పేరు (ఆంగ్లం) | Velagapudi Venganaaryudu |
పేరు (తెలుగు) | వెలగపూడి వెంగనార్యుడు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | — |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | కృష్ణకర్ణామృతము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | వెలగపూడి వెంగనార్యుడు |
సంగ్రహ నమూనా రచన | చ. ఉదరము నింపగోరి ఖలు లుండెడితావులు చేరి వారిక ట్టెదుట నశాంక నిన్ను నటియింపగ జేసిన పాతకంబులన్ సదయత నోర్వగావలె బ్రసన్నమతిన్ ననుగన్నతల్లి శా రద యదువంశనాయకుని ప్రస్తుతి నిష్కృతి నే నొనర్చెదన్. ఆ. 2. |
వెలగపూడి వెంగనార్యుడు
ఇతడు శ్రీలీలాశుకయోగి విరచితమైన కృష్ణకర్ణామృతమును మూడాశ్వాసముల గ్రంథముగా దెనిగించెను. ఈకవి యాఱువేల నియోగిబ్రాహ్మణుడు; పెద్దనామాత్యునిపుత్రుడు. ఇతడేకాలమునం దుండినవాడో నిశ్చయముగా దెలియదుగాని యీతని కృష్ణకర్ణామృతములోని పద్యమొకటి సులక్షణసారమునం దుదాహరింపబడి యుండుటచేట నితడు 1930వ సంవత్సరమునకు బూర్వమునం దుండెనని మాత్రము తెలియును. ఈతనికవిత్వము నిర్దుష్టమయి శ్రావ్యముగా నున్నది. కృష్ణకర్ణామృతములోని పద్యములు మూటి నిందు జూపు చున్నాను –
శా. బాలు న్మంజులతాలవాలచపలాపాంగోల్లసల్లీలునిం
గాళిందీపులినాంగణప్రణయశృంగారై కఖేలున్ శుభ
శ్రీలోలుం గరుణావలోకనసుధాశీలున్ వినీలప్రభా
జాలుం గొల్చెద రామణియకరసస్వారాజ్యపాలు న్మదిన్. ఆ. 1.
చ. ఉదరము నింపగోరి ఖలు లుండెడితావులు చేరి వారిక
ట్టెదుట నశాంక నిన్ను నటియింపగ జేసిన పాతకంబులన్
సదయత నోర్వగావలె బ్రసన్నమతిన్ ననుగన్నతల్లి శా
రద యదువంశనాయకుని ప్రస్తుతి నిష్కృతి నే నొనర్చెదన్. ఆ. 2.
ఉ. చల్లనివాని నవ్వు వెదజల్లెడువాని దయారసంబు జొ
బ్బిల్లెడువాని గెంపుజిగిపెంపు చెలంగెడుమోవివాని సం
ఫుల్ల సరోజనేత్రముల బొల్చినవాని బయోధివీచికా
వేల్లి తనీలనీరదనవీనతనుద్యుతివాని గాంచెదన్. ఆ. 3.
ఆంధ్ర కవుల చరిత్రము నుండి……..
———–