అయ్యలరాజు రామభద్రుడు (Ayyalaraju Ramabhadrudu)

Share
పేరు (ఆంగ్లం)Ayyalaraju Ramabhadrudu
పేరు (తెలుగు)అయ్యలరాజు రామభద్రుడు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1515
మరణం1/1/1580
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుసకలకథాసారానుగ్రహము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుఅయ్యలరాజు రామభద్రుడు 16 వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి. ఈయన ఆంధ్ర భోజుడు,సాహితీ సమరాంగణ సార్వభౌముడు, విజయనగర సామ్రాజ్య పాలకుడు అయిన శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములోని భువనవిజయం లోని అష్ట దిగ్గజాల లో ఒకడు. ఈ విషయము పరిశోధనలో ఉంది. కానీ నిస్సంశయముగా వారికి సమకాలీనుడు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఅయ్యలరాజు రామభద్రుడు
సంగ్రహ నమూనా రచనఈ కవి వ్రాయ తలపెట్టిన/అంకితమీయ సంకల్పించిన సకల కథాసార సంగ్రహము అను గ్రంథము ముగింపకమునుపే కృష్ణదేవరాయలు మృతినొందినందున, ఆదరించుప్రభువులు లేక బీదవాడయిన రామభద్రకవి యందందు దిరిగి గుత్తియప్పలరాజు మొదలైనవారి నాశ్రయించి వారిమీద జాటుపద్యములను జెప్పుచు, గొంతకాలము జీవనముచేసి, కడపట కృష్ణదేవరాయని యల్లు డయిన రామరాజుయొక్క మేనల్లు డగు గొబ్బూరి నరసరాజువద్ద జేరి తాను తరువాత రచియించిన రామాభ్యుదయము నారాజున కంకితము చేసెను. ఈకవి గుత్తి యప్పలరాజుపయిని జెప్పిన చాటుపద్య మొకటి యిందు క్రింద బొందుపఱుచుచున్నాను-

అయ్యలరాజు రామభద్రుడు

ఈ కవి వ్రాయ తలపెట్టిన/అంకితమీయ సంకల్పించిన సకల కథాసార సంగ్రహము అను గ్రంథము ముగింపకమునుపే కృష్ణదేవరాయలు మృతినొందినందున, ఆదరించుప్రభువులు లేక బీదవాడయిన రామభద్రకవి యందందు దిరిగి గుత్తియప్పలరాజు మొదలైనవారి నాశ్రయించి వారిమీద జాటుపద్యములను జెప్పుచు, గొంతకాలము జీవనముచేసి, కడపట కృష్ణదేవరాయని యల్లు డయిన రామరాజుయొక్క మేనల్లు డగు గొబ్బూరి నరసరాజువద్ద జేరి తాను తరువాత రచియించిన రామాభ్యుదయము నారాజున కంకితము చేసెను. ఈకవి గుత్తి యప్పలరాజుపయిని జెప్పిన చాటుపద్య మొకటి యిందు క్రింద బొందుపఱుచుచున్నాను-
రాజమనోజా! విద్యా! భోజా! దీనార్థికల్పభూజా! రిపుసం
భాజా! వైభవవిజితబి డౌజా! రవితేజ! గుత్తి యప్పలరాజా!
ఈకవి చిరకాలము జీవించి బహుసంతానవంతు డయి దారిద్ర్యముచేత బాధపడినవాడు. ఈతని సంతానాధిక్యమునుబట్టి యితనిని జనులు పిల్లల రామభద్రయ్య యనియు పిలిచెడువాడుక గలదు. ఇతడు కృష్ణదేవరాయని యాస్థానకవి యన్నపేరే కాని యీతనికాల మంతయు నించుమించుగా నారాయనియనంతరముననే గడుపబడినది. ఇతడు కొంతకాలము పింగళి మారన్నకును, తరువాత రామరాజ భూషణునకును సమకాలికుడుగా నుండి కృష్ణదేవరాయల మరణానంతరమున నించుమించుగా నలుబది యేబది సంవత్సరములు బ్రదికి 1580 వ సంవత్సరప్రాంతమునందు మృతినొందెను. ఈతడు చేసినగ్రంథము రామాభ్యుదయము ముఖ్య మయినది. ఇది మిక్కిలి ప్రౌడమయిన కవితాధోరణికలదయి, పదగుంభనమునందు పాండురంగ మహాత్మ్యమును బోలి యమకానుప్రాసములను గలదిగానున్నది. ఈకవి ప్రారంభదశయందు గృష్ణదేవరాయల దర్శనార్థముగా విజయనగరము వచ్చినప్పుడూరిబయల రామరాజభూషణునిశిష్యు లొకపద్యమును గుర్వాజ్ఞానుసారముగా జెప్పబూని కుదురక యాలోచించుచున్నట్లును, వారు చలిచేత వడ్కుచు నచ్చటకు రా దటస్థించిన యీ కవికి చలిమంట వేసి కప్పుకొన బట్ట నిచ్చి యతనిచేత
సీ.మోహాపదేశ తమోముద్రితము లైన
కనుదమ్ముల హిమంబు లునుపరాదు
శ్రమబిందుతారకాగమఖిన్నకుచకోక
ముల జంద్రనామంబు దలపరాదు
శీర్యదాశావృంత శిథిలతాసులతాంత
మసియాడ వీవనల్విసరరాదు
పటుతాపపుటపాక పరిహీణతను హేమ
మింక బల్లవపుటా ర్చిడగరాదు
లలన కానంగకీలికీలాకలాప
సంతతాలీడ హృదయపాత్రాంతరాళ చ. ప్రమద మెలర్ప నుగ్రమృగబాధ హరింపగ వేటమై నర
ణ్యమునకు రా నఘం బొదవె నక్కట| ధర్మము చాలు గుక్క బ
ట్టు మనుట యెంచి విల్లబు తటుక్కున ధారుణి వైచి సారమే
యముల మరల్ప బంచె మృగయాక్రియ మాని విభుండు ఖిన్నుడై. [అ.2]

ఉ. అక్కట! కోసలక్షీతివరాత్మజ కానకకన్నముద్దులే
జక్కనిమంచిరాకొమరుజందురు డెక్కడ ? యధ్వరావనం
బెక్కడ ? దైత్యసంహరణ మెక్కడ ? ఘోరవనాంతరశ్రమం
బెక్కడ ? యెట్టు లంపుమనియె న్ముని ? నో రెటులాడె నింతకున్ ? [అ.4]

ఉ. వింధ్య మధిత్యకాకటకవిస్ఫుటపాదపపుష్ప గుచ్ఛసౌ
గంధ్యము హేమధాతుమయకల్పితసంధ్యము బద్ధమేరుసా
గంధ్యము చండకేసరనికాయనిరాకృతభద్రదంతిద
ర్పాంధ్యము గ్రుంగద్రొక్కితి మహాగుణభూషణ సత్యభాషణా. [అ.5

ఉ. చూచుటలే దశోకవని జొచ్చి యటుంజని చూచెదంగదా!
యాచపలాక్షి మజ్జినని యచ్చటనుండినయేని లెస్స లే
దా చతురాననుండు మొదలైన నుపర్వు లెఱుంగ జిచ్చులో
వై చెదగాక యీయొడలు వానరవీరులమ్రోల వైతునే ? [అ.6]
పరుషోక్తి బాధ చూడకు,
పరిణామ సుఖముచూడు, బ్రతికెద వసురే
శ్వర! మందు చేదుచూడకు, పెరిగిన
తెవులడగ జూడు పెద్దతనానన్!

———–

You may also like...