పేరు (ఆంగ్లం) | Pingalai Lakshmi Kantham |
పేరు (తెలుగు) | పింగళి లక్ష్మీకాంతం |
కలం పేరు | – |
తల్లిపేరు | కుటుంబమ్మ |
తండ్రి పేరు | వెంకటరత్నం |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/10/1894 |
మరణం | 1/10/1972 |
పుట్టిన ఊరు | ఆర్తమూరు, క్రిష్ణా జిల్లా ( స్వగ్రామం చిట్టూర్పు ) |
విద్యార్హతలు | ఎమ్.ఏ ( మద్రాస్ విశ్వవిద్యాలయం ). రేపల్లెలో ప్రాథమిక విద్య, మచిలీపట్నం హైస్కూల్/ కాలేజి చదువు ( నోబుల్ కాలేజ్ ). |
వృత్తి | ఉపాధ్యాయుడు ( నోబుల్ కాలేజీ ఆంధ్ర పండితుడు ) & ( మద్రాస్ ప్రాచ్య పరిశోధనా విభాగంలో రీసర్చ్ ). బందరు నోబుల్ హైస్కూలులో తెలుగు పండితుడు. మద్రాసు ఓరియెంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలో పరిశోధకుడు. 1931 – ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మొట్టమొదటిసారిగా బి.ఏ, ఆనర్స్ కోర్సు ప్రాంభించిన సమయంలో అక్కడ లెక్చరర్‌గా చేరాడు. క్రొత్త కోర్సులకు రూపకల్పన చేశాడు. 18 సంవత్సరాల సర్వీసు అనంతరం 1949లో పదవి విరమించాడు. ఇతను చేసిన పాఠ్య ప్రణాళికలే ఇతర సంస్థలకు మార్గదర్శకాలయ్యాయి. ఇతని బోధనల నోట్సులే సాహిత్య చరిత్ర, విమర్శలకు ప్రామాణికాలయ్యాయి. 1954 – 1961 – విజయవాడ ఆకాశవాణి కేంద్రం సలహాదారు. 1961 – 1965 – శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యుడు. |
తెలిసిన ఇతర భాషలు | తెలుగు, సంస్కృతం. |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ఆంధ్ర సాహిత్య చరిత్ర, సాహిత్య శిల్ప సమీక్ష, మధుర పండిత రాజము, సంస్కృత కుమార వ్యాకరణము, గంగాలహరి, తేజోలహరి, ఆత్మాలహరి, ఆంధ్ర వాజ్మయ చరిత్ర, గౌతమ వ్యాసాలు, గౌతమ నిఘంటువు (ఇంగ్లీష్ – తెలుగు), నా రేడియో ప్రసంగాలు, మానవులందరు సోదరులు,(మహాత్మా గాంధీ ప్రవచనాలకు అనువాదం), తొలకరి, సౌందర నందము (1932) – పింగళి కాటూరి కవుల జంట కృతి |
ఇతర రచనలు | http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=154 |
ఈ-పుస్తకాల వివరాలు | https://archive.org/details/andhrasahityacha025940mbp |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రికి శుశ్రూష చేసి, సంస్కృతాంధ్రాలలో బాగా పఠించి వారి శిష్యులలో అగ్రగణ్యులయ్యారు. పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. రాయల అష్టదిగ్గజాలలో ఒకడైన పింగళి సూరన వంశానికి చెందినవాడు. లక్ష్మీకాంతం అధ్యాపకుడిగా, నటుడిగా, కవిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించాడు. కాటూరి వెంకటేశ్వరరావు తో కలసి వీరు ఆంజనేయస్వామిపై ఒక శతకం చెప్పారు. వీరిద్దరు జంటకవులుగా ముదునురు, తోట్లవల్లూరు, నెల్లూరు మొదలగు చోట్ల శతావధానాలు చేశారు. వీరు పాండవోద్యోగ విజయములు, ముద్రా రాక్షసము నాటకాలలో ధర్మరాజు, రాక్షస మంత్రిగా పాత్రలు చక్కగా పోషించి పేరుపొందారు. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యవర్గ సభ్యులుగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వీరికి విశిష్ట సభ్యత్వం ఇచ్చి సత్కరించింది. తెలుగు అకాడమీ బోర్డ్ మెంబరుగా, అకాడెమిక్ కౌన్సిల్ చేర్మన్ గా, మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ లోని తెలుగు విభాగంలో డిపార్ట్మెంట్ హెడ్ గా పనిచేశారు. మంచి సంగీతఙ్జులు. మంచి నటుడు: గయోపాఖ్యానంలో అర్జునుడుగా, నరకాసురవధ లో కృష్ణుడుగా నటించారు. సంస్కృత రూపక కర్తగా/ నిర్వాహకులుగా ఆకాశవాణి లో పని చేశారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ఆంధ్ర సాహిత్య చరిత్ర- కృతి సమర్పణము |
సంగ్రహ నమూనా రచన | కం. శ్రీధరునకు, నలమేల్మం గాధవునకు, శేషశైలనాధునకు, సురా రాధితపదాబ్జునకు, తే జోధవళితదిబ్ముఖునకు, సూర్యాత్మునకున్. ఉ. బాలిశుడైననాకు, నొకపాటివివేకమొసంగి, గాలికిన్ తూలెడునాకుకాలునిలద్రొక్కుకొనందగుధార్ఢ్యమిచ్చి, వా చాలుడనైపొనర్చునపచారసహస్ర శతాపరాధసం క్షాళనచేసియేలుకొనుస్వామికినియ్యదియంకితమ్మగున్ |
ఆంధ్ర సాహిత్య చరిత్ర- కృతి సమర్పణము
కం. శ్రీధరునకు, నలమే ల్మం
గాధవునకు, శేషశైల నాధునకు, సురా
రాధిత పదాబ్జునకు, తే
జోధవళిత దిబ్ముఖునకు, సూర్యాత్మునకున్.
ఉ. బాలిశుడై ననాకు, నొకపాటి వివేక మొసంగి, గాలికిన్
తూలెడు నాకు కాలు నిలద్రొక్కుకొనందగు ధార్ఢ్యమిచ్చి, వా
చాలుడ నై పొనర్చు నపచార సహస్ర శతాపరాధ సం
క్షాళనచేసి యేలుకొను స్వామికి నియ్యది యంకితమ్మగున్
కం. గురుడౌ వేంకటకవి, సౌం
దరనందము స్వీకరించి ధన్యత యొసగెన్
పరమేశ, కుమార వ్యా
కరణము నీకొసగి విబు గణ్యత గంటిన్.
కం. ఇది యింకొక కానుక నీ
మృదు పదముల నిడితి స్వీకరింపుము దీనిన్
సదమల కోమల కరుణా
స్పద శుభదాలోకనముల బరికింపు ననున్.
ఉ. సారతరాంధ్రవాజ్మయ విశాల జగత్పరిణామ కారణో
దార కవీ౦ద్ర కావ్య పురుషార్థ నిరూపిత త త్తదాత్మ స౦
స్కార విలోక దర్పణ ముఖమ్మిది, యీ చరితమ్ము సాహితీ
మేరువులౌ బుధో త్తముల మెప్పుగడి౦చెను మున్నె నీకృపన్.
గి. ఇది జని౦చిన నలుబదియే౦డ్లను౦డి
సరస సాహిత్య విఙ్ఞాన సత్రమనుచు
ఆశ్రయి౦పని తెలుగు విద్యార్థిలేడు
చొచ్చి చూడని తెల్గు వ్యాసు౦డు లేడు.
———–