పత్రి రామసీత (Patri Ramaseeta)

Share
పేరు (ఆంగ్లం)patri Ramasita
పేరు (తెలుగు)పత్రి రామసీత
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఇంటర్వ్యూ, కోరిక
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికపత్రి రామసీత
సంగ్రహ నమూనా రచన

పత్రి రామసీత
ఇంటర్వ్యూ

సుబ్బారావు పొద్దున్నే మా ఇంటికి పరుగెత్తుకువచ్చి తనకు సర్వీసు కమిషను దగ్గరనుంచి ఇంటర్వ్యూకు రమ్మని ఉత్తరం వచ్చిందని వెల్లడించాడు. నేను కంగ్రాచ్యులేషను చెప్పేలోగానే, ఆ ఉద్యగోం యొక్క గొప్పతనం తనకు రాబోయే జీతం వివరాలు, తనకింద ఉండగల గుమాస్తాల సంఖ్య, తను నిర్వహించాల్సిన బాధ్యతలు, పైకి ఎగబాకి పోవటానికి గల అవకాశాలు మొదలైనవి వివరించి చెప్పేశాడు అసలు ఆ ఉద్యోగానికి తనే తగినవాడినని, తనకోసమే ఆ ఉద్యోగం ఖాళీగా ఉందేమో నన్న అభిప్రాయం వెలిబుచ్చాడు. అయితే అది ‘‘గెజిటెడ్ ఆఫీసర్ రాంక్’’ కాదే అన్న బాధ పట్టుకు పీడిస్తోందన్నాడు. కాని ‘‘ప్యూచర్ ప్రాస్పెక్ట్స్’’ బాగా ఉన్న ఉద్యోగం కనుకనూ, ప్రస్తుతంలో 350 రూ.లు జీతం ఇస్తారు కనుకనూ, తనబోటి తెలివైనవాడు తెగ ‘‘షైను’’ అయిపోటానికి తగినది కనుకనూ ఈ ఇంటర్వ్యూకు వెళ్లటానికే నిశ్చయించుకున్నానన్నాడు. ఇటువంటి ఉద్యోగాలకు సాధారణంగా సెలక్టు చేసుకునేటట్టయితేనే ఇంటర్వ్యూకు పిలుస్తారట. అల్లాటప్పాగాళ్లందర్నీ పిలవరట. కాబట్టి తను ఆఫీసరయిపోయనట్టే నన్నాడు. తనకు తోడుగా నన్ను కూడా రమ్మన్నాడు.
‘‘సుబ్బారావు ఉద్యోగాన్వేషణ’’ అనే అంశంపై మీకు కొద్దిగా వివరించాలసి ఉంటుంది. అసలు సుబ్బారావునాకు స్వయానా మేనత్త కొడుకు. వాళ్ల నాన్నగారు హైస్కూల్లో లెక్కల మేష్టారు. లెక్కల మేష్టార్లకు ఉండాల్సిన కరుకుదనం మొదలైనవాటికి ఆయనను మూర్తీభవించిన ఉదాహరణగా పేర్కొనవచ్చను. దానికి తోడు ఆయనకు క్రకమశిక్షణ, విద్యవిధానం, మదలైన విషయాలమీద ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. వాటన్నిటినీ సుబ్బారావుమీద ప్రయోగించి అతన్ని ‘‘మోడల్ స్టూడెంటు’’గా చెయ్యాలని ఆయన ఆశయం. అందుచేత మావాడు