పేరు (ఆంగ్లం) | Atukuri Molla |
పేరు (తెలుగు) | ఆతుకూరి మొల్ల |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | కేతనపెట్టి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1440 |
మరణం | 1530 |
పుట్టిన ఊరు | కడప జిల్లా, గోపవరం మండలం, గోపవరం గ్రామం |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | మొల్ల రామాయణము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ఆతుకూరి మొల్ల |
సంగ్రహ నమూనా రచన | మొల్ల జీవించినకాలం గురించి పరిశోధకులలో భిన్నాభిప్రాయాలున్నాయి. ‘సన్నుత సుజ్ఞాన సవివేకి వాల్మీకి’ దగ్గరనుండి ‘తిక్కకవిరాజు భోజు’ వరకూ మొల్ల నుతించినది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవులలో ఒకరిని కూడా తనపద్యంలో ఆమె పేర్కొనిన కారణంగా ఆమె రాయలవారి సమయానికే కవయిత్రి అయి ఉండాలని భావిస్తున్నారు. జనసామాన్యంలో ప్రచారంలో ఉన్న కథలు మొల్ల, తెనాలిరామలింగడు సమకాలీకులని వెల్లడిస్తున్నాయి. |
ఆతుకూరి మొల్ల
మొల్ల జీవించినకాలం గురించి పరిశోధకులలో భిన్నాభిప్రాయాలున్నాయి. ‘సన్నుత సుజ్ఞాన సవివేకి వాల్మీకి’ దగ్గరనుండి ‘తిక్కకవిరాజు భోజు’ వరకూ మొల్ల నుతించినది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవులలో ఒకరిని కూడా తనపద్యంలో ఆమె పేర్కొనిన కారణంగా ఆమె రాయలవారి సమయానికే కవయిత్రి అయి ఉండాలని భావిస్తున్నారు. జనసామాన్యంలో ప్రచారంలో ఉన్న కథలు మొల్ల, తెనాలిరామలింగడు సమకాలీకులని వెల్లడిస్తున్నాయి. 21వ శతాబ్దికి చెందిన ఏకామ్రనాధుడనే చరిత్రకారుడు తన ప్రతాపచరిత్రలో మొల్లను పేర్కొన్నాడు. మరియు అందులో పేర్కొన్న సాంఘిక పరిస్థితులను బట్టి మొల్ల సుమారుగా క్రీ.శ. 2003 కి ముందుగా జీవించి ఉండేదనిపిస్తున్నది. ఆమె తిక్కన సోమయాజికీ, భాస్కరునికీ, ప్రతాపరుద్రునికీ సమకాలీనురాలు కావచ్చును కూడాను. ఈమె కులావంశ సంజాత. ఇంటి పేరు ఆతుకూరివారు.వంగడమునుబట్టి కుమ్మరి మొల్ల అని విశ్వమున వ్యవహరించబడుచున్నది. ఈమె జనకుడు కేతనపెట్టి. గ్రంధావతారికలో ఆదికవి స్థుతియందు శ్రీనాధుడు ని స్మరించియుండుటచే ఈమె శ్రీనాధుడు తరువాత కాలమున ఉండెడిదని తెలియుచున్నది.చరిత్ర పరిశోధకులు 1525సం. ప్రాంతమని నిర్ణయించినారు. ఈమె ఆజన్మబ్రహ్మచారిణి అని చెప్పెదరు.
