పేరు (ఆంగ్లం) | Digavalli Venkata Sivarao |
పేరు (తెలుగు) | దిగవల్లి వేంకటశివరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | సూర్యమాణిక్యాంబ |
తండ్రి పేరు | వెంకటరత్నం |
జీవిత భాగస్వామి పేరు | కమల |
పుట్టినతేదీ | 2/14/1898 |
మరణం | 10/3/1992 |
పుట్టిన ఊరు | తూర్పుగోదావరి జిల్లా కాకినాడ |
విద్యార్హతలు | బి.ఎ.,బి.యల్ |
వృత్తి | న్యాయవాది |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ఆంగ్ల రాజ్యాంగము, కథలు గాథలు, పోతన వేమనల యుగము , హిందూ ధర్మ సంగ్రహము (1926), హిందువుల ఋణములు, అన్యా క్రాంతములు (1926), దక్షిణాఫ్రికా (1928): విజ్ఞాన చంద్రికా మండలి వారి ప్రచురణ, నీలాపనింద (1929), సత్యాగ్రహ చరిత్ర (1930) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | దిగవల్లి వేంకటశివరావు |
సంగ్రహ నమూనా రచన | దిగవల్లి వేంకట శివరావు చరిత్ర పరిశోధకులు, రచయిత, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన అనేక చారిత్రికాంశాలను పరిశోధించి పుస్తకాలు రచించారు. ఆయన తల్లిగారు ద్రాక్షారామం వాస్తవ్యులు ఆలమూరు సూరయ్య గారి కుమార్తె. శివరావుగారి సతీమణి విశాఖపట్టణంకు వాస్తవ్యులు బుధ్ధిరాజు మూర్తిరాజు గారి కుమార్తె కమల. శివరావుగారు వృత్తిరీత్యా 1922 నుండీ విజయవాడలో ప్రఖ్యాత న్యాయవాది. అంతేకాక వారు చరిత్ర పరిశోధకుడుగా గ్రంథ కర్తగా ప్రసిధ్ధి.గాంధీ వాది. గాంధీ ప్రవేశపెట్టిన అనే క సత్యాగ్రహ ఉద్యమములో వారి సేవ విశేషమైనది |
దిగవల్లి వేంకటశివరావు
దిగవల్లి వేంకట శివరావు చరిత్ర పరిశోధకులు, రచయిత, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన అనేక చారిత్రికాంశాలను పరిశోధించి పుస్తకాలు రచించారు.
ఆయన తల్లిగారు ద్రాక్షారామం వాస్తవ్యులు ఆలమూరు సూరయ్య గారి కుమార్తె. శివరావుగారి సతీమణి విశాఖపట్టణంకు వాస్తవ్యులు బుధ్ధిరాజు మూర్తిరాజు గారి కుమార్తె కమల. శివరావుగారు వృత్తిరీత్యా 1922 నుండీ విజయవాడలో ప్రఖ్యాత న్యాయవాది. అంతేకాక వారు చరిత్ర పరిశోధకుడుగా గ్రంథ కర్తగా ప్రసిధ్ధి.