పేరు (ఆంగ్లం) | P.Sridevi |
పేరు (తెలుగు) | పి. శ్రీదేవి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | గుళ్ళపల్లి నారాయణమూర్తి |
జీవిత భాగస్వామి పేరు | పెమ్మరాజు కామరాజు |
పుట్టినతేదీ | 1/1/1929 |
మరణం | 1/1/1961 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | యం.బి.బి.యస్. ఆంధ్రా మెడికల్ కాలేజీ. విశాఖపట్నం. |
వృత్తి | డాక్టర్ |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | కవితలు: అంటారా తెలుగు స్వతంత్ర సెప్టెంబర్ 7 (1956), కేవలం స్వగతం తెలుగు స్వతంత్ర అక్టోబరు (1956), కిణాంక స్మృతులు తెలుగు స్వతంత్ర అక్టోబరు (1957) రేవతి స్వయంవరం తెలుగు స్వతంత్ర ఆగస్ట్ 3, 1956, శ్రావణబాధ్రపదాలు జయంతి నవంబర్ 1, 1958, సాంధ్యసమస్య తెలుగు స్వతంత్ర ఫిబ్రవరి, (1958) పులకరించిన ప్రకృతి తెలుగు స్వతంత్ర, జూలై (1958), వెన్నెల ఎడారిలో చీకటి ఒయాసిస్సు తెలుగు స్వతంత్ర జూన్ (1960) మధుకలశమ్ (గేయకావ్యం. ఒమర్ ఖయాం భావాలు ఆధారంగా) కథలు : రేవతి స్వయంవరం, తెలుగు స్వతంత్ర, ఉరుములు, మెరుపులు (పెద్దకథ) తెలుగు స్వతంత్ర, కల తెచ్చిన రూపాయిలు. తెలుగు స్వతంత్ర, మెత్తని శిక్ష తెలుగు స్వతంత్ర నవలలు : కాలాతీత వ్యక్తులు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పి.శ్రీదేవి కాలాతీత వ్యక్తులు |
సంగ్రహ నమూనా రచన | గబగబా సగం మెట్లెక్కి “ప్రకాశం ! “ అని గట్టిగా కేక వేశాడు కృష్ణమూర్తి . డాబా మీది వరండాలో నుండి మెట్ల మీదకు తొంగి చూస్తూ ప్రకాశం . “వస్తున్నానోయ్ , ఒక్క నిముషం ! నువ్వే పైకి రారాదూ పోనీ ! “ అన్నాడు . ఆ చివరి మాట వినిపించుకోకుండానే కృష్ణమూర్తి మళ్లీ కిందికి దిగిపోయి వీధి వరండాలో నిలుచున్నాడు కూనిరాగం తీస్తూ . ఇంతలో తన పక్క నుండి ఎవరో దూసుకుపోయినట్లయింది . తుళ్ళి పడి ఆ వక్తి కేసి తేరిపార చూశాడు . |
పి.శ్రీదేవి
కాలాతీత వ్యక్తులు
గబగబా సగం మెట్లెక్కి “ప్రకాశం ! “ అని గట్టిగా కేక వేశాడు కృష్ణమూర్తి . డాబా మీది వరండాలో నుండి మెట్ల మీదకు తొంగి చూస్తూ ప్రకాశం . “వస్తున్నానోయ్ , ఒక్క నిముషం ! నువ్వే పైకి రారాదూ పోనీ ! “ అన్నాడు . ఆ చివరి మాట వినిపించుకోకుండానే కృష్ణమూర్తి మళ్లీ కిందికి దిగిపోయి వీధి వరండాలో నిలుచున్నాడు కూనిరాగం తీస్తూ . ఇంతలో తన పక్క నుండి ఎవరో దూసుకుపోయినట్లయింది . తుళ్ళి పడి ఆ వక్తి కేసి తేరిపార చూశాడు . అతనికేదో ఐనట్లయింది . ప్రకాశం కిందికి దిగి వచ్చి కృష్ణమూర్తి భుజం మీద చెయ్యి వేసి “ఇంక పద ! “ అన్నాడు .
ఇద్దరూ సందు మలుపు తిరిగి మెయిన్ రోడ్డు వైపు నడిచారు . దారిలో ప్రకాశం “ ఏం కృష్ణ మూర్తీ ! ఏమిటీ విశేషాలు ! అన్నట్టు ఆ మధ్య హైదరాబాదు వెళ్ళావట కదూ ! “ అన్నాడు .
