అంబటిపూడి వెంకటరత్నం (Ambatipudi Venkataratnam)

Share
పేరు (ఆంగ్లం)Ambatipudi Venkataratnam
పేరు (తెలుగు)అంబటిపూడి వెంకటరత్నం
కలం పేరు
తల్లిపేరుసుబ్బమ్మ
తండ్రి పేరుసుబ్రహ్మణ్యం
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/5/1908
మరణం
పుట్టిన ఊరుప్రకాశం జిల్లా,పర్చూరు మండలం, ఏదుబాడు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఇందిరావిజయమ్‌ (సంస్కృత నాటకం), కృష్ణకథ (అనువాదంమూలం:శ్రీరామకృష్ణానంద స్వామి), ప్రణయవాహిని, మైనాదేవి,మొరాన్‌కన్య, వత్సలుడు, వనవాటి, దక్షిణ, వీరాంజలి
ఇంద్రధనువు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఅంబటిపూడి వెంకటరత్నం
సంగ్రహ నమూనా రచనమాధవపెద్ది వెంకటనరసయ్య వద్ద అక్షరాభిషేకం గావించారు. ఎనిమిద యేట ఉపనయనము అయిన తరువాత పొన్నూరు చేరి అక్కడ ఉన్నత పాఠశాలలో ఆరు నుండి తొమ్మిదవ తరగతి వరకు చదివారు. తరువాత బందరు వెళ్లి అక్కడ తొమ్మిదవ తరగతిలో చేరారు. అక్కడ చెరుకువాడ నరసింహపంతులు ఇంగ్లీషును, పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగును బోధించేవారు. ఆ తరువాత ఇతడు నల్లపాడు గ్రామంలో బండ్లమూడి వెంకయ్యశాస్త్రి వద్ద సంస్కృతాధ్యయనం చేసి కాళిదాసు రఘువంశ కావ్యాన్ని పఠించారు. తరువాత తిమ్మరాజుపాలెంలో ప్రతాప కృష్ణమూర్తి శాస్త్రి వద్ద పంచకావ్యాలను చదువుకున్నారు.

అంబటిపూడి వెంకటరత్నం

మాధవపెద్ది వెంకటనరసయ్య వద్ద అక్షరాభిషేకం గావించారు. ఎనిమిద యేట ఉపనయనము అయిన తరువాత పొన్నూరు చేరి అక్కడ ఉన్నత పాఠశాలలో ఆరు నుండి తొమ్మిదవ తరగతి వరకు చదివారు. తరువాత బందరు వెళ్లి అక్కడ తొమ్మిదవ తరగతిలో చేరారు. అక్కడ చెరుకువాడ నరసింహపంతులు ఇంగ్లీషును, పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగును బోధించేవారు. ఆ తరువాత ఇతడు నల్లపాడు గ్రామంలో బండ్లమూడి వెంకయ్యశాస్త్రి వద్ద సంస్కృతాధ్యయనం చేసి కాళిదాసు రఘువంశ కావ్యాన్ని పఠించారు. తరువాత తిమ్మరాజుపాలెంలో ప్రతాప కృష్ణమూర్తి శాస్త్రి వద్ద పంచకావ్యాలను చదువుకున్నారు. తరువాత కడియం వెళ్లి చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి వద్ద సిద్ధాంతకౌముది కొంతభాగం చదువుకున్నారు. మిగిలిన భాగాన్ని అగిరిపల్లిలో సంపత్కుమారాచార్య వద్ద అభ్యసించారు. చిరివాడలో వేలూరి శివరామశాస్త్రివద్ద సంస్కృతాంధ్రాంగ్ల భాషలు నేర్చుకున్నారు. ఆ తరువాత గుంటూరులో ఉన్నత పాఠశాల విద్య పూర్తిగావించారు. గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఎఫ్.ఏ చదువుకున్నారు. అదే కళాశాలలో బి.ఏ. తెలుగు, చరిత్ర ప్రధానాంశాలుగా చదివారు.

