పేరు (ఆంగ్లం) | Tripuraneni Ramaswamy Chowdary |
పేరు (తెలుగు) | త్రిపురనేని రామస్వామి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | పున్నమ్మ |
పుట్టినతేదీ | 1/15/1887 |
మరణం | 1/16/1943 |
పుట్టిన ఊరు | కృష్ణా జిల్లా, అంగలూరు |
విద్యార్హతలు | డబ్లిన్ లో న్యాయశాస్త్రం |
వృత్తి | న్యాయవాది |
తెలిసిన ఇతర భాషలు | సంస్కృతం, ఆంగ్లము |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | సూతపురాణము, శంబుకవధ, సూతాశ్రమ గీతాలు, ధూర్త మానవ శతకము, ఖూనీ, భగవద్గీత, రాణా ప్రతాప్ |
ఇతర రచనలు | http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=3910 http://kaviraaju.blogspot.com/2011/04/1.html |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | కవిరాజు |
ఇతర వివరాలు | కవిరాజుగా ప్రసిద్ధి చెందిన త్రిపురనేని రామస్వామి న్యాయవాది, ప్రముఖ హేతువాద రచయిత, సంఘసంస్కర్త. స్మృతులు, పురాణాలు, వ్యవస్థీకృత మతము వలన వ్యాపించిన కుల వ్యవస్థ మీద, సామాజిక అన్యాయాల మీద ఆయన పూర్తి స్థాయి ఉద్యమము ప్రారంభించాడు. 1922 లో గుంటూరు జిల్లా, తెనాలి లో స్థిరపడ్డాడు. 1925 లో తెనాలి పురపాలక సంఘ చైర్మనుగా ఎన్నికయ్యాడు. తెనాలి మున్సిపాలిటీ చైర్మెన్ గా ఉన్నపుడు, గంగానమ్మ కొలుపులలో నిర్వహించే జంతుబలిని నిషేధించాడు. ఈ అంశంలో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టి చైర్మను పదవి నుండి తొలగించారు. అయితే వెంటనే జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ఎన్నికై, తిరిగి చైర్మను అయ్యాడు. జంతుబలులు మాత్రం సాగలేదు. ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్ ఈయన కుమరుడే. 1987 వ సంత్సరంలో భారతదేశ ప్రభుత్వము వారు ఆయన స్మారక చిహ్నంగా ఆయన పేరు మీద తపాళా బిళ్ళను జారీ చేయడం జరిగింది. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | త్రిపురనేని రామస్వామి చౌదరి గేయాలు |
సంగ్రహ నమూనా రచన | త్రిపురనేని రామస్వామి చౌదరి గేయాలు ఆయన ప్రసిద్ధ గేయంలోని ఒక భాగం: వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడొ తెల్పుడీ పూసిపోదుము మెడను వైతుము పూలదండలు భక్తితో రైతు,దీనజన పక్షపాతిగా వారి సేవనే తన మార్గంగా ఎంచుకొన్నాడు. మానవసేవే మాధవసేవ అని నమ్మాడు. చూడండి… మలమల మాడు పొట్ట , తెగమాసిన బట్ట ,కలంతపెట్టగా విలవిల యేడ్చుచున్న నిఱుపేదకు జాలిని జూపకుండ, ను త్తలపడిపోయి, జీవరహితంబగు బొమ్మకు నిండ్లు వాకిళుల్ పొలమును బొట్ర నిచ్చెడి ప్రబుద్ధవదాన్యుల నిచ్చమెచ్చెదన్. |
త్రిపురనేని రామస్వామి చౌదరి గేయాలు
ఆయన ప్రసిద్ధ గేయంలోని ఒక భాగం:
వీరగంధము తెచ్చినారము
వీరుడెవ్వడొ తెల్పుడీ
పూసిపోదుము మెడను వైతుము
పూలదండలు భక్తితో
రైతు,దీనజన పక్షపాతిగా వారి సేవనే తన మార్గంగా ఎంచుకొన్నాడు. మానవసేవే మాధవసేవ అని నమ్మాడు. చూడండి…
మలమల మాడు పొట్ట , తెగమాసిన బట్ట ,కలంతపెట్టగా
విలవిల యేడ్చుచున్న నిఱుపేదకు జాలిని జూపకుండ, ను
త్తలపడిపోయి, జీవరహితంబగు బొమ్మకు నిండ్లు వాకిళుల్
పొలమును బొట్ర నిచ్చెడి ప్రబుద్ధవదాన్యుల నిచ్చమెచ్చెదన్.