గాంధీ వాది. గాంధీ ప్రవేశపెట్టిన అనే క సత్యాగ్రహ ఉద్యమములో వారి సేవ విశేషమైనది. జైలుకు వెళ్ళటానికి ఏరోజుకారోజు సంసిధులైయ్యుండికూడా బ్రిటిష్ ప్రభుత్వచేసే అన్యాయమును ప్రజలకు కాంగ్రెస్సు కార్యకర్తలకు తెలిసేటట్టు ఉదృతముగా ఆనేక రచనలు కాంగ్రెస్సువాదిగను వ్యక్తిగతముగను చేశారు. నిశతమైన న్యాయవాదిగా వృత్తి రీత్యా వారు ప్రముఖులైనప్పటికి నీ వారు కేవలం వృత్తికే అంకితం అయి ధన సంపాదనే లక్ష్యం చేసు కోలేదు. విద్యార్థిగా చదువుకుంటున్న రోజలనుంచే దేశ చరిత్ర, స్వతంత్ర ఉద్యమాలకు తోట్పడుటకు దోహదం మైన వారి ఉపాధ్యాయుల ప్రసంగాలు, రచనలు, వారి పై ప్రభావం చూపటంవల్ల వారు వృత్తిలో ప్రవేశిస్తూనే ఆకాలంనాటి కాంగ్రెస్సు రాజకీయల్లో పాలుపంచుకుంటూ ఇంకో ప్రక్క ఏమాత్రం సమయం వృధాచేయకుండా వారు సాహిత్యకృషిలో మునిగి తేలుతూ వుండేవారు. చరిత్రకు సంబంధించి ఇంకా వెలుగు చూడని క్రొత్త విషయాలు చదవాలి వ్రాయాలి అనేది ఆయనకు లక్ష్యంగా వుండేది. అనేక పుస్తాకాలు చదివి చారిత్రాత్మకమైన అనే క అపురూపమైన వ్యాసములు, పుస్తకములు వ్రాశారు. వారు నీతి నిజాయితీకి మరోపేరు అవినీతి ఆటగోడుతనంసహించేవారు కాదు. కల్లాకపటం వారి దరిదాపుల్లోకి రావటానికి సాహచించేవికావు. 1930–1947 మధ్యకాలంలో గాంధీ గారి స్వాతంత్ర్యోద్యమం పిలుపులో వారు సాహిత్య, రాజకీయ, న్యాయవాద పరిజ్ఞానంతో చేసిన కృషి అపారం. ఉపన్యాసాలు ఇవ్వటం ఉపన్యాసాలకి వెళ్ళటం వారు అరుదుగా చేశేవారు. స్వాతంత్ర్య సమరయోధులుగా ఎటువంటి గౌరవాలు సన్మానాలు స్వీకరించేవారు కాదు. తను వృత్తిరీత్య న్యాయవాదినని, జైలుకు పోలేదని కారణాలు చెప్పి నిరాకరించేవారు. వినపట్టం కొంచంగా తక్కువ కావటంతోనే 1965 లోనే కోర్టుకు వెళ్లడం మానేశారు. అప్పటికి వారికి చాల పెద్ద పెద్ద కేసులు విచారణకుండేవి. ఆత్మగౌరవం వారికి సంధిపడరాని విషయం. కోర్టు మానేసినప్పటికీ వారి సలహాకోసం కక్షిదారులు వస్తూవుండేవారు. అలాగ వారు న్యాయ సలహాలు ఇస్తూ 1980 దాకా విజయవాడలోనే వుండేవారు. వారి సతీమణి కమల 1978 లో పరమపదించారు. 1980 లో 83 ఏండ్లు పైబడ్డ తరువారు శివరావుగారు హైదరాబాదులో వారి కుమార్ల వద్ద వుండేవారు. వారు సాహిత్య కృషి మాత్రం మానకుండా జీవితాంతం చదవుతూ వ్రాస్తూ వుండి చివరకు 95 పైబడినతరువాత 03-10-1992 న భోపాల్ నగరంలో “a narrative of the campaign in India which terminated the war with Tippusultan in 1792” అనే పుస్తకం చదువూతూనే వారి కుమారుని వద్ద చివరి శ్వాస వదిలారు. వారి సాహిత్య కృషే వారి జీవిత చరిత్రలో చాల పెద్ద పర్వం. వారు దాదాపుగా 40 పుస్తకాలు, 400 వ్యాసాలు వాశారు. వారు వ్రాసిన వ్యాసాలు అనేక పత్రికల్లో ప్రకటితమయ్యేవి