పేరు (ఆంగ్లం) | Chitrakavi Ramanakavi |
పేరు (తెలుగు) | చిత్రకవి రమణకవి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | అనంత కవి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1630 |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | సాంబవిలాసము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | ఈకవి సాంబవిలాసమను ప్రబంధమును రచియించి వేంకటేశ్వరుని కంకితముచేసెను. ఇతడు 1630 వ సంవత్సరప్రాంతములందున్నట్లు తెలియవచ్చుచున్నది. ఇతని తండ్రియైన యనంతకవి రామరాజ భూషణకృతమైన హరిశ్చంద్రనలోపాఖ్యానమునకు వ్యాఖ్య చేసినందున అతడు పదునేడవ శతాబ్దారంభమునం దుండుట స్పష్టము. సాంబవిలాసములోని పద్యముల నప్పకవి లక్ష్యములనుగా జేకొని యుండుటచేత రమణకవి తప్పక తనసాంబవిలాసమును 1650 వ సంవత్సరమునకు గొంతకాలము పూర్వమే చేసియుండవలెను. కవి తన్నుద్దేశించి యీక్రింది వాక్యములను తనపుస్తకములో జెప్పుకొన్నాడు- |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | చిత్రకవి రమణకవి |
సంగ్రహ నమూనా రచన | ఓరమణాఖ్య సత్కవికులోత్తమ ! మామకమంజులాహ్వయ శ్రీరమణీయ! నీవిపుడు చేయగ బూనినసాంబలక్షణా సారసదృగ్వివాహకథ సన్మతి మాకిపు డంకితంబుగా గూరుపు నీకు గల్గు జయగుర్వచలాయురభీష్టవస్తువుల్. |
చిత్రకవి రమణకవి
ఈకవి సాంబవిలాసమను ప్రబంధమును రచియించి వేంకటేశ్వరుని కంకితముచేసెను. ఇతడు 1630 వ సంవత్సరప్రాంతములందున్నట్లు తెలియవచ్చుచున్నది. ఇతని తండ్రియైన యనంతకవి రామరాజ భూషణకృతమైన హరిశ్చంద్రనలోపాఖ్యానమునకు వ్యాఖ్య చేసినందున అతడు పదునేడవ శతాబ్దారంభమునం దుండుట స్పష్టము. సాంబవిలాసములోని పద్యముల నప్పకవి లక్ష్యములనుగా జేకొని యుండుటచేత రమణకవి తప్పక తనసాంబవిలాసమును 1650 వ సంవత్సరమునకు గొంతకాలము పూర్వమే చేసియుండవలెను. కవి తన్నుద్దేశించి యీక్రింది వాక్యములను తనపుస్తకములో జెప్పుకొన్నాడు-
ఉ. ఓరమణాఖ్య సత్కవికులోత్తమ ! మామకమంజులాహ్వయ
శ్రీరమణీయ! నీవిపుడు చేయగ బూనినసాంబలక్షణా
సారసదృగ్వివాహకథ సన్మతి మాకిపు డంకితంబుగా
గూరుపు నీకు గల్గు జయగుర్వచలాయురభీష్టవస్తువుల్.
సీ. సర్వలక్షణసారసంగ్రహం బొనరించి
తనరె మీతాత పెద్దనకవీంద్రు
డలహరిశ్చంద్రనలాధీశ సత్కథా
శ్లేషసత్కృతికి బ్రసిద్ధిగా గ
గవిహితుండౌచు వ్యాఖ్యానంబు వొనరించి
మరియు నిందుమతీసుపరిణయంబు
మొదలైనసత్కావ్యములు చేసి రహిగాంచె
నరయ మీతండ్రి యనంతసుకవి
చిత్రకవిమంజులాన్వయక్షీరవార్ధి
చంద్రమూర్తిని సద్బుద్ధిశాలి వీవు
రమణసత్కవి నీవొనర్పంగ బూను
కృతివతంసంబు నతని కంకిత మొనర్పు.
సాంబవిలాసమునందు దుర్యోధనపుత్రియైన లక్ష్మణాకన్యను కృష్ణుని కొడుకైన సాంబునికిచ్చి వివాహము చేసినకథ చెప్పబడినది. ఇది సలక్షణమైన గ్రంథము. ఇందుండి రెండుమూడు పద్యముల నిం దుదాహరించుచున్నాను.