కృష్ణమూర్తి పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ “ఆ నేను చెప్పే విశేషాల కేముంది గాని ఎవరోయ్ ఆ మెరుపు తీగ ! “ అంటూ తిరుగు ప్రశ్న వేశాడు . అదేమిటో అర్ధం కాక “ఏమిటో !అన్నట్లు తెల్ల బోయి చూశాడు ప్రకాశం .
“నువ్వు చూడలేదూ !” ఇప్పుడే మీ యింట్లోకి వేల్లిన్బ్ది .”
“కళ్ళ జోడూ రెండు జడాలూ – ఆ అమ్మాయేనా ?” అన్నాడు ప్రకాశం .
“ఆ ఆ !” అన్నాడు కృష్ణమూర్తి .
“కొత్తగా దిగారు లేరు ! మా యింటి కింది వాటాలో అద్దెకుంటున్నారు .”
ఆ మాట వినేసరికి కృష్ణమూర్తి అదోలా మొహం పెట్టి “ఈ యింట్లోనే ఉంటున్నారా !
చెప్పావు కావేం ?” అంటూ మూలిగాడు .
ప్రకాశం నవ్వుతూ “చెప్పడానికేముంది ఇందులో ? ఈ మధ్యనేగా వాల్లోచ్చింది ! అంతా కలిపి పదిహేను రోజులవలేదు . ఇన్నాళ్ళూ నువ్వు ఊళ్లోనే లేవాయె !” అంటూ సంజాయిషీ చెప్పుకున్నాడు . అంతలోనే మళ్లీ “ కాని నాకు భయంగా ఉంది సుమా కృష్ణమూర్తీ ! గది మార్చేస్తే బాగుండునని తూస్తుంది ! “ అన్నాడు .
కృష్ణమూర్తి “అదే భయం దేనికీ ! ఇంతకూ ఆవిడ నర్సా , స్తూదేంటా ?” అన్నాడు సిగరెట్ వెలిగించుకుంటూ .
“రెండు కాదు , వర్కింగ్ గర్ల్ , అంటే ఎక్కడో ఉద్యోగం చేస్తోంది బి .ఏ . జూనియర్ దాకా చదివి మానేసిందట , ఆ పైన డబ్బు లేక అనుకుంటాను టైపూ షార్టు హాండూ నేర్చుకుంది . ప్రస్తుతం రైల్వేలో ఏదో ఆఫీసులో పని చేస్తూంది . వాళ్లదసలు అనకాపల్లి దగ్గర ఏదో ఊరట “ అన్నాడు ప్రకాశం . ఆమెను గురించి తనకు తెలిసినంత వరకూ చెప్పేశాననే తృప్తితో .
“ పదిహేను రోజులలో ఇన్ని ఆరాలు తీసిన వాడిని గదా – మళ్లీ ఆవిడంటే భయమంటావేం ? పోనీగాని ఈ మాటలు ఆవిడను ఇంట్రడ్యూస్ చేస్తావ నాకు ?” అన్నాడు కృష్ణమూర్తి .
“తప్పకుండా , అంత ప్రాధేయపడాలా ? అసలు ఇవాళ రూముకెళ్ళగానే ఆవిడే ఆడిగేస్తుంది – మీ ఫ్రెండుని పరిచయమైనా చేశారు కాదేం అని . మొన్ననేం జరిగిందో తెలుసా – ఆవిడ భలే మనిషిలే ! – “ అంటూ ఎందుకో ఆగిపోయాడు ప్రకాశం .
“ అసలేం జరిగిందో చెప్పక అలా గుటక వేసి ఊరుకుంటావే ?” అని కదిలించాడు కృష్ణమూర్తి .
“ ఆవిడకి ఇంటర్ లో క్లాస్ మేటట . కళ్యాణి అని ఒక అమ్మాయి . ఈ సంవత్సరమే ఆనర్సు లో చేరింది . ఓ సాయంత్రం ఈవిడ గారు ఆ అమ్మాయిని అమాంతం నా రూములోనికి తీసుకొచ్చింది , పరిచయం చేయాలంటూ .”
“ ఇంకేం ! ఇద్దరు స్నేహలతల్ని సంపాదించావన్నమాట ! “ అన్నాడు కృష్ణమూర్తి కొంచెం ఈర్ష్యతో .
వెంటనే ప్రకాశం “అంతగా కుమిలిపోకు – ఇందిర యిందాకా నిన్ను సారిగా గమనించలేదేమో గాని అమాంతం భుజం పట్టుకు నిలవేసి మరీ మాటాడేస్తుంది . అర నిమిషం కిందట పరిచయమైన వాళ్ళతో ఆరు గంటలు బాతాకానీ వేసుకు కూర్చో గలదు . చాలా చలాకీ పిల్ల !” అని స్నేహితుడిని ఊరడించడానికి ప్రయత్నించాడు .
