లింగముగుంట రామకవి (Lingamugumta Ramakavi)

Share
పేరు (ఆంగ్లం)Lingamugumta Ramakavi
పేరు (తెలుగు)లింగముగుంట రామకవి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1620
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుచతుర్వాటికామహాత్మ్యము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికలింగముగుంట రామకవి
సంగ్రహ నమూనా రచనఈకవి చతుర్వాటికామహాత్మ్య మను నైదాశ్వాసముల స్థలపురాణమును రచియించెను. ఇతడు మత్స్యపురాణము వామనపురాణము మొదలయిన గ్రంథములను రచియించిన ట్లీతని తమ్ముడైన లింగమగుంట తిమ్మకవి తనసులక్షణసారమందు వ్రాసెను గాని యాగ్రంథములు లభింపలేదు. ఈకవి తెనాలిరామకృష్ణునితోడి సమకాలికుడు. రామకృష్ణుని గురు వైన భట్టరు చిక్కాచార్యులు తనకు గురువైనట్లు కవి యీపద్యమున వ్రాసికొని యున్నాడు –

లింగముగుంట రామకవి

ఈకవి చతుర్వాటికామహాత్మ్య మను నైదాశ్వాసముల స్థలపురాణమును రచియించెను. ఇతడు మత్స్యపురాణము వామనపురాణము మొదలయిన గ్రంథములను రచియించిన ట్లీతని తమ్ముడైన లింగమగుంట తిమ్మకవి తనసులక్షణసారమందు వ్రాసెను గాని యాగ్రంథములు లభింపలేదు. ఈకవి తెనాలిరామకృష్ణునితోడి సమకాలికుడు. రామకృష్ణుని గురు వైన భట్టరు చిక్కాచార్యులు తనకు గురువైనట్లు కవి యీపద్యమున వ్రాసికొని యున్నాడు –
క. గురురాయపట్టభద్రుని
నరిహరు శ్రీరంగనాయకాంశభవున్ భ
ట్టరు చిక్కాచార్యుని మ
ద్గురు దలచుచు నడుగులకు నతు ల్గావింతున్.
ఇతడు 1620-30 సంవత్సరప్రాంతములయం దుండినవాడు. ఈరామకవి తన చతుర్వాటికా మహాత్మ్యములో,

సీ. శ్రీవల్లభోపేంద్రదేవేంద్రజనక కశ్యపౠషిగోత్రాబ్ధిచంద్రు డగుచు
వృద్ధకుండికపొంత వెలయులింగముగుంట నేకభోగముగాగ నేలినట్టి
చెన్నయామాత్యుని శ్రీరామమంత్రినందను డన్నపకును దద్ధర్మపత్ని
కమ్మలమ్మకు సుతుడనుసంభవుండుతిమ్మనకుగాదనకు గస్వనకు బెద్ద


భవ్యభాగీరథీసతీప్రాణవిభుడు
ఘనులు బస్వన రామ లక్ష్మణులతండ్రి
మహితవిద్యుండు మత్పితామహుడు నైన
సర్వకవిసార్వభౌముని సన్నుతింతు.
తనపితామహుడును గవి యైనట్టు స్తుతించి యున్నాడు. ఇతడు యాజ్ఞవల్క్య నియోగిబ్రాహ్మణుడు; కాశ్యపగోత్రుడు; లక్ష్మయామాత్యపుత్రుడు. ఈతని కవిత్వము నిర్దుష్టమయి రసవంతముగా నున్నది. చతుర్వాటికామాహాత్మ్యములోని కొన్ని పద్యము లిందు బొందుపఱుపబడుచున్నవి-

ఉ. చీటికిమాటికిన్ సకలసీమల గ్రుమ్మరుచున్ శ్రమంబునన్
బాటిల నేల దర్శనవిపాటితకల్మషకోటికిం జతు
ర్వాటికి నేగి రామున కవశ్యము మ్రొక్కుచు ముక్తి కామినిన్
జేటిక జేయగా వలదె సిద్ధమనోరథుడై నరుం డిలన్. [ఆ.1]


మ. తలపం బూర్వభవంబునం దెచట నేదానంబు లీగంటినో
గలి కేతెంచితి రీప్సితార్థములు వీక న్మీకు నర్పించి మీ
వలనన్ దీవన లందినన్ భువనము ల్వర్ణింపవే కావునన్. [ఆ.2]


శా. ఉద్వేలప్రళయాబ్ధులో యనగ నత్యుద్రేకమానంబులై
విద్వద్వర్యుని గుంభ సంభవు మహావిర్భావధైర్యున్ మనం
బుద్విగ్నంబుగ బట్టి కట్టుటకు నిట్లొక్కుమ్మడిన్‌డాయ భా
స్వద్విఖ్యాతుల నాత్మసైన్యముల హస్తం బెత్తి మాన్చెన్వడిన్. [ఆ.3]


చ. ఇవిరె గొలంకు లాపగలు నింకుచు గాల్నడ లయ్యె వేండ్రమై
పవనము వీచె భూజములపత్రము లన్నియు నూడె జీవజం
తువులు తపించె లోకులకు దోచె విదాహము లక్క డక్కడన్
దవము జనించె శైలముల దాసె తనంతట మండువేసవిన్. [ఆ.4]


చ. వరద శరణ్య నీవు వనవాసము చేయుచు నేగుదెంచి నా
చరణము లంటి మ్రొక్కిన బ్రసన్నత గైకొని ధన్యు నిన్ను భూ
వరు డని యుంటిగాని పరవస్తు వటంచు నెఱుంగనైతి నా
యెఱుగమి సైపవే తెలియనెవ్వడ నీఘనమాయ నచ్యుతా. [ఆ.5]

ఆంధ్ర కవుల చరిత్రము నుండి……..

———–

You may also like...