దాసరి సుబ్రహ్మణ్యం (Dasari Subrahmanyam)

Share
పేరు (ఆంగ్లం)Dasari Subrahmanyam
పేరు (తెలుగు)దాసరి సుబ్రహ్మణ్యం
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం1/10/2010
పుట్టిన ఊరుతెనాలి ప్రాంతంలోని చుండూరు రైల్వేస్టేషన్ కు దగ్గర్లో ఉన్న పెదగాదెలవర్రు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుచందమామ: తోకచుక్క (1954 – 55),
మకరదేవత (1955 – 56), ముగ్గురు మాత్రికులు (1957 – 58), కంచుకోట (1958 – 59), జ్వాలాద్వీపం (1960 – 61), రాకాసిలోయ (1961 – 64)
బొమ్మరిల్లు: మృత్యులోయ (1971 – 74), శిథిల నగరం (1974 – 75), మంత్రాలదీవి (1976 – 80)
గంధర్వ నగరం (1980-82), సర్పకన్య (1982-85)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికదాసరి సుబ్రహ్మణ్యం
సంగ్రహ నమూనా రచనచందమామలో చేరక ముందు ఆయన కమ్యూనిజాన్నీ, హేతువాదాన్ని అధ్యయనం చేశారు. పదహారేళ్ళకే కమ్యూనిస్టు ఉద్యమంలో పాలుపంచుకున్నారు. జైలుకు వెళ్ళారు. బోధన్ చక్కెర కర్మాగారంలో, మహారాష్ట్రలోని ఆంగ్లేయుల సైనిక శిక్షణా శిబిరంలో కూడా కొద్ది రోజుల పాటు పనిచేశారు. తరువాత ఆ ఉద్యోగాన్ని వదిలి పాండిచ్చేరి చేరుకున్నారు. అక్కడ అరవిందాశ్రమం ప్రెస్ లో తెలుగు కంపోజర్ గా, ప్రూఫ్ రీడర్ గా పనిచేశారు. మెల్ల మెల్లగా పత్రికా సంపాదకులతో పరియాలు పెరిగాయి.

వాటి ప్రభావంతో చిత్రగుప్త, తెలుగు స్వతంత్ర, అభిసారిక వంటి పత్రికల్లో సాంఘిక కథలు రాయటం అలవాటయ్యింది. అప్పుడే చక్రపాణి నుంచి పిలుపు రావడంతో చందమామలో చేరారు. అక్కడ చేరిన మొదట్లో సాదా కథలతో సరిపెట్టుకున్న ఆయన రాజారావు ఆకస్మిక మరణంతో ఆయన రాస్తూ వచ్చిన సీరియల్ విభాగంలో దాసరికి అవకాశం వచ్చింది. ఆయన రాసిన మొట్ట మొదటి సీరియల్ తోకచుక్క. అది బాల సాహిత్య చరిత్రలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మరో పాతికేళ్ళపాటు ఆయన ధారావాహికలు చందమామలో నిరాటంకంగా ప్రచురితమయ్యాయి. వ్యక్తిగత కారణాలతో 1978 తర్వాత ఆయన సీరియల్స్ రాయడం మానుకున్నారు.

ఆయనకు కుటుంబం అంటూ ఏదీ ఉండేది కాదు. చందమామ ఆఫీసు ప్రాంతంలోనే గది తీసుకుని ఒంటరిగా ఉండేవారు. ఆయనకు పెళ్ళి అయి, ఒక కూతురు కూడా ఉన్నప్పటికీ ఆయనతో ఎవరూ ఉండేవారు కారని ఒక సందర్భంలో కొడవటిగంటి కుటుంబరావు తెలియజేశారు