“అంత మంచి కంపెనీ దొరికితే అలా తెల్ల మొహం వేస్తావేం ? పోనీలేగాని నువ్వు రూము ఖాళీ చేస్తే మాత్రం తప్పకుండా నాతో చెప్పు “ అన్నాడు కృష్ణ మూర్తి .
అంతవరకూ నవ్వుతూనే మాటాడుతున్న ప్రకాశం ఆ మాట విని మొహం ముడుచుకున్నాడు . మళ్లీ వెంటనే సర్దుకుని “ ఓ ! తప్పకుండా !” అనగలిగాడు .
ఇద్దరూ అలా పూర్ణా థియేటర్ వేపు సాగిపోయారు .
ప్రకాశం ఫైనల్ ఇయర్ ఎం .బి ., బి .ఎస్ . చదువుతున్నాడు . కాలేజీ కెదురుగా చెంగల్రావు పేట డౌన్ లో మొదటి మేడ యింట్లో ఉంటున్నాడు .
నిన్న మొన్నటి దాకా ఆ మేడ స్టూడెంట్స్ లాడ్జి గా ఉండేది . మెడికల్ కాలేజీలో చేరిన నాటి నుండి ప్రకాశం అందులోనే ఉంటున్నాడు . పైన ఉన్న ఒకే ఒక మేడ గదిలో కిందనంతా కలిపి నాలుగు గదులున్నాయి . వాటిలో పూర్వం ఏ .వి .యన్ కాలేజీ విద్యర్దులుండేవారు . వేసవిలో వాళ్లు ఖాళీ చేసి పోగానే ఆ వాటిలో ఇందిరా , ఇందిరా నాన్నా ప్రవేశించారు .
ఎత్తయిన గుర్రపు అరుగులూ , చిన్న వీధి వసారా , వసరాలో నుంచి లోపలికి నడక , దానిలో నుండి మేడ మీదకి సన్నని మెలికలు తిరిగే సిమెంటు మెట్ల వరుస – ముప్పై ఏళ్ల క్రితం అదే అందం అనుకునే పద్దతిలో కట్టబడినదా యిల్లు . ప్రకాశం తన రూముకు వెళ్ళాలన్నా బయటకు రావాలన్నా ఆ నడకలో నుండే నడవాలి . సంసారులున్న యింటిలో అటు యిటూ తిరగడం , తన కోసం . ఎవరో వస్తూ పోతూండడం – వాళ్లకి ఇబ్బందిగా ఉంటుందేమో ననిపించేది ప్రకాశానికి కొత్తలో పూర్వం ఎప్పుడూ విద్యార్ధులే ఉండేవారేమో అతనికా కష్టం ఉండేది కాదు . మొదట్లో మరొక రూము చూసుకుంటే బాగుండుననుకున్నాడు . కాని ఐదు సంవత్సరాల అందులో ఉండడానికి , అంతరాయం లేకుండా తన చదువు సాగడానికి ఏడో కారణం ఉండే ఉంటుందనిపించిందతనికి . ఆ నమ్మకాన్ని కాదనుకోలేక అలాగే కాలం గడిపేస్తున్నాడు .
ఆ ఇంట్లో దిగిన రెండో రోజునే ఇందిర హడావిడిగా ప్రకాశం రూములోకి వచ్చి “ చూడండీ ! మా నాన్న గారికేందుకో గంట నుండి చాలా ఆయాసంగా ఉంది . ప్రయాణం బడలిక వల్లనో ఏమో ! ఒక్కసారి చెయ్యి చూస్తారా ! “ అంది .
ప్రకాశం వెళ్లి చూశాడు , “ మీ నాన్న గార్కి బ్లడ్ ప్రషర్ ఉందనుకుంటాను . ప్రస్తుతానికేం భయం లేదు . పూర్తి విశ్రాంతి తీసుకోమనండి , రాత్రికి భోజనం మానిపించి కొంచెం పాలివ్వండి . రేపుదయం హాస్పటలుకు తీసుకు వెళ్లి చూపిస్తాను “ అన్నాడు .
మర్నాడు ఉదయం ఇందిర ప్రకాశం రూములోకొచ్చి “ మీరిప్పుడు హాస్పటలుకు వెళతారు గాడూ ! అభ్యంతరం లేకపోతే మా నాన్నగారిని కూడా తీసుకు వెళతారా ?” అంది .