నల్లగొండ జిల్లా చుండూరు గ్రామం చేరుకుని అక్కడ విద్య బోధించేవారు. ఇతడు ఎందరో శిష్యులను తీర్చిదిద్దారు. దరిద్ర నారాయణ సంఘమును స్థాపించి అన్నదానము, వస్త్రదానము చేసి ఆచరణతో కూడిన ఆదర్శమును ప్రదర్శించారు. కస్తాల గ్రామంలో విద్యానాథ గ్రంథాలయమును స్థాపించారు. అట్లే చుండూరులో ఆంధ్రరత్న పఠనమందిరమును ప్రారంభించారు. హరిజన పాఠశాలను నెలకొల్పాడు. మద్యపాన నిషేధాన్ని ప్రచారం చేశారు. ఇతడు కొంతకాలం నల్లగొండలోని గీతావిజ్ఞానాంధ్ర కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు.

నల్లగొండ జిల్లా చండూరు నివాసియైన అంబటిపూడి వెంకటరత్నం 1934లోనే అక్కడ సాహితీమేఖల అనే సంస్థను ప్రారంభించి, అనేక సాహితీ – సామాజిక సేవల్ని నిర్వహించారు. నల్లగొండ ఓరియంటల్‌ కాలేజ్‌ ప్రధానాచార్యులుగా పనిచేశారు. బహుగ్రంథకర్తగా అనేక సాహితీ ప్రక్రియలలో రచనలు చేసిన అంబటిపూడివారు, తాము రాసిన 12 కథలతో ‘కథావళి’ని 1950లో ప్రచురించారు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఈ పుస్తకం వెలుగు చూసింది. ఇప్పుడు ఇందులో వున్న ఎనిమిది కథలు స్వతంత్ర రచనలు కాగా, అయిదు కథలు అనువాదాలు.

భాగవతంలో కనిపించే ‘కళింగ మర్దన’ వేరు. రచయిత కలగన్న కళింగ మర్దన వేరు. కాళింగుని పొగరణచి రాధను రక్షించడం, అంతా కలిసి పార్టీ చేసుకోవడం ఈ కథలో కనిపిస్తుంది. అసమర్ధుడైన భర్తను వదిలి, నచ్చిన ప్రియుడితో లేచిపోతే, మోజు తీరాక వాడు ఆమెను వదిలేసి పారిపోతాడు. ఒక డాక్టరింట్లో పని మనిషిగా చేరినా, గుర్తు పట్టిన వాళ్ళ ఈసడింపులు భరించలేక నదిలో దూకుతుంది. ఆమెను రక్షించి, ఆశ్రయం కల్పించిన జయరాముడి ఇంట్లో ఉండటమా? కళంకం భరించలేక చావడమా? అని తేల్చుకోలేకపోవడం ‘సానుభూతి’లో కనిపిస్తుంది. తండ్రి ఇంట్లో విలాసవంతంగా పెరిగిన మోహన్‌, వితంతు వంటమనిషి అక్రమ సంతానంగా తెలిసి ‘విభ్రాంతి’కి గురవుతాడు. తనను ప్రాణంగా చూసుకున్న అమ్మమ్మ రుణం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇక బాల్యంలో వివాహం చేసుకుని, విద్యాభ్యాసం కోసం కాశీకి వెళ్ళిన వాచస్పతి పండితుడిగా తిరిగి వస్తాడు. మారువేషంలో వచ్చి విద్యావంతురాలైన భార్యను పరీక్షించి, ఆమె సౌశీల్యాన్ని గుర్తించి స్వీకరించడం ‘ప్రాయశ్చిత్తం’లో కనిపిస్తుంది. లోకమంతా దీనులు, దు:ఖార్తులతో నిండి వుంది. వాళ్ళకు చేతనయినంత సహాయం చేయాలని ప్రయత్నించే వ్యక్తిని ‘అదేమి రోజో… అబ్బ’లో చూడవచ్చు. ‘ధర్మోజయతి’ కథలో గాయకుడైన శేషును ప్రేమించిన కళ్యాణి పెద్దల ఇష్టంతో పెళ్ళి చేసుకుని హాయిగా వుంటుంది. బొంబాయి నుండి వచ్చిన కళ్యాణి మేనత్త కొడుకు మీనన్‌, ఆమె తండ్రి తీసుకురమ్మన్నాడని చెప్పి, ఆమెను వెంటబెట్టుకుని వెళ్ళి రామబ్రహ్మం అనే వ్యక్తికి అమ్మేసి వెళ్ళిపోతాడు. ఆమె తెలివిగా తప్పించుకుని, పక్కింటి వారి సహాయంతో వాళ్ళను పోలీసులకు పట్టించి, భర్తను చేరుకుంటుంది. ‘తపస్సు’ కథలో కరువు పీడిత ప్రజలకు అలంఘర్‌ పాదుషా పెద్దమనసుతో ఆదుకుంటాడు. ఇరవై ఒక్క రోజులు తపస్సు చేసి వాన కురిపిస్తామన్న విప్ర సోదరుల మాటలు నమ్ముతారు. అనుకున్న ప్రకారం వాన కురవడంతో, వాళ్ళకు అగ్రహారాలిచ్చి సన్మానిస్తాడు. ఇంకోవైపు విలాసంగా పెరిగిన ధనవంతుడు దివాళా తీసి కూలివాడుగా మారినా వాడి ఠీవి ఎక్కడికి పోతుంది? వాడికి వాడే ‘ప్రభువు’. ఇవన్నీ అంబటిపూడి వెంకటరత్నం స్వంత రచనలు.

