పేరు (ఆంగ్లం) | Bhanumati Ramakrishna |
పేరు (తెలుగు) | భానుమతీ రామకృష్ణ |
కలం పేరు | – |
తల్లిపేరు | సరస్వతమ్మ |
తండ్రి పేరు | వెంకటసుబ్బయ్య |
జీవిత భాగస్వామి పేరు | పి.యస్. రామకృష్ణారావు |
పుట్టినతేదీ | 9/7/1925 |
మరణం | 12/24/2005 |
పుట్టిన ఊరు | ప్రకాశం జిల్లా, ఒంగోలు |
విద్యార్హతలు | – |
వృత్తి | సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని సంగీత దర్శకురాలు. |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | అత్తగారి కథలు, నాలో నేను, అత్తగారూ, నక్సలైట్లూ,ప్రేమ (1952) (కథ) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | 1966లో ఆమె వ్రాసిన అత్తగారి కథలు అను హాస్యకథల సంపుటికిగాను పద్మశ్రీ బిరుదు ఇచ్చి, భారత ప్రభుత్వము ఈమెను సత్కరించింది. ఇదే సంపుటికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు కూడా వచ్చింది. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు కళా ప్రపూర్ణ ఇచ్చి సత్కరించింది. 1984లో కలైమామణి బిరుదుతో తమిళనాడు లోని ఐయ్యల్ నాటక మన్రము సత్కరించింది. బహుకళా ధీరతి శ్రీమతి అను బిరుదుతో 1984 ననే లయన్స్ క్లబ్బు సత్కరించింది. 1984లో తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించింది. 1986లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ఇచ్చింది. 1986లో ఉత్తమ దర్శకురాలిగా అవార్డును ఆంధ్ర ప్రభుత్వము నుండి అందుకుంది. 2013 లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలయిన 50 ప్రముఖ చలనచిత్ర కళాకారుల తపాలాబిళ్ళలలో ఒకటి భానుమతి ది. |
ఇతర వివరాలు | ప్రముఖ దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని మరియు సంగీత దర్శకురాలు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | భానుమతీ రామకృష్ణ |
సంగ్రహ నమూనా రచన | భానుమతి ప్రకాశం జిల్లా దగ్గరున్న దొడ్డవరం గ్రామంలో 1925, సెప్టెంబరు 7న జన్మించారు. తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య. తల్లి సరస్వతమ్మ. వీరికి సంగీతంలో తొలి గురువు తండ్రిగారే. సంప్రదాయమైన కుటుంబం కావడం వల్ల భానుమతి పూర్తిగా కట్టుబాట్లతో పెరిగారు. అయినా 13 సంవత్సరాల వయసులోనే తండ్రిగారిని ఒప్పించి 1939లో వరవిక్రయం సినిమాలో నటించారు. ఈమె తొలిసినిమాకు తీసుకున్న పారితోషకం 350 రూపాయలు. ఆ రోజుల్లో పూర్తిగా మగవాళ్లే రాజ్యమేలుతూ, స్త్రీ పాత్రలు కూడా పురుషులే పోషిస్తున్న కాలంలో భానుమతి సినీరంగంలోకి అడుగుపెట్టారు. తనదైన సొంత ముద్రతో ఎదిగారు. భానుమతి గారిది బహుముఖీనమైన ప్రజ్ఞ. నటనపరంగా నభూతో నభవిష్యతి. చారిత్రక, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో విభిన్నమైన, వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఎక్కడా ఆమె తలవొంచుకుని ప్రవర్తించేది కాదు. తన మాట చెల్లాలనే మనస్తత్వం. చాలా మంది ఈమె ఆత్మాభిమానాన్ని చూసి పొగరు అనుకునేవారు. |
భానుమతి రామకృష్ణ
భానుమతి ప్రకాశం జిల్లా దగ్గరున్న దొడ్డవరం గ్రామంలో 1925, సెప్టెంబరు 7న జన్మించారు. తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య. తల్లి సరస్వతమ్మ. వీరికి సంగీతంలో తొలి గురువు తండ్రిగారే. సంప్రదాయమైన కుటుంబం కావడం వల్ల భానుమతి పూర్తిగా కట్టుబాట్లతో పెరిగారు. అయినా 13 సంవత్సరాల వయసులోనే తండ్రిగారిని ఒప్పించి 1939లో వరవిక్రయం సినిమాలో నటించారు. ఈమె తొలిసినిమాకు తీసుకున్న పారితోషకం 350 రూపాయలు. ఆ రోజుల్లో పూర్తిగా మగవాళ్లే రాజ్యమేలుతూ, స్త్రీ పాత్రలు కూడా పురుషులే పోషిస్తున్న కాలంలో భానుమతి సినీరంగంలోకి అడుగుపెట్టారు. తనదైన సొంత ముద్రతో ఎదిగారు. భానుమతి గారిది బహుముఖీనమైన ప్రజ్ఞ. నటనపరంగా నభూతో నభవిష్యతి. చారిత్రక, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో విభిన్నమైన, వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఎక్కడా ఆమె తలవొంచుకుని ప్రవర్తించేది కాదు. తన మాట చెల్లాలనే మనస్తత్వం. చాలా మంది ఈమె ఆత్మాభిమానాన్ని చూసి పొగరు అనుకునేవారు. కానీ భానుమతి మాత్రం మొక్కవొని ధైర్యంతో తన అపారమైన ప్రజ్ఞతో అనేక విజయాలను సాధించారు. 1943 ఆగస్టు 8న నిర్మాత, దర్శకుడైన పి.యస్. రామకృష్ణను ప్రేమించి, అనేక అవరోధాలను తట్టుకొని వివాహం చేసుకున్నది. వీరి సంతానం భరణి. ఆ పేరుమీదే స్టూడియోను నిర్మించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు భానుమతి.