చీకటిపడేవేళకే ఇంటికి చేరుకోవటం, తర్వతా భోంచేసి చదువుకుని పది గంటలకే నిద్రపోవటం, తెల్లవారకట్లనే లేచి చదువుకోవటం, సినిమాల వంటి దురలవాట్లు లేకుండా చేసుకోవటం మొదలైనవి విధిగా, చెయ్యాల్సి వచ్చింది. అదీకాక సుబ్బారావుకు కూడా ఇటువంటి మంచి అభిప్రాయాలు ఉండటంచేత తనంతట తానే కొన్ని అమలుపరచేవాడు. క్లాసులో ముందర బెంచీమీద కూర్చోవటం, తీరికవేళల్లో క్లాసులో ఫస్టున వచ్చే కుర్రాళ్లతోనే మాట్లాడటం, అప్పుడప్పుడు లెక్చరరుగారిని తెలియని లెక్క అడగటం, సినిమాలు సాధ్యమైనంత తక్కువగా చూడటం, రోడలమీద అసలు తిరక్క పోవటం, ఇత్యాది పనులు తు.చ. తప్పకుండా ఆచరించేవాడు. ఈ తరహా కుర్రవాళ్లందరూ ఫస్టుక్లాసులో పాసయిపోతారన్న విషయం అందరికి తెలిసిందే. తనకు ఫస్టుక్లాసు రావటంతో నోబుల్ ప్రైజ్ వచ్చినంత సంబరపడిపోయాడు. ఇదే విధంగా ఎమ్మెసీ, డి.యెస్సీ మొదలైనవి కూడా ఫ్టస్లుక్లాసులో పాసయిపోయి ఒక గొప్పవాడ్నయి పోదా మనుకున్నాడు. ఆతర్వతాత ఒక స్కాలర్ షిప్పు మీద ఎక్కి కూచుని అమెరికా, ఫ్రాన్సు షికారు వెళ్లి రావచ్చని సంబరపడ్డాడు. అయితే వాళ్ల నాన్నగారికి ఈ వ్యవహారం అంతగా రుచించలేదు. కలల అలల మీద తేలుతున్న సుపుత్రుణ్ని ఒక మంచిరోజు చూసుకుని నేలమీదకు దింపి, మంచి ఉద్యోగం చూసుకుని వేన్నీళ్లకు చన్నీళ్ల మాదిరిగా ఉండవలసినదిగా బోధించాడు. సుబ్బారావు దిగాలుపడినవాడై తల్లి ద్వరా తండ్రి మనస్సు మార్చాలని ప్రయత్నించాడు కాని, తల్లే అందుకు ఒప్పుకోకపోవటం వల్ల తప్పనిసరిగా ఉద్యోగాన్వేషణ చెయ్యవలసి వచ్చింది.
కాని తనబోటి మాథమాటిక్సు గ్రాడ్యుయేట్ మామూలు గుమాసత్ ఉద్యోగం చెయ్యటం చిన్న తన మనిపించింది. నలుగురు స్నేహితుల నడిగాడు తనబోటివాడు చెయ్యదగ్గ ఉద్యోగం ఏదైనా చెప్పమని. ఒకాయన ఐ ఏ.ఎస్.కు వెళ్లి కలక్టరయిపోవలసినదిగా సలహా యిచ్చాడు. అసలా మాట కొస్తే గెజిటడ్ ఆఫీసరుకు తక్కువ ‘‘రాంకు’’ ఉద్యోగం చెయ్యవద్దన్నాడు. పైగా ఇదే ఇంగ్లండో, అమెరికానో అయితే తద్దలాగా ఎగరేసుకు పోయేవారినిన్నీ, ఎప్పుడూ గుమాస్తా ఉద్యోగం చెయ్యనని ప్రమాణం చెయ్యమనీ కూడా అన్నాడు.