మార్గాయాసంతో చెట్టుకింద నిద్రించిన డేవిడ్‌ను చూసి ఒక వితంతువు, మత ప్రచారకుడు, పిల్లలు లేని దంపతులు, ఒక కన్నెపిల్ల, ఇద్దరు దొంగలు – ఎలా ఆలోచిస్తారో ‘భాగ్యరేఖలు’ కథ తెలియజేస్తుంది. పగటి కలలు కంటూ ప్రపంచమంతా తిరిగి తిరిగి జీవితకాలాన్ని పాడుచేసుకోవడం కంటే, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని కలలను సాకారం చేసుకోవాలని ‘భాగ్యత్రిపుటి’ తెలియజేస్తుంది. ఒక వ్యాపారవేత్త, ఒక విలాసవంతుడు, ఒక రాజకీయ వేత్త, ఒక వగలాడి అందరూ ముసలితనంలో వుంటారు. వాళ్ళకు యవ్వనం కలిగిస్తానని, అప్పుడు వాళ్ళు ఆదర్శంగా మెలగాలని కోరుతూ డాక్టర్‌ వాళ్ళకు ఒక మందు తాగిస్తాడు. యవ్వనవంతులైన ఆ నలుగురు విశృంఖలంగా ప్రవర్తిస్తారు. తర్వాత మందు ప్రభావం తగ్గి, మళ్ళీ ముసలివాళ్ళవుతారు. ‘డాక్టర్‌ చేసిన తమాషా’ వాళ్లకు గుణపాఠం నేర్పిస్తుంది. ‘నేతి నేతి కావాలి’ కథలో తల్లిదండ్రులతో సంతకెళ్ళిన కుర్రాడు కనిపించిన ప్రతిదీ కావాలంటాడు. బీదరికంతో వాళ్ళు ఏమీ కొనివ్వలేకపోతారు. చివరకు అమ్మానాన్నల నుండి తప్పిపోయిన ఆ కుర్రాడ్ని ఊరడించడానికి, ఇంతకుముందు కోరుకున్నవన్నీ ఇస్తామని ఆశ పెట్టినా ఏడుపు ఆపుకోలేకపోతాడు. ఇప్పుడు వాడికి ఒకటే కోరిక. ఒకే ఏడుపు. అమ్మానాన్నలు కావాలని. ఈ కథలో పసిపిల్లల మనస్తత్వాన్ని చక్కగా పట్టుకున్నారు. ఇందులోని ‘నేతి నేతి అమ్మ కావాలి’ కథ ముల్కరాజ్‌ ఆనంద్‌ రాసిన కథకు అనువాదం కాగా, మిగిలిన కథలన్నీ నెథానియల్‌ హథారాన్‌ రాసిన కథలకు అనువాదాలు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ పుస్తకాన్ని మళ్ళీ వెలుగులోకి తెచ్చిన ప్రచురణ కర్తలను అభినందించక తప్పదు.

———–

You may also like...