1939లో వరవిక్రయం ద్వారా ప్రారంభమైన భానుమతి సినీ ప్రస్థానం 1998 పెళ్లికానుకతో ఆగింది. సుమారు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో వందకు పైగా చిత్రాలలో నటించారు. దర్శకురాలుగా- అసాధ్యురాలు, రచయిత్రి, చండీరాణి, భక్తధృవ మార్కండేయ (1, 2) వంటి పలు చిత్రాలకు పనిచేశారు. ఇక నిర్మాతగా మారి బాటసారి, విప్రనారాయణ, చింతామణి, ప్రేమ, లైలామజ్ఞు వంటి చిత్రాను నిర్మించారు. సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలైతే చింతామణి, చక్రపాణి, ప్రేమ లాంటివి ఎన్నో ప్రేక్షకుల మన్ననలు పొందాయి. అంతేకాదు ప్రేమ చిత్రానికి కథను కూడా అందించారు. ఇలా అర్థశతాబ్దం పాటు సినీరంగంలో తిరుగులేని పాత్ర పోషించారు. ఇలా అన్ని విభాగాలలోను పనిచేసిన మహిళ భారతదేశంలో ఈమె ఒక్కరే. వీరి నటనాపరంగా డా. సర్వేపల్లి రామకృష్ణ, బెజవాడ గోపాలరెడ్డి, పి.వి. రాజమన్నారు, కొడవటిగంటి కుటుంబరావు, చక్రాపాణీలు వీరిని ఎక్కువ అభిమానించే వారు.
భానుమతి ఒక్క సినీరంగానికి సంబంధించిన వారే కాదు భిన్నమైన రంగాలలో కూడా ప్రతిభను కనపరిచారు. ఈమె చిత్రకారిణి, జ్యోతిష్యురాలు. తాత్వికమైన అంశాలలో మంచి ప్రవేశం ఉంది. నాలో నేను పేరిట ఆత్మకథను రాసుకున్నారు. ఇది టెలీ సీరియల్ గా కూడా వచ్చింది. వంటలు చేయడంలో అందివేసిన చెయ్యి. చెన్నై నగరంలో డా. భానుమతి రామకృష్ణ మెట్రిక్యులేషన్ స్కూలు స్థాపించి ఉచిత విద్యను అందించారు. తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్ గా కూడా పనిచేశారు. తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డు మెంబరుగా కూడా కొంతకాలం ఉన్నారు.
అన్నిటిని మించి భానుమతి మంచి రచయిత్రి. తెలుగువారు గర్వించదగ్గ అత్తగారి కథలు రచించారు. వీరు రచించిన కథలు- 1967లో అత్తగారి కథలు(7), 1971లో అత్తగారూ – నక్సలైట్లూ (9), 1985లో అత్తగారి కథలు (8), 1991లో భానుమతి కథలు (20) పేరిట ముద్రితమై అందుబాటులోకి వచ్చాయి. వీరి కథల్లోని అత్తగారు హాస్యాన్ని పండిస్తూనే తన పెద్దరికాన్ని నిలబెట్టు కుంటుంది. మానత్వాన్ని ప్రదర్శిస్తుంది. అత్తగారి ప్రవర్తన, మాటలు, చేతలు హాస్యాన్ని పుట్టిస్తూ ఆసక్తిగా సాగుతాయి. ఈ కథల్లోని అత్తగారు మద్రాసులో ఉంటారు. ఇంట్లో, చుట్టుపక్కల ఇళ్లల్లో ఈమె మాటకు తిరుగు ఉండదు. అందరూ ప్రేమను అభిమానాన్ని ఈమె పై కురిపిస్తారు. ఆవకాయ పెట్టడం నుంచి అరటి కూర చేయడం వరకు అందివేసిన చెయ్యి. పాతకాలపు పెద్దమనిషి. తెలుగు సాహిత్యంలో గిరీశం, ఎంకి, బుడుగు పాత్రలు ఎలా నిలిచిపోయాయో భానుమతి అత్తగారి పాత్రకూడా అలానే నిలిచిపోయింది. ఇవి ఆంగ్లంలోకి కూడా అనువాదమయ్యాయి.
