పేరు (ఆంగ్లం) | Atharvanaacharyudu |
పేరు (తెలుగు) | అథర్వణాచార్యుడు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1395 |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | లక్షణదీపిక |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | అథర్వణాచార్యుడు మహా భారతాన్ని తెలుగులో వ్రాసిన కవి. ఇతను వ్రాసిన మహా భారతంఇప్పుడు లభించడంలేదు, కానీ ఇతని తరువాతి కవులు ఈ గ్రంథంలోని పద్యాలను ఉదహరించడం వల్ల మనకు ఇతని రచన గురించి తెలుస్తుంది. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | అథర్వణాచార్యుడు |
సంగ్రహ నమూనా రచన | ప్రణతాశేషవసుంధరాధిప శిరస్స్రగ్గంధలుబ్ధభ్రమ త్క్వణదభ్రభ్రమకృద్ద్విరేఫగణఝంకారప్రదాబద్ధసం ప్రణవత్యుత్ప్రథిత ప్రవర్ధితసమస్తక్షత్రసూయాధ్వర క్షణసింహాసనభాసితున్ దృఢధనుశ్శ్లాఘాజనున్ ధర్మజున్ |
అథర్వణాచార్యుడు
కురుపతి రవిసుతుని సువర్ణరత్నభూషణతతుల నురక బహుమతిచే
సి రభసము మీఱ సేనల కు రాజు గావించె సమరకుశలుం డగుటన్
అను పధ్యము వల్ల కనీసం కర్ణ పర్వము వరకూ తెనిగించి ఉంటాదు అని చెప్పవచ్చు.
ఆతరిని చెలికి నిచ్చిన
రోతొడవులు తొడిగెనాసరోజదళాక్షీ
కౌతుకమున జెప్పుమని విన
బ్రీతి జనించెడిని తనదు హృదయంబునకున్
అను పధ్యము వల్ల ఆదిపర్వం నుండి మొదలుపెట్టినాడని చెప్పవచ్చు.
నయమార రాఘవుడు నావయెక్కి వడి దాతి జాహ్నవీశైవలినిన్
జయజయ యని వినువీధుల వియచ్చరులు సన్నుతింప వేడుకతోడన్.
అను పద్యము వల్ల అరణ్యపర్వాన్ని అందులోని ఉపాఖ్యాలనూ అనువదించినట్టు తెలుస్తుంది.
సుమారుగా మొత్తం భారతం తెనిగించి ఉండవచ్చు అని చెప్పవచ్చు.
దుర్యోధనుని వర్ణణ:
నతనానావనినాథయూధమకుటన్యస్తాబ్జ రాగోజ్వల
ద్ద్యుతివిభ్రాజితపాదపీఠు లలనాదోశ్చామరోద్ధూతమా
రుతలోలాళివినీలకుంతలు బ్రభారుగ్ధాము గేయూరశో
భితబాహాపరిఘున్ సువర్ణ ధరణీభృద్ధైర్యు దుర్యోధనున్
రాజసూయం చేస్తున్న ధర్మరాజు వర్ణణ:
ప్రణతాశేషవసుంధరాధిప శిరస్స్రగ్గంధలుబ్ధభ్రమ
త్క్వణదభ్రభ్రమకృద్ద్విరేఫగణఝంకారప్రదాబద్ధసం
ప్రణవత్యుత్ప్రథిత ప్రవర్ధితసమస్తక్షత్రసూయాధ్వర
క్షణసింహాసనభాసితున్ దృఢధనుశ్శ్లాఘాజనున్ ధర్మజున్
కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణసారసంగ్రహంలోని ఉదాహరణ:
పది దినము లయిదుప్రొద్దులు
పదపడి రెణ్ణాళ్ళు నొక్కపగలున్ రేయున్
గదనంబుజేసి మడిసిరి
నదిసుత గురు కర్ణ శల్య నాగ పురీశుల్
అప్పకవి ఉదాహరించిన విరాటపర్వంలోని పద్యం:
ఢాంఢమిత భేరికా ధ్వానముం ఢులీ ని
నాదమును నిన్ను ముట్ట ననారతంబు
పెక్కుగంధర్వపతులు నల్దిక్కులందు
గాచు సౌగంధికంబు దేగలరె యొరులు?
———–