పేరు (ఆంగ్లం) | Cheruvu Jayalakshmi |
పేరు (తెలుగు) | చెరువు జయలక్ష్మి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ఎండమావులు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | చెరువు జయలక్ష్మి |
సంగ్రహ నమూనా రచన | భాస్కరుని అరుణకిరణాలు ఇంకా తన ఉనికిని గుర్తుచేస్తున్నాయి. సాయంత్రం ఎండ వేడి తగ్గి, చల్లని గాలి వీస్తోంది. గాలికి చెట్లు ఊగుతునానయి. రాత్రి వచ్చే వెనెనలకి సంతోషంగా స్వాగతం పలుకుతున్నట్టుగా. పొగడ చెట్టు క్రింద కూర్చున్న జ్యోత్స్న నెమ్మదిగా శరణాలయం గేటు దాటి రోడ్‌మీద పడ్డది. పార్కులోకి వెళ్లేటప్పటికి భాస్కర్ జ్యోత్స్నకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. |
సి. జయ
ఎండమావులు
భాస్కరుని అరుణకిరణాలు ఇంకా తన ఉనికిని గుర్తుచేస్తున్నాయి. సాయంత్రం ఎండ వేడి తగ్గి, చల్లని గాలి వీస్తోంది. గాలికి చెట్లు ఊగుతునానయి. రాత్రి వచ్చే వెనెనలకి సంతోషంగా స్వాగతం పలుకుతున్నట్టుగా.
పొగడ చెట్టు క్రింద కూర్చున్న జ్యోత్స్న నెమ్మదిగా శరణాలయం గేటు దాటి రోడ్‌మీద పడ్డది.
పార్కులోకి వెళ్లేటప్పటికి భాస్కర్ జ్యోత్స్నకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు.
‘‘రా, జోత్స్నా ఇంత ఆలస్యం చేశావేం నువ్వు రావేమో అని భయపడుతున్నాను’’ జోత్స్న చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కుతూ అన్నాడు.
‘‘రాకుండా ఎలా ఉండగలను భాస్కర్. కానీ, రోజు రోజుకీ నాకు ఎందుకో భయంగా ఉంది ఇలా రావాలంటే’’ దిగులుగా అంది జోత్స్న.
‘‘ఎందుకు భయం?’’ సిగరెట్టు వెలిగించి, పుల్ల ఆవతల పారేస్తూ అడిగాడు భాస్కర్.
‘‘నేను ఉండేది ఒక అనాధశరణాలయంలో. వాళ్ళ భయభక్తులలో, వాళ్ళ దయా దాక్షిణ్యాలలో బ్రతుకుతున్నాను. నాకో బ్రతుకు తెరువు చూపించేదాకా అందులో ఉంచుకుంటారు. తరువాత పంపేస్తారు. కానీ నేను ఈ లోపల ఇట్లా చాటుగా నీతో పరిచయం రోజూ నిన్ను కలుసుకోవటం లాంటివి వాళ్ళకి తెలిస్తే. ముందుగానే బయటికి పంపివేస్తారు. అప్పుడు నాగతి ఏమిటి?’’
‘‘అదా నీ భయం. అంతదాకా ఎందుకు వస్తుంది. నేను ఈ లోపల నిన్ను పెళ్ళి చేసుకుని తీసుకుపోతానుగా’’ ధైర్యం చెబుతూ అన్నాడు.
‘‘నిజంగానా?’’
‘‘నిజంగా జోత్స్నా నన్ను నమ్ము’’
మౌనంగా ఆలోచిస్తూ కూర్చండిపోయింది జోత్స్న.
‘‘ఏమిటి ఆలోచిస్తున్నావు? నన్ను నమ్మటం లేదా అడవిపువ్వులా నువ్వు ఈ అనాధ శరణాలయానికి అంకితం కావటం నాకు ఇష్టంలేదు అనాధశరణాలయాల్లో ఉన్న ఆడపిల్లలకి సంఘంలో సానుభూతి గౌరవం ఉండవు చాలా చులకనగా చూస్తారు.
అలా కాకుండా, నీకు ఒక వ్యక్తిత్వం చేకూర్చాలని సంఘంలో నీకు గౌరవ మర్యాదలు కలిగించాలని, నాకు చాలా ఆరాటంగా ఉంది ఇలాంటి అవకాశం కోసం నేను ఇనిన రోజులుగా ఎదురుచూశాను. నేను ఒక ఆదర్శంతమైన పని ఏదైనా చెయ్యగలిగానూ అంటే అది నిన్ను నేను పెళ్ళి చేసుకోవటమే’’.