అనేక చారిత్రక విషయములు ఎక్కడెక్కడనుంచో త్రవ్వి బహువిధ కృషితో వాటిని తెలుగువారి కోసం సరళమైన తెలుగులో మంచి శైలిలో వెలుగులోకి తీసుకుచ్చారు. శివరావు గారు తన సమకాలికులు, మిత్రుల కంటే దీర్ఘ కాలం జీవించారు వారిజ్ఞాపక శక్తి అపారం. కచ్చితమైన తారీఖులు పేర్లు సంఖ్యలు వారికి కొట్టిన పిండి. వారి చేతివ్రేళ్ళమీద వుండేవి. కట్టల కట్టలుగా వ్రాసుకునియన్న నోట్సుల్లోంచి ఏ విషయంపైన కావలసినా చాల సునాయాసంగా బయటకు తీయగలిగేవారు. మొదటినుంచీ పుస్తకం చదువుతు న్నప్పుడే నోట్సు వ్రాసుకోటం వారికి చిరకాలపు అలవాటు. ఆ విధంగా వారు చరిత్ర పరిశోధన చేసి వ్రాసిపెట్టుకున్నఅనేక నోట్సుల కట్టలు చాలవిలువైన ఖజానాలాంటివి చరిత్రపరిశోధకులకు చాల ఉపయోగ పడగలవి ఇంకా ఉన్నాయి. వారి అముద్రిత గ్రంథములు, వ్యాసములు కూడా చాలవున్నవి. ముఖ్యంగా కథలు గాథలు 5 మరియ 6 భాగములు చాల విలువైనవి. వెంటనే ముద్రింప తగినవి. వారు చేసిన సాహిత్యకృషి వారి పుస్తకాలు వ్యాసాలు చెప్ప గలవు. న్యాయవాది వృత్తి, సాహిత్య కృషి, స్వాతంత్ర్యోద్యమములో జైలుకి వెళ్ళటం అనివార్యమైన స్థితిలో కూడా వారు వివిధరకాలుగా చేసిన కృషి విషేంచి చెప్పదగినవి. వాటిల్లో కొన్ని క్లుప్తంగా
ఆంధ్ర మద్రాసు ప్రావిన్సల పై విపులమైన సమాచారము గాంధీగారి హయామ్ లో కాంగ్రెసు అధిష్ఠానానికి పంపిచారు
స్వాతంత్ర్యోద్యమములో కాంగ్రెసు కార్యకర్తలకు బోధపడేటట్లు కీలక రాజకీయ విషయములు, ప్రజాప్రభుత్వ విధానములు, బ్రిటిషవారు మనదేశంలో చేస్తున్నపక్షపాతపు పరిపాలన, వారు మనప్రజలను మన దేశ నిధులను ఏవిధంగా దోచుకుంటున్నదీ మొదలగు విషయముల గురించి అనేక కరపత్రములు వ్రాశారు
కాంగ్రెస్ జాతీయనాయకులవద్దనుండి ఇంగ్లీషులో వచ్చిన కీలక సమాచార కార్యాచరణ విషయాలను తెలుగులోకి, ఆంధ్రప్రాంతపు కాంగ్రెస్సు నాయకులు తెలుగులో వ్రాసినది ఇంగ్లీషులోకి తర్జమాలు
కృష్ణా జిల్లా కాంగ్రస్ కర్యాచరణకు in charge for publicity గా పనిచేశారు
సహకార సంస్ధోద్యమంలో వారు కృష్ణా జిల్లా సహకార సంసధకు డైరక్టరు గాను బెజవాడ సహకార భాండారు కార్యదర్శిగాను పనిచేశారు
న్యాయవాదిగా వారి సేవలను కాంగ్రెస్ నాయకులగు డా.ఘంటసాల సీతారామ శర్మ, ఎన్.జి.రంగా (ఆచార్యరంగా) గార్లకి వచ్చిన కేసులలో న్యాయవాదిగా వారి తరఫున పనిచేశారు
ఇండియలీగ్ కమీషన్ కు, ఖోసలా కమీషన్ (కృష్ణా రివర్ ) కూ తను వ్రాసిన మెమోరాండ సమర్పించారు.
