చిట్టా దామోదరశాస్త్రి (Chitta Damodara Sastry)

Share
పేరు (ఆంగ్లం)Chitta Damodara Sastry
పేరు (తెలుగు)చిట్టా దామోదరశాస్త్రి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1925
మరణం3/29/2012
పుట్టిన ఊరుకృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని సిద్ధాంతం గ్రామం
విద్యార్హతలు
వృత్తిఆంధ్రోపన్యాసకునిగా పనిచేశారు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువాస్తవం, మధుమాసం, నక్షత్రేష్టి, అనుగ్రహం, స్వారాస్యం, నలభీమ, పాకపరిషత్తు, పోయివచ్చిన ప్రాణం, అనంతదాన మహామహిమ అనే నవలలను, అమృతతవర్షిణి కథావీధి, కామధేను మొదలుగు 12 కథా సంపుటలను, ఆనందవర్షిణి విద్యావిధానం-చీకటివెలుగులు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుసేవా నివృతులైన తర్వాత హైదరాబాద్‌కు వచ్చి శ్రీ విద్యారణ్య ఆవాస మహావిద్యాలయం (శ్రీ శారదాధామం) ప్రిన్సిపాల్‌గా, ‘స్ఫూర్తి’ మాసపత్రిక సంపాదకునిగా బాధ్యతలు నిర్వర్తించారు. జాగృతి వారపత్రికలో ‘నేనెరిగిన సిద్దులు- ప్రసిద్ధులు’ శీర్షికన దాదాపుగా వందమందిని పరిచయం చేశారు. దామోదరశాస్త్రి గేయరామాయణం, గేయభారతం, గేయకృష్ణచరిత్ర రచించారు. చివరిదానిలో భాగమైన ‘కృష్ణ-కుచేల’ నృత్యరూపకం వేయికిపైగా ప్రదర్శనలకు నోచుకుంది. ఆకాశవాణి-హైదరాబాద్‌ కేంద్రం నుంచి పెద్ద సంఖ్యలో వారి ప్రసంగాలు ప్రసారమయ్యాయి.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికచిట్టా దామోదరశాస్త్రి
గురువుగారి మాట
సంగ్రహ నమూనా రచన‘‘ఏం బాగున్నదని చేసుకున్నావురా?’’ పరాచకాలాడాడు మేనమామ సుబ్బన్న అప్పుడే పెళ్లైన రంగడితో.
నిజానికి సుబ్బన్న కూతురు సునీత రంగడి పెళ్లానికంటే అందగత్తేమీ కాదు. కాకపోతే, సుబ్బన్న ఆస్తిపరుడు. పేదరాలైన చెల్లెలు రాములమ్మ ’’మా రంగడి కేం తక్కువ? సునీత నియ్యవా, అన్నా’’ అంటూ ఎంత బతిమాలనా సుబ్బన్న అంగీకరించలేదు సరికదా, తోటకూరాకులో పురుగును తీసేసినట్లు మాట్లాడాడు. దాంతో రాములమ్మకు రోషం వచ్చింది. వెంటనే చివాలున లేచింది, గిర్రున తిరిగి ఇంటిముఖం పట్టింది.

చిట్టా దామోదరశాస్త్రి
గురువుగారి మాట

 ‘‘ఏం బాగున్నదని చేసుకున్నావురా?’’ పరాచకాలాడాడు మేనమామ సుబ్బన్న అప్పుడే పెళ్లైన రంగడితో.

నిజానికి సుబ్బన్న కూతురు సునీత రంగడి పెళ్లానికంటే అందగత్తేమీ కాదు. కాకపోతే, సుబ్బన్న ఆస్తిపరుడు. పేదరాలైన చెల్లెలు రాములమ్మ ’’మా రంగడి కేం తక్కువ? సునీత నియ్యవా, అన్నా’’ అంటూ ఎంత బతిమాలనా సుబ్బన్న అంగీకరించలేదు సరికదా, తోటకూరాకులో పురుగును తీసేసినట్లు మాట్లాడాడు. దాంతో రాములమ్మకు రోషం వచ్చింది. వెంటనే చివాలున లేచింది, గిర్రున తిరిగి ఇంటిముఖం పట్టింది.

