బిరుదురాజు రామరాజు (Biruduraju Ramaraju)

Share
పేరు (ఆంగ్లం)Biruduraju Ramaraju
పేరు (తెలుగు)బిరుదురాజు రామరాజు
కలం పేరు
తల్లిపేరులక్ష్మీదేవమ్మ
తండ్రి పేరుబిరుదురాజు నారాయణరాజు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ4/16/1925
మరణం2/8/2010
పుట్టిన ఊరువరంగల్ జిల్లా,ధర్మసాగర్ మండలం, దేవనూరు
విద్యార్హతలుఎం.ఎ.
వృత్తిప్రొఫెసర్‌
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఆంధ్రయోగులు (నాలుగు సంపుటాలు), సంస్కృత సాహిత్యానికి తెలుగువారి సేవ,
చరిత్రకెక్కని చరితార్థులు, మరుగున పడిన మాణిక్యాలు, తెలుగువీరుడు, తెలుగు జానపదరామాయణం, వీరగాథలు, యక్షగాన వాజ్మయము, తెలుగు సాహిత్యోద్ధారకులు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు1994 – పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే గౌరవ డాక్టరేట్ ప్రధానం,
1995 – భారత ప్రభుత్వం నుండి నేషనల్ ప్రొఫెషనల్‌షిప్,
2001 – సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారి శివానంద ఎమినెంట్ సిటిజన్‌ అవార్డ్,
2003 – రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు,
2007 – పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ‘విశిష్ట పురస్కారం’,
2009 – సి.పి.బ్రౌన్ అకాడెమీ వారి తెలుగు భారతి పురస్కారం
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికబిరుదురాజు రామరాజు
సంగ్రహ నమూనా రచనబిరుదురాజు రామరాజు 1925 ఏప్రిల్ 16వ తేదీ దేవనూరు గ్రామంలో లక్ష్మీదేవమ్మ, బిరుదురాజు నారాయణరాజు దంపతులకు జన్మించారు. ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం వరంగల్ జిల్లా మడికొండలో నడిచింది. మూడవ తరగతి నుండి ఇంటర్‌మీడియెట్ వరకు ఉర్దూ మీడియంలో చదువుకున్నారు. మెట్రిక్ చదివేటప్పుడు 11వ ఆంధ్రమహాసభల సందర్భంగా మహాత్మాగాంధీ వరంగల్ వచ్చినప్పుడు ఇతడు ఆ సభలలో వాలంటీర్‌గా పాల్గొన్నారు. మహాత్మాగాంధీతో కలిసి పాదయాత్ర చేశారు. వరంగల్‌లో చదువుకునే రోజుల్లో ఇతనిపై ఆర్యసమాజం ప్రభావం ఎక్కువగా ఉండేది. ఆ తరువాత హైదరాబాదులోని నిజాం కళాశాలలో బి.ఎ. చదువుకున్నారు.

బిరుదురాజు రామరాజు

 

బిరుదురాజు రామరాజు 1925 ఏప్రిల్ 16వ తేదీ దేవనూరు గ్రామంలో లక్ష్మీదేవమ్మ, బిరుదురాజు నారాయణరాజు దంపతులకు జన్మించారు. ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం వరంగల్ జిల్లా మడికొండలో నడిచింది. మూడవ తరగతి నుండి ఇంటర్‌మీడియెట్ వరకు ఉర్దూ మీడియంలో చదువుకున్నారు. మెట్రిక్ చదివేటప్పుడు 11వ ఆంధ్రమహాసభల సందర్భంగా మహాత్మాగాంధీ వరంగల్ వచ్చినప్పుడు ఇతడు ఆ సభలలో వాలంటీర్‌గా పాల్గొన్నారు. మహాత్మాగాంధీతో కలిసి పాదయాత్ర చేశారు. వరంగల్‌లో చదువుకునే రోజుల్లో ఇతనిపై ఆర్యసమాజం ప్రభావం ఎక్కువగా ఉండేది. ఆ తరువాత హైదరాబాదులోని నిజాం కళాశాలలో బి.ఎ. చదువుకున్నారు. ఆ సమయంలో దాశరథి కృష్ణమాచార్యతో పరిచయం కలిగింది. నిజాం వ్యతిరేక రాజకీయోద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. కాళోజీ నారాయణరావు, టి.హయగ్రీవాచారి, ఎం.ఎస్.రాజలింగం, జమలాపురం కేశవరావు మొదలైన యువనాయకులతో కలిసి రజాకార్ల ఉద్యమం, స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాలలో పాల్గొని 1947లో మూడు నెలలపాటు కారాగారశిక్ష అనుభవించారు. 1947-50ల మధ్యకాలంలో నిజాం కళాశాలలో తెలంగాణా విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. బి.ఎ.తరువాత న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో ఎం.ఎ. చదివే రోజులలో విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో అనుమతి లేకుండా కవిసమ్మేళనం నిర్వహించినందుకు అరెస్ట్ కూడా అయ్యారు. ఎం.ఎ. చదివే సమయంలో సి.నారాయణరెడ్డితో కలిసి కొంతకాలం రామనారాయణకవులు అనే పేరుతో జంటకవులుగా కవిత్వం చెప్పారు. మాడపాటి హనుమంతరావు ఆంధ్రసంఘం నెలకొల్పి దానికి బిరుదురాజు రామరాజును అధ్యక్షుడిగా నియమించారు. తెలంగాణా రచయితల సంఘం ఇతడు మొదటి కార్యదర్శిగా ప్రారంభమైంది. ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తరువాత ఇది ఆంధ్ర రచయితల సంఘంగా మారింది. దీనికి ఇతడు మొట్టమొదటి కార్యదర్శి. ఎం.ఎ. పూర్తి అయ్యాక ఇతడు ఖండవల్లి లక్ష్మీరంజనం మార్గదర్శకత్వంలో తెలుగుజానపద గేయసాహిత్యం అనే అంశంపై పరిశోధన చేసి దక్షిణ భారతదేశంలోనే జానపదసాహిత్యంపై మొట్టమొదటి పి.హెచ్.డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి సంపాదించారు. సంస్కృతంలో ఎం.ఎ. చేసి అందులో కూడా డాక్టరేట్ పొందారు.
ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1951లో ఉపన్యాసకుడిగా చేరి అంచెలంచెలుగా తెలుగుశాఖకు డీన్‌గా, అధ్యక్షుడిగా ఎదిగారు. ఇతని మార్గదర్శకత్వంలో 37 మంది పిహెచ్.డి పట్టాలు పొందారు. ఇతని పర్యవేక్షణలోనే కేతవరపు రామకోటిశాస్త్రి , కోవెల సుప్రసన్నాచార్య, ముదిగొండ వీరభద్రశాస్త్రి , అక్కిరాజు రమాపతిరావు, అనంతలక్ష్మి, రవ్వా శ్రీహరి వంటి వారు తమ పరిశోధనలు చేసి డాక్టరేట్ పట్టాలను పొందారు. ఈయన 1983లో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు.———–

You may also like...