జానమద్ది హనుమచ్ఛాస్త్రి (Janamaddi Hanumacchastri)

Share
పేరు (ఆంగ్లం)Janamaddi Hanumachchastry
పేరు (తెలుగు)జానమద్ది హనుమచ్ఛాస్త్రి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ9/5/1926
మరణం2/28/2014
పుట్టిన ఊరుఅనంతపురం జిల్లా రాయదుర్గం
విద్యార్హతలుతెలుగు, ఇంగ్లీషు భాషలలో ఎం.ఏ. పట్టా పొందారు.
వృత్తి
తెలిసిన ఇతర భాషలుహిందీ, కన్నడ
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుమా సీమకవులు, నాట్యకళాప్రపూర్ణ బళ్ళారి రాఘవ (జీవిత చరిత్ర),
కస్తూరి కన్నడ సాహిత్య సౌరభం 2, కడప సంస్కృతి- దర్శనీయ స్థలాలు, రసవద్ఘట్టాలు,
మన దేవతలు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర, సి.పి.బ్రౌన్ చరిత్ర,మొండి గోడలనుంచి మహా సౌధం దాకా, విదురుడు, త్యాగమూర్తులు, మనిషీ నీకు అసాధ్యమేదీ, ఎందరో మహానుభావులు, భారత మహిళ, శంకరంబాడి సుందరాచారి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుపొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు
లోకనాయక్ ఫౌండేషన్ సాహితీపురస్కారం (2011)
గుంటూరులో అయ్యంకి వెంకటరమణయ్య అవార్డు
అనంతపురం లలిత కళా పరిషత్ అవార్డు
ధర్మవరం కళాజ్యోతి వారి శీరిపి ఆంజనేయులు అవార్డు
కడప సవేరా ఆర్ట్స్ వారి సాహితీ ప్రపూర్ణ అవార్డు
మదనపల్లి భరతముని కళారత్న అవార్డు
తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారం
బెంగళూరులో అఖిల భారత గ్రంథాలయ మహాసభ పురస్కారం
ఉడిపి పెజావరు పీఠాధిపతిచే ‘ధార్మికరత్న’ బిరుదు
ఇతర వివరాలుమానవులు పుడతారు … చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు … వీరిని “మృతంజీవులు” అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -జానమద్ది హనుమచ్ఛాస్త్రి- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ….
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికజానమద్ది హనుమచ్ఛాస్త్రి
సంగ్రహ నమూనా రచనశ్రీ జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారి వ్యాసములు ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, మాసీమ పాఠకులకు సుపరిచితములు. వీరు 1970 వ సం. నుండి తమ వ్యాసములను విరివిగా పత్రికలకు పంపి పేరు గడించిరి. వీరికి హిందీ, కన్నడ భాషలందు కూడ ప్రవేశము కలదు.