అప్పుడు ఎదురు వచ్చాడామెకు మరో సుబ్బన్న. అతనూ  ఆ ఊరివాడే. అతి సామాన్యుడు. అతనికీ ఓ పెళ్లి కావాల్సిన కూతురుంది. ‘‘ఏ మక్కా ఇంత ఎండలో వెళ్లొస్తున్నావ్ అబ్బాయి చదువకు డబ్బుకోసం కాదు కదా’’ అన్నాడు.

‘‘లేదన్నా మా అబ్బాయి చదువైపోయి ఇంటికి వస్తున్నాడు’’ అంది రాములమ్మ.

‘‘అయితే ఇక పెళ్లే పప్పన్నం ఎప్పుడు?’’ అడిగాడు సుబ్బన్న.

‘‘తీరుబడిగా చెపుతా, మీ ఇంటికి పద’’ అంది రాములమ్మ.

అక్కడ అతని కూతురు శుక్రవారం మహాలక్ష్మిలా తలంటి పోసుకుని, తలలో పూలు పెట్టుకుని పూలబుట్టతో గుడికి బయలుదేరింది. రాములమ్మను చూసి, ‘‘రా, అత్తా’’ అంటూ ఎంతో ఆప్యాయంగా పలుకరించి, లోపలికి తీసుకెళ్లింది. ఇల్లంతా ఎంతో శుభ్రంగా ఉంది. వస్తువు లెన్నో లేవుగానీ, ఉన్నంతవరకు చక్కగా సర్ధి న్నాయి.

‘ఆహా’ అనుకుంది రాములమ్మ. మంచినీళ్లు తాగి సుజాత పెళ్లెప్పుడు చేస్తావంది సుబ్బన్నతో.

‘‘మనం మేడ సుబ్బన్నలాగా బస్తీ సంబంధం చేయగలమా’’ అన్నాడు సుబ్బన్న తలెత్తి తన పాకవైపు చూస్తూ.

‘‘పోనీ, పల్లె సంబంధమే చేయరాదా’’ సలహా ఇచ్చింది రాములమ్మ.

‘‘అదుగో, దాని కోసమే బయలుదేరా నీవు ఎండనపడి వస్తుంటే ఇటు ఇంటికి వచ్చేశా’’ అన్నాడు పాక సుబ్బన్న.

రాములమ్మకు మేడ సుబ్బన్న మాట గుర్తు వచ్చింది. ‘‘పెళ్లంటే నూరేళ్ల పంట మా సునీతను బస్తీలోనే ఇస్తా’’ అన్నాడు సొంత అన్న.  ఆ మేడలో కూర్చున్నంతసేపూ తేళ్లూ, జెర్రులూ పాకినట్లయింది రాములమ్మకు. ఒళ్లంతా కుతకుతా ఉడికిపోయింది. ఎండనపడి వచ్చిందేమో, చల్లని పాక చల్లని మాట చల్లని కుండలో నీళ్లు ‘ఆహా’ అనుకుంది.

ఓ నిశ్చయానికి వచ్చేసింది. ఇంటికి వచ్చేసింది. అక్కడ అప్పుడే ఊరి నుండి వచ్చిన రంగడు, ‘‘అమ్మా బాగున్నవా’’ అంటూ పలకరించాడు. ‘‘నాకు ఉద్యోగం దొరికిందమ్మా’’ అన్నాడు.

వెంటనే గురువుగారి మాట గుర్తు వచ్చింది – ‘‘చిన్న ఉద్యోగం అని వదిలిపెట్టకు. చేరిన తరువాత పనిలో లోపం చేయకు. తరువాత్తరువాత అదే పెద్ద ఉద్యోగమవుతుంది చేసుకున్న తరువాత పెళ్లాం అందంగా కనిపించినట్లు’’ అని. ఆ మాటకు రంగడు సిగ్గుపడ్డాడు.