భానుమతి కృషికి ఎన్నో అవార్డులు, పురస్కారాలు వచ్చాయి. 1956లోనే రాష్ట్ర గౌరవ పురస్కారం వచ్చింది. 3 సార్లు జాతీయ పురస్కారాలు పొందారు. తమిళులు ఈమెను తమ రాష్ట్ర అష్టవధానిగా కీర్తిస్తారు. కేంద్రప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చింది. 1975లో ఆంధ్రవిశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదును ప్రధానం చేసింది. 1984లో మద్రాసు ప్రభుత్వం కలైమణి బిరుదు ఇచ్చింది. 1986లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ప్రధానం చేసింది. 1986లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ దర్శకురాలిగా గుర్తించింది. అత్తగారి కథలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది.
ఇలా బహుముఖీన ప్రతిభతో వివిధ రంగాలలో కృషి చేసిన భానుమతి 2005, డిసెంబర్ 24 న మరణించారు. ఆమె నేటి తరానికి ఆదర్శం. ఆమె పట్టుదల ఓ పాఠం. ఎందరో మహిళలకు ఆమె ఒక లెజెండ్.
అత్తగారి కథలు
(ప్రధమ భాగం)
అత్త గారూ ఆవకాయా
సాధారణంగా మద్రాస్లో ఉండే తెలుగు జనాభాకు ఆవకాయ తినే ప్రాప్తం కలగడం అద్రుస్తంలో ఒక భాగం అని చెపాల్సిందే. విజయవాడ దగ్గరనుండి విశాఖపట్నం వరకూ ఉండే వూళ్ళలో, బంధువులో, తెలిసినవలో వుండి ఆవకాయ జాడీలు మద్రాసుకు రవాణ చేస్తే తప్ప బంధువులు, తెలిసినవలు, కనీసం ఆవకాయ సప్లై చేసే రకం బంధువులు-ఇద్దరు లేని తెలుగువాళ్ళు మద్రాసులో కాసే మామిడికాయలు తినల్సిన్దేకని ఆవకాయ తినే అవకాసం లేదు. ఆవకాయ పెటడం తెలిసిన బామ్మగార్లు ఉండే కుటుంబాలకు భాదేలేదు. నూజివీడు రసాల కాయలూ, సామర్లకోట పప్పునునే తెప్పించ లెకపొఇన మద్రాస్ మామిడి కాయలతిననినా గమగుమలాడే ఆవకాయ పెతగలరు. ఎటొచ్చి తినటం తెలిసి, ఆవకాయ పెటడం తెలియని మా బూతివండ్లకే అవస్థ. పూఇనా సంవత్సరం వరకూ తెలిసిన వందలు బెజవాడ ప్రాంతాల నుండి ప్రతిఏటా ఆవకాయ పంపుతున్దేవాళ్ళు, రెండు మూడు పెధధజాడిలో. ఈ సంవత్సరం వారింట్లో రెండు ముదూ పెండ్లిళ్ళు జరగడం వాళ్ళ మాకు ఆవకాయ పంపే వ్యవధి వారిలేకుండా పోయింది. ఇన్నాళ్ళు ఆవకాయను గురించి ఆలూచించని నాకు ‘ఇంట్లో ఆవకాయ లేదు, ఈ సంవత్సరాలు రాదూ’ అని తెలియగానే గుందేగాతుక్కు మంది.
కొన్ని వస్తువులు వున్నపతికంటే లేన్నప్పుడు ఎక్కువ అగ్రస్థానం వహిస్తాయి మనుషుల మనసులో అలాగే ఆవకాయ ప్రతి ఏటా వస్తున్నప్పుడు మా వంటచేసే అయ్యారు అన్నం వడ్డించిన వెంటనే “ఆవహా ఉరహా వెన్నుమా” అంటే మేము “వెండాభ,ఎప్పుడు ఆవకయనా దరిద్రం”, అన్న రోజ్జులుకుడా వున్నాయి. ఆవకాయ వున్నప్పుడు మా వంట అయ్యారు పచ్చళ్ళు చేయటానికి బాధ్ధకిమ్చేవాడు. ఈ సంవత్సరం ఆవకాయ లేకపోయేసరికి మా వంట అయ్యారు చేసే వంటలోని లూపాలన్ని ఒక్కొక్కటే బయపడటం మొదలుపెట్టాయి. ఈ సంవత్సరం వంట అయ్యారు ఏం చేస్తే అది తిని, నోరు మూసుకుని, ఊరుకో వాలిగా బూలునని అనుకున్నపుదంతా ఆవకాయ కోసం నోరురడం మొదలపెట్టింది. అవకయకోసం మా ఇంటికి మా వారి మిత్రులు కొందఱు కుటుంబాలతో సహభోజనానికి వచేవారి, అప్పుడప్పుడుఅంతా, “ఆహా! ఎన్నాళ్ళకు తిన గాలుగుతున్నమంది మన దేశపు ఆవకాయ” అని వాళ్ళంతా లొట్టలు వేస్తూ తింటుంటే. మేము చాలా నిర్లక్ష్యంగా” ఆ, ఆవకాయ భాగ్యమండి! మాకు ప్రతీ ఏటా వస్తుంటుంది ఆవకాