Share
పేరు (ఆంగ్లం)Mallareddy
పేరు (తెలుగు)మల్లారెడ్డి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుషట్చక్రవర్తులచరిత్ర మను నెనిమిదాశ్వాసముల పురాతనగ్రంథము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమల్లారెడ్డి
సంగ్రహ నమూనా రచనఇతడు రచియించిన షట్చక్రవర్తులచరిత్ర మను నెనిమిదాశ్వాసముల పురాతనగ్రంథ మొకటి నాయొద్దనున్నది. దీనిని తాలపత్రముల మీద వ్రాసినవా రేహేతువుచేతనో కృత్యాదిపద్యములను వదలివేసి షష్ఠ్యంతములు మొదలుకొని వ్రాసియున్నారు. ఈపుస్తకమునందలి యాశ్వాసాంతగద్య మిట్లున్నది.
“ఇది శ్రీమద్బిక్కనవోలిపట్టణ ప్రసిద్ధ సర స్తటావలంబ సిద్ధరా మేశ్వర వరప్రసాద సమాసాదిత సంస్కృ తాంధ్రభాషాకవి రతాసపోషణ విశేషతా చమత్కార గురుభక్తివిహార రాచుళ్ల గోత్ర పవిత్ర కాచభూపాలపుత్ర బుధవిధేయ మల్లారెడ్డి నామ
ధేయ ప్రణీతంబైన షట్చక్రవర్తి చరిత్రంబను మహాప్రబంధంబు నందు___ఆశ్వాసము.”

మల్లారెడ్డి

ఇతడు రచియించిన షట్చక్రవర్తులచరిత్ర మను నెనిమిదాశ్వాసముల పురాతనగ్రంథ మొకటి నాయొద్దనున్నది. దీనిని తాలపత్రముల మీద వ్రాసినవా రేహేతువుచేతనో కృత్యాదిపద్యములను వదలివేసి షష్ఠ్యంతములు మొదలుకొని వ్రాసియున్నారు. ఈపుస్తకమునందలి యాశ్వాసాంతగద్య మిట్లున్నది.
“ఇది శ్రీమద్బిక్కనవోలిపట్టణ ప్రసిద్ధ సర స్తటావలంబ సిద్ధరా మేశ్వర వరప్రసాద సమాసాదిత సంస్కృ తాంధ్రభాషాకవి రతాసపోషణ విశేషతా చమత్కార గురుభక్తివిహార రాచుళ్ల గోత్ర పవిత్ర కాచభూపాలపుత్ర బుధవిధేయ మల్లారెడ్డి నామ
ధేయ ప్రణీతంబైన షట్చక్రవర్తి చరిత్రంబను మహాప్రబంధంబు నందు___ఆశ్వాసము.”
ఈమల్లారెడ్డి యిభరా మని మనపుస్తకములలో జెప్పబడిన యిబ్రహీము గోలకొండ నవాబుగా నున్నకాలములో నుండి యొకసారి యాతని యాస్థానమునకు దనయాస్థానకవీశ్వరుని తోడగూడ బోయినప్పుడు, చ. బలరిపుభోగ కాచనరపాలునిపెద్దకుమార మల్ల నీ
కలితయశ;ప్రభావములు కన్గొనలే కలకట్టు మన్నెమూ
కలు తల లొల్లరో బిరుదుగద్దియము ల్చదివించుకొందురౌ
కొలది యెఱుంగ జాల కలకుక్కలు చుక్కలజూచి కూయవే.