ఆరోజునుంచి ప్రతీ పేపరూ చూసేవాడు, ఎక్కడైనా గెజిటెడ్ ఆఫీసరు ఉద్యోగాలకు ఖాళీలున్నాయేమోనని. అదేం ఖర్మో కాని అటువంటి ఉద్యోగాలకు అటడ్వర్టయిజ్ మెంట్లు చాలా తక్కువగా వచ్చేవి అదమం ఒక్కటైనా ఉన్నా, వాటికి బోలెడు గొంతెమ్మ కోరికలుండేవి. పొరపాటున కనీస విద్యార్హత ‘‘గ్యాడ్యుయేట్’’ అని ఉన్నాదానికి తోకలాగా అధమం అయిదు సంవత్సరాల అనుభవం కావాలని వేసేవారు. అయితేనేం మావాడు ఆశ వదులుకోలేదు. ‘‘తనకు గెజిటెడ్ ఆఫీసరు ఉద్యోగం ఇవ్వాల్సి వస్తుందని గవర్నమెంటువారు అసలు ప్రకటన చెయ్యటమే మానివేశా’’రన్నాడు. తనబోటి ‘‘జీనియస్’’ ఇక్కడ ‘రాట’వుతున్నట్టు వాళ్లకు తెలియదేమోనని అభిప్రాయ పడ్డాడు. అసలు ఈ యూనివర్సిటీవాళ్లకు బుద్దిలేదన్నాడు. ఎందుకంటే ఫస్ట్ క్లాసు గ్రాడ్యుయేట్ల లిస్టు ఒకటి గవర్నమెంటువాళ్లకు ఇచ్చేస్తే, వాళ్లేమో ఈ లిస్టులోనుంచి తనబోటి వాళ్లను సెలక్టు చేసుకోవచ్చునట. అది చాలా తేలికగా ఉంటుందిట కూడాను. అటు గవర్నమెంటు వారికి ఇటు వీళ్లందరూకూ వ్యయప్రయాసలకు తగ్గుతాయి. ఈ ఊహ గవర్నమెంటువారికి తట్టకపోవటం మావాడి దురదృష్టమే మరి.
చివరకు ఒకరోజు పేపర్లో ఎటువంటి లక్షణాలు గల ఉద్యోగాలు కావాలని తను తహతహలాడిపోతున్నాడో సరిగ్గా అటువంటివే రెండు ఉద్యోగాలు కనుపించాయి. పైగా ‘‘ఫస్ట్ క్లాసు గ్రాడ్యుయెట్లు అయితే చాలునని, పూర్వపు అనుభవం లేకపోయినా సరే, ఆఫీసరు ఉద్యోగాలు ఇచ్చేస్తమని, కావాలిసనవాళ్లు దరఖాస్తులు పంపుకోవచ్చునని’’ ప్రకటించారు. మావాడు తెగ మురిసిపోయాడు. ఆ తర్వాత ఆ ఉద్యోగాలకు దరఖాస్తులు పడేశాడు అయితే ఒక చిక్కు వచ్చింది. ఈ రెండు ఉద్యోగాలు తనకు వచ్చుస్తే ఏ ఉద్యోగానికి వెళ్లటమూ అనేది పెద్ద సమస్యగా తయారయిందన్నాడు. ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు ఆ ఉద్యోగం యొక్క ‘‘ప్యూచర్ ప్రాస్పెక్ట్స్’’ కనుక్కుని ఏ ఉద్యోగంలో చేరాల్సింది నిర్ణయిస్తానన్నాడు.
ఇంక ఆ మర్నాటి నుంచి మావాడు ఇంకా ఇంటర్వ్యూకు ర్మ్మని ఉత్తరం రాలేదని నానాబాధ పడేవాడు. పోష్టుమాన్ కనుపించటం తరువాయి. తనకు తప్పకుండా ఉత్తరం రావాలిన, వెతికి చూడమని వేధించేవాడు. కొంతకాలం గడిచాక ఇంక తనకు ఇంటర్వ్యూ రాదనుకున్నాడు. మళ్ల ఉయోగ ప్రకటనలు వెతకటం మొదలుపెట్టాడు. ఈవిధంగా ఒక అరడజను ఉద్యోగాలకు అప్లయి చేయటమూ, వాళ్లు కనీసం సమాధానంగా ‘‘మా శాఖలో ఫలానా ఉద్యోగమునకు మీరు సెలక్టు కాలేదని తెలుపుటకు విచారించుచున్నాము’’ అని అయినా రాయకుండా ఉండటమూ జరిగింది. అయినా మావాడు ఆపీసరు ఉద్యోగానికి ఆశ వదులుకోలేదు.
