సింహాద్రి వేంకటాచార్యుడు (Simhadri Venkatacharyudu)

Share
పేరు (ఆంగ్లం)Simhadri Venkatacharyudu
పేరు (తెలుగు)సింహాద్రి వేంకటాచార్యుడు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలులక్షణావివాహమను నామాంతరముగల చమత్కారమంజరి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికసింహాద్రి వేంకటాచార్యుడు
సంగ్రహ నమూనా రచనగీ. అరుణపల్లవములబోలు నాపదంబు
లాపదంబుల బోలును నలకజాత
మలకజాతముబోలు నిత్యముఖలీల
నిత్యముఖలీలబోలు నన్నెలతనడుము.

సింహాద్రి వేంకటాచార్యుడు

ఈకవి లక్షణావివాహమను నామాంతరముగల చమత్కారమంజరిని రచించెను. చమత్కారమంజరి మూడాశ్వాసముల ప్రబంధము. ఈకవి శ్రీవైష్ణవుడు; చెన్నకేశవాచార్యుల పౌత్రుడు; తిరుమలాచార్యులపుత్రుడు; గౌతమగోత్రుడు. “భధ్రాచలస్వామి రామచంద్రుడొసర నాడెందమున నిండియుండు గాత” అని భద్రాచలరామస్వామి నిష్టదైవతముగా స్తుతియించి యుండుటచేత కవి గోదావరిమండలములోని వాడని తోచుచున్నది. ఇతడు తనగ్రంధమును వైష్ణవమతోద్ధారకుడైన రామానుజాచార్యున కంకితము చేసెను.అప్పకవికి బూర్వికులయిన లాక్షణికు లెవ్వరు నీతిగ్రంధమును పేర్కోనకపోవుటన నితడు 1630-40 వ సంవత్సరప్రాంతముల యందుండెనని యూహింపదగియున్నది. అక్కడక్కడ గొన్ని వ్యాకరణదోషము లున్నను, ఈతని కవిత్వము మొత్తముమీద ప్రౌడముగానే యున్నది. చమత్కారమంజరినుండి రెండుమూడు పద్యముల నిందుదాహరించుచున్నాను.

గీ. అరుణపల్లవములబోలు నాపదంబు
లాపదంబుల బోలును నలకజాత
మలకజాతముబోలు నిత్యముఖలీల
నిత్యముఖలీలబోలు నన్నెలతనడుము.


మ. బిగువుంగుబ్బలు గాంచి మాను నలజంబీరంబు బీరంబు క్రొం
జిగిమోము ల్గని సిగ్గున న్వదలు రాజీవంబు జీవంబు విం
తగ భ్రూరేఖలుచూచి భీతి నిడు గోదండంబు దండంబు త
జ్జగతీమోహనుమ్రోల నున్న చెలులం జర్చింపగా శక్యమే. [ఆ.2]


శా. జోక న్వీడ్కొని చుక్కరేగెను జుమీ శుభ్రాంశుబింబప్రభో
త్సేకంబు ల్తఱిగెం జుమీ కడకువచ్చెం జుమ్మి యీరేము చిం
తాకాలుష్యము లేల బాల మదిలో ధైర్యం బవార్యంబుగా
గోకోయన్గతి గుక్కుటంబు లఱచెం గోకోవిరావార్భటిన్. [ఆ.3]

———–

You may also like...