సంతోషంతో జ్యోత్స్న హృదయం పరవళ్ళు తొక్కింది వెనెనల రోజులలో సముద్రపు అలలులాగా
‘‘ఎంతటి సంస్కారం ఉంది భాస్కర్ లో’’ అనుకుంది తృప్తిగా ‘‘నేను చాలా అదృష్టవంతురాల్ని భాస్కర్ ఒకకులం, గోత్రం, దిక్కూ మొక్కూ లేక అనాథశరణాలయంలో ఉన్న నన్ను పెళ్లి చేసుకుని, నాకొక పరిపూర్ణత ఇస్తానంటే, అంతటి అదృష్టంకంటే నేను జీవితంలో కోరుకుండే దేమీలేదు’’ అంది తృప్తిగా.
రోజులు నెలలూ గడిచిపోతూనే ఉన్నాయి సాయంత్రాలు ఎవ్వరూ చూడకుండా వెళ్ళి వచ్చేది జ్యోత్స్న.
ఆరోజు ఆదివారం.
ఎవరికి తెలియకుండా భస్కర్తో సినిమాకి వెళ్ళింది జోత్స్న.
ఇద్దరూ సినిమాకి వెళ్ళారు సినిమా జోరుగా సాగుతోంది ఇంగ్లీషు సినిమా అది ముద్దులు కౌగిలంతల సీన్లు చేసేటప్పటికి వేడెక్కి పోయింది ఇద్దరికీ సినిమా చూస్తున్నంత సేపూ.
సినిమా పూర్తి అవగానే, బయటికి వచ్చారు ఇద్దరూ ‘‘అబ్బ, ఆకలేస్తోంది ఏదన్నా తిందా పద’’ అని హోటల్‌కి పోయి టిఫిన్ తిన్న తరువాత, టాక్సీలో ఒక చిన్న ఇంటిముందు ఆపించాడుభాస్కర్.
‘‘దిగు జ్యోత్స్న’’
గదిలోకి వెళ్ళి లైటు వేశాడు భాస్కర్ ఒకమంచం, కిటికీలో ఒక కూజా, గ్లాసు, ఒక ప్లాస్కూ గది చాలా నీటుగా, సింపుల్‌గా ఉంది.
‘‘కూర్చో జ్యోత్స్న బుజాలు పుచ్చుకుని మృదువుగా కూర్చోపెట్టాడు.
ఒక్కసారి నిండుగా నవ్వింది జ్యోత్స్న.
‘‘అబ్బ నీ నవ్వు ఎలా ఉందో తెలుసా? అప్పుడే విచ్చిన గులాబీమీద మంచుబిందువులు పడితే ఎలా ఉంటుంది?’’
మళ్ళీ నవ్వింది జ్యోత్స్న ‘‘ఎలా ఉంటుంది?’’
‘‘ఎలా వుంటుందా నీ నవ్వులా ఉంటుంది’’ రెండు చేతులతో జ్యోత్స్న ముఖం దగ్గరకు తీసుకుని పెదిమల మీద గాఢంగా ముద్దుపెట్టుకున్నాడు.
అభ్యంతరం చెప్పలేదు జ్యోత్స్న. వయసులో వున్న వేడి, దానికి తోడు అంతకుముందు చూసొచ్చిన సినిమా ప్రభావం జ్యోత్స్నని అడ్డుచెప్పనియ్యలేదు.
ఒళ్లు తెలియని, ఎక్కడో ఆనందలోకాలకి, మధురసీమలకి చేరుకున్నారు.
రెండు గంటల తరువాత నెమ్మదిగా తేరుకున్నారు ఇద్దరూ నలిగిన చీరె, రేగిన తల, బద్ధకంగా, మత్తుగా జరిగిన స్మృతి మనసులో మెదులుతుంటే సిగ్గుగా లేచికూర్చుంది.
‘‘జ్యోత్స్నా నువ్వెలా వున్నావో తెలుసా? నలిగిన గులాబీలా నిన్ను విడిచిపెట్టలేను’’ జ్యోత్స్నని హృదయానికి చేర్చకుంటూ అన్నాడు భాస్కర్.