‘‘ఏమిట్రా సిగ్గు పడుతున్నావ్’’ అంది తల్లి.

‘‘ఏమీ లేదు’’ అన్నాడు కొడుకు.

‘‘నీ పెళ్లి కుదిరినట్లే నీవే పిల్లను చూసి ఒప్పుకోవాలి. ఎరుగుదువుగా, మన సుబ్బన్న మామ కూతురును…’’ అంటున్న తల్లి మాటకు అడ్డు వచ్చి, ‘‘అక్కర్లేదమ్మా నీకు నచ్చితే నాకు నచ్చినట్టే ముహూర్తం పెట్టించు నేను బస్తీ వెళ్లి బట్టలు కుట్టించుకు వస్తా’’ అన్నాడురంగడు.

అలా పాక సుబ్బన్న కూతురు సుజాతతో రంగడి పెళ్లి గుళ్లో ఘనంగా జరిగింది. పెళ్లికి వచ్చిన మేడ సుబ్బన్న పరాచకా లాడుతూ అన్నాడు. ‘‘ఏం బాగున్నదని చేసుకున్నావురా’’ అని రంగడితో.

వాడూ నవ్వుతూనే చెప్పాడు – ‘‘మామయ్యా నేను చేసుకోలేదు. అమ్మ చేసింది’’ అని

అయినా విడవకుండా రెచ్చకొట్టాడు మేనమామ. ఆశ్చర్యపోయాడు మేనల్లుడు.

‘‘సుబ్బన్న మామ కూతురే నీకు తెలిసిందే అంది అమ్మ. అయినా చేసుకునే ముందు చేసుకో అంది. పెళ్లి చూపు లెందుకులే అన్నాను నేను. తెర తీసిన తరువాత చూశాను, ఇప్పుడు నీ మాట విన్నాను పేదవాణ్ని, పిల్ల నెందుకిస్తావులే అని సరిపెట్టుకున్నాను’’ అన్నాడు రంగడు.

మామయ్య కేమీ తోచలేదు. విసవిసా నడిచి వెళ్లిపోయాడు.

అల్లుడు ఆలోచించాడు. అమ్మ ఇలా ఎందుకు చేసిందో అడగాలనుకున్నాడు. అంతలో అమ్మ రానే వచ్చింది. ‘‘ఏమన్నాడ్రా మామయ్య నేను కాళ్లావేళ్లా బతిమాలినా విన్నాడా నీ కొడుక్కి ఆస్తి ఉందా? అన్నాడు. నీ కొడుకు ఆఫీసరా అన్నాడు. తన పిల్లకు బస్తీ సంబంధమే చేస్తా నన్నాడు. తీరా బస్తీ సబంధం వాళ్లు బురిడీ కొట్టించాక నా దగ్గర కొచ్చాడు. అప్పుడు నా కనిపించింది – ఈ మామయ్య మనవాడు నీ కన్యాయం చేస్తున్నానని. ఒక్క క్షణంలో నిశ్చయించాను. నీతిగల పాక సుబ్బన్నే మనతో వియ్యమందటానికి తగినవాడూ అని. ‘అక్కా నేను నీ తమ్ముణ్ననుకో’ అనగానే, ‘అలాగే బాబూ, అబ్బాయి రానే వస్తున్నాడు, అమ్మాయి మనసు కనుక్కుని, ముహూర్తం పెట్టించు’ అన్నాను పాక సుబ్బన్నతో.

‘‘మన ఇంటి తోరణం చూసి మీ మామయ్య ఎలా ఎగతాళిచేశాడనుకున్నావ్ ఇల్లలకగానే పండుగవుతుందా అన్నాడు. సా కింకా రోషం వచ్చింది. ఇలాంటి మామయ్య చుట్టూ తిరిగి నీకు పిల్లనిమ్మని బతిమాలానే అని దుఃఖించాను. భగవంతుడు నా కళ్లు తెరిపించాడు. నేను నీకు అన్యాయం చేయలేదురా, నాన్నా బంగారపు బొమ్మను కట్టపెట్టా నీవే చూస్తావుగా’’ అంది.

