పేరు (ఆంగ్లం) | Kota Sivaramayya |
పేరు (తెలుగు) | కోట శివరామయ్య |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | సానందోపాఖ్యాన మను నాలుగాశ్వాసముల పద్యకావ్యము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కోట శివరామయ్య |
సంగ్రహ నమూనా రచన | ఈ గ్రంథము నందలి రెండు మూడు పద్యముల నిందుదాహరించుచున్నాను – ఉ. గారెలు బూరె లిడ్డెనలు గమ్మనిదోసెలు జక్కిలంబులున్ జారులు గూరలున్ ఫలరసంబులు దేనెలు బానకంబులున్ సారెలు బాయసాన్నములు జక్కెర లప్పడంబులున్ బేరిననేతులుం జెఱకుబిళ్ళలు జల్లనినీరుమజ్జిగల్. [ఆ.1] ఉ. పాపము చేయవల్దనుచు బల్మఱు బెద్దలు చెప్పిన న్మహా కోపముమీఱ వారియెడ గుత్తుకబంటివిషంబు గ్రక్కుచున్ బాపము గీప మేడది నెపం బిడి జీవము దాటిపోయి యే దాపున నెందు బోవునొ నిదాన మెఱుంగ రివేటిబోధనల్. [ఆ.2] |
కోట శివరామయ్య
ఈకవి సానందోపాఖ్యాన మను నాలుగాశ్వాసముల పద్యకావ్యమును రచించెను. ఇతడు శూద్రుడు; కౌశికగోత్రుడు; కోట బాపనయ్య పుత్రుడు; కాళహస్తిపుర నివాసుడు. ఇతడు తాను కృష్ణదేవరాయలకాలములో నున్నధూర్జటికవి శిష్యుడ నని గ్రంథములో జెప్పుకొని యుండుటచేత 1525 – 1550 వ సంవత్సరములకు మధ్యనుండియుండును. సానందొపాఖ్యానమునందు లక్షణవిరుద్ధము లైన ప్రయోగములు కొన్ని కానబడుచున్నవి. కవిత్వము మృదువుగానే యున్నది. ఈ గ్రంథము నందలి రెండు మూడు పద్యముల నిందుదాహరించుచున్నాను –
ఉ. గారెలు బూరె లిడ్డెనలు గమ్మనిదోసెలు జక్కిలంబులున్
జారులు గూరలున్ ఫలరసంబులు దేనెలు బానకంబులున్
సారెలు బాయసాన్నములు జక్కెర లప్పడంబులున్
బేరిననేతులుం జెఱకుబిళ్ళలు జల్లనినీరుమజ్జిగల్. [ఆ.1]
ఉ. పాపము చేయవల్దనుచు బల్మఱు బెద్దలు చెప్పిన న్మహా
కోపముమీఱ వారియెడ గుత్తుకబంటివిషంబు గ్రక్కుచున్
బాపము గీప మేడది నెపం బిడి జీవము దాటిపోయి యే
దాపున నెందు బోవునొ నిదాన మెఱుంగ రివేటిబోధనల్. [ఆ.2]
మ. జమువెంటం బురవీధులం జనుచు భాస్వత్పట్టణశ్రీవినో
దము లీక్షింపుచు జూడ జూడ మఱియుం దండోపతండంబులై
భ్రమ కల్పించుపురీవిశేషములకుం బ్రాజ్యాద్భుతానీతుడై
యమునిం గన్గొని పల్కె సంయమి మరందానందసాంద్రోకులన్. [ఆ.3]
ఆంధ్ర కవుల చరిత్రము నుండి…
———–