ప్రజాసేవ సంస్ధల్లో, న్యాయాలయాలలో ఇబ్బంది ఎదుర్కొన్న సందర్భములలో అధికారులతో స్పందించి నివారణకు చర్యలు చేప్పట్టారు
కేవలం తన పుస్తకాలే కాకుండా గొప్ప పండితులైన వేలూరి శివరామ శాస్త్రి గారు, భావకవి బసవరాజు అప్పారావు గార్ల పుస్తకాలు ముద్రంపచేశారు
తనమిత్రులైన వారికోరికపై వారి పుస్తకాల సవరణలకు సహాయ పడ్డారు.
ఆంధ్ర ప్రభుత్వమువారు వారి జ్ఞాపకాలను రికార్డు చేసారు. ఆవిధంగా వారు చేసిన కృషి వివరాలు వారి సాహిత్య కృషితో జతపర్చటమైనది.
“Family History and diary of chronological events” అని పేరుతో ఒక పెద్ద డైరీలో 1815 నుండీ వారు తన సొంత విషయాల్తో పాటుగా ఆకాలంనాటి గోదావరి ప్రోవిన్సు, పిఠాపురం జమీందారీ ఎస్తేటు పరిసర ప్రాంతాలకు సంబంధించినవి కూడా వ్రాశారు. ఎందువలనంటే వారి పితామహులైన దిగవల్లి తిమ్మరాజుగారు ఆకాలంలో రాజమండ్రి- కాకినాడ- పిఠాపురం (ఆనాటి రాజమండ్రీ జిల్లా) లో కంపెనీ ప్రభుత్వము వారి వున్నతో ద్యోగి (1820లోఇంగ్లిషు రికార్డు కీపర్ తరువాత 1850 లో హుజూర్ సిరస్తదారు). వారి పితామహుని కాలం నాటివి గోదావరి జిల్లాకి, పిఠాపురం జమీందారీకి సంబంధించిన ప్రభుత్వ రికార్డులు, రెవెన్యూ రికార్డులు నుంచి శివరావు గారు బహుముఖ కృషితో సంపాదించి వ్రాశారు. వారి తండ్రి గారి కాలం 1850 -1908 మరియు తన జీవితకాలం 1898-1992 మధ్య కాలం లోని సంఘటనలు శివరావుగారి డైరీలో వ్రాశారు . 1923 నుండీ 1947 మధ్యకాలంలో కృష్ణాజిల్లాలో ముఖ్యంగా బెజవాడలో గాంధీమహాత్ముని సహాయనిరాకరణోద్యమము ఉప్పు సత్యాగ్రహము మొదలగు స్వాతంత్ర్య పోరాటమునకు సంబంధించన ఉద్యమాల సంఘటనలు చాలా విపులంగా వ్రాసుకున్నారు. ఆంతేకాక తన డైరీలో “Reminiscences” అని పేరుతో వారికి ప్రీతి కరమైన విషయాల పై విశదంగా అనుభవాలు జ్ఞాపకాలు వ్రాశారు. ఉదాహరణకు వారి రాజమండ్రీలో 1910 -1916 మధ్య అనుభవాలు, మద్రాసులో 1916 – 1922 ప్రెసిడెన్సీ కాలేజీ, విక్టోర్యా హాస్టలు జ్ఞాపకాలు వ్రాసుకున్నారు. వారి సమకాలీకులు విక్టోర్యా హాస్టల్లో నున్న ఇంజనీరింగ్, వైద్య, సాహిత్యము, న్యాయ విభాగపు విద్యార్థులు తెలుగువారు వారి వారి జీవితకాలాంతరమూ శివరావుగారితో ఉత్తర ప్రత్యుత్తరాలు, రాకపోకలు వుండేవి. అటువంటివారి కొందరి పేర్లు చెప్పక తప్పదు: అడవి బాపి రాజు, వెలిదండ్ల హనుమంతరావు L.M&S, డా. చాగంటి సూర్యనారాయణ MBBS, డా. దండు సుబ్బారెడ్డి M.D, యల్లాప్రగడ సుబ్బారావు L.M&S.,Ph.D (U.S.A), డా