చ. కొడవలిచేత బొడ్డు తగ గోసి గడానిపసిండిచేటలో
నిడి నులివెచ్చనీట నొడ లెంతయు నారిచి మేలిచల్వపా
వడ దడియొత్తి ఫాలమున బాగుగ నున్నని కాపుదృష్టిబొ
ట్టిడి రహి దీవన ల్సలిపి హెచ్చుగ నారతు లిచ్చి క్రచ్చఱన్. [ఆ.1]
ఉ. జాంబవతీతనూజు డలసాంబుడు బాల్యమునందు మందహా
సం బనుభవ్యచంద్రిక సజస్రము మాతృమనోంబుజాతహ
ర్షాంబుధి బొంగజేయుచు నుదంచితనై జకుమారచంద్రభా
వంబు యథార్థమై తనర వర్తిలు సత్కళలం జెలంగుచున్. [ఆ.1]
మ. ఒక భిల్లాగ్రణి వెంబడించి తనపై నుత్సాహ మొప్పంగ వ
చ్చు కఠోరాధికగర్వధూర్వహతరక్షుశ్రేష్ఠమున్ సాంబభూ
పకరీంద్రంబు నుతింప మేలితళుకుం బల్వాడియందంపునుం
జికటారింబడ గూల్చి యార్భటు లొనర్చెంబేర్చి శౌర్యంబునన్. [ఆ.1]
ఈకవి భారద్వాజగోత్రుడు; కాత్యాయనసూత్రుడు; ఓబళాంబాపుత్రుడు. ఇతనిచే రచింపబడిన రామాయణమొకటిగూడ గానబడుచున్నది. దానికితడు “విద్వత్కవికర్ణరసాయనసకలవర్ణనాపూర్ణ రామాయణము” అని పేరు పెట్టెను. ఈరామాయణములోని గద్యమునుబట్టి కవి యభిమన్యువిలాసము, కుమార గురువిలాసములోనగు గ్రంథములనుగూడ రచించినట్లు తెలియవచ్చుచున్నది. ఈరామా యణములోనివి ప్రతికాండమునుండియు రెండేసి పద్యముల నిందుదాహరించుచున్నాను-
చ. బిరుదులజల్లులున్ బునుగుబిల్లులపిల్లలు నుల్లసద్గతిం
బరగెడు మేలిమూలికలవల్లులు వీక్షణపర్వకారిబం
ధురమృగరాణ్మతల్లులు వినూత్నతరంబులు కొల్లలై తగన్
నరవిని గాన్క లిచ్చి మహిజానికి నిట్లని రందఱుం దగన్. [బాలకాండము]
శా. దేహం బస్థిర మెల్లవారలకు ధాత్రీభాగమం దేల యి
ట్లూహాపోహలు చేయ నీతనికి ము న్నుత్సాహియై యిత్తునం
చాహాపల్కితి వి స్డబద్దములు పెక్కాడంగ యుక్తంబులౌ
నా హేయాంగము దీని నమ్మి యిటు లేలా దబ్బఱ ల్పల్కగన్. [బాలకాండము]
మ. భరతుం డెవ్వడు కైక యెవ్వతె ధరాపాలుండు తా నేమి త
ద్వరయుగ్మం బన నేది నానిశితతీవ్రస్ఫారఖడ్గంబుచే
భరతుం ద్రుంచి ధరాస్ధలంబునకు నిన్ బట్టంబు నే గట్టెదన్
ధరణీమండలి నెల్లమానవులు మోదం బూని కీర్తింపగన్. [అయోధ్యాకాండము]
మ. నిను మన్నించి మదాత్మజున్ రఘువరన్ నేనిట్లు కోల్పోయితిన్
నిను బెండ్లాడి సమస్తభూమిజనము ల్నీచాత్ము డీతం డనం
గ నవేలంబగునింద వర్తిలితి గైకా సూర్యవంశంబు నీ
దునిమిత్తంబున నెన్నిభంగుల జెడెన్ దోషంబు నిన్ జూడగన్. [అయోధ్యాకాండము]
ఉ. ఉత్తములైనరాజవరు లుద్ధుర బాణకృపాణచాపముల్
హత్తి ధరించు టెల్ల సభయాత్మకులై శరణన్నవారి ను
ద్యత్తరలీల గావగ రణాంగణమం దెదిరించినట్టియు
న్మత్తరిపుప్రకాండముల మర్దనచేయగ గాదె యెన్నగన్. [అరణ్యకాండము]
ఉ. ఆచెలువంపుజొక్క పుటొయారము లాజిగిప్రాయ మాఘన
శ్రీచణరూప మాతళుకు జెక్కులచక్కదనంబు లామహా
ధీచతురత్వ మాపలుకు దేనియ లాగమనంబు లావిభా
ప్రాచురి యెక్కండం గనుట పల్కుట వింటయు లేదు రావణా. [అరణ్యకాండము]
శా. నీకున్ శత్రుడ గాను భవద్రిపులతో నే సఖ్యముం జేయ నే
జోక న్నీకపకారిగా నకట యిచ్చో జాలనిర్హేతుకం
బై కన్నట్టిరుష న్నను న్నిశితతీవ్రామోఘబాణంబుచే
వే కూల్పంగ నిమిత్త మేమి యిది దోర్వీరంబె శ్రీరాఘవా. [కిష్కిందాకాండము]
ఉ. అంగదు గాంచి యోతనయ యాత్మ వగం దురపిల్ల బోకు ని
న్నుం గడు నాదుమాఱుగ గనుంగొను నీరవిపుత్రు డిమ్మహో
త్తుంగభుజప్రతాపనిధితో నెడబాయక యుండినన్ జయా
భంగురభోగభాగ్యముల బ్రస్తుతి కెక్కి రహింతు వన్నిటన్. [కిష్కింధాకాండము]
ఉ. బంగరుమేలినిగ్గు గలపర్వతమోయన నైజగాత్ర ము
త్తుంగముగాగ బెంచి మఱితోడనె పాశము లెల్ల నూడ్చి సా
రంగపరంపరం గదుమురాజితసాహససింహమోయనన్
బొంగుచు నెంటవచ్చుదితిపుత్రుల బోవగదోలి రోషియై. [సుందరకాండము]
ఉ. రామకరాగ్రముద్రిక ధరాసుతచేతి కొసంగి రాఘవ
క్షేమము తెల్పియాజనని కేవలశోకము మాన్పి లంక వా
లామితహవ్యభుక్శిఖల నంతయు దగ్ధము చేసి సీతచూ
డామణి గొంచువచ్చితి దటాలున నిప్పు డటంచు బల్కినన్. [సుందరకాండము]
ఆంధ్ర కవుల చరిత్రము నుండి…..
———–