‘‘నాకు అలాగే వుంది కానీ’’
‘‘బాధపడకు మన పెళ్ళకి త్వరలోనే మంచి ముహూర్తం పెట్టిస్తాను’’
‘‘నిజంగా’’
‘‘నిజం కాకపోతే అబద్దం చెబుతానా? పద నిను దింపుతాను’’ అని బయలు దేరాడు.
అదృష్టవశాత్తు శరణాలయం గేటు దగ్గర ఎవరూలేరు గేటు ఓరగా తెరిచేవుంది చప్పుడు చెయ్యకుండా గదిలోకి వెళ్లి పడుకుంది జ్యోత్స్న.
జరిగింది అనాథ శరణాలయంలో ఎవరికీ తెలియలేదు.
మూడు నెలలు గడిచిపోయాయి ప్రతి రోజూ జ్యోత్స్న భాస్కరరావు గదికి వెళ్ళటం, రాత్రి ఏ పది గంటలకో రావటం జరిగిపోతోంది.
కానీ అన్ని రోజులూ ఒకలా ఉండవు ఉంటే మనిషిలో దైవత్వమే ఉంటుందేమో మరి.
ఆరోజు రాత్రి జ్యోత్స్న టాక్సీ దిగివస్తుంటే శరణాలయం వార్డెను చూసింది.
గజగజా వణికిపోయింది జ్యోత్స్న
‘‘ఎక్కడినుంచి వస్తున్నావు?’’ గంభీరంగా అడిగింది వార్డెను మాట్లాడలేదు జ్యోత్స్న తలవంచుకుని అలాగే నిలబడిపోయింది.
‘‘చెప్పు జ్యోత్స్నా. టాక్సీలో నిన్ను దిగబెట్టిన అతను ఎవరు? ఎన్నిరోజుల నుంచి ఇలా జరుగుతోంది?’’
‘‘దాదాపు నాలుగు నెలల నుంచీ’’ భయం భయంగా అంది.
‘‘అతను ఎవరు?’’
‘‘అతనూ, నేనూ ప్రేమించుకున్నాం. నన్ను పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చాడు.’’
‘‘అందుకని ముందుగానే కాలు జారావన్నమాట’’
‘‘అతను నిన్ను మోసగిస్తే నీ గతి ఏమౌతుంది? నిన్ను కన్న తల్లీ, తండ్రీ ఎవరో నీకు తెలియదు ఏవిధంగా మరి ఏ పరిస్థతుల్లో కని. నిన్ను ఈ అనాథ శరణాలయంలో వదిలారో తెలియదు. తల్లీ. తండ్రీ దిక్కూ మొక్కూ ‘నా’ అన్న వాళ్ళు లేని అనాధవి నువ్వు.
నీకు సంఘంలో తగిన స్థానంలేదు. విలువలేదు. రేపు నీకు ఏదైనా జరిగితే నీ మీద జాలిపడి, కనీసం సానూభూతి కూడా చూపించదు ఈ సంఘం అలాంటప్పుడు నువ్వు ఎంత జాగ్రతత్తగా వుండాలి?
‘‘ఇప్పుడు నువ్వు ఏ గర్భవతివో అయితే, నీకు పట్టినగతే నీ బిడ్డకు కూడా కల్పిస్తావా? ‘నా’ అన్నవాళ్లు లేకుండా చేస్తావా?’’
‘‘సారి కూడా మాట్లాడలేదు జ్యోత్స్న వార్డెను కోప్పడుతుంటే నిజానిజాల్ని వూమించటానికి భయపడ్డది.
‘‘మాట్లాడవేం జ్యోత్స్నా?’’
‘‘సిస్టర్, నేను అతన్ని ప్రేమించాను. నమ్మాను నాకు యిప్పుడు మూడోనెల. అతను నన్ను పెళ్ళి చేసుకుంటానన్నాడు’’ కొంచెం ధైర్యంగానే అంది.
‘‘నువ్వు గర్భవతివా? ఎంతపని చేశావు జ్యోత్స్నా?’’ అతను నిన్ను పెళ్ళి చేసుకుంటే ఫరవాలేదు. లేకపోతేమటుకు నువ్వు ఇక్కడ ఉండటానికి వీలులేదు.
నీలాంటి అనాధలు యెంతోమంది వున్నారు ఇక్కడ. వాళ్ళకి నీ ప్రవర్తన ఆదర్శం, గుణపాఠం కాకూడదు సరే రేపు నీతో నేనూ వస్తాను అతన్ని నాకు చూపించు. మీ పెళ్ళి విషయం మాట్లాడతాను’’ సీరియస్‌గా చెప్పి వెళ్ళిపోయింది వార్డెన్ రోజ్లీ.
పంజరం విడిచిన పక్షిలా అయింది జ్యోత్స్న మనసు. ‘‘తను ఇవ్వాళ భాస్కర్‌తో తన విషయం అంతా చెప్పేసింది తను. తను తల్లికాబోతోందని, త్వరలో పెళ్ళిచేసుకుందాం అని.
అతను ఇంతవరకూ ఆమాటే ఎత్తలేదు అందుకని ఇవ్వాళ అడిగింది తను. త్వరలో ముహూర్తం పెట్టిస్తానన్నాడు. రేపు సిస్టర్ రోజ్లీని తీసుకువెళ్ళి అన్ని సంగతులూ మాట్లాడేసెయ్యాలి.
భవిష్యత్తు మధురంగా, హాయిగా ఉంటుంది. తనూ ఒక ఇంటికి గృహిణికాబోతోంది.
హు తన బ్రతుకు ఎలాంటి బ్రతుకు, దిక్కూ, మొక్కూ లేని ఒక అనాధ తను. ‘‘నా’’ అన్న వాళ్ళుగానీ, జాతి, మతం, కులంగానీ, సంఘంలో స్త్రీకి సామాన్యంగా ఉండవలసిన గౌరవం విలువకూడా లేని ప్రాణి తను.
ఈ అనాథ శరణాలయాల్లాంటివి ఉండబట్టి తనలాంటివాళ్లు బ్రతుకు తున్నారు.
కానీ ఇకముందు తను ఒక గృహిణి. ఒక సంస్కారవంతుడు, విశాలహృదయుడికి భార్య కాబోతోంది అబ్బ భాస్కర్ ఎంత మంచివాడు. అతన్ని తలచుకుంటేనే తన మనసు ప్రేమతో, రాధనతో తన మనసు నిండిపతోంది లోచనలలో, ఎప్పటికో నిద్రపోయింది ఆ రాత్రి.
మర్నాడు సాయంత్రం వార్డెన్ రోజ్లీని వెంటపెట్టుకుని భాస్కర్‌రావు గదికి వెళ్ళింది జ్యోత్స్న.
గది ఖాళీగా ఉంది.
గదిలో అతని సామానులాంటిది కూడా ఏమీలేదు గుండె ఝల్లుమంది జ్యోత్స్నకి బాధతో కృంగిపోతూ అవతలగా ఉన్నవాళ్ళని భాస్కర్ని గురించి అడిగింది.
అతను పొద్దునే గది ఖాళీ చేశాడని. ఒక ఉత్తరం మటుకూ ఇవ్వమన్నాడని ఒక కవరు తెచ్చి ఇచ్చింది ఒక ఆవిడ ఉత్తరం విప్పి ఆత్రంగా చదివింది జ్యోత్స్న.
‘‘జ్యోత్స్నా’’, ఇన్నాళ్లూ మనఇద్దరం ఏదో కలిసి గడిపాం, దిక్కూ, మొక్కూ, కులం గోత్రం లేని నిన్ను చేసుకోవటానికి మావాళ్ళు ఒప్పుకోరు.
ఇంకా నీ సంగతి అంటావా, నువ్వు ఉన్నది అనాధ శరణాలయంలో నీకు పుట్టే బిడ్డను నీలాగే అక్కడే పెంచు ఆ విషయంలో నీకు కష్టం కాదనుకుంటాను.
అయినా, అనాధ శరణాలయాల్లో ఉన్న నీలాంటి వాళ్ళకి, శీలమని గుణమని పవిరతమైన విషయాల్లో మీకు విలువ ఏముంది? నిన్ను అడిగేది మటుకూ ఎవరు?
నేను నిన్ను వాడుకున్నట్టు, ఇంతకు ముందు నిన్ను ఎంతమంది పయోగించుకున్నారో? భవిష్యత్తులో ఇంకా ఎంతమంది నీకు నాలాగా పరిచయం అవ్వాలో.
ఏదో వయసు తొక్కే పొంగులో, ప్రవాహంలో ఇద్దరం కలిశాం ఎలాకలిశామో అలాగే విడిపోదాం
నీవాడు కాని భాస్కర్.
ఉత్తరం చదవటం పూర్తిచేసిత, బేలగా అలాగే నిలబిపోయింది జ్యోత్స్న.
