పేరు (ఆంగ్లం) | Bahujana Palli Sita Ramacharyulu |
పేరు (తెలుగు) | బహుజనపల్లి సీతారామాచార్యులు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1827 |
మరణం | 3/20/1891 |
పుట్టిన ఊరు | నాగపట్నం |
విద్యార్హతలు | – |
వృత్తి | చెన్నపురి లోని పాఠశాల నందు1864లో తెలుగు పండితులు |
తెలిసిన ఇతర భాషలు | సంస్కృతం, తమిళం |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | సౌందర్యరాజస్వామి శతకము, 1849-వైకృతదీపిక, పదార్థనామకోశము, బాలచంద్రోదయము, 1871- ఆలఘుకౌముది, 1872-నీతిమాల, 1872- సతీధర్మసంగ్రహము, ప్రపన్న పారిజాతము, 1887-ఆంధ్రశబ్దమంజరి, ఉపాధ్యాయబోధిని, వినాయక శతకము, త్రిలింగ లక్షణశేషము, శబ్దరత్నాకరము 1855. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు |
Shabdaratnakaram#page/n1/mode/2up |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | బహుజనపల్లి సీతారామాచార్యులు “ప్రౌఢ వ్యాకరణం” రచించిన ప్రముఖ తెలుగు రచయిత. వీరు ద్రవిడదేశ వైష్ణవులు. సీతారామాచార్యుల వారి పేరు వినగానే అందరికీ స్ఫురించునది “శబ్ద రత్నాకరము”. దీని తర్వాత శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు. వీరు చెన్నపురి (ప్రస్తుత చెన్నై)లోని పాఠశాల నందు1864 లో తెలుగు పండితులుగా ఉద్యోగమారంభించి ప్రథమ పండితులుగా కొనసాగారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | బహుజనపల్లి సీతారామాచార్యులు-శబ్ద రత్నాకరము- పీఠిక |
సంగ్రహ నమూనా రచన | బహుజనపల్లి సీతారామాచార్యులు శబ్ద రత్నాకరము- పీఠిక జనులు తమ తమ భాషలయందు సంపూర్ణ జ్ఞానము సంపాదించుకొనుట యత్యావశ్యకము. ఆ జ్ఞానము ఆయాభాషాగ్రంథములను దల స్పర్శముగఁ జదువక కాని కలుగనేరదు. అట్లు చదివి పదార్ధ పరిజ్ఞానముఁబడయుటకు ముఖ్యసాధనంబులు నిఘంటువులు. ఆనిఘంటువు లో యీ దేశభాషలయం దింగ్లీషు నందువలె వచనరూపములుగాక సంస్కృతంబునందుబలెఁ బద్యరూపములుగానున్నయవి. అట్లుండుటచే విద్యార్ధులకవి సుబోధంబులుకావు. ఆహేతువుఁబట్టి ముందు సంస్కృతమునందుఁ బద్యరూపములుగా నుండిన ఘంటువులన్నియు నిప్పుడు అకారాదిక్రమమున వచనరూపములుగా నేర్పఱుపఁబడియున్నవి. ఇంకను గొన్ని యేర్పఱుపఁబడుచున్నవి. అట్లే యాంధ్ర ద్రవిడాది భాషలయందును గొన్ని యేర్పఱుపఁబడియున్నవి. అందు విడాదిభాషల కేర్పఱుపఁబడిననేమో విద్యార్ధుల యుపయోగమునకుఁ జాలునంతటివిగాను లక్ష్యావిరుద్ధములుగాను నున్నవి. ఈ యాంధ్రమున కేర్పఱుపఁబడినుండు నొకటి రెండు నిఘంటువు లన్ననో యట్లుకావు. |
శబ్ద రత్నాకరము- పీఠిక
జనులు తమ తమ భాషలయందు సంపూర్ణ జ్ఞానము సంపాదించుకొనుట యత్యావశ్య కము. ఆ జ్ఞానము ఆయాభాషాగ్రంథములను దల స్పర్శముగఁ జదువక కాని కలుగ నేరదు. అట్లు చదివి పదార్ధ పరిజ్ఞానముఁబడయుటకు ముఖ్యసాధనంబులు నిఘంటు వులు. ఆనిఘంటువు లో యీ దేశభాషలయం దింగ్లీషు నందువలె వచనరూపములుగాక సంస్కృతంబునందుబలెఁ బద్యరూపములుగానున్నయవి. అట్లుండుటచే విద్యార్ధుల కవి సుబోధంబులుకావు. ఆహేతువుఁబట్టి ముందు సంస్కృతమునందుఁ బద్యరూపము లుగా నుండిన నిఘంటువులన్నియు నిప్పుడు అకారాదిక్రమమున వచనరూపములుగా నేర్పఱుపఁబడియున్నవి. ఇంకను గొన్ని యేర్పఱుపఁబడుచున్నవి. అట్లే యాంధ్ర ద్రవిడాది భాషలయందును గొన్ని యేర్పఱుపఁబడియున్నవి. అందు ద్రవిడాదిభాషల కేర్పఱుపఁబడిననేమో విద్యార్ధుల యుపయోగమునకుఁ జాలునంతటివిగాను లక్ష్యా విరుద్ధములుగాను నున్నవి. ఈ యాంధ్రమున కేర్పఱుపఁబడినుండు నొకటి రెండు నిఘంటువు లన్ననో యట్లుకావు.
కావున నీలోపంబుంబాఁపఁ గొంతకాలంబునకు ముందు సంస్కృతాంధ్రముల యందు విశేష పాండిత్యంబు గలిగి యాసేతుహిమాచలము చాలఁబ్రసిద్ధి వచించి యుండిన పరవస్తు చిన్నయసూరిగారు జీవితులైయుండినకాలంబున దీర్ఘసూత్రతతో ననేక గ్రంథపరిశోధనంబుగావించి మిగులవిరివిగాఁ బ్రయోగసహితంబుగ అకారాది తెనుఁగునిఘంటు వొకటి వ్రాయంబ్రారంభించి నడపుచుండిరి. ఆ మహా ప్రారంభముఁ జూచి యది పరిపూర్తియగుటకు బహుకాలము చెల్లుననియుఁ బరిపూర్తియయినను అందుఁదెనుఁగు పదములుమాత్రమే చేర్పఁబడియుండుటంజేసి యది విద్యార్ధుల కంతగాఁ బ్రయోజనకారి కాఁజాలదనియు, ఇదికాక బళ్లయందుఁ జది వెడువిద్యార్థులంత పెద్దపుస్తకముఁ గొని యుంచుకొనుట కష్టముగా నుండుననియు నూహించి సంస్కృతాంధ్ర భాషలయందుఁ గొంత పరిశ్రమముగల నేనీయాంధ్ర భాషయందు చదువ దొరంకొను విద్యార్ధుల సహాయార్థము వారి యుపయోగమునకుఁ జాలునంతటి దిగాను లక్ష్యావిరుద్ధముగాను నుండునట్లు తెనుఁగుపదములతోఁగూడఁ దదపేక్షితము లైన సంస్కృతపదములనుజేర్చి చిన్నదిగ అకారాది నిఘంటు వొకటి వ్రాసి శీఘ్ర కాలముననే పూర్తిచేసెదఁగాక యని మిక్కిలి వూనికతో దీని వ్రాయ వుద్యమించితిని. అట్లుద్యమించి మునుమున్ను తెనుఁగునిఘంటువులయందడి పదములను మాత్రమెత్తి వ్రాసికొని యర్థములందలివి తఱచుగ లక్ష్యవిరుద్ధములు గానుండుటచే లక్ష్యశోధనంబు గావించియు తదనుసారంఁబుగ నర్ధములను వ్రాయ నిశ్చియించి వాస్తవార్థ పరిజ్ఞానసిద్ధికిని విశేషపదప్రాప్తికిని మూలకారణంబగు నాంధ్రభారతాది గ్రంధపరిశోధనంబునం దత్యంత సముత్సుకుండనై తదసాధారణ గ్రంథసముపార్జ నంబునకుంగడంగి తదుపార్జన విషయమై శరీరకష్టమును, విత్తనష్టమును నించుకే నియుం బాటింపక నాకుఁ దీఱికయైన కాలములయందు వేతనములేర్పఱిచి యుంచు కొని యుండిన యిద్దఱు ముగ్గురు వ్రాయసకాండ్రతోడఁ బదిగంటలకుఁ గలేజికింజని సాయంకాలమయిదుగంటలపర్యంత మచ్చటనయుండి యనేక గ్రంథములను వ్రాయించుకొని వచ్చితిని. కొన్ని దేశాంతరంబులనుండి తెప్పించితిని. కొన్ని పండితుల సన్నిధిం గడించితిని. కొన్ని హానరెబిల్ లక్ష్మీనరసింహులుసెట్టిగారి యొద్ద వ్రాయించితిని. ఆ గ్రంథసంపాదన కాలమునందుఁ బచ్చయప్ప మొదలారిగారి పాఠశాలలోఁ బండితాగ్రగణ్యులై ప్రఖ్యాతికెక్కియుండిన ఉ. వైయాకరణ శ్రీనివాసా చార్యులవారు తాముప్రాణపదముగా సంగ్రహించి యుంచికొనియుండిన యపూర్వ గ్రంథ ప్రయోగసారసంగ్రహములైన కొన్ని సంచికలను లోకోపకార్ధము నాచేతికొసంగిరి. అవి నాగ్రంథకరణకార్యమునకు మిక్కిలి సహకారులయ్యెను. ఈ తీరున గ్రంధములను సేకరించుటకే యయిదాఱు సంవత్సరములు కావచ్చెను. ఇన్నిపాట్లుపడియు నింత ద్రవ్య వ్యయముచేసియు సాధారణ గ్రంధములే విశేషముగ దొరికినవిగాని తదితరము లు విశేషముగ దొరకినవి కావు. సాధారణగ్రంథములయందును బెక్కులుచిక్కవయ్యె. చిక్కినగ్రంథములివియవి వెనుకఁజేర్పబడియుండు గ్రంథసంకేతాది వివేచన పట్టికయందు విశదములు కాఁగలవు. అక్కడనే గ్రంథభారశోధనచే నాకుఁదోచి యేర్పఱి చిన తద్గ్రంధకర్తలగు కవుల తారతమ్యమును నెఱుకపడఁగలదు. ఈ ప్రకారము గ్రంథ ములను సేకరముచేసి యందు వెదకియెత్తినపదములను ముందటి తెనుఁగుపదము లతోడఁ గూర్చి తెనుఁగు సంస్కృతానుసారి కనుక అమరము, అమరపదపారిజాతము, మేదిని, విశ్వప్రకాశికలోనగు సంస్కృత నిఘంటువులను బరిశీలించియందుండి వలయునన్ని సంస్కృతపదముల నెత్తి చేర్చితిని. నాగ్రంథకరణకార్యములు రెంటి మూటికిఁ జాలసహాయభూతముగా నుండినకతన అమరపదపారిజాతము నాపాలిటికిఁ బారిజాతముగానే యుండెను. సంస్కృతాంధ్రపదముల నకారాదిగా నిట్లేర్చికూర్చి మిగుల మనఃక్లేశపడి దేశ్య వైకృత సంస్కృతగ్రామ్యాది సూచకంబులుగ నక్కడక్కడ నాయాయి సంకేతాక్షరంబులిడి యంతనెంతయు విచారణచేసి యాతెనుగుపదము లకు లక్ష్యావలోకనముచే లక్షింపబడిన యర్థములనువ్రాసి సంస్కృతపదంబులకు నాయానిఘంటువులయందు వ్రాయబడియుండు నర్థములను వ్రాసితిని.
వాడుకపదములు నైఘంటికపదములును దక్కఁదక్కిన తెనుఁగుపదముల కర్థములువ్రాయబడి ప్రయోగములు చూపఁబడియున్నవి. కొన్నిచోట్లఁ గ్రొత్తగానిర్ధారణ చేయఁబడిన యర్థము సరియని విశ్వాసము పుట్టుటకుఁగాఁ దెనిఁగింపఁబడిన గ్రంథముల యందలి పదములకుఁ దెనిఁగింపఁబడిన గ్రంథముల యందలి పదము లకుఁ దత్తత్సంస్కృతమాతృ గ్రంథములనుండి యాయాఘట్టముల ప్రయోగములను నెత్తి వ్రాయఁబడియున్నవి. సంస్కృత నిఘంటువులన్నియుఁ బ్రామాణికులగు పండితులచేతనే వ్రాయఁబడినవి కానవానికిఁ బ్రయోగములు చూపబడవు. ఇందుఁ దెనుఁగుపదములు కొన్నిటికి యథాశక్తిని వ్యుత్పత్తియు వ్రాయఁబడియున్నది. తెనుఁగునం దపూర్వమయినయది యట్లు వ్రాయఁబడుట స్వపాండిత్య ప్రకటనము నకుఁగాదు. తెనుఁగుపండితులును దాము నితఃపరము దానిని వాడుకలోనికిఁ దేవలయు ననుటకు సూచకంబని గ్రహింపవలయును. సంకేతాక్షరక్రమమును వానియర్థములును దీని వెనుకనుండు సంజ్ఞావివరణ పట్టికయందుఁ బ్రకాశితములు కాఁగలవు. సంకేతము లేర్పఱుచుచోఁ గొన్నియెడలనిది సంస్కృత మిది తెనుఁగని కనిపట్టుట దుష్కరముగా నుండెను. కొన్నికడల దేశ్యమిది వైకృతమిదియని తెలిసికొనుట దుస్సాధ్యముగా నుండెను. కొన్నిచోట్ల దేశ్యవైకృత మిశ్రపదమిదియని గుర్తెఱుగుట దుర్లభముగా నుండెను. కొన్నిపట్ల నిది సంస్కృతాంధ్ర మిశ్రపదమనియు గ్రామ్యపదమనియు గ్రహించుట దురూహముగా నుండెను. అది యట్టిదయని బుద్ధిమంతులు తలుతురు. “విద్వానేనవిజానాతి విద్వజ్జనపరిశ్రమమ్, నహివంధ్యావిజానాతి గుర్వీమ్ప్రసవ వేదనామ్” అని పెద్దలు వక్కాణింతురుకాదె.
ఈ నిఘంటువును వ్రాయఁబ్రారంభించిన క్రొత్తలో, రా – రా – పో – రామానుజులు నాయఁడు కొంతకాలము లేఖరిగానుండి యీగ్రంథమునకుఁగావలసిన కుదురుపాటు లన్నియుఁ గలుగఁ జేసెను. ఆ పిమ్మట నొకరిద్దఱు కొన్నిదినములుండి యా వ్రాతపని చూచిపోయిరి. అటు తరువాత సంస్కృతాంధ్ర పండితులైన ఉ – కొ- అనంతాచార్యులు వ్రాయసమునకుఁ గుదిరి యత్యంతశ్రద్ధతో నిర్భరప్రయాసము పుచ్చుకొని నిర్విఘ్న ముగ నీ గ్రంథముఁ బరిసమాప్తిఁ బొందించిరి. శీఘ్రకాలముననే ఈ నిఘంటువు వ్రాసి సంపూర్తిగావించెదఁగాకయని యుద్యమించియు నిది పరిసమాప్తిఁబొంద రమారమి యిరువదియైదు సంవత్సరములకు మీఁడనే కాలము పట్టెను. ఎటువంటి బుద్ధి శాలురకు నిట్టి కార్యములయందుఁ బొరపాట్లు కలుగుననఁగా నావంటి స్వల్పబుద్ధి కాయిట్టి మహాకార్యమునందుఁ బొరపాట్లు కలుగకమానును? కావున బుద్ధిమంతులట్టి పొరపాట్లుదెలిపి దిద్దించి నన్నుఁ గృతార్థుం జేయుదురని ప్రార్ధించెద.
———–