పేరు (ఆంగ్లం) | Anantapantula Ramalingaswamy |
పేరు (తెలుగు) | అనంతపంతుల రామలింగస్వామి |
కలం పేరు | – |
తల్లిపేరు | లక్ష్మీదేవి |
తండ్రి పేరు | వెంకట సోమేశ్వరరావు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 8/1/1890 |
మరణం | 1/1/1977 |
పుట్టిన ఊరు | విజయనగరం జిల్లాలోని పార్వతీపురం |
విద్యార్హతలు | – |
వృత్తి | ప్రభుత్వ పరిశ్రమల శాఖలో సూపరెంటెండెంటు |
తెలిసిన ఇతర భాషలు | సంస్కృతం, ఆంగ్లం, తెలుగు |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | శుక్ల పక్షం, శుక్ర చాపం (గేయసంపుటి), అనుతాపం, వివేకోపాసన, భువన విజయం, వికటవాణి, కథాయుగం కవితాంజలి, హిత సంహిత, భార్గవ రామాయణం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | అనంతపంతుల రామలింగస్వామి |
సంగ్రహ నమూనా రచన | 1910-20 మధ్యకాలంలో భావకవిత్వం పరుగులు పెడుతున్న కాలంలో రాయప్రోలు సుబ్బారావు, అబ్బూరి, దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి ప్రముఖులు చాలా రచనలు చేశారు. వానిలో దేవులపల్లి వారి కృష్ణ పక్షం ఒక ముఖ్యమైన కవితా సంపుటి. దీనిపై అనంతపంతుల ఎక్కుపెట్టిన గ్రంథాస్త్రమే శుక్లపక్షం (1932). దీనిపై విశ్వనాథ నరసింహం విమర్శ కూడా రాశారు. |
అనంతపంతుల రామలింగస్వామి
అనంతపంతుల రామలింగస్వామి ప్రముఖ తెలుగు కవి. ఇతడు భావకవిత్వం మీద వ్యంగ్య రచనలు చేశాడు.
ఈయన 1890, ఆగష్టు 1 తేదీన విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలో జన్మించాడు. సంస్కృతం, ఆంగ్లం, తెలుగు భాషలలో ఈయన ప్రవీణుడు. ఈయన కొంతకాలం ప్రభుత్వ పరిశ్రమల శాఖలో సూపరెంటెండెంటుగా ఉద్యొగ బాధ్యతలు నిర్వహించాడు. వీరికి సాంప్రదాయ కవిత్వం, ప్రబంధాల గురించిన ఇతివృత్తాలు, దేశభక్తిని బోధించే రచనలు అంటే చాలా ప్రీతి.
1910-20 మధ్యకాలంలో భావకవిత్వం పరుగులు పెడుతున్న కాలంలో రాయప్రోలు సుబ్బారావు, అబ్బూరి, దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి ప్రముఖులు చాలా రచనలు చేశారు. వానిలో దేవులపల్లి వారి కృష్ణ పక్షం ఒక ముఖ్యమైన కవితా సంపుటి. దీనిపై అనంతపంతుల ఎక్కుపెట్టిన గ్రంథాస్త్రమే శుక్లపక్షం (1932). దీనిపై విశ్వనాథ నరసింహం విమర్శ కూడా రాశారు.
1920 నుండి 1937 వరకు ఆంధ్రపత్రిక, శారద, భారతి పత్రికలలో పాతికపైగా ఈయన రచనలు ప్రచురితమయ్యాయి.
———–