ఇది ఇట్లా ఉండగా ఇంటర్వ్యూకోసరమని ఏవిధంగా తయారుకావాలో కొంతమంది పెద్దవాళ్లను అడిగి తెలుసుకున్నాడు. పూపరు తెప్పించి శ్రద్దగా చదవటం మొదలుపెట్టాడు. జనరల్ నాలెడ్జి పుస్తకం ఒకటి కొనేశాడు. కెనడీ దగ్గర్నుంచి మావూరు పంచాయతీబోర్డు ప్రెసిడెంటు వరకు ఎవరెవరు ఏఏ పదవుల్లో ఉన్నారు, టోగో దేశపు ఎల్లలు ఏవి, టైబరు నది ఒడ్డున గల పట్టణము రాజధానిగా గల రాజ్యము ఏది, కొంగ గంటకు ఎన్నిమైళ్ల వేగముతో ఎగురును, ధరామమీటరు పొడవు ఎంత, అలెగ్జాండరు మొదలుకొని చైనావారి వరకు హిందూదేశముపై ఎవరెవరు దండెత్తిరి, ప్రపంచములో గల ఎత్తయిన కట్టడములు, లోతైన కందకములు మొదలైనవన్నీ కంఠతా పట్టేశాడు. అప్పటికీ నమ్మకం కుదరకు మాచేత రెండు, మూడు ‘మాక్’ ఇంటర్వ్యూలు కూడా పెట్టించుకున్నాడు. ఇంక ఇంటర్వ్యలో తనకు డోకా లేదు పొమ్మన్నాడు.
ఈలోగా వాళ్ల నాన్నగారు ఇండియాలో ఆఫీ­సరు ఉద్యోగాలే కాకుండా గుమాస్తా ఉద్యోగాలు కూడా ఉన్నాయని, అవి కూడా చాలా బావుంటాయని, 150 రూ. ల సంపాదించవచ్చుననీ బోధించారు. అయితేనేం, మావాడు ‘‘ససేమీరా వినను’’ పొమ్మన్నాడు. తింటే గారలే తినాలి, చేస్తే ఆఫీసరు ఉద్యోగమే చేయాలి. కనుక తక్కువ ఉద్యోగాలు చెయ్యనన్నాడు.
ఏమైతేనేం ఇప్పుడు ఇంటర్వ్యూ వచ్చింది కనుక తన కష్టాలు గట్టెక్కయని భావించాడు. ఇంటర్వ్యూ తరువాత ఉద్యోగం రావటం ఖాయం కాబట్టి తనింక బాధపడక్కర్లేదన్నాడు.
సర్వీస్ కమీషనువారి ఆఫీసుకు వెళ్ళేవరకు మావాడు ఇదే రకమైన అభిప్రాయాలు వెలిబుచ్చుతూనే ఉన్నాడు. అక్కడ చేరిఉన్న జనాభాను చూసేసరికి మావాడు గతుక్కుమని ‘ఏవిట్రా ఇంతమంది చేరారు, కొంపదీసి అందరూ ఇంటర్వ్యూకే కాదుగదా’’ అని వాపాయాడు. విచారించగా అక్కడ ఉన్న వాళ్లలో చాలామంది ఇంటర్వ్యూకేనని తేలింది. అందులో ప్రతి ఒక్కరి ముఖంలోనూ ‘‘ఆఫీసరు’’ కళ ఉట్టిపడుతోంది. కొందరు గుంపులు గుంపులుగా చేరి మాట్లాడుకొంటున్నారు. ప్రక్కవాళ్ళతో మాటాడ్డవే తమ గౌరవానికి భంగమన్నట్టుగా మూతి బిగించుకు కూచున్నారు కొందరు. కొంతమంది పుస్తకాలు పేపర్లు తెగ నమిలేసి భట్టీయంపట్టిస్తున్నారు. వాల్ల ముకాలలో ఆదుర్దా స్పష్టంగా కనుపిస్తోంది. మరికొందరు మన్నుతిన్న పాముల్లా గోళ్లు గిల్లుకుంటూ కూచున్నారు. కొందరేమో హాలు ఈ చివర్నించి ఆ చివరకు హడావుడిగా తిరిగేస్తున్నారు. దారిలో కనపడ్డవాళ్లను నిలేసి ఏమిటో అడిగేస్తున్నారు. మధ్యలో విట్లు కూడా వేస్తున్నారు.