జానమద్ది హనుమచ్ఛాస్త్రి

శ్రీ జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారి వ్యాసములు ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, మాసీమ పాఠకులకు సుపరిచితములు. వీరు 1970 వ సం. నుండి తమ వ్యాసములను విరివిగా పత్రికలకు పంపి పేరు గడించిరి. వీరికి హిందీ, కన్నడ భాషలందు కూడ ప్రవేశము కలదు.
శ్రీ జానమద్దివారు రాయదుర్గం జిల్లా బోర్డు హైస్కూలు నందు యస్.యస్.యల్.సి. ముగించి ప్రైవేటుగా బి.ఏ. లో ఉత్తీర్ణత పొంది, బి.ఇడి. పూర్తి చేసిరి. తరువాత స్వయంకృషితో ఆంధ్ర, ఆంగ్ల భాషలలో ఏం.ఏ. పట్టమును పొందిరి. కడపలో ఉద్యోగము చేయుచున్నప్పుడు శ్రీ మల్లెమాల వేణుగోపాలరెడ్డి, శ్రీ రాచపల్లి రాజగోపాలరెడ్డి, శ్రీ పి. రామకృష్ణారెడ్డి శ్రీ వై.పి.వి. రెడ్డి, శ్రీ పేరాల భరతశర్మ మున్నగు ప్రముఖ వ్యక్తులందరితో పరిచయము లేర్పడినవి, శ్రీ రాజపల్లి రాజగోపాలరెడ్డిగారు ‘మాసీమ’ యనుపేర నొక పక్ష పత్రికను ప్రారంభించుచు శ్రీ జానమద్దివారిని రాయలసీమ కవులను గూర్చి వ్యాసములు వ్రాయమని కోరిరి ఆ ప్రోత్సాహముతో ఉత్తేజులై, రాయలసీమలో మఱుగు పడిన కవుల చరిత్రములను వ్రాయుటకు సిద్దపడిరి. ఈ వ్యాసములు వరుసగా ‘మాసీమ’ యందేకాక తదితర దినపత్రికల ద్వరా, ఆకాశవాణి యందును వెలుగు చూచినవి. దీనితో శాస్త్రిగారి పేరు ఆంధ్రదేశమునకు పరిచయమైనది, కీర్తిప్రతిష్ఠలు తెచ్చినది. తదుపరి వారు ఆ కవుల వ్యాసములన్నింటిని ‘మా సీమకవులు’ గా పుస్తక రూపములోనికి దెచ్చరి.
శ్రీ జానమద్దివారు మంచి గేయ రచయితల ‘అమృతం గమయ’ శీర్షికతో వ్రాసిన గేయమాలిక మానవులానంద మయులగుటకు, భారతీయ విజ్ఞానులు చూపిన పధమెట్టిదో ఇందు వివరించిరి.
……………………………………………….
……………………………………………….
గంగాతరంగాల కమ్మతెమ్మెర చూచి,
ఓషదీ లతలలో వనదేవతల నూచి,
సెలయేటి అలలపై ప్రకృతి కన్నెల నూచి,
చల్లగా ప్రాణాల, నుల్లసిల్లగ జేతురెవరో
…………………………………………………..
…………………………………………………..
భారతీయుల మమ్మేమూ
మాభాగ్యకల్పనా, కామధేనువులు మీరు
అన్నమయ, ప్రాణమయ, మనోమయ
విజ్ఞానమయ, ఆనందమయ, కోశముల వోలె
మాదేశ ప్రణాళికా కోశముల చిత్తశుద్ధియు,
నిత్యనూత్న చైతన్యము, స్వార్థ రాహిత్యమ్ము
మాలోన లేవంచు దరియంగ రారేమి……
దిగిరండు, దిగిరండు దేవ సురభుల్లార
భారతక్షేత్రాల పసిడి నిగ్గులుధేల,
…………………………………………………
అమృత ప్రదానమ్ము నమరింప రారండు రారండు
శ్రీ జానమద్దివారు కన్నడ భాషాప్రియ లగుటచే ‘కన్నడ భారత కర్తలు’ ‘కన్నడ గురుజాడ కైలాసం’ ‘ప్రజాకవి సర్వజ్ఞుడు’ జ్ఞాన వీర బహుమతి గ్రహీత శ్రీ డా. దత్తాత్రేయ రామచంద్ర బేంద్రే మున్నగు వారిని గూర్చి వ్యాసములు వ్రాసిరి. అట్లే కన్నడమందలి ‘గణపతి’ పుస్తకమును తెలుగులోని కనువదించిరి. రాయలసీమ నటుడైన శ్రీ బళ్లారి రాఘవనుగూర్చి ప్రతికలకు వ్రాసిరి. రేడియోలలో ప్రసంగములు గావించిరి.
శ్రీ జానమద్దివారు కడప జిల్లా రచయితల సంఘ కార్యదర్శిగా చేసిన సాహిత్యకృషి అపారము, వారి కార్యదర్శి పదవి ఆదర్శప్రాయమైనది. రచయితల సంఘపు కార్యక్రమములలో వారు రాత్రింబవళ్ళు తలమునక లగుచున్నారు. వీరికి శ్రీ మల్లెమాల వేణుగోపాలరెడ్డిగారి అండదండలెంతేని కలవు. వీరిరువురి సారధ్యములో రచయితల సంఘ కార్యక్రమములు చురుకుగా జరుగుచున్నవి. కార్యదర్శి పదవి నలంకరించుటకు తగిన ఓర్పు, నేర్పు, దీక్ష, దక్షత, నమ్రత, వినమ్రతలు శ్రీ జానమద్ది వారిలో మూర్తీభవించినవి.

———–

You may also like...