పేరు (ఆంగ్లం) | Bhagi Narayanamurthy |
పేరు (తెలుగు) | భాగి నారాయణమూర్తి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1912 |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | బి.ఎస్సీ |
వృత్తి | రోడ్డు రవాణా సంస్థ (R.T.C.)లో చాలా కాలం పనిచేశారు. |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ఖండకావ్యాలు : జయగంట, రుధిర రేఖలు, దీపావళి, వలపు, కాపు పడుచు, కాలమహిమ, వీడ్కోలు తెనుగు మొర |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | భాగి నారాయణమూర్తి |
సంగ్రహ నమూనా రచన | ఈయన సికిందరాబాదులో 1912వ సంవత్సరంలో జన్మించారు. ఇతడు మంచి నటుడు, నాటకకర్త, కవి, కథారచయిత కూడా. ఇతడు మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్సీ పట్టా పుచ్చుకున్నారు. ఈయన రోడ్డు రవాణా సంస్థ (R.T.C.)లో చాలా కాలం పనిచేశారు. ఆచార్య ఆత్రేయ రచించిన ప్రగతి అనే నాటకంలో ఇతడు వేసిన పాత్ర నటుడిగా ఈయనకి మంచి పేరును తెచ్చిపెట్టింది. ఇతడు సాధన సమితి కార్యదర్శిగా ఉంటూ తెలంగాణా సాహితీ, సాంస్కృతిక రంగాలకు ఎనలేని సేవ చేశారు. ఇతడు వ్రాసిన కథలను పద్మం కథల పేరుతో వెలువరించడానికి ప్రయత్నాలు జరిగాయి కాని ఫలించలేదు. |
భాగి నారాయణమూర్తి
ఈయన సికిందరాబాదులో 1912వ సంవత్సరంలో జన్మించారు. ఇతడు మంచి నటుడు, నాటకకర్త, కవి, కథారచయిత కూడా. ఇతడు మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్సీ పట్టా పుచ్చుకున్నారు. ఈయన రోడ్డు రవాణా సంస్థ (R.T.C.)లో చాలా కాలం పనిచేశారు. ఆచార్య ఆత్రేయ రచించిన ప్రగతి అనే నాటకంలో ఇతడు వేసిన పాత్ర నటుడిగా ఈయనకి మంచి పేరును తెచ్చిపెట్టింది. ఇతడు సాధన సమితి కార్యదర్శిగా ఉంటూ తెలంగాణా సాహితీ, సాంస్కృతిక రంగాలకు ఎనలేని సేవ చేశారు. ఇతడు వ్రాసిన కథలను పద్మం కథల పేరుతో వెలువరించడానికి ప్రయత్నాలు జరిగాయి కాని ఫలించలేదు.
వేంకటావధాని, సరిపల్లి విశ్వనాధశాస్త్రి వంటి ప్రసిద్ధులు పోతన జయంతి ఉత్సవాలలో ప్రసంగించారు. 1955 ఫిబ్రవరిలో వరంగల్లు యువకవులు ‘సాహితీ బంధు బృందం’ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంస్థ పలువురి కవితలతో ‘తొలికారు’ అనే కవితా సంకలనాన్ని వెలువరించింది. ఇలా వరంగల్లు సాహిత్య సమాచారంతో ఒక ఉద్గ్రంధమే తయారవుతుంది. నాటి తెలంగాణలో సాహితీ చైతన్యాన్ని పెంపొందించిన మరో రెండు సంస్థలు కూడా ప్రధాన సాహిత్య చరిత్రల్లో విస్మరణకు లోనయ్యాయి. ‘సాధన సమితి’ అనే సంస్థ 1939లో ఆవిర్భవించింది. కథానిక ప్రక్రియను బాగా ప్రోత్సహించింది. 20 పుస్తకాలు ప్రచురించింది. ప్రత్యూష అనే లిఖిత పత్రికను నిర్వహించింది. నెల్లూరు కేశవస్వామి, భాగి నారాయణమూర్తి, బూర్గుల రంగనాధరావు, వెల్దుర్తి మాణిక్యరావు, జె.సూర్యప్రకాశరావు, పిల్లలమర్రి హనుమంతరావు ఇందులో ప్రముఖంగా పాల్గొన్నారు. 1955లో నవలల పోటీ నిర్వహించింది. దేవులపల్లి రామానుజరావు రాసినట్టు ‘తెలంగాణలో తెలుగును మరింత తేజోవంతం చేయడానికి ఆవిర్భవించిన ఆంధ్ర సారస్వత పరిషత్తు’ ఆలంపురం, మంచిర్యాలల్లో నిర్వహించిన కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది.
తెలంగాణలో జన్మించి 1900-1956 సంవత్సరాలమధ్యకాలంలో కవితా రచన చేసిన కవుల పేర్లు ప్రధాన సాహిత్య చరిత్రలో కనిపించవు. అడ్లూరి అయోధ్యరామకవి, మేడిచర్ల ఆంజనేయమూర్తి, చెలమచర్ల రంగాచార్యులు, రంగరాజు కేశవరావు, గంగుల శాయిరెడ్డి, సిరిసిన హళ కృష్ణమాచార్యులు, కంభంపాటి అప్పన్నశాస్త్రి, బెల్లంకొండ నరసింహాచార్యులు, చిలకమర్రి రామానుజాచార్యులు, భాగి నారాయణమూర్తి వంటి ప్రతిభావంతులు చాలాకాలం క్రితమే విస్మృత కవుల కోవలో చేరారు. వీరితోపాటు ఇక్కడి విస్మృత కవులందరి రచనలకు సాహిత్య చరిత్రలో స్థానం దొరకాలి.
———–