“ మాటల్లో వచ్చారు . నేనే వచ్చి చెపుదామనుకుంటున్నాను . ఇంకో అరగంటలో బయలుదేరతాను . సిద్ధంగా ఉండమనండి “ అన్నాడు ప్రకాశం . ఆ తరువాత కాస్సేపటికి అతడు కిందికి దిగి వచ్చేసరికి ఇందిర కూడా తయారై ఉంది . ముగ్గురూ కలిసి హస్పటలుకు వెళ్లారు .
ఆ సాయంత్రం ఇందిర మళ్లీ ప్రకాశం రూములోకి వచ్చి “ ఏమండీ ! ఉదయం నాన్నగారిని పరీక్ష చేసిన డాక్టరు ఏమన్నాడు ? బ్లడ్ టెస్టు చేశారు గదా ? ఏమిటి సంగతి ?” అని అడిగింది .
“ నేను చెప్పాను కదూ బ్లడ్ ప్రెషర్ ఉందని ! అదే , చాలా ఎక్కువ ప్రెషర్ ఉంది . కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలి . అదీకాక ఆయన అలవాట్లు కొంచెం తగ్గించుకోవాలి “ అనేసి ప్రకాశం కొంచెం బాధపద్దట్టు , మళ్లీ “ క్షమించండి . డాక్టరు గారలా చెప్పారు “ అన్నాడు . అలా అన్నందుకు ఆమె ఏదైనా బాధ పడుతున్నదేమోనని ఆమె వైపు పరిశీలనగా చూశాడు .
ఇందిర ఏమీ బాధ పడలేదు సరిగదా చాలా సాధారణంగా – “ నేనూ అదే చెపుతున్నాను . కాని ఆయన యింక మారేది లేదు . అసలా తాగుడు వల్లనే యింతగా ఆరోగ్యం పాడైంది “ అంది .
ప్రకాశం మనస్సు చివుక్కుమంది . తండ్రి గురించి ఒక కొత్త మనిషితో ఇందిర ఇలా మాట్లాడగల్గడం అతని కాశ్చర్యం కలిగించింది .
తండ్రి ఆరోగ్యం గురించిన ఏదో ప్రశ్న వేయడానికి వచ్చి కరం క్రమంగా ఇందిర అలా ప్రకాశంతో మాటలాడుతూ కూర్చుండిపోయేది . ఒక మాట చెప్పడానికి వచ్చి పది ప్రశ్నలు వేసి వెళ్ళేది .
ఉదయం 10 గంటలకు ఆఫీసుకు వెళ్లి సాయంత్రం ఐదు గంటలకు వస్తుంది ఇందిర . ప్రకాశం సాయంత్రం ఐదు అయేసరికి కాలేజి నుండి వస్తాడు . వెంటనే బట్టలు మార్చుకొని ఏ స్నేహితుదితోనే కలసి బజారుకు పోయేవాడు .లేదా చదువుకునేందుకు లైబ్రేరీ కి పోయేవాడు . తిరిగి ఇల్లు చేరుకునే సరికి ఎనిమిదో తొమ్మిదో అయేది .రాగానే ఇందిర ఏదో ఒక సాకుతో కబుర్లు చెపుతూ కూర్చుంటుంది . ఒక్కొక్కసారి ప్రకాశానికి ఆవిడ రాకపోకలు చికాకు కలిగించేవి . చదువు వెనక పడుతుందని భయపడేవాడు . కాని ఏమీ తోచనప్పుడు ఆమెతో కబుర్లు చెప్పడంలో ఏదో ఒక ఆనందం అనుభవించేవాడు .
ప్రకాశానికి క్రమంగా ఆమెతో కాలక్షేపం ఒక తప్పనిసరి అలవాటుగా పరిణమించింది . రోజులో ఏదో ఒక సమయంలో ఆమె అతని గదికి వస్తుంది . ఏదో ఒక అక్కరలేని విషయమైనా సరే ప్రస్తావించి మాటలు పెంచుతుంది . రోజులకు రోజులు అల గడిచాయి . కాని ప్రకాశం మాతరం అవసరం లేకుండా వాళ్ళా వాతాలోకి వెళ్ళలేదు . ఇందిరతో తనకు తానై మాటాడలేదు . ఒక్కొక్కప్పుడు ఇందిర మరీ విసుగెత్తిస్తుంది . ప్రకాశం లోలోపల మందిపడినా పైకి మాత్రం ఇందిర నేమీ అనలేకపోయేవాడు . ఇందిరంటే అతని కెందుకో ఒక విధమైన భయం . ఆమెలో అతన్ని ఆక్షరించిన వాటికంటే భయపెట్టిన విషయాలే ఎక్కువ .
రచన : కాలాతీత వ్యక్తులు (నవల నుంచి )…
———–