గోవిందరాజుల సుబ్బారావు, డా అమంచర్ల శేషాచలపతి రావు కె యల్ రావు (కానూరి లక్ష్మణ రావు) M.Sc., Ph.D. (కేంద్ర మంత్రిగా చేశారు) టి. యస్ అవినాశ లింగం (మద్రాసు రాష్ట్ర మంత్రి గాచేశారు), యమ్. భక్త వత్సలం ( మద్రాసు రాష్ట్ర ముఖ్య మంత్రిగా చేశారు ) కోకా సుబ్బారావు ( భారత ప్రధన న్యాయ మూర్తిగా చేశారు) పోతాప్రగడ శ్రీరామారావు, (తణుకులో న్యాయవాదిగా చేశారు )
వృత్తి రీత్యా శివరావు గారు న్యాయ వాదైనా వారు సాహిత్యాభిలాషి. వారి జీవితం సాహిత్య కృషి కే అంకితం. శివరావు గారి సాహిత్యాభి రుచి చిన్నానాటి నుండే. పద్నాల్గెండ్ల ప్రాయంలో రెండవ ఫారంలో చదువుతుండగా 1912 లో వీరేశలింగం గారి సతీమణి గారి స్మారకోత్సవం శివరావు గారి ప్రార్థన భక్తచింతామణి పద్యాలు తోటి ప్రారంభం అయింది. అప్పట్ణుండీ రాజమహేంద్రవరంలో సారస్వత సభలలో బాలుడైన శివరావు గారు చదవే భక్తచింతామణి పద్యాల ప్రార్థనతో ప్రారంభించటం పరిపాటి. వారు 3 వ ఫారంచదువతున్నప్పుడు చిలకమర్తివారి రామచంద్ర విజయమును పూర్తిగా వ్రాసినందుకు వారి క్లాస్ మాస్టారు భక్తచింతామణి (3వ సంకలనం) పుస్తకమును బహుకరించారు.. ఆరేళ్ల తరువాత, 1919 లో భక్తచింతామణి రచించిన వడ్ఢాది సుబ్బారాయుడుగారే స్వయంగా వారి చేతి దస్కత్తుతో భక్త చితామణి 8 వ సంకలన మును శివరావు గారికి బహుకరించారు. 1913 లోఆంధ్రభాషాభి వర్ధిని (చిలకమర్తి వారు స్దాపించి న సారస్వత సభ) లో సభ్యలుగా చేరారు. 1914 లో శివరావు గారి వ్యాసం “స్త్రీ విద్య” ఆలమూరు వెంకటరాజుగారి వ్యాసంతో పాటు గృహనిర్వాహకము అను చిన్నపుస్తకములో ముద్రింప బడింది. 1914 లో ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజము వార్షికోత్సనము అధ్యక్షుడుగా చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు, కార్యదర్శిగా అద్దంకి సత్యనారాయణ శర్మగారు, సభ్యులుగా మైనంపాటి నరసింహ రావు, అడవి బాపిరాజు, బంధా వీరనారాయణదేవు, గుడిపాటి సూర్యనారాయణ, బోడపాటి సత్యనారాయణ, ఈరంకి నరసింహము, సూరంపూడి కనకరాజు, దిగవల్లి వెంకట శివరావు, పోణంగిపల్లి సత్యనారాయణ, చింతపెంటవెంకట రమణయ్య, వాసిరెడ్డి వీరభద్ర రావు, కవికొండల వెంకటరావు తదితరులు. ఆ వార్షికోత్సవాల సమావేశాలకు అనేక ప్రసిధ్ధ పురుషులు అధ్యక్షత వహించారు. వారిలో కొందరి పేర్లు చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు, శ్రీపాద కృష్ణమూర్తి గారు, చిలుకూరి వీరభద్రరావు గారు, వంగూరి సుబ్బారావు