మొక్కపాటి నరసింహశాస్త్రి (Mokkapati Narasimha Sastry)

Share
పేరు (ఆంగ్లం)Mokkapati Narasimha Sastry
పేరు (తెలుగు)మొక్కపాటి నరసింహశాస్త్రి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1892
మరణం1973
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుబారిష్టర్ పార్వతీశం, మొక్కపాటి నరసింహశాస్త్రి కథలు
హరివినోదము, మమైక దైవసంప్రార్ధనము, శతథా, కందకుక్షి, ద్విపదలాక్ష
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుమొక్కపాటి నరసింహశాస్త్రి సుప్రసిద్ధ తెలుగు హాస్య రచయిత. 1925 లో ప్రచురితమైన ఇతని బారిష్టర్ పార్వతీశం అన్న నవల తెలుగు హాస్య రచనలలో మరువలేని స్థానాన్ని పొందింది. బారిష్టర్ పార్వతీశం హాస్యానికి పెట్టింది పేరు. ఈ నవల మూడు భాగాలుగా వెలువడింది. ఇందులో మొదటి భాగం అప్పటి నర్సాపురం ప్రాంతం యొక్క సామాజిక స్ధితిగతులను హాస్యరీతిలో తెలియచెప్పుతుంది.
ఇది పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణం, అతని అమాయకత్వం అయోమయం మొదలైనవాటితో వున్న గొప్ప హాస్య రచన. పిఠాపురం ఆస్థానంలో దివానుగా ప్రసిద్ధులైన మొక్కపాటి సుబ్బారాయుడు వీరి సహోదరుడు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికబారిష్టరు పార్వతీశం-మొదటి భాగము
సంగ్రహ నమూనా రచన

బారిష్టరు పార్వతీశం-మొదటి భాగము
పార్వతీశం పుట్టు పూర్వోత్తరాలు
పార్వతీశం పుస్తకం చదివిన వాళ్ళు చాలామంది, “ఈ ఆసామి ఎవరండీ” అనో “ఎవరి మీద రాశారండి” అనో “అసలిలా ఇలా రాయాలని మీకు ఎలా తోచిందండి” అనో, నన్ను తరచూ అడుగుతూ ఉండడం కద్దు. అలాగే ఆ మధ్య రేడియో వారు కూడా “వాడి అనగా పార్వతీశం పుట్టు పూర్వోత్తరాలు ఏమిటో, నాలుగు ముక్కలు చెప్పండి” అన్నారు. వారికి చెప్పిన సమాధానాలు, దరిమిలా నన్ను ప్రశ్నించే వారందరికీ నేను తరచూ చెప్పిన సమాధానాల సారాంశం, ఈ క్రింది సమాచారం.

దేనికైనా పెట్టి పుట్టలంటారు మనవాళ్ళు; లేదా ముఖాన్ని రాసి ఉండాలంటారు. ఒక్కొక్క ముఖం చుస్తే ముద్దు పెట్టుకో బుద్ధి పుడుతుంది. అన్నప్పుడూ అందరికీ అది సాధ్యము కాకపోయినా మరో మాట ఆ ముఖం చూడాలనీ, ఆ ముఖం వారిని పరిచయం చేసుకోవాలనీ అనిపిస్తుంది. కొన్ని ముఖాలు చూస్తే మొత్తబుద్ధి పుడుతుంది, జన్మలో ఆ ముఖం కనబడకుండా వుంటే బాగుండుననిపిస్తుంది. అలాగే కొందరి పేరు వినగానే ఆయన పుట్టు పూర్వోత్తరాలేమిటో తెలుసుకోవాలెనని కుతూహలం కలుగుతుంది. అలంటి అదృష్టవంతుడు మా పార్వతీశం

ఆడియోhttps://archive.org/details/BarishtarParvateesam1,
https://archive.org/details/BarishtarParvateesam2,
https://archive.org/details/BarishtarParvateesam3,
https://archive.org/details/BarishtarParvateesam4

బారిష్టరు పార్వతీశం

మొదటి భాగము
పార్వతీశం పుట్టు పూర్వోత్తరాలు

          పార్వతీశం పుస్తకం చదివిన వాళ్ళు చాలామంది, “ ఆసామి ఎవరండీఅనోఎవరి మీద రాశారండిఅనోఅసలిలా ఇలా రాయాలని మీకు ఎలా తోచిందండిఅనో, నన్ను తరచూ అడుగుతూ ఉండడం కద్దు. అలాగే మధ్య రేడియో వారు కూడావాడి అనగా పార్వతీశం పుట్టు పూర్వోత్తరాలు ఏమిటో, నాలుగు ముక్కలు చెప్పండిఅన్నారు. వారికి చెప్పిన సమాధానాలు, దరిమిలా నన్ను ప్రశ్నించే వారందరికీ నేను తరచూ చెప్పిన సమాధానాల సారాంశం, క్రింది సమాచారం.

          దేనికైనా పెట్టి పుట్టలంటారు మనవాళ్ళు; లేదా ముఖాన్ని రాసి ఉండాలంటారు. ఒక్కొక్క ముఖం చుస్తే ముద్దు పెట్టుకో బుద్ధి పుడుతుంది. అన్నప్పుడూ అందరికీ అది సాధ్యము కాకపోయినా మరో మాట ముఖం చూడాలనీ, ముఖం వారిని పరిచయం చేసుకోవాలనీ అనిపిస్తుంది. కొన్ని ముఖాలు చూస్తే మొత్తబుద్ధి పుడుతుంది, జన్మలో ముఖం కనబడకుండా వుంటే బాగుండుననిపిస్తుంది. అలాగే కొందరి పేరు వినగానే ఆయన పుట్టు పూర్వోత్తరాలేమిటో తెలుసుకోవాలెనని కుతూహలం కలుగుతుంది. అలంటి అదృష్టవంతుడు మా పార్వతీశం. అతని ముఖారవిందం, అందలి వికాసం అతని జన్మ నక్షత్రఫలం, అదంతాను. లేకపోతే ఎందరికో అతని పేరు తెలియడమేమి? నా పేరు తెలియకపోవడమేమి?అతని పరిచయం కోసం, అతని సంగతి తెలుసుకోవడం కోసం, అందరూ కుతూహలపడడం; కుతూహలమే కాదు తహతహలాడడం, ఎందుకు? మా వాడి పేరు తెలిసిన వాళ్ళలో శతాంశానికేనా నా పేరు తెలయక పోవడమేమి? ఒక్కరూ నన్ను తెలిసిన వాళ్ళలో నీ సంగతి సందర్భాలు, పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి బాబు అని ఒక్కరూ అడగరేమి? ఇది నకు కొంచెం బాధగానే వుంటుంది. అప్పుడప్పుడూ ముఖ్యంగా నా స్నేహితులెవరేనా వారి స్నేహితులకో, లేక ఏదన్నా సభలోనో నన్ను పరిచయము చేసేటప్పుడు వీరు ఫలానా నరసింహశాస్త్ర్తిగారు అంటే, అయితే ఏమంటావు అనే ప్రశ్నార్థక ముఖాలు చూడడం. వెంటనేవారు పార్వతీశం సృష్టికర్తఅనగానే, ఓహో అలా చెప్పండిఅయితే కొంతవరకూ ఈయన్ని సహించ వచ్చుననే తృప్తి వారిలో కనపడడం చూచినప్పుడు కొంచెం కష్టంగా వుండే మాట వాస్తవమేపుత్రాధిచ్చేద్ పరాజయం అంటారు కాని, ఏమో చెప్పలేను. పరాజయాన్ని ఎంత పుత్రునివల్లనైనా అంగీకరించడం కూడా గొప్పేనంటాను. నా మట్టుకు నేను గొప్పవాడినని కాదుగానినా పేరు ఎవ్వరూ ఎరక్కపోయినా ఇదే బాగుందని నా మనస్సుకి సమాధానం చాలాకాలం క్రితమే చెప్పుకున్నాను. నా అహమికకు స్వస్తి చెప్పాను. మైనారిటీ వెళ్ళని వాడికింద లెక్క వేసుకున్నాను నా మట్టుకు నేను. ఏమంటే పెద్దవాళ్ళంతా నన్ను సుబ్బారాయుడి గారి తమ్ముడు అంటారు. మరోచోట  శివశాస్త్రిగారి వియ్యంకులనీ, తీర్థులు గారి మామగారని, అనిపించుకోవడం బాగా అలవాటయింది. అందుచేతను ఎవరైనా ఈయన పార్వతీశం రచయిత అనగానే అవతలవాడు పెద్ద నవ్వు నవ్వి, “అలాగటండీ! అలా చెప్పండి?” అలా చెప్పండి అని పైకి, అందుకనే ఆయన మొహం అలా వుందని లోపల, అనుకుంటున్నాడని  తెలిసినా నాకేమీ యిబ్బంది కలగడం లేదు. అంతే కాదు; సంతోషంగా వుంటుంది. మధ్యను. ఎందుచేతనంటే యేనకేనాప్యుపాయేనా, నలుగురి నోళ్ళాపడడం, నలుగురి చేతా నాలుగు అనిపించుకోడం, మంచిదే అనుకోండి. సంతోషించతగ్గ విషయం. గర్వించదగ్గ విషయం అని చాలామంది అభిప్రాయం