దాసరి సుబ్రహ్మణ్యం

దాసరి సుబ్రహ్మణ్యం రచించిన నవలల్లో ఒక జానపద నవల అగ్నిమాల .జనవరి 2011 వ సంవత్సరం పుస్తకంగా విడుదలైంది .
చందమామలో దాసరి సుబ్రహ్మణ్యం ‘రాకాసి లోయ’ తర్వాత రెండేళ్ళ పాటు బెంగాలి సీరియల్స్ ‘దుర్గేశ నందిని’, ‘నవాబు నందిని’ ని ప్రచురించారు.అటువంటి సంస్థాన కథలు తెలుగువారం వ్రాయలేమా అన్న పట్టుదలతో రాజపుత్ర సంస్థానాల నేపథ్యంలో ‘అగ్నిమాల’ రాయడం జరిగింది. అగ్నిమాల కథలో సాధారణానికి భిన్నంగా రాజకీయం ప్రేమకు దారి తీయడం, వ్యూహానికి ఉన్న ప్రాధాన్యం ప్రేమకు లభించక పోవడం వంటివి ముఖ్య అంశాలు.ఈ కథ
చంద్రగిరి రాజైన నవభోజ మహారాజుకు మరియు కాలభోజ మహారాజుకు మధ్య ఉన్న రాజకీయ వైరంతో ప్రారంభమవుతుంది.చంద్రగిరి రాజాశ్రితుడైన అగ్నిపాలుడు మహావీరుడు, రాజభక్తుడు అయిన అగ్నిపాలుడు భారతంలో ధర్మరాజు లాగా ఒక చిన్న అపరాధం చేశాడు.అది ఒక వారకాంత కోసమై క్షత్రియుడైన జగ్గరాజుపై కత్తి దూయడం.నవభోజ మహారాజు కాలభోజుని కుట్రలకు ప్రత్యుపాయ పన్నాగంగా తన అనుచరుడు వారవనితా హృదయాధినేత అయిన అవజ్ఞవర్మను బలవంతుడైన మల్లూరు మండలాధీశుడు ప్రసేన మహారాజుకు అల్లుడుగా చేయడం ద్వారా తన రాజ్య బలాన్ని పెంచదలిచాడు. కుటిలుడు, దుష్టుడు అయిన అవజ్ఞవర్మ ప్రసేన మహారాజు కుమార్తె అయిన వకుళమాలతో ప్రేమలో విఫలుడై తన దుస్థితిని అగ్నిపాలుడుపై మోపదల్చుకున్నాడు. స్నేహితులైన ఓబలరాజు,జయసింగ్ ప్రేరేపణల వల్ల తనకు తెలియకుండానే అవజ్ఞవర్మ చేయలేని పనిని తాను చేయగలనని అవజ్ఞవర్మతో తన సంస్థానాన్ని పందెం కడతాడు. నవభోజునికి తెలియకుండా అగ్నిపాలుడు తన అనుచరుడైన మాహూ మరియు కొంతమంది సైనిక బృందంతో ప్రసేనుడి ఇంటికి బయల్దేరుతాడు.మార్గ మాధ్యమంలో కాలభోజుని అనుచరుడైన విష్ణుమిత్రున్ని కలిసి కొన్ని లేఖలు అందుకుంటాడు. అవి తన ప్రేయసికి అందించమని ప్రేయసి పేరు చెప్పకుండానే స్పృహ కోల్పోతాడు.
మాహూ ద్వారా విష్ణుమిత్రుడు మరణించాడని భావించిన అగ్నిపాలుడు దారి తప్పి బృందంతో వీడి ప్రసేనుడి కోటకు చేరుకుంటాడు. తన వద్ద ఉన్న లేఖల కారణంగా అగ్నిపాలుడిని విష్ణు మిత్రుడిగా భావించి ప్రసేనుడు ఆశ్రయం ఇస్తాడు. సమయం గడువగా వకుళమాల, అగ్నిపాలుడిని ప్రేమించిన విషయం తెలుసుకున్న వకుళమాల మామ బేతాళవర్మ రాజద్రోహం చేయుటకు పూనుకుంటాడు. విష్ణుమిత్రుని ప్రేయసి తండ్రి అయిన మణిమంతుని ద్వారా విష్ణుమిత్రుడి స్వభావం మంచిది కాదని భావించిన వకుళమాల విష్ణుమిత్రునిగా చెలామణీ అవుతున్న అగ్నిపాలుడిని నవభోజ మహారాజు సైనికులకు పట్టిస్తుంది. విష్ణుమిత్రునిగా భావించి అగ్నిపాలుడిని తీసుకు వెళ్ళిన సైనికులలో ధర్మనందుడు ఉదార స్వభావం కలిగిన వాడవటంతో అగ్నిపాలుడికి మాహుని వెతుకుటలో సహాయం చేస్తాడు.అవజ్ఞుని స్వభావం తెలియని నవభోజుడు అతనిని న్యాయస్థానానికి అధినేతగా చేస్తాడు. ఈ అవకాశం అదునుగా భావించిన అవజ్ఞవర్మ అగ్నిపాలుడిని విష్ణుమిత్రుని పేరుమీద రాజద్రోహ నేరం క్రింద ఉరి శిక్ష విధిస్తాడు. ఓబలుడి ద్వారా అసలు విషయం తెలుసుకున్న నవభోజ మహారాజు జయసింగ్, మాహూల ద్వారా అగ్నిపాలుడిని కాపాడుతాడు. అగ్నిపాలుడు బేతాళవర్మ కుట్ర నుంచి ప్రసేనుని కాపాడి వకుళమాలని సొంతం చేసుకుంటాడు.
ప్రచురణకర్తగా, పత్రికానిర్వాహకునిగా కూడా అయోధ్యరామయ్య కృషిచేశారు. 1948-50 మధ్య కాలంలో భాగ్యనగర్ పత్రికను నడిపారు. విజ్ఞాన గ్రంథమాల సంస్థను ఏర్పాటు చేసి 10పుస్తకాలను ప్రచురించారు.

———–

You may also like...