అనిసెట్టి సుబ్బారావు (Anisetty Subbarao)

Share
పేరు (ఆంగ్లం)Anisetty Subbarao
పేరు (తెలుగు)అనిసెట్టి సుబ్బారావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1922
మరణం1/1/1981
పుట్టిన ఊరు
విద్యార్హతలుబి.ఎ.
వృత్తితెలుగు సినిమా రచయిత మరియు ప్రగతిశీల కవి, నాటక కర్త.
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలురక్తాక్షరాలు (1943), అనిశెట్టి నాటికలు (1945), శాంతి (1951), మా ఊరు (1954)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుసుబ్బారావు, మహాకవి శ్రీశ్రీకి బాగా సన్నిహితుడు. సుబ్బారావు మరణించిన తర్వాత మద్రాసులోని సంతాప సభలో శ్రీశ్రీ ‘నాకు అనిశెట్టి, ఆరుద్ర అ-ఆ’ లాంటివారు. అ-పోయింది. ఆ- మిగిలింది’ అని చెప్పి క్లుప్తంగా తమ అనుబంధాన్ని తెలిపి ముగించాడు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఅనిసెట్టి సుబ్బారావు
సంగ్రహ నమూనా రచనవచ్చాను వచ్చాను
వ్యాస సంతతి వాణ్ణి!
వెళ్ళిపోయిన కోటికోట్ల జీవుల విడిచి
కుళ్ళిపోయే నేటి కోట్ల జీవుల కొరకు
పొర్లివచ్చే కోటీ కోట్ల జీవులకొరకు
వచ్చాను వచ్చాను

అనిసెట్టి సుబ్బారావు

వచ్చాను వచ్చాను – అనిసెట్టి సుబ్బారావు కవిత


వచ్చాను వచ్చాను
వ్యాస సంతతి వాణ్ణి!
వెళ్ళిపోయిన కోటికోట్ల జీవుల విడిచి
కుళ్ళిపోయే నేటి కోట్ల జీవుల కొరకు
పొర్లివచ్చే కోటీ కోట్ల జీవులకొరకు
వచ్చాను వచ్చాను
వ్యాస సంతతి వాణ్ణి !
కలగుండు వడియు నిశ్చలమైన గుండె వలె
నిద్రించు నీటిలో విడుచు పొడిరాయివలె
ఆడవులూ, పడవులూ ‘ అహఒఉ ‘ టెల్లలు దాటి
వచ్చాను వచ్చాను
వ్యాస సంతతి వాణ్ణి !
పగిలించి రణ్భేరి, పద్మవ్యూహము త్రెంచి
శివమెత్తి విస్ఫులింగములు చిమ్ముతులేచి
ఈ జగతిలో నూతన జగతి పెకలిస్తాను!
వచ్చాను వచ్చాను
వ్యాస సంతతి వాణ్ణి !
తలవొగ్గి బానిస సలాము చెయ్యరు మీరు,
ధన మదాంధత బలిసి తారసిల్లరు మీరు,
వచ్చాను వచ్చాను
వ్యాస సంతతి వాణ్ణి !
రాళ్ళు రప్పలు ప్రాణ్మొలొకి పులకింపగా
పరాకోటినందు ప్రాణుల కళాసృష్టి;
ఎగసి ప్రవహిస్తుంది ఇక వెలుగు బావుటా

వచ్చాను వచ్చాను
వ్యాస సంతతి వాణ్ణి !

ప్రేమమూర్తుల నిత్యనృత్యమై, సత్యమై
భువనముల్ సకలముల్ పొంగి పోవంగా
నిర్భరానందమావిర్భవించగా
వచ్చాను వచ్చాను
వ్యాస సంతతి వాణ్ణి !

———–

You may also like...