అక్కడ చేరివున్న వాళ్ల మొహాలలోని భావాలనుబట్టి మూడు తరగతులుగా విభజించవచ్చు. మొదటిజతివారు అర్జునుడు మత్స్యయంరతం కడకొట్టినంత అవలీలగా తాము ఈ ఉద్యోగాన్ని ‘‘కొట్టెయ్యగల’’మనే ధీమాతో ఉన్నారు. వాళ్లు అప్పుడే ఆఫీసర్లయిపోయినట్లుగానే భావించుకొని అదే పద్ధతిలో నడుస్తునానరు. కూచుంటున్నారు, మాట్లాడుతున్నారు కూడాను. రండో తరగతి వారు చాలా బిడియస్తులు. మాట్లాడితేనే కొంపెలక్కడ అంటుకుంటాయో నన్న భయం స్పష్టంగా కనపడుతోంద. ఈ ఉద్యోగం వస్తుందో రాదోనని వూరికే మధనపడుతున్నారు. ఇంక మూడో గ్రూపువాళ్లు దేన్నీ ఖాతరు చేస్తున్నట్టు లేదు. ఇలాంటివి ఎనిన చూశామో అన్న ఫోజు పెట్టారు. వాటిలో ఇదొకటి. తగిల్తే మంచిదే, లేకపోతే మరీ మంచిది అన్నట్టు ఉన్నారు.
ఇంతలో మా పక్కన కూర్చున్నాయనకు వూరికే కూచోవటం విసుగు పుట్టింది కాబోలు ఏం చదివారని మావాడ్నిడిగాడు. బియస్సీ ఫస్ట్ క్లాసుని ధీమాగా చెప్పాడు వీడు. మరి మీరేం చదివు అని కూడా అడిగాడు.
‘‘ఎమ్కామ్ ఎల్ ఎల్.బి’’ అన్నాడాయన. ఆ తరువాత ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చి మా కావలిఫికేషన్లడిగా వాళ్లని అడక్కుండానే వెల్లడించివెళ్లారు. చివరికీ తేలిందేమిటంటే ఇంటర్వ్యూకు వచ్చినవాళ్లలో మూడొంతులమంది పోస్టు గ్రాడ్యుయేట్లని, మిగిలినవాళ్లలో చాలామంది డబుల్ గ్రాడ్యుయేట్లనీను. అప్పటికే మావాడికి కొద్దిగా దిగులు పట్టుకుంది. కాని అప్పటికేం చెయ్యలేక వూరుకున్నాడు.