మా మతం గొప్పదంటే కాదు మా మతం గొప్పదని వాదులాడే మతోన్మాదులను ఈసడిస్తూ ….
ఒకరుడు ‘వేదమే’ భగవ దుక్తమటంచు నుపన్యసించు నిం
కొకరుడు ‘బైబిలే’ భగవదుక్తమటంచును వక్కణించు, వే
రొంకరుడు మా ‘ ఖొరాన్ ‘ భగవదుక్తమటంచును వాదులాడు, నీ
తికమక లేల పెట్టెదవు? తెల్పగరాదె నిజంబు నీశ్వరా.
——-
తెలుఁగుజోదులు
గౌతమీనది, కృష్ణవేణియు
తుంగభద్రయు, సర్వదా
జీవనదులై యెండిపోవక
యెల్లకాలము పాఱుచున్
బీళ్ళ నన్నిటిఁ బంటపొలములు,
పండ్లతోఁటలు చేయుచున్,
దెల్గుదేశం బతి సుభిక్షము
గా నొనర్చును సర్వదా
తెలుఁగుబిడ్డా! మఱచిపోకుర
తెలుగు దేశము పురిటిగడ్డర
కొక్కొరోకో పాటఁ బాడర
తెలుఁగువారల మేలుకొల్పర!!
రెండుకోట్లకు మించియుండిన
తెల్గువారల నక్కటా!
చీల్చివైచిరి, నాల్గుదెసలకుఁ
జిమ్మివైచిరి నేఁటికిన్,
కొంతమంది నిజామురాష్ట్రము
నందుఁ జిక్కిరి బేలలై,
కొంతమందియు కన్నడంబున
నుండిపోయిరి దీనులై,
తెలుఁగుబిడ్డా! మఱచిపోకుర
తెలుఁగు దేశము పురిటిగడ్డర
కొక్కొరోకో పాటఁ బాడర
తెలుఁగువారల మేలుకొల్పర!!
పూర్వ మెప్పుడొ యెదురులేకయె
ద్రవిడదేశము మీఁదికిన్
జైత్రయాత్రలు సల్పియుండిరి
తెల్గుబంటులు జోదులై
తెలుఁగుదేశం బాక్రమించిరి
యఱవవారలు నేటికిన్,
మెల్ల మెల్లఁగ బ్రాఁకులాడుచు
దిడ్డికంతల దూఱుచున్,
తెలుఁగుబిడ్డా! మఱచిపోకుర
తెలుగు దేశము పురిటిగడ్డర
కొక్కొరోకో పాటఁ బాడర
తెలుగువారల మేలుకొల్పర!!
లెమ్ము లెమ్మిఁక నడుముగట్టుము
తెల్గు వారల నెల్ల నీ
వొక్క రాష్ట్రమునందుఁ గూర్పఁగ
గట్టియత్నముఁ జేయుమా!
అన్యులెవ్వరు నడ్డఁజాలరు,
నీ మనోరథ సిద్ధినిన్
బడయనేర్చెద వచిరకాలము
నందె పేరు ప్రతిష్ఠతో
తెలుగుబిడ్డా! మఱచిపోకుర
తెలుగు దేశము పురిటిగడ్డర
కొక్కొరోకో పాటఁ బాడర
తెలుగువారల మేలుకొల్పర!!
ఒడ్డె బందెలదొడ్డిఁ ద్రోలిరి
తెల్గువారలఁ గొందఱన్,
మిగిలియుండిన వారినెల్లర
నఱవవారల కాళ్ళపైఁ
గూలఁద్రోసిరి, కేరడంబులు
కుచ్చితంబులు పల్కుచున్,
మఱువరాని పరాభవంబును
గల్గఁజేసిరి, యెల్లరున్
తెలుగుబిడ్డా! మఱచిపోకుర
తెలుగు దేశము పురిటిగడ్డర
కొక్కొరోకో పాటఁ బాడర
తెలుగువారల మేలుకొల్పర!!
తెల్గువారలపేరు మాసెను
తెల్గునాఁటను నేఁటితోఁ
తెల్గువారలకెల్ల నుమ్మడి
దేశ మొక్కటి లే దహో!
తెల్గువారల ఢాక యెఱిఁగియె
కుచ్చితంబుగ నీ గతిన్
చిదిమివైచిరి, యదిమిపెట్టిరి,
నాల్గుదెసలకు నెట్టుచున్
తెలుగుబిడ్డా! మఱచిపోకుర
తెలుగు దేశము పురిటిగడ్డర
కొక్కొరోకో పాటఁ బాడర
తెలుగువారల మేలుకొల్పర!!
———–