          సరే నా మాటెవరికి కావాలి! పార్వతీశం సంగతి కదా మీకు కావలసింది. అతని పుట్టు పూర్వోత్తరాలు నేను మట్టుకు ఏమి చెప్పను. అతను చెప్పుకున్న దాని కంటే, అతను అయోనిజుడు, స్వయంభువు బ్రహ్మ మానసపుత్రుల జాతిలోని వాడు

          పార్వతీశం తన నివాసం మొగలితుర్రు అని వ్రాసుకున్నా యదార్థం చేతను అతని పుట్టుక మాత్రం నర్సాపురం తాలూకా గుమ్మలూర్లు అనే గ్రామంలో మనలో మనమాట ఊరులో పార్వతీశం ఎందుకు పుట్టవలసి వచ్చింది అంటే, అది మా అత్తవారి ఊరు, అందుచేతను నాకు వూరు అంటే అభిమానం ఎక్కువ.

          ఆ రోజులలో అక్కడకు ప్రయాణం ఏంతో కష్టంగా వుండేది. ఊరికి ఎటువైపునా రోడ్డు లేదు. మట్టిరోడ్డు కుడా సరిగా వుండేది కాదు. వర్షం కురిస్తే బాటసారుల పాట్లు పరమేశ్వరుని కెరుక, అయినా నాకక్కడకు వెళ్ళడం సరదాగా వుండేది.

