 1909లో అల్లామా హకీం సయ్యద్ షామ్సుల్లా ఖాద్రి మరియు సయ్యిదా మహబూబ్ బేగం ఖాద్రి దంపతులకు జన్మించాడు. ఆయన కుటుంబం సాహిత్య ప్రపంచంలో సుప్రసిద్ధమైనది. ఆయన సహోదరులలొ పెద్దవాడు. ఆయనకు ఇద్దరు తమ్ముళ్ళు. వారు సయ్యద్ ఇమ్దదుల్లా ఖాద్రి మరియు సయ్యిద్ సాడుల్లా ఖాద్రి. ఆయన తంద్రి అల్లామా సయ్యద్ షామ్సుల్లా ఖాద్రి కూడా అనేక పుస్తకాలను రచించారు. ఆయన దక్కనీయత్ యొక్క మొదటి పరిశోధకుడు
1946లో ఖాద్రి హైరదాబాద్ రాష్ట్రానికి మొదటి జర్నలిస్టు. ఆయన ఉర్దూ దినపత్రిక “సల్తానత్” లో ఒకే జాతి సిద్ధాంతం పై రచననలు చేసేవారు.
———–