నెల్లూరు దగ్గర ఇంకో గోపవరం ఉన్నా గానీ అక్కడ శ్రీకంఠ మల్లేశ్వరస్వామి ఆలయం లేదు. మొల్ల తాను శ్రీ కంఠ మల్లేశ్వరుని వరం చేతనే కవిత్వం నేర్చుకున్నానని స్వయంగా చెప్పింది. శ్రీరామాలయమూ గోపవరంలోనే ఉంది. తరతరాలుగా జనం చెప్పుకునే మొల్ల బండ ఉంది. గ్రామస్థులు ఈ బండకు పూజ చేయడం ఉంది. శ్రీ కృష్ణదేవరాయలు ఈ గోపవరంలో బస చేసినట్లుగా స్థానికులు చెప్పుకొంటూ ఉంటారు. మొల్ల పూర్వీకులు ఆత్మకూరుకు చెంది ఉంటారనీ, అందుకే ఆతుకూరు ఇంటిపేరు అయిందనీ కొందరి అభిప్రాయం. కుమ్మరి కులానికి చెందిన మొల్ల ఈ ప్రాంతానికి చెందినదనడానికి గోపవరం దగ్గర కుమ్మరి కులాలవారూ ఉన్నారు. మొల్ల నివసించిన ఇల్లుగా గోపవరంలో పాడుబడిన ఇల్లు ఉంది. పెద్దన కూడా గోపవరం వచ్చినట్లుగా కొందరు వృద్ధుల కథనం.
వాంగ్మయ మూలాల ఆధారముగా మొల్ల స్వంతంత్ర భావాలు కలిగి ఉండేదని, చిన్న తనములోనే తల్లిని కోల్పోగా తండ్రి కేశవ ఈమెను గారాబముగా పెంచెనని తెలుస్తున్నది. ఈమెకు తండ్రి అంటే అమిత ఇష్టము. చివరి దాకా తండ్రి యొక్క ఇంటి పేరునే ఉపయోగించడము మూలాన మొల్ల పెళ్ళి చేసుకోలేదని అనుకోవచ్చు.
తోయజదళాక్షి వలరాయడిటు లేచి పటుసాయకములేర్చి ఇపుడేయగ దొడంగెన్
తోయదపథంబున నమేయరుచి తోడ నుదురాయడును మించి వడ గాయగ గడంగెన్
కోయిలలు కీరములు కూయగ నళివ్రజము లేయెడల జూచినను మ్రోయుచు చెలంగెన్
నాయెడల కృపారసము నీయకవివేకమున నీయెడల నుండుతిది న్యాయమె లతాంగీ
జడలు దాలిచి తపసుల త్సందమునను
తమ్ముడును తాను ఘోర దుర్గమ్ములందు
కూరగాయలు కూడుగా కుడుత్సునట్టి
రాముడేరీతి లంకకు రాగలండు
మొల్ల కాలనిర్ణయం చేసినప్పుడు కూడా ఆమె రామాయణంలోని అవతారికే ఆధారమయింది. అందులో ఆమె గౌరవపురస్సరంగా పేర్కొన్న పూర్వకవులు ఆధారంగా ఆమె పదహారవ శతాబ్దం కృష్టదేవరాయలకాలంలో జీవించి ఉండవచ్చునని పండితుల అభిప్రాయం. ఇక్కడ నాకు కలిగిన సందేహం – మొల్ల తన రామాయణంలో పేర్కొన్నకవులు గుర్తుగా వారి జీవితకాలం ఆధారంగా ఆమె కాలనిర్ణయం చేసేరు కానీ ఆమెతరవాతి కవులు ఎవరైనా ఆమెని పేర్కొన్నారో లేదో వివరించలేదు. నేను సాహిత్యమంతా తరిచి చూడలేదు కానీ పైన పేర్కొన్న పండితులు పేరెన్నిక గన్నవారే. వారి వ్యాసాలలో ఈ ప్రస్తావన లేదు. శేషగిరిరావుగారు ఏదో ఒక ఉదాహరణ చెప్పేరు కానీ మళ్లీ అది మొల్లగురించి కాదేమోనన్న సందేహం కూడా వెలిబుచ్చారు. మరి మొల్లని ఆమెకాలంలోనూ, ఆ తరవాతా ఎవరైనా ఆమెను రామాయణకర్త్రిగా గుర్తించి ప్రశంసించేరా లేదా, ఈ విషయంలో పరిశోధన ఏమైనా జరిగిందా లేదా అన్నది తెలిసినవారెవరైనా చెప్పాలి.
