పిడుపర్తి బసవకవి (Piduparti Basavakavi)

Share
పేరు (ఆంగ్లం)PiPiduparti Basavakavi
పేరు (తెలుగు)పిడుపర్తి బసవకవి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరుపాలనార్యుడు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుబసవపురాణమను పద్య కావ్యము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికపిడుపర్తి బసవకవి
సంగ్రహ నమూనా రచనపిడుపర్తి బసవకవియొక్క కవనవిధము తెలియుటకై ప్రభులింగలీలనుండి రెండుమూడు పద్యముల నుదాహరించు చున్నాను.- ఉ. ఊరును నిల్లు బల్లియలు నొల్లక సల్లలితాంతరంగులై
ఘోరతరాటవిన్ ఘననికుంజములన్ సెలయేళ్ళ చెంత శృం
గారవంబులన్ భయదగహ్వరసీమ దపంబు జేసి పెం
పారుమహామునీశ్వరులయాత్మలు దత్తఱ మందె నత్తఱిన్. [ఆ.1]

పిడుపర్తి బసవకవి

ఇతడు శైవబ్రాహ్మణుడు. బసవపురాణమును పద్య కావ్యముగా రచియించిన సోమనాధుని తమ్ముడయిన పాలనార్యుని పుత్రుడు. కాబట్టి యీకవియు నించుమించుగా సోమనాధుని కాలమునందే యున్నవా డగుటచేత 1520 -వ సంవత్సర ప్రాంతమునం దున్నవాడని చెప్పవచ్చును. ఇతడు పాల్కురికి సోమనాథుడు రచియించిన ప్రభు లింగలీలను తెనుగున నైదాశ్వాసముల పద్యకావ్యముగా రచించెను. ఈ బ్రభు లింగలీలయందు బసవేశ్వరునికిని బసవేశ్వరుని మేనల్లుడయిన చెన్న బసవన్నకును గురువయిన యల్లమప్రభుడను జంగమదేవరయొక్క కథ చెప్పబడియున్నది. పిడుపర్తి బసవకవియొక్క కవనవిధము తెలియుటకై ప్రభులింగలీలనుండి రెండుమూడు పద్యముల నుదాహరించు చున్నాను.- ఉ. ఊరును నిల్లు బల్లియలు నొల్లక సల్లలితాంతరంగులై
ఘోరతరాటవిన్ ఘననికుంజములన్ సెలయేళ్ళ చెంత శృం
గారవంబులన్ భయదగహ్వరసీమ దపంబు జేసి పెం
పారుమహామునీశ్వరులయాత్మలు దత్తఱ మందె నత్తఱిన్. [ఆ.1]


ఉ. చిత్తసరోజ మిష్టమున జేరిచి చూపులు ప్రాణలింగమున్
హత్తగ జేసి భావమున కంచితతృప్తి యొసంగి సంగముల్
రిత్తలు చేసి యెందును జరింపగ నేరిచి తేని నీవ య
త్యుత్తమలింగమూర్తి వివి యొప్పుగ జేకొను సిద్ధరామనా. [ఆ.3]


మ. బసవయ్యా భవదీయమందిరమునన్ భక్తిన్ సదాభోజనం
బసలారంగ నొనర్చుజంగమము లాత్యాసక్తి నాకటించే
విసునంగా నికనేల తామసము ఠీవిన్ వారి దోడ్తెచ్చి మీ
రసమానస్థితి నారగింప గదరయ్యా హాయిగా నేటికిన్. [ఆ.5]

ఆంధ్ర కవుల చరిత్రము నుండి…

———–

You may also like...