అల్లసాని పెద్దన్న (Allasani Peddanna)

Share
పేరు (ఆంగ్లం)Allasani Peddanna
పేరు (తెలుగు)అల్లసాని పెద్దన్న
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీశాలివాహనశకము 1430
మరణం
పుట్టిన ఊరుబళ్లారి లోని దోరాల గ్రామము
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుమనుచరిత్రము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుఆంధ్ర కవితా పితామహుడు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఅల్లసాని పెద్దన్న
సంగ్రహ నమూనా రచనఅల్లసాని పెద్దనార్యుడు నందవరీక నియోగిబ్రాహ్మణుడు; చొక్కనామాత్యుని పుత్రుడు; బళ్లారి ప్రాంతములయందున్న దూపాడు పరగణాలోని దొరాలగ్రామ మీతని జన్మస్థలము; కృష్ణదేవరాయల యాస్థానకవీశ్వరులలోనెల్ల నితడు ముఖ్యుడు. ఈతడు కృష్ణదేవరాయల యనంతరముగూడ కొంతకాలము జీవించుయుండుటచేత, ఇంచుమించుగా 1535 వ సంవత్సరము వరకును బ్రతికియుండెనని చెప్పవచ్చును. కృష్ణదేవరాయలు మృతి నొందిన తరువాత నీతడు చెప్పిన జాలిని పుట్టించెడి యీక్రింది పద్యమీతడు రాయలయనంతరమున జీవించియున్నట్టు తెలుపుచున్నది-

సీ. ఎదురైనచో దన మదకరీంద్రము డిగ్గి
కే లూత యొసగి యెక్కించుకొనియె
మనుచరిత్రం బందుకొనువేళ బుర మేగ
బల్లకి తనకేల బట్టియెత్తె
బిరుదైన కవిగండ పెండేరమున కీవె
తగు దని తానె పాదమున దొడిగె
గోకటగ్రామా ద్యనే కాగ్రహారము
లడిగినసీమలయందు నిచ్చె
నాంధ్రకవితాపితామహ యల్లసాని
పెద్దనకవీంద్ర యని నన్ను బిలుచునట్టి
కృష్ణరాయలతో దివి కేగలేక
బ్రతికియుండితి జీవచ్ఛవంబ నగుచు

అల్లసాని పెద్దన్న

అల్లసాని పెద్దనార్యుడు నందవరీక నియోగిబ్రాహ్మణుడు; చొక్కనామాత్యుని పుత్రుడు; బళ్లారి ప్రాంతములయందున్న దూపాడు పరగణాలోని దొరాలగ్రామ మీతని జన్మస్థలము; కృష్ణదేవరాయల యాస్థానకవీశ్వరులలోనెల్ల నితడు ముఖ్యుడు. ఈతడు కృష్ణదేవరాయల యనంతరముగూడ కొంతకాలము జీవించుయుండుటచేత, ఇంచుమించుగా 1535 వ సంవత్సరము వరకును బ్రతికియుండెనని చెప్పవచ్చును. కృష్ణదేవరాయలు మృతి నొందిన తరువాత నీతడు చెప్పిన జాలిని పుట్టించెడి యీక్రింది పద్యమీతడు రాయలయనంతరమున జీవించియున్నట్టు తెలుపుచున్నది-


సీ. ఎదురైనచో దన మదకరీంద్రము డిగ్గి
కే లూత యొసగి యెక్కించుకొనియె
మనుచరిత్రం బందుకొనువేళ బుర మేగ
బల్లకి తనకేల బట్టియెత్తె
బిరుదైన కవిగండ పెండేరమున కీవె
తగు దని తానె పాదమున దొడిగె
గోకటగ్రామా ద్యనే కాగ్రహారము
లడిగినసీమలయందు నిచ్చె
నాంధ్రకవితాపితామహ యల్లసాని
పెద్దనకవీంద్ర యని నన్ను బిలుచునట్టి
కృష్ణరాయలతో దివి కేగలేక
బ్రతికియుండితి జీవచ్ఛవంబ నగుచు.


అంతేకాక కృష్ణదేవరాయలు లోకాంతరగతుడు కాగానే కటకమునుండి గజపతి దండెత్తివచ్చినట్లును, అల్లసాని పెద్దన యీ క్రింది పద్యమును వ్రాసిపంపగా నతడు సిగ్గుపడి మరలిపోయినట్టును జెప్పుచున్నారు:-


సీ.రాయరావుతుగండరాచయేనుగువచ్చి
యారట్లకోట గోరాడునాడు
సంపెటనరపాలసార్వభౌముడు వచ్చి
సింహాద్రి జయశిల జేర్చునాడు
సెలగోలుసింహంబు చేరి ధిక్కృతి గంచు
తల్పుల గరుల డీకొల్పునాడు
ఘనతరనిర్భరగండపెండెర మిచ్చి
కూతు రాయలకును గూర్చునాడు
నొడ లెఱుంగవొ చచ్చితో యుర్వి లేవొ
చేరజాలక తల చెడి జీర్ణమైతొ
కన్నడం బెట్లుచొచ్చెదు గజపతీంద్ర
తెఱచినిలుకుక్క చొచ్చిన తెఱగుతోప.


ఈ కవి రూజునొద్ద మిక్కిలి గౌరవముపొందినవా డయి, రాజు చెప్పుమన్నప్పుడు గాక తనయిష్టమువచ్చినప్పుడు మాత్రమే కవిత్వము చెప్పు స్వాతంత్ర్యము గలవాడనియు, రాజొకనాడు కృతి చెప్పుమనివేడగా నతడు చెప్పక యీ క్రిందిపద్యమున జెప్పననియు వాడుక గలదు:-


చ. నిరుపహతిస్థలంబు రమణీప్రియదూతిక తెచ్చియిచ్చుక
ప్పురవిడె మాత్మ కిం పయినభోజన ముయ్యెలమంచ మొప్పత
ప్పరయురసజ్ఞ లూహ తెలియంగలలేఖకపాఠకోత్తముల్
దొరకినగాక యూరక కృతు ల్రచియింపుమటన్న శక్యమే?


ఈ కవియే కవిత్వ ముండవలసిన రీతినిగూర్చి యీక్రింది పద్యమును గూర్చెనని చెప్పుదురు:- చ.ఘనతరఘూర్జరీకుచయుగక్రియ గూడముగాక ద్రావిడీ
స్తనగతి దేటగాక యరచాటగునాంధ్రవధూటిచొక్కపుం
జనుగవలీల గూడతయు జాటుతనంబును లేక యుండ జె
ప్పినయదెపో కవిత్వ మనిపించు నగిం చటుగాక యుండినన్.


ఈ పద్యము వేంకటనాథకవికృత మగు పంచతంత్రమునందు గానబడుచున్నది. పెద్దనార్యుడు సంస్కృతాంధ్రములయం దసమానసాహిత్యము గలవాడు. ఇత డొకనాడు కృష్ణదేవరాయల యాస్థానములో సకలకవీశ్వరులు నుండగా రాజు కోరికమీద నుభయభాషా పాండిత్యము వెల్లడి యగునట్లుగా నొక యుత్పలమాలిక నాశుకవిత్వముగా జెప్పి సభవారినందఱిని మెప్పించి కాలికి బిరుదందె వేసికొన్నవాడు. రాజు కవిగండపెండేరమును బసిడిపళ్లెరమున నునిచి, సంస్కృతాంధ్రములందు సమానముగా కవిత్వము చెప్పగలవారు దీనిని ధరింపనర్హులని పలికినప్పుడు పెద్దనార్యుడు లేచి యీక్రింది యుత్పలమాలికను జదువగా రాజు మెచ్చి తానే యాకవిగండపెండేరమును కవిపాదమున దొడిగెనట-