ఇంతలో వో చిన్న కలకలం బయలుదేరింది. అక్కడున్నవాల్లంతా లేచి ఓ మూలకు పరుగెత్తుతున్నారు. ఏం కొంప మునిగిందోనని మేం కూడా పరుగెత్తాము. అక్కడ ఒకాయన కూచుని టర్వ్యూలో గల పరమార్థానిన బోధిస్తునానడు. దగ్గర మార్గాలు, అడ్డదార్లు మొదలైనవి విపులీకరిస్తున్నాడు. అసలు శ్రీకృష్ణ పరమాత్మ గీతను బోధించినంత సులువుగా ‘‘వోస్ ఇంతేనా ఇంటర్వ్యూ అంటే’’ అనిపించేటట్లు చెప్పేస్తున్నాడు. ఆ తర్వతా ‘‘కాసబ్లాంకా కూటమి రాజ్యాలకు మన్రోవియా కూటమి రాజ్యాలకు టోగో ప్రెసిడెంటు హత్యను పురస్కరించుకుని యుద్ధం రాగలదా లేదా, కాంగో పరిస్థతి చక్కబడినట్లేనా? మన బంగారపు కంట్రోల్ గురించి మీ అభిప్రాయ మేమిటి? ప్రజలు ప్రస్తతపు బడ్జెట్ అనే అంశమును వివరించుము’’ అంటూ శరపరంపరగా ఒక డజను ప్రశ్నలు గుప్పించేస్తే ‘‘ఈ క్వొశ్చన్లు చాలా ఇంపార్టెంటండి. ఈ రోజుల్లో మీరు ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా వీటిలో ఏ రెండు ప్రశ్నలైనా అడక్కపోతే చెవి కోయించుకుంటా’’ నన్నాడు. క నిముషం ఆగి ‘‘మీలో ప్రతి ఒక్కరు ఉద్యోగానికి సెలక్టు కావాలని కాంక్షిస్తున్నాను. నేను చాలా బీదవాడ్ని, మీబోటివాళ్లు సంతోషపూర్వకంగా సహాయంచేస్తే కృతజ్ఞడ్ని’’ అని తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఈ మాటలు వినగానే అక్కడున్న వాళ్లలో చాలామంది పులిని చూసినట్టుగా పారిపోయారు వారిలో ఒకాయన ఒక మమాసత్యాన్ని వెళ్లడించినట్లుగా ‘‘ఇందుకనేననండి మన దేశం ఇంత హీనస్థతిలో ఉంది. అసలు ఇతన్ని హాలులోకి ఎవరు రానిచ్చారు’’ అని కోప్పడ్డాడు. కొంతమంది మారతం రూపాయో, అర్దో ఇచ్చారు. మొత్తానికి వో పదిరూపాయలదాకా పోగయింది. అతను అందరికి తన కృతజ్ఒతలు వెల్లడించి మళ్లా అందరూ సెలక్టు కావాలని ఆవిస్తున్నానని సెలవు పుచ్చుకున్నాడు.
తరువాత ఒక గుమాస్తా వచ్చి అక్కడివాళ్లందరన్నీ వాళ్ల ఉద్యోగాల వారీగా విభజించి వాళ్లు ఎక్కడికి వెళ్లి కూచోవాలో చెప్పి వెళ్లిపోయాడు ఇంటర్వ్యూకు రాని నాబోటివాళ్లు ఒక అరడజను మంది మాత్రం హాలులో మిగిలాము.
ఒక గంట పోయాక మావాడు ఏడుపు మొహంతో బయటకు వచ్చాడు. సంగతేమిటో చెప్పకుండానే వీధిలోకి లాక్కొచ్చాడు. తరువాత భోరుమని ‘తనకు ఆఫీసరయ్యే యోగ్యత లేదన్నాడు. ఇంక జన్మలో ఇంటర్వ్యూకు వెళ్లనన్నాడు. ఇంటర్వ్యూలను, ఉద్యోగాలను, గవర్నమెంటును తిట్టిపోశాడు. చివరకు అసలు విషయం చెప్పేశాడు. అసలు సంగతేమిటంటే మొదట మేమున్న హాలులో హడావుడి తరువాత అక్కడి వాళ్లలో చాలామంది పోస్టు గ్రాడ్యుయేట్లవటం మావాడ్ని కొద్దగా గాభరా పెట్టింది. పైగా ఇంటర్వ్యూ గురించి వివరించినతని ఉపన్యాసం, ప్రశ్నలు వినగానే సగం నీరసించాడు. ఎందుకంటే అట్లాంటి ప్రశ్నలకు మావాడు ‘‘ప్రిపేరు’’ కాలేదు. దానికి తోడు వీడి పేరు ఆరోజు ఇంటర్వ్యూకు వచ్చని వాళ్లలో మొదటిది కావటం చేత మిగిలినవాళ్లను ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారో తెలుసుకునే అవకాశం లేకపోయింది.
