పేరి కాశీనాథ శాస్త్రి (Peri Kasinatha Sastry)

Share
పేరు (ఆంగ్లం)Peri Kasinatha Sastry
పేరు (తెలుగు)పేరి కాశీనాథ శాస్త్రి
కలం పేరు
తల్లిపేరుమహాలక్ష్మమ్మ
తండ్రి పేరువెంకటశాస్త్రి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1858
మరణం
పుట్టిన ఊరుగజపతినగరం తాలూకాలోని పురిటిపెంట అనే గ్రామం
విద్యార్హతలువ్యాకరణాన్ని, న్యాయాన్ని, వేదాంతాలంకార శాస్త్రాలను నేర్చుకొన్నారు.
వృత్తిఉపాధ్యాయులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుగంగా స్తవం ,గోదావరి లహరి ,యామినీ పూర్ణ తిలకం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికపేరి కాశీనాథ శాస్త్రి
సంగ్రహ నమూనా రచనపేరి కాశీనాథ శాస్త్రి (1858 -1920) ప్రముఖ పండితుడు మరియు కవి.వీరు గజపతినగరం తాలూకాలోని పురిటిపెంట అనే గ్రామంలో వెంకటశాస్త్రి మరియు మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. వీరు చిన్నతనంలోనే తండ్రి వద్ద వ్యాకరణాన్ని, మధ్వశ్రీ భీమాచార్యులు దగ్గర న్యాయాన్ని, కొల్లూరు కామశాస్త్రి వద్ద వేదాంతాలంకార శాస్త్రాలను నేర్చుకొన్నారు. పిదప విజయనగరం మహారాజావారి ఆస్థానంలో పండితులుగా చేరారు. వీరు 1878లో మహారాజా సంస్కృత కళాశాలలో ఉపాధ్యాయునిగా ప్రవేశించి ప్రఖ్యాతిని పొందారు.

పేరి కాశీనాథ శాస్త్రి

పేరి కాశీనాథ శాస్త్రి (1858 -1920) ప్రముఖ పండితుడు మరియు కవి.వీరు గజపతినగరం తాలూకాలోని పురిటిపెంట అనే గ్రామంలో వెంకటశాస్త్రి మరియు మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. వీరు చిన్నతనంలోనే తండ్రి వద్ద వ్యాకరణాన్ని, మధ్వశ్రీ భీమాచార్యులు దగ్గర న్యాయాన్ని, కొల్లూరు కామశాస్త్రి వద్ద వేదాంతాలంకార శాస్త్రాలను నేర్చుకొన్నారు. పిదప విజయనగరం మహారాజావారి ఆస్థానంలో పండితులుగా చేరారు. వీరు 1878లో మహారాజా సంస్కృత కళాశాలలో ఉపాధ్యాయునిగా ప్రవేశించి ప్రఖ్యాతిని పొందారు.
ఆనాడు కవులుగా రాణించిన పండితులలో వీరొకరు. అపర భోజునిగా కీర్తిగాంచిన పూసపాటి ఆనంద గజపతి రాజుకు వీరనిన చాలా గౌరవం ఉండేది. “యథా కాళిదాస స్తథా కాశీనాథ” అని వీరిని గురించిన స్తుతి నేటికీ వినిపిస్తుంది. వివిధములైన కవితలను వెలయిస్తూ నానారాజ సందర్శనం చేస్తూ, కనకాభిషేకాలు పొందుచూ వీరు ఆంధ్రదేశ సంచారం కావించారు.
గోదావరీ లహరి, బ్రహ్మసూత్ర భాష్యాంధ్రానువాదం అనే రెండు గ్రంథాలు వీరివి ముద్రితములయ్యాయి. ఉత్తర శాకుంతలము మొదలైన గ్రంథాలు ఆముద్రితములు. గ్రాంథిక భాషావాదంలో కల్లూరి వేంకట రామశాస్త్రికి వీరు అండగా ఉన్నారు. ఉర్లాము మొదలైన అనేక సంస్థానాలలో వీరు విద్వత్పరీక్షకులుగా నుండి సన్మానం పొందారు.
వీరికు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు జన్మించారు. సుప్రసిద్ధ మహామహోపాధ్యాయులైన తాతా సుబ్బరాయశాస్త్రి వీరు అల్లుడే.

———–

You may also like...