ఉ. పూతమెఱుంగులున్ బసరుపూపబెడంగులు చూపునట్టివా
కైతలు జగ్గునిగ్గు నెనగావలె గమ్మున గమ్మనన్వలెన్
రాతిరియున్ బవల్ మఱపురా:హొయల్ చెలియారజంపుని
ద్దాతరితీపులంబలెను దారసిలన్వలె లో దలంచినన్
బాతిగ బైకొనన్వలెను బైదలి కుత్తుకలోనిపల్లటీ
కూత లనన్వలెన్ సొగసుకోర్కులు రావలె నాలకించినన్
జేతికొలంది గౌగిటను జేర్చిన గన్నియచిన్నిపొన్ని మే
ల్మూతలచన్నుదోయివలె ముచ్చట గావలె బట్టిచూచినన్
డాతొడనున్న మిన్నులమిటారపుముద్దులగుమ్మ కమ్మనౌ
వాతెఱదొండపండువలె వాచవిగావలె బంట నూదినన్ గాతల దమ్మిచూలిదొరకైవసపుంజవరాలి సిబ్బెపు
న్మే తెలియబ్బురంపుజిగినిబ్బరపుబ్బగుగబ్బిగుబ్బపొం
బూతలనున్న కాయసరిపోడిమి కిన్నెర మెట్లబంతి సం
గాతపు సన్నబంతి బయకారపు గన్నడగౌళపంతుకా
సాతత తానతానల పసం దివుటాడెడు గోటమీటు బల్
మ్రోతలునుం బలెన్ హరుపు మొల్లముగావలె నచ్చతెన్గు లీ
రీతిగ సంస్కృతం బుపచరించినపట్టున భారతీవధూ
టీ తపనీయ గర్భనికటీభవదానస పర్వసాహితీ
భౌతికనాటకప్రకరభారతభారత సమ్మతప్రభా
శీతనగాత్మజా గిరిశశేఖర శీతమయూఖ రేఖికా
పాతసుధాప్రపూర బహుభంగ ఘుమంఘుమ ఘుంఘుమార్భటీ
జాతకతాళయుగ్మ లయసంగతి మంచువిపంచికామృదం
గాతత తేహిత త్తహిత హాధిత దంధణు ధాణుదింధిమి
వ్రాత నయానుకూలపద వారకుహూద్వహ హరికింకిణీ
నూతన ఘల్ఘలాచరణ నూపుర ఝూళఝళీమరంద సం
ఘాతవియద్ధునీ చకచకద్విక చోత్పల సారసంగ్రహా
యాతకుమారగంధవహ హారిసుగంధ విలాసయుక్తమై
చేతము చల్ల జేయవలె జిల్లున జల్లవలె న్మనోహర
ద్యోతక గోస్తనీఫల మధుద్రవ గోఘృత పాయసప్రసా
రాతి రసప్రసార రుచిరప్రతిమంబుగ సారెసారెకున్.


పెద్దనార్యుడు హరికథాసారము, స్వారోచిషమనుచరిత్రము మొదలైన పెక్కుగ్రంథములను రచియించెను. వానిలోనెల్ల మనుచరిత్రము మిక్కిలి ప్రసిద్ధమై యెల్లయెడల వ్యాపించి యున్నది. ఈయనకుం బూర్వమునం దున్నకవు లెవ్వరును స్వకల్పనమును విశేషముగా జేర్చి ప్రబంధములను రచియించి యుండలేదు. వారు పురాణేతిహసాదులను మాత్రము తెనిగించిరి. ఈతడే మార్కండేయ పురాణమునుండి స్వారోచిష మనుసంభవ కథను గైకొని పెంచి స్వకపోలకల్పనతో మొట్టమొదట మనుచరిత్రమును బ్రబంధరూపమున రచియించిన కవి యగుట చేత నీతని కాంధ్రకవితాపితామహు డన్న బిరుదనామము కలిగినది. ఈతనికాలము మొదలుకొని రామరాజభూషణుడు వసుచరిత్రము చేయువఱకును గల కవులందఱును జాలవఱకు దమ ప్రబంధములను మనుచరిత్రరీతినే చేసిరి. ఈ కవి జన్మముచేత స్మార్తుడే యయినను, నడుమ వైష్ణవము పుచ్చుకొని వైష్ణవాగ్రేసరుడయి విష్ణ్వాలయములకు భూదానాదులను జేసెను. ఈవిషయమే యెకంజీ దొరవారు సంపాదించి యుంచిన రాజకీయప్రాగ్దేశపుస్తక భాండాగారమునందలి వ్రాతపుస్తక ములయందు దెలుపబడియున్నది. అందున్న కోకటాగ్రహారమును గూర్చిన యంశము నిందు క్రింద వ్రాయుచున్నాను-