ఇంటర్వ్యూ చేసే గదిలోకి అడుగు పెట్టగానే అక్కడ కూర్చున్న నలుగురు మెంబర్లు మావాడి కంటికి కాటు వెయ్యటానికి సిద్దంగా ఉన్న తాచుపాముల్లాగా, ఎరమీదకు దుమికే పెద్ద పులుల్లాగా, వినటానికి శ్రోతలు దొరికిన రాజకీయ నాయకుడిలాగా, పాలసీ తీసుకుంటూనన్న మనిషి దొరికిన ఇన్సూరెన్సు ఏజంట్లులాగా కనిపించారట అందులో ఒకాయన బట్టతలతో నున్న యముడులాగా ఉన్నాట. ఆయన ‘‘విలన్’’ లాగా ఒక నవ్వు నవ్వి వీడ్ని కూర్చోమని ‘‘నేషణల్ ఎమర్జన్సీ’’ ఎందుకొచ్చిందో తెల్సా అని గదమాయించి అడిగాడు. వీడు బిక్కు బిక్కుమంటూ ‘‘తెలుసు’’ అన్నాడు. ఎందుకొచ్చిందో చెప్పు అని మళ్లీ అడిగాట్ట. ఇంతలోనే మావాడికి అర్జెంటుగా తుమ్ము వచ్చింది. అప్పుడు తుమ్మితే ఆఫీసరు పద్ధతిలో ఉండదని అబిప్రాయపడినవాడై ఆపటానికీ శత సహ్రస విధాల ప్రయత్నించాడు. కాని లాభంలేకపోయింది.
అటువంటి సమయంలో తుమ్ము వస్తుందని మావాడు కలలోనైనా వూమించలేదు. మావాడు ఆపటానికి ప్రయత్నించడంవలన దానికి కోసంవచ్చి ఇంకా ఎక్కువ ఫోర్సుతో హ్రాచ్చీ, హాచ్చి హ్రాచ్రీ అనే శబ్దంతో మూడుగా బయటకు దూకింది అనుకోకుండా వచ్చిపడ్డ ఈ అవాంతరానికి కమిటీ మెంబర్లు నలుగురు స్తంభించిపోయారు. వారి మొహాలు చూడటానికి మావాడికి భయం వేసింది. తను చేసిన ఘోరకృత్యానికి తనకు యావజ్జీవ కారాగారశిక్ష వేస్తారు కాబోలు నన్నటుటగా భావించారు అసలు తనను తుమ్ము ఆపటం కూడా చేతకాని చవటగా జమకట్టారేమోనని బాధపడ్డారు. తనకిక గత్యంతరం ఏమిటి, చేతికొచ్చిన ఆఫీసరు ఉద్యోగం ఒక్క తుమ్ము మూలంగా చెయ్యిజారి పోతోందే. ఇహ ఎప్పటికైనా తనకు ఆఫీసరు ఉద్యోగం వస్తుందా అని మావాడు బాధపడుతున్న సమయంలోనే ‘‘బట్టతల యముడు’’ గారు ఒక ప్రశ్నవేశాడు. అది వీడికి సిరగా వినపడలేదు వినపడిన భాగానికి సమాధానం చెప్పటానికి నోరు పెకిలి రాలేదు. ఈలోగానే ఇంకొక మెంబరుగారు అందుకున్నాడు. దాంతో వీడికి గాభరా ఎక్కవయింది. ఏ ప్రశ్నకో సమాధానం చెప్పాలో అర్థంకాలేదు. మొత్తం ప్రశ్నలకు సమాధానంగా శ్రీ కే. నెహ్రూగారు అంబాసడర్ జనరల్ ఆఫ్ అమెరికా ఇన్ ఇండియా అనేశాడు. ఈ సమాధానం వినటంతోటే వాళ్లకు మతిపోయి ‘‘అయ్యా తమరు ఇంక శలవు పుచ్చుకోవచ్చు’’ ననేశారు.
ఇదీ మావాడి మొదటి ఇంటర్వ్యూ ముచ్చట.

 

———–

You may also like...