పేరు (ఆంగ్లం) | Edla Ramadasu |
పేరు (తెలుగు) | ఎడ్ల రామదాసు |
కలం పేరు | – |
తల్లిపేరు | మహాలక్ష్మమ్మ |
తండ్రి పేరు | అప్పయ్య |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1860 |
మరణం | 1/1/1910 |
పుట్టిన ఊరు | విజయనగరం జిల్లా కలవచర్ల అగ్రహారం |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | తన అనుభవాలను, బోధనలను పద్యాలుగాను, కీర్తనలుగాను రచించారు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | ఎడ్ల రామదాసు రామభక్తులు మరియు గేయ రచయిత. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ఎడ్ల రామదాసు |
సంగ్రహ నమూనా రచన | తత్త్వకర్తల్లో ప్రసిద్ధుడైన వీరబ్రహ్మేంద్రస్వామి తరువాత అంత ప్రసిద్ధి పొందిన తత్త్వకర్త ఎడ్ల రామదాసు. 19వ శతాబ్దం చివరి భాగానికి చెందినవాడు. ఇతడు కాకినాడ నివాసి. ఎడ్ల రామదాసు 119 కీర్తనలు రచించారు. అదే ”సాంఖ్యయుగ తార్కిక మనస్కయోగం”. దీనితో పాటు ఆయన శిష్యులు రచించిన కొన్ని కీర్తనలతో ఎడ్ల రామదాసు చరిత్ర అనేపేర ప్రకటితం. |
ఎడ్ల రామదాసు
తత్త్వకర్తల్లో ప్రసిద్ధుడైన వీరబ్రహ్మేంద్రస్వామి తరువాత అంత ప్రసిద్ధి పొందిన తత్త్వకర్త ఎడ్ల రామదాసు. 19వ శతాబ్దం చివరి భాగానికి చెందినవాడు. ఇతడు కాకినాడ నివాసి. ఎడ్ల రామదాసు 119 కీర్తనలు రచించారు. అదే ”సాంఖ్యయుగ తార్కిక మనస్కయోగం”. దీనితో పాటు ఆయన శిష్యులు రచించిన కొన్ని కీర్తనలతో ఎడ్ల రామదాసు చరిత్ర అనేపేర ప్రకటితం.
భక్తి భావంతో కొంత మంది ఉపవాస విధానాలతో రాత్రి తెల్లవార్లూ జాగారం చేస్తూ తరంగ నృత్యాలు చేస్తారు. ముఖ్యంగా రామదాసు కీర్తనలూ, ఎడ్ల రామదాసు కీర్తనలూ, తూము నరసింహదాసు, అల్లూరి వెంకటాద్రి స్వామి, విష్టల ప్రకాశరావు, ఆదిభట్ల నారాయణ దాసు మొదలైన గేయ కర్తల పాటల్ని భజన పరులంతా ఆలపించే వారు. ఈ భజన బృందాలు ఒక్కొక్క గ్రామంలో పోటీలు పడి రెండు బృందాలుగా ఒకరిని మించి మరొకరు గ్రామ పెద్ద బజారులో ఉధృతంగా భజనలు చేస్తారు.
భక్తిభావంతో వాళ్ళు పాడే పాట, ఆడే ఆట చూసేవారికి ఎంతో ఆసక్తిదాయకంగా ఉంటాయి. ధనుర్మాసమంతా భజన కార్యక్రమాల్లో పాల్గొనడం వీరి కర్తవ్యం. ఈ హరిదాసులు పాడే పాటలు జనం నోళ్ళలో ఎన్నో ఏళ్ళుగా నానుతున్న పాటలే. రామదాసు కీర్తనలు, ఎడ్ల రామదాసు, పరంకుశదాసు, వెంకటదాసు, హనుమద్దాసు, నారాయణ తీర్థుని తరంగాల వంటివాటిని వీరు ప్రధానంగా గానం చేస్తారు.
———–