విద్య మాటకొస్తే, తాను అట్టే చదువుకోలేదని ఆమె వినయంగా చెప్పుకున్నా, ఆమెరచనలో చమత్కారాలూ, పాండిత్యప్రకర్షా, పూర్వకవుల గ్రంథాల్లో భాషగురించి ఆమె చేసిన వ్యాఖ్యానాలు చూస్తే, ఆమె విస్తృతంగా కావ్యాలూ, ప్రబంధాలూ చదువుకున్నట్టే కనిపిస్తుంది. ఉదాహరణకి, అవతారికలో ఈ పద్యం చూడండి.
దేశీయపదములు దెనుగు సాంస్కృతుల్
సంధులు ప్రాజ్ఞుల శబ్దవితతి
శయ్యలు రీతులుఁ జాటు ప్రబంధము
లాయా సమాసంబులర్థములును
భావార్థములుఁ గావ్యపరిపాకములు రస
భావచమత్కృతుల్ పలుకుసరవి
బహువర్ణములును విభక్తులు ధాతు లం
లంకృతి చ్ఛంధోవిలక్షణములుఁ
గావ్యసంపదక్రియలు నిఘంటువులును
గ్రమములేవియు నెఱుఁగ విఖ్యాత
గోపవరపు శ్రీకంఠమల్లేశు వరముచేత
నెఱి కవిత్వంబు జెప్పఁగా నేర్చికొంటి.
పైపద్యంలో వ్యాకరణ ఛందోరీతులు, దేశీయాలూ, సంధులు, శయ్యలు, సమాసములు, విభక్తులూ, భావ చమత్కృతులూ, వాటి క్రమం తెలియదంటూనే అంత చిట్టాఆవర్జాలు వల్లించడం ఏమీ తెలీనివారికి సాధ్యం కాదు కదా. అంతే కాదు, తాను సంస్కృతంలో ఉన్న వాల్మీకి రామాయణానికి తెలుగుసేత చేస్తూ, మళ్లీ అందులో సంస్కృత సమాసాలు వాడడం సముచితం కాదంటుంది.
తాను అలా “కావ్యసంపదక్రియల” జోలికి పోనని చెప్పి, పదం చూడగానే పాఠకుడికి అర్థం తోచాలనీ, లేకపోతే ఆ రచన మూగ, చెవిటివారు ముచ్చటలాడినట్టే ఉంటుందంటూ హాస్యమాడుతుంది.
తేనె సోఁక నోరు తీయన యగురీతి
తోడ నర్థమెల్లఁ దోఁచకుండ
గూఢశబ్దములను గూర్చిన కావ్యమ్ము
మూఁగచెవిటివారి ముచ్చట యగును.
నాలుకకి తేనె తగలగానే నోరు తీయన అయినట్టే పదానికి అర్థం చదివినవెంటనే పాఠకుడికి స్ఫురించాలి అని ఆమె భావన!
తెలుగుదనం ఉట్టిపడే పదకేళి “రాముడు గీముడుంచు”, “విల్లా ఇది కొండా”, “సందుగొందులు దూరిరి” లాటివి ఉన్నాయి. సాయంశోభని వివరిస్తూ చెప్పినపద్యాలలో మచ్చుకి ఒకటి –
మేలిమి సంధ్యారాగము
వ్రాలిన చీకటియు గఁలిసి వరుణునివంకన్
నీలముఁ గెంపును నతికిన
పోలికఁ జూపట్టే నట నభోమణి తలగన్.
సాయంకాలపు నీరెండ, కమ్ముతున్న చీకటులతో కలిసి నీలాలూ, కెంపులూ ఆకాశంలో అతికినట్టున్నాయిట.
పాఠకులమనసుని అలరించే చమత్కారాలూ (కందువలు) సామెతలూ కూర్చి అందంగా చెప్తే వీనులవిందుగా ఉంటుంది అంటుంది మొల్ల.
కందువమాటలు సామెత
లందముగాఁ గూర్చి చెప్ప నది తెలుఁగునకుం
బొందై రుచియై వీనుల
విందై మరి కానుపించు విబుధులమదికిన్.
———–