పేరు (ఆంగ్లం) | Chitrakavi Anantakavi |
పేరు (తెలుగు) | చిత్రకవి అనంతకవి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | యిందుమతీపరిణయము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | చిత్రకవి అనంతకవి |
సంగ్రహ నమూనా రచన | ఇత డారువేలనియోగి. రామరాజభూషణు డొనర్చిన హరిశ్చంద్రనలోపాఖ్యానమునకు వ్యాఖ్యానము చేయుటయేకాక యీకవి యిందుమతీపరిణయ మనుప్రబంధమును రచించెను. ఇతడు 1620వ సంవత్సరప్రాంతములందు కవిగా బ్రసిద్ధికెక్కినాడు. ఇతడు చిత్రకవి పెద్దనార్యుని పుత్రుడు; భారద్వాజగోత్రుడు. ఈకవి తన్నుగూర్చి తన హరిశ్చంద్రనలోపాఖ్యానములో నిట్లు చెప్పుకొన్నాడు. |
చిత్రకవి అనంతకవి
ఇత డారువేలనియోగి. రామరాజభూషణు డొనర్చిన హరిశ్చంద్రనలోపాఖ్యానమునకు వ్యాఖ్యానము చేయుటయేకాక యీకవి యిందుమతీపరిణయ మనుప్రబంధమును రచించెను. ఇతడు 1620వ సంవత్సరప్రాంతములందు కవిగా బ్రసిద్ధికెక్కినాడు. ఇతడు చిత్రకవి పెద్దనార్యుని పుత్రుడు; భారద్వాజగోత్రుడు. ఈకవి తన్నుగూర్చి తన హరిశ్చంద్రనలోపాఖ్యానములో నిట్లు చెప్పుకొన్నాడు.
సీ. శ్రీహనుమద్వర శ్రీలబ్ధనుకవిత్వచతురుండ లక్షణసారసంగ్ర
హం బొనరించి యుద్యత్కీర్తి బ్రఖ్యాతు డగుచిత్రకవి పెద్దనార్య సుతుడ
విష్ణుచిత్తీయాదివివిధకావ్యార్థముల్ తెలిసి వక్కాణించుధీరసుతుడ
గండికోటాఖ్యదుర్గస్థలాద్యక్షుడై పృథివి వంతుకు నెక్కు పెమ్మసాని
చిన్నతిమ్మక్షమాపాలశేఖరుండు
గారవింపగ బహుమానగౌరవముగ
మనినధన్యుండ సభ్యసమ్మతగుణైక
గరిమ వెలయు ననంతాఖ్య కవివరుండ.
ఈవ్యాఖ్యానమును చేయునప్పటికి గవి యిందుమతీపరిణయమును జేయలేదు. ఇతడు చేసిన యిందుమతీపరిణయము నాకు లభించినదికాదు. కవికాశ్రయుడైన పెమ్మసాని చినతిమ్మరాజుయొక్క యన్న పెదతిమ్మరాజు 1614 వ సంవత్సరమువఱకును రాజ్యముచేసిన వేంకటపతిరాయనికి మంత్రిగా నుండెను.
ఆంధ్ర కవుల చరిత్రము నుండి……..
———–