“అల్లసాని పెద్దయ్యంగారు బ్రాహ్మణుడు, నందవరీకుడు, చొక్కరాజుగారి కొమారుడు. కోకటగ్రామమును శ్రీకృష్ణదేవరాయలవారీ కవీశ్వరుని కియ్యగా, అతడు వైష్ణవము పుచ్చుకొని యీగ్రామము శ్రీవైష్ణవుల కగ్రహారము చేసియిచ్చెను. అప్పుడు దానికి పెట్టినక్రొత్తపేరు శఠగోపపురము. ఈ కవి శాలివాహనశకవర్షములు 1440 బహుధాన్యసంవత్సర వైశాఘశుద్ధ 15 లు నాడు ఈ గ్రామమునందుండు పకలేశ్వరస్వామికి నైవేద్య దీపారాధనలకై రెండు పుట్లచేను ధారపోసియిచ్చి సదరు దేవాలయములో శిలాశాసనము వేయించినాడు. పయిసంవత్సరము కార్తికశుద్ధ12 శి నాడు చన్నకేశవస్వామికి నాలుగున్నర పుట్లభూమి ధారపోసి శాసనము వేయించినాడు…… కృష్ణదేవరాయలతర్వాత సదాశివదేవరాయల కాలములోను, రామరాయలకాలములోను, నంద్యాలరాజైన మట్లఅనంతరాజు కాలములోను కోకటాగ్రహారము బ్రాహ్మణులకు జెల్లెను.” ఈకవి కోకటాగ్రహారమునకు శఠగోపపురమని పేరు పెట్టుటయేకాక తన మనుచరిత్రములోను హరికథాసారములోనుగూడ శఠగోపయతిని దనగురువునుగా స్తుతించి యున్నాడు-


క. కొలుతు న్మద్గురు విద్యా
నిలయం గరుణాకటాక్ష నిబిడజ్యోత్స్నా
దళితాశ్రితజనదురిత
చ్ఛలగాఢధ్వాంతసమితి శఠగోపయతిన్. [మనుచరిత్ర]


క. శఠగోపయతికి శఠతరు
కుఠారకోపమమతికిని గురుమతహృ త్క
ర్మఠనిరతికి జతురాగమ
పఠనాయతనియతికి నజపాసంభృతికిన్. [హరికథాసారము]


లక్షణగ్రంథములయం దక్కడక్కడ* నుదాహరింపబడిన పద్యములు లభించుటయేకాని హరికథాసారము పూర్ణముగా దొరికినదికాదు. హరికథాసారములోని యీరెండు పద్యములును రంగరాట్చందస్సునం దుదాహరింపబడి యున్నవి-


క. అంబరముపగుల నార్చి ప్ర
లంబాసురు డాగ్రహము వెలయ గదిరినవే
ళం బలరాముడు చేముస
లంబున వానితల ద్రుంచె లావు మెఱయగన్. [హరికథాసారము. ఆ 4]


క. తెంపరియై మది యింత చ
లింపక యనిలోనదెగియె నెవ్వ డతడు నై
లింప సభ నుండు ననుడు బ
దంపడి యాచార్యుతోడ దా ని ట్లనియెన్. [హరికథాసారము] ఈకవియే మొట్టమొదట దెలుగు గ్రంథములలో తురకమాటలు లోనగు నన్యభాషాపదములను స్వేచ్ఛముగా బ్రయోగింప నారంభించినాడు. ఆంధ్రకవితాపితామహుని యీక్రింది చాటుపద్యములో దురుష్కభాషావాక్యమే వేయబడినది.