వార్డెన్ కూడా ఉత్తరం చదివి, ‘‘అతను ఎక్కడికి వెళ్లాడో అడ్రస్సు ఏమైనా మీకు తెలుసా?’’ ఉత్తరం ఇచ్చిన విడని అడిగింది.
‘‘అబ్బే ఆ వివరాలు ఏమీ మాకు తెలియవు అసలు అతనిది ఈ ఊరు కూడా కాదు’’ అన్నది ఆవిడ.
‘‘నీలాంటివాళ్ళకి ఇక్కడ స్థానం లేదు నీ ప్రవర్తన ఇక్కడ ఉన్నవాళ్ళకి మార్గదర్శం కాకూడదు నువ్వు చేతులారా చేసుకున్న ఖర్మ వెళ్ళిపో’’ అని పంపేశారు అనాధశరణాలయం హెడ్ సిస్టర్, వార్డెన్ కూడా.
నీళ్ళల్లోంచి బయటపడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంది జ్యోత్స్న మనసు
‘‘ఏం జరిగింది?’’
ఒక్కరోజు క్రితం తన భవిష్యత్తుని స్వర్గంలా ఊహించుకున్న తను, ఒక్క రోజు తేడాలో దారునంగా వాస్తవమైన నరకానికి తోయబడింది.
‘‘ఊహకి, వాస్తవానికి ఎంతతేడా’’
‘‘ఎందుకిలా జరిగింది?’’
ఎదిగీ ఎదగని వయస్సు, పూర్తిగా పరిపూర్నత చేకూర్చుకోలేని, వికసించని మనసు. బయట ప్రపంచం లోకంతీరూ తెలుసుకోకుండా తను పెరిగిన వాతావరణం పూర్తిగా తన పతనానికి అవకాశం ఇచ్చాయి.
‘‘భాస్కర్ ఎంత మంచివాడు అనుకుంది తను మనిషి అందమైన వాడు మాటలు తియ్యగా మాట్లాడ గలిగే నేర్పు ఉంది అతనికి మనసు మటుకూ హు మేడి పండులాంటి మనిషి
‘‘తను అతని మాటలు ఎంతగా నమ్మింది మనస్ఫూర్తిగా ప్రేమించింది. మొట్టమొదటిసారిగా పిచ్చిగా ఆరాధించింది. అతనే లోకం అనుకుంది.
అతనుకూడా తనని ఎంతో ప్రేమిస్తునానడు అనుకుంది తను.
కానీ, అది ఒట్టి భ్రమ ఎండ మావిలా అయిపోయింది తన జీవితం తనలో అతను ఆడుకున్నాడు. అవసరానికి వాడుకున్నడు బోజనం చేసిన తరువాత, తిని పారేసిన విస్తరిలా వాడుకున్నాడు ఇలా ఎంతమందిని మోసం చేశాడో.
తను ఒక అనాధ కాబట్టి, తనకి సంఘంలో విలువలేదు కాబట్టి దులపరించుకుని తేలిగ్గా వెళ్ళిపోయాడు.
తనలాంటి తెలియని అమాయకులైన అనాధలకి ఇంతకంటే సంఘంలో విలువలేదు కాబోలు అనాధ అంటే అందరికీ అలుసే అనాధ శరణాలయంలో పెరిగిన ఆడపిల్లలకి సంఘంలో విలువ లేదు ఇలాంటి సంకుచితమైన మనుష్యులముందు తమలాంటివాళ్ళకి గౌరవం ఎలా వస్తుంది?
‘‘భాస్కర్’’ ఎటువంటి భాస్కర్.
‘‘ఎంత సంస్కారవంతుడుగా ప్రవర్తించాడు. ఎన్ని ఆదర్శాలు పలికాడు. బహుశ, ఆడపిల్లల్ని మృదువుగా వశపరచుకుని, మోసం చెయ్యటానికి ఇదొక కొత్తరకం వల కాబోలు’’
అతిగా ప్రేమించిన మనిషిమీదే ద్వేషం కూడా పెరుగుతుంది వక్రిస్తే. అతని పేరు తలచుకుంటే ద్వేషంతో నిండిపోయింది జ్యోత్స్న మనసు పగ సాధించాలనే పట్టుదల ఎక్కువైంది.
కానీ ఎలా? అతని జాడే తెలియదే తెలివిగా తప్పుకున్నాడు.
———–