గారు, చెలికాని సుబ్బారావు గారు, నాళం కృష్ణారావుగారు, వడ్డాది సుబ్బారావుగారు,కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు అలా 1914 లో జరిగిన సమావేశం లోశివరావు గారు స్త్రీ విద్య మీద ప్రసంగించారు. ఇంకో సారి “హిందూమహా జనులమతసభ, అనబడిన సమావేశం లో కందుకూరి వీరేశలింగం గారు కూడ హాజరైవున్నప్పుడు శివరావు గారు రామానుజాచారి పాత్ర వహించి తను రచించిన పద్యం చదవగా వీరేశలింగం గారు చాల ప్రసన్నులైయ్యారు. 1915-1916 సంవత్సరం లో SSLC క్లాసులో ఇంగ్లీషు పరీక్షలో ఉన్నత మార్కలుతో4 సెక్షన్ల మీద మొదటి స్దానం లో నిలిచినందుకు వారి క్లాస్ మాస్టారు గజవల్లి రామచంద్రరావు M.A గారు Life of Gladstone by John Morley 3 volumes బహుకరించారు. రాజమండ్రీ జ్ఞాపకాల్లో వారి డైరీ లో చిలకమర్తివారి కీ శ్రీపాద కృష్ణమూర్తిగారికి వకరిమీద వకరు ఎద్దేవపుర్వక వాదోపవాదాలు జరుగుతూవుండేవని వారి డైరీ లోరాజమండ్రీ జ్ఞాపకాలలో వ్రాసుకున్నారు. 1916 లో మద్రాసు ప్రసిడెంసీ కాలేజీ లో ఇంటర్మీడియట్ చదువుతుండగా “హత్యా ఛాయ” అను నవల తెలుగులో వ్రాశారు. ఆ నవల ఆధారంగానే 1929 లో నీలాప నింద అను పుస్తకము ప్రచురించారు. 1918 లోఇంటర్ ఫైనల్ వుడగా మద్రాసు రాజధాని కాలేజీ తెలుగు విద్యార్థుల ఆంధ్ర భాషావర్ధని సమాజం తరఫున శివరావు గారు ఆంధ్ర వాణి అనేటివంటి చేతివ్రాత పత్రికకి సంపాదకులుగా వుండేవారు ఆపత్రికలో “ విడువము” అనే పేరుతో వ్రాశిన సంపాదకీయ ప్రచురణను చాలమంది అభనందించారు శ్రీ నూతక్కి రామశేషయ్య గారు (తదుపరి జయపూరు దివాన్ గాచేశారు ) చాల అభినందించారు. భహ్మశ్రీ వావిలకొలను సుబ్బారావు గారు ఆ చేతివ్రాత పత్రిక అభిమానులు. అదే కాలంలో 1918 లో శివరావు గారికి మద్రాసు సాధు సంఘం వారు శివరావు గారు వ్రాసిన “ రాజ భక్తి” అను వ్యాసమునకు రజత పతాకం బహుకరించారు. ఆ పతకం మద్రాసు జిల్లా కలెక్టురు గారు ప్రోగ్రెసివ్ యూనియన్ హాలు జరిగిన బహిరంగ సభలో బహుకరించారు. 1919 లో శివారవు గారు బి.ఏ చదువుతుండగా శ్రీ కృష్ణదేవరాయలు మీద వ్రాసిన వ్యాసం ఎమ్.పి శర్మ గారు మద్రాసులో సంపాదకులు గావున్న విద్యావిశాఖ పత్రికలో ప్రచురించ బడింది. 