          ఒకసారి దీపావళికి మంచి వర్షాలు పడుతున్న రోజులలో, పడుతూ లేస్తూ ఒక్కడుగు ముందుకి వేయబోతే రెండడుగులు ముందుకి జారుతూ నానయతనా పడి, గుమ్మలూరు చేరుకున్నాను. అప్పుడు మమూలుగా మా బావమరుదులూ, మరదళ్ళు పక్కింటి వారబ్బాయి మొదలైన వాళ్ళంతా నా చుట్టూ చేరారు. వీళ్ళంతా నన్నొక నాయకుణ్ణి చూసినట్లు భక్తిభావంతో చూస్తుండేవారు. ఉబుసుపోకకు, వాళ్ళకు కబురూ, కబురూ చెప్పడంలో ఆనాటి పడవ ప్రయాణంలో వుండే కష్టాలూ, తమాషాలూ, అనుభవాలు కొన్ని చెప్పుకొచ్చాను. వాళ్లు చాలా సంతోషించారు. వాళ్ళంతా నన్ను ఏకాగ్రీవంగా అదో కథలా వ్రాయమన్నారు. నాకప్పటికి పుస్తకం రాద్దామని సంకల్పం ఎంతమాత్రమూలేదు. సరికదా వ్రాయగలననే ధైర్యం కూడా సుతరామూ లేదు. నేనప్పటికి వ్రాసినదల్లా మూడుకథలు మాత్రమే. “పిలక”, “నేను మా ఆవిడఅనేవి సాహితిలోనూ, లక్ష్మి భారతి పత్రికలోనూ తరువాత అచ్చుపడ్డాయి. సాహిత్యరంగంలో అతిచౌకగా ఖ్యాతి సంపాదించిన వాళ్లలో అగ్రగణ్యుడను నేను. పిలక, లక్ష్మి అనేవి రెండూ చాలామంది దృష్టిని ఆకర్షించాయి, చాలామంది అభిమానాన్ని పొందానాయి. కాని నాకు తెలుసు కనుకను ఇకముందు మనమేమీ వ్రాయకుండా వుంటే మర్యాదగా వుంటుంది అనుకుంటూ  వుండగా సమావేశం తటస్థమయింది. “బాలవాక్యం బ్రహ్మవాక్యంఅన్నారు పెద్దలు. మా కుర్రాళ్లు అడగగానే యెందుకో నాకూ వ్రాయవలెనని ఉత్సాహం కలిగింది. కాగితం మిద శ్రీరామ చుట్టి ప్రారంభించి, ఒక కుర్రవానిని నర్సాపురం నుంచి నిడదవోలు దాకా తీసుకువెళ్ళాను అక్కడ వానిని ఏమి చేయాలో తోచక మద్రాసు తీసుకువెళ్లాను. అప్పటికి కుర్రవానికి నామకరణం చెయ్యలేదు. ఇంగ్లండు పంపిద్దామని అనుకోనూ లేదు. వ్రాసినంతవరకు మా కుర్రవాళ్ళకు వినిపించాను. వాళ్ళు చాలా బాగుందని ఎకగ్రీవంగా నాకు సర్టిఫికెట్ ఇచ్చారు. కుర్రవాళ్ళ సతోషం నాకెంతో ఉత్సాహం కలిగించింది. కుర్రవాడు మద్రాసులో వుండిపోయాడే, వాడిని మళ్ళా యిల్లు చేర్చవద్దా అనుకున్నాను. కథకు ఆది మధ్యాంతాలు సరిగా వుంటేనే కాని నాకు తృప్తిగా వుండదు. అందుచేతను కుర్రవాని సంగతి తేల్చక తప్పింది కాదు. అప్పుడు హటాత్తుగా తోచింది. ఇలాంటివాడిని దేశాంతరాలకు  తీసుకువెడితే యెలా వుంటుందా అని, చాల తమాషాగా వుంటుందనిపించింది, సరే యెంత ఖర్చయినా, యెంత శ్రమయినా వీడిని ఇంగ్లండు పంపించవలసిందే ననుకున్నాను. రోజుల్లో ఇంగ్లండు వెళ్లడమన్నా బారిష్టరు చదవదమన్నా చాల గొప్ప.

          ఈ కుర్రవాడి భవిష్యత్తు ఎప్పుడైతే నిశ్చయయిందో, తక్షణం అతని జన్మస్థానం పేరూ, ఇంటిపేరూ, చదువు వగైరా అవసరమైన పూర్వరంగం వ్రాశాను. అంతవరకే నా బాధ్యత తరువాత కథంతా పార్వతీశమే చెప్పుకుపోయాడు. మన పురాణకర్తలు  సూతుడు, శౌనకాది మహామునుల కిట్లనియె; అనో దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె, అనో కథ అందుకునేవారు. అప్పుడు దానంతటది కొంతదూరం సాగిపోయేది. డబ్ల్యు.డబ్ల్యు జేకబ్స్ అనే సుప్రసిద్ధ ఆంగ్ల హాస్య రచయిత వుండేవాడు. ఆటను నౌకా జీవితం యెన్ని రకాలుగానో, యెంతో హాస్యజనకంగానో, వర్ణిస్తూ అనేక కథలు వ్రాశాడు. అతని కథలన్నీ దినైట్ వాచ్ మెన్ డెక్ మీద కూర్చుని ఇలా అన్నాడు, అని ప్రారంభిస్తేగాని అతనికి కథ నడిచేదికాదట

———–

You may also like...