అను పద్యమును దనకవిచేత చదివించుకొనగా రాజులందఱును గోపించి యుద్ధ సన్నద్ధులయియున్నప్పుడు మల్కిభరాము వారివారించి ప్రశాంతులను జేసెనని యీవఱకే గంగాధర కవి చరిత్రమునందు వ్రాసియున్నాను. దీనినిబట్టి యీకవి యిబ్రహీము కాలములో నున్నట్లు తెలియవచ్చుచున్నది. ఇబ్రహీము క్రీస్తుశకము 1550 వ సంవత్సరము మొదలుకొని 1581 వ సంవత్సరము వఱకును గోలకొండరాజ్యమును పాలించెను. “కుమారమల్ల” యని పయిపద్యములో జెప్పబడి యుండుటచేత మల్లారెడ్డి యిబ్రహీముకాలములో కౌమారదశ యందుండి 1600 వ సంవత్సర ప్రాంతముల వఱకును జీవించియున్న ట్లూహించవలసియున్నది. ఈమల్లారెడ్డి కాపుకులజుడు; కాచరాజపుత్రుడు; గోదావరిమండలములోని బిక్కనవోలుసంస్థానప్రభువు. ఇతడు రాజమహేంద్రవరమును పాలించిన వీరభద్రరెడ్డి మొదలైన రెడ్లసంబంధుడని తోచుచున్నది. ఈతనికవిత్వము రసవంత మయి సలక్షణముగా నున్నది. ఈతని షట్చక్రవర్తిచరిత్రమునుండి కొన్ని పద్యముల నిందుదాహరించుచున్నాను-

సీ. గోపుర గోపుర గోపురప్రతిమంబు
కల్పద్రు కల్పద్రుగౌరవంబు
మానవ మానవ మానవాభిశయంబు
మణిజాల మణిజాలమంజిమంబు
సారంగ సారంగ సారంగనయనంబు
సుమనోబ్జ సుమనోబ్జశోభితంబు బహుధామ బహుధామ బహుధామచిత్రంబు
ఘనసార ఘనసారగంధిలంబు
భవ్యకాసార కాసారబంధురంబు
జవనసైంధవ సైంధవసంకులంబు
బహుళకేతన కేతనభస్థలంబు

నై విజృంభించె సిరి నయోధ్యాపురంబు. [ఆ.1]
ఉ. రాజవు నీవు సద్గతి తెఱంగు లెఱింగి బుధానురాగివై
యాజరుచిం జెలంగి సముదంచితవిష్ణుపదానువర్తి వి
భ్రాజితసత్కళానిధివి రశ్మి యొకానొకవేళ నిండినన్

హా జనపాలకా కువలయం బడలన్ గృశియించు టొప్పునే. [ఆ.3]
చ. అతను వియోగతాపము నిజాంగమునం దగ నిండియుండగా
నతివ సతృష్ణయై నలకథామృత మెంతయు గ్రోలె నందునన్
మిత మెడల న్వెసన్ జ్వరము మించె నటంచును దత్సఖీభిష
గ్వితతులు దానికిం దగుచికిత్సలు చేయ దొడంగి రత్తఱిన్. [ఆ.4]

సీ. గోరక్షణము చేయుశౌరి యుండుట జేసి
గోరక్షణము చేయుకోర్కె మెఱసె
బుధులబ్రోచెడు చతుర్భుజు డుందుటనుజేసి
బుధుల బ్రోచుచునుండు బుద్ధిమించె
సత్యానురక్తు డౌచక్రి యుండుట జేసి
సత్యానురక్తుడై చాల నెలసె
బలభద్రయుతుడు శ్రీపతి యుండుటనుజేసి
బలభద్రయుక్తుడ్తె ప్రజ్ఞ మీఱె
నొడల బురుషోత్తముడు పూనియుంట జేసి
తాను బురుషోత్తముం డన ధాత్రి నొప్పె భవ్యలక్ష్మీవిలాసవిభ్రమము లలరు
చక్రధరమూర్తి పురుకుత్సచక్రవర్తి. [ఆ.6]

చ. ఘనములదర్పణంబు లిభకర్ణతలాగ్రము లెండమావు ల
వ్వనధితరంగము ల్సిరులు, వాయువుముందఱ నిడ్డదీపముల్
వనములబుద్బుదంబులు జలంబులపై లిఖియించువర్ణముల్

తనువులు, రాకుమార పరితాపము వల్వదు నీమనంబునన్. [ఆ.7]
చ. సరసుల దేలి పుష్పవనసంతతిపై గడువ్రాలి సుప్తబం
భరముల దోలి చారుశుకపంక్తుల నేలి ప్రసూనగంధ మా
దరమున గ్రోలి పుష్పితలతాతరు లెక్కుచు పోలి మెల్లగా

జరగగజొచ్చె దక్షిణపు జల్లనిగాలి వయాళిపెంపునన్. [ఆ.8]

ఆంధ్ర కవుల చరిత్రము నుండి…

———–

You may also like...