మ. సమరక్షోణిని గృష్ణరాయలభుజాశాతాసిచే బడ్డ దు
ర్దమదోర్దండపుళిందకోటియవసవ్రాతంబు సస్తాశ్వ మా
ర్గమునం గాంచి శబాసహో హరిహరంగాఖూబు ఖోడాకి తే
తుముకీబాయిల బాయిదేమలికియందు ర్మింటికిం బోవుచున్.


ఈతని జూచి యాకాలమునందలి యితరకవులును దమచాటు పద్యములలోను గ్రంథములలోను యవనభాషావాక్యాదులను జొప్పించిరి. అట్టివారిలో నొక్క డగు నందితిమ్మన్న యొకచాటుపద్యములో-


శా. రాయగ్రామణి కృష్ణరాయ భవదుగ్రక్రూరఖడ్గాహిచే
గాయం బూడ్చి కళింగదేశనృపతుల్ కానిఝ్ఝరీపోషణీ
మాయాభీకుముటూకులోటుకుహుటూ మాయాపటా జాహరే
మాయాగ్గేయ మడే యటండ్రు దివి రంభాజారునిన్ యక్షునిన్.


అన చెప్పియున్నాడు. ఈలాగుననే పెద్దనార్యుడు గ్రంథములలో నన్యభాషాపదములను బ్రయోగించినందుకు మనుచరిత్రములోని యీక్రిందిపద్యమును దృష్టాంతముగా జూపవచ్చును-


సీ. పచ్చనిహురుమంజివనివాగెపక్కెర పారసిపల్లంబు పట్టమయము
రాణ నొప్పారు పైఠాణంబుసింగిణి తళుకులకోరీలతరకసంబు
మిహి పసిండిపరుంజు మొహదాకెలంకుల ఠావుగుజ్జరివన్నె కేవడంబు
డా కెలంకునసిరాజీకరాచురకత్తి కుఱగట గ్రొవ్వాడి గొఱకలపొది
పీలికుంచె తలాటంబు పేరొజంబు
మణులమొగముట్టు బన్ని సాహిణియొకండు కర్తయెదుటికి గొనివచ్చె గంధవాహ
బాంధవం బగునమ్మహాసైంధవంబు. [మనుచరిత్రము. ఆ.4]


ఈయనను జూచి యాకాలపువా డయిన ధూర్జటికవియు దనకాళహస్తి మాహాత్మ్యమునం దీక్రిందిరీతి పద్యములం దన్యభాషాపదములు చేర్చి కూర్చినాడు-


సీ. బిజమాడుదేవర నిజకృపామహిమ జెన్నారునాయిల్లు బిడారునీకు
నాకునీపాదార్చనముసేయనడలింగమూర్తి చేకుఱెవచ్చిమూర్తమాడి
యొడయచిత్తేశ నాయునికి నీమజ్జనమాడు శివార్చన మాడుబేకు
విచ్చేయు డిది బూదివీడియం బందుకో జంగమస్వామి నాసదనమునకు


నోగిరంబులు మంచిమే లోగిరమున
నావటించెద బదుడు మీ రారగింప
బ్రతిదినంబును జంగమార్చనము లేక
దనువు వడనొల్ల రూపకందర్ప యనగ. [కాళహస్తిమాహాత్మ్యము]

ఆంధ్ర కవుల చరిత్రము నుండి…

———–

You may also like...