చిత్రకవి పెద్దన్న (Chitrakavi Peddanna)

Share
పేరు (ఆంగ్లం)Chitrakavi peddanna
పేరు (తెలుగు)చిత్రకవి పెద్దన్న
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుసర్వలక్షణసారసంగ్రహమను నామాంతరముగల లక్షణసారసంగ్రహము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికచిత్రకవి పెద్దన్న
సంగ్రహ నమూనా రచనసీ. “సర్వలక్షణసారసంగ్రహం బొనరించి తనరెమితాత పెత్దనకవీంద్రు”
డని యీతని పౌత్రు డైన రమణకవియు చెప్పియున్నారు. ఈలక్షణసారసంగ్రహము నాకు లభింపకపోయినను యప్పకవీయమున గ్రహింపబడిన రెండుపద్యముల నిచ్చట ఉదాహరించుచున్నాను.

గీ. మహిమ నెక్కటివళులన మరవఱలలు
రహిని దమతమ కయి యేగు రమ్యచరిత
వనధిగంభీర సద్గుణవాసయనగ
భంజితాసురసముదాయ యాంజనేయ.

చిత్రకవి పెద్దన్న

ఇతడు పదునాఱవ శతాబ్దాంతమునం దుండినవాడు. ఇతని కొడుకైన యనంతకవి యిందుమతీ పరిణయమును, మనుమడైన రమణకవి సాంబవిలాసమును రచించిరి. ఇతడు సర్వలక్షణసారసంగ్రహమను నామాంతరముగల లక్షణసారసంగ్రహమును రచించినట్లు,

సీ. * * *లక్షణసారసంగ్ర
హం బొనరించి యుద్యత్కీర్తి బ్రఖ్యాతుడగు చిత్రకవి పెద్దనార్యసుతుడ”
అని యీతనికుమారుడైన యనంతకవియు,

సీ. “సర్వలక్షణసారసంగ్రహం బొనరించి తనరెమితాత పెత్దనకవీంద్రు”
డని యీతని పౌత్రు డైన రమణకవియు చెప్పియున్నారు. ఈలక్షణసారసంగ్రహము నాకు లభింపకపోయినను యప్పకవీయమున గ్రహింపబడిన రెండుపద్యముల నిచ్చట ఉదాహరించుచున్నాను.

గీ. మహిమ నెక్కటివళులన మరవఱలలు
రహిని దమతమ కయి యేగు రమ్యచరిత
వనధిగంభీర సద్గుణవాసయనగ
భంజితాసురసముదాయ యాంజనేయ.


చ. ఎఱుగవుగాక భోగముల కెల్లను నెచ్చెలి జవ్వనంబ యి
త్తఱి నుడివోవకుండ నుచితంబుగ జక్కవదోయి బోలి క్రి
క్కిఱిసినచిన్ని చన్ను గవ యింపెసలారంగ నాదుచిత్తమన్
వఱలుసరోవరంబున నవారణ గేళి యొనర్చు కోమలీ.

———–

You may also like...