అప్పుడర్ధమైంది – మేడ మామయ్య వల్ల అమ్మ మనసు ఎంత క్షోభచెందిందో. అమ్మ మొహంలోకి చూశాడు రంగడు. సంతృప్తితో ప్రశాంతంగా ఉంది.

తరువాత సత్యనారాయణ వ్రతం జరిగింది. వేంకటేశ్వర దీపారాధన జరిగింది. మనసంతా భగవంతునిపై నిలిపి పూజ చేస్తున్న సుజాతను చూసి రంగ డెంతో సంతోషించాడు. రాములమ్మ మాట సరేసరి.  ఆ తరువాత ఆ ఇంటా, ఈ ఇంటా మూడు నిద్దర్లయినాయి.

‘‘పిల్లా రాత్రి నిద్రపట్టిందా’’ ప్రశ్నించింది. సుజాతను ఆటపట్టిస్తూ వరసైన ముత్తైదువు.

‘‘లేదు, నిద్దర చేశాం వదినా’’ అంటూ సిగ్గు ఒలకపోసింది సుజాత.

‘‘ఇందాక మీ మామయ్య కూతురు సునీత వచ్చింది. ఎంతో అందంగా ఉంది. మీ కిస్తామన్నారటగా మీ రెందుకు చేసుకోలేదు’’ అడిగింది సుజాత.

‘‘అనలేదు. మా మేనమామ బస్తీ సంబంధం చుట్టూ తిరిగాడు. తీరా అది బెడిసికొట్టిన తరువాత ‘సునీత నిస్తా మేడ రాసిసత్ బాల తొడుగుతో సమా ఇస్తా’ అని అమ్మకు కబురు పంపాడట.

‘‘అమ్మ అప్పటికే మీ నాన్నకు మాటిచ్చింది. ఇంటికి తోరణం కట్టింది. మాట నిలుస్తుందో, లేదో అని మీ నాన్న భయపడ్డాడట కాని మా అమ్మ చాలా దొడ్డమనసు గలది. ‘ఈ డబ్బు మా రంగడు సంపాదించగలడు. మా కాబోయే కోడలే బంగారుబొమ్మ వేరే బంగారు తొడుగులక్కరలేదు’ అని తిప్పికొట్టిందట’’ అన్నాడు రంగడు ప్రశాంతంగా.

అంతవరకు అతనిమీదే చూపు నిలిపిన సుజాత కాశీ వెళ్లిన అత్తగారికి మనసులోనే నివాళులర్పించింది. ‘నే నెంత అదృష్టవంతురాలిని’ అనుకుంటూ అతని గుండెపై వాలిపోయింది.

రోజులు వారాలయ్యాయి. వారాలు నెలలైనాయి. నెలలు సంవత్సరాలైనాయి. నీళ్లు పోసుకున్న సుజాతను సుబ్బన్న తన పాకకు ఆప్యాయంగా తీసుకెళ్లాడు.

రాములమ్మే ప్రతిరోజూ వెళ్లి కోడల్ని చూసి వస్తూండేది.

ఒకరోజున రంగడెంతో ఉత్సాహంగా ఇంటికి వచ్చాడు. అతనికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది. సుజాత పుట్టింటి నుండి పండంటి కొడుకు నెత్తుకొని వచ్చింది. ప్రమోషన్ కాగితం సుజాత కిచ్చి, పిల్లవాణ్ని ఎత్తుకోకుండానే ముద్దుపెట్టుకున్నాడు. సుజాత బుగ్గలెర్రబడ్డాయి.

అప్పుడు రంగడికి గురువుగారి మాట గుర్తుకు వచ్చింది.

———–

You may also like...