1919–1920 సంవత్సరంలో శివరావుగారు వ్రాసిన ఆత్మ విశ్వాసము అను వ్యాసమునకు మద్రాసు రాజధాని కాలేజీ వారు చిరకాలంగా ప్రతీఏటా 1875 నుంచీ ఇస్తూవచ్చిన రూ 20 బౌరదల్లన్ బహుమతి 1919 సంవత్సలో శివరావుగారికి వచ్చింది. అంతకు పూర్వం ఆ బౌరదల్లన్ బహుమతిని పొందినవారిలో 1875 లో తల్లాప్రగడ సుబ్బారావు ( 1850-1890) ( సుబ్బారావు గారు మద్రాసు థియోసఫికల్ సొసైటీకి శక్రటరీ చేశారు, అనిబిశంటు కన్నా ముందు ). తరువాత 1891 లో వేపారామేశం గారికి ( వేపారామేశం గారు మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్ చేశారు ) పానుగంటి రామారాయణింగారికి in 1892, పెద్దిభొట్ల వీరయ్యగారికి 1894 and దాసు విష్ణురావు గారికి 1895 లోను వచ్చినట్లుగా శివరావు గారి డైరీ లోవ్రాసుకున్నారు. చిన్ననాటినుండీ వారు గాంధీగారి సత్యాగ్రహ ఉద్యమం, స్వాతంత్ర్యపోరాటానికి వారి ఉపాధ్యాయుల ప్రేరేపణ వారి మనస్సుకు బాగా నాటుకున్నాయ. 1913- 1914 సంవత్సరం స్కూలు విద్యార్థిగానుండగనే రాజమండ్రీలో వారు గాంధీగారు దక్షిణాఫ్రికాలో చేసే సత్యాగ్రహ ఉద్యమసహాయానికి నిధులు పోగుచేశి పంపిచారు. 1920 లో లాకాలేజీలో జేరేట్టప్పటికే గాంధీగారి సహాయనిరాకరణోద్యమము కొనసాగుతుండటం వారి మనస్సు ఆందోళనకు గురై స్వాతంత్ర్యపోరాటంలో తను కూడా పాలు పంచుకోవాలనే ఒక గట్టి సంకలనం రావటం జరిగింది. వారు ఎలాగో లాకాలేజీ చదువు పూర్తిచేసుకుని బయట పడుతూనే కాంగ్రెస్ రాజకీయాల్లో తన శక్తికొలది బాధ్యతలు నిర్వహించారు. లాకాలేజీలో జేరబోయే ముందు 1919 సంవత్సరం ఎండా కాలపు శలవలకి శివరావుగారు బొంబాయికి వెళ్లారు . అవి రౌలట్ బిల్లు తిరస్కారానికి తీవ్ర ఆందోళన చెస్తున్న రోజులు. ఆక్కడ బోంబే క్రానికల్ పత్రిక (బి.జి హర్నిమన్ సంకలనంచేసే పత్రిక ) సత్యాగ్రహ ఉద్యమాన్ని చాల అనుకూలంగా ప్రచురించేటటువంటి పత్రిక (ఆకారణంగా హర్నిమన్ నుకు దేశాంతర శిక్ష విధించారు deported ) శివరావు గారు ఆ పత్రికలో ప్రచురించిన వ్యాసాలు, విశేషాలు కత్తిరించి ఒక ఫైలలో అతికించుకుని తిరుగు ప్రయాణంలో బెజవాడకు వస్తుండగా ఒక సి ఐ ఢి పోలీసు రైలు బండి లోకి వచ్చి ఆ ఫైలు తనతో అట్లా తీసుకును వెళి తే తంటాల్లో పడతావని హెచ్చరించాడుట. మద్రాసులో లా చదువుతూవుండగనే 1920 నవంబరులో లియో టాల్సాయి, రంబీంద్రనాధ్ రచించిన 23 కథలు “కోడి గృడ్డంత వడ్లగింజ , మేము మీకు పట్టముగట్టితిమి, పధ్నాలుగేండ్ల ప్రాయము” అను 23 కథలు వారు తెలుగులో వ్రాసిన వ్యాసాలు ఆంధ్ర పత్రికలో ప్రచురితమైనవి. 1891 లో దాసు కేశవరావు గారు బెజవాడలో నడుపుచున్న జ్ఞానోదయము అను వార పత్రికలో1922 ఆ ప్రాంతములో శివరావు గారు రచించిన వ్యాసుములు హైందవ నాటకరంగము, హైందవ వనోద కథలు అను రెండు వ్యాసములు ప్రచురితమైనవి.
———–