పేరు (ఆంగ్లం) | Tarigoppula Mallana |
పేరు (తెలుగు) | తరిగొప్పుల మల్లన |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | చంద్రభాను చరిత్రము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | తరిగొప్పుల మల్లన |
సంగ్రహ నమూనా రచన | ఈకవి చంద్రభానుచరిత్ర మనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచియించెను. ఇతడు నియోగిబ్రాహ్మణుడు; దత్తాత్రేయ యోగీంద్రుని శిష్యుడు; దత్తనామాత్యుని తమ్ముడు. ఈతడు లాక్షణిక కవి; కవిత్వము రసవంతముగా నుండును. ఈకవి వసుచరిత్రమును కృతినందిన తిరుమలదేవరాయని పుత్రుడగు వేంకటపతిరాయల కాలములో నుండినట్లు చంద్రభానుచరిత్రములోని యీక్రిందియెత్తుగీతములో జెప్పినాడు – సీ. … … … … … అనుచు బుధులెన్నవలయు రాజాధిరాజ రాజపరమేశ సకలకర్ణాటకాంధ్ర రాజ్యధౌరేయ తిరుమలరాజతనయ చంద్రు డగువేంకటపతిక్షి తీంద్రమణికి. |
తరిగొప్పుల మల్లన
ఈకవి చంద్రభానుచరిత్ర మనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచియించెను. ఇతడు నియోగిబ్రాహ్మణుడు; దత్తాత్రేయ యోగీంద్రుని శిష్యుడు; దత్తనామాత్యుని తమ్ముడు. ఈతడు లాక్షణిక కవి; కవిత్వము రసవంతముగా నుండును. ఈకవి వసుచరిత్రమును కృతినందిన తిరుమలదేవరాయని పుత్రుడగు వేంకటపతిరాయల కాలములో నుండినట్లు చంద్రభానుచరిత్రములోని యీక్రిందియెత్తుగీతములో జెప్పినాడు –
సీ. … … … … …
అనుచు బుధులెన్నవలయు రాజాధిరాజ
రాజపరమేశ సకలకర్ణాటకాంధ్ర
రాజ్యధౌరేయ తిరుమలరాజతనయ
చంద్రు డగువేంకటపతిక్షి తీంద్రమణికి.
ఈవేంకటపతిరాయలు 1585 వ సంవత్సరము మొదలుకొని 1614 వ వఱకును రాజ్యముచేసినవా డయినందున, కవియు నాకాలమునం దుండినవాడే. తాలికోట యుద్ధమయినతరువాత తండ్రియైన తిరుమలదేవరాయడు తనరాజధానిని విజయనగరమునుండి పెనుగొండకు మార్చుకొన్నట్లే కొమారుడైన యీవేంకటపతిరాయడును తనరాజధానిని పెనుగొండనుండి చంద్రగిరికి మార్చుకొనెను. ఈకవి కవితా రచనను సూచించెడుపద్యములను రెంటిమూటి నిందు బొందుపఱుచు చున్నాను-
ఉ. అంత దిగంతదంతురల తాంతనిశాంతని తాంతకాంతవ
న్యంతిక తాంతపాంధజనతాంతరసంతతకృంతనప్రధా త్యంతసమంతవిస్ఫుర దుదంత పరంతపకాంతిసంతతి
క్రాంతదురంతకుంతరతికాంతము పొల్చె వసంత మెంతయున్. [ఆ.3]
ఉ. తత్తఱపాటుతోడ గనుదమ్ములడాలు దిగంతరంబులన్
జిత్తరు నింప లే బయిటచేల కుచంబులపొంత జాఱ నా
బిత్తరి మ్రానుపాటొదవ బిమ్మటితో నొకకొంత గొంకి లో
జిత్తము మట్టుపెట్టుకొని చేరి సహోదరుదండ నిల్వగన్. [ఆ.4]
ఉ. ధరణితలేంద్రనందనవిధంబున గనుంగొన గోరి మున్ను కి
న్నరవరు డిచ్చినట్టి భువనస్తుతమైనయదృశ్యవిద్య న
య్యిరువురు గుప్తమూర్తు లయి యిందుసహోదరమందిరంబునన్
దరలక యుండి రట్టియెడ దన్వియు జేరగ వచ్చి యచ్చటన్. [ఆ.5]
ఆంధ్ర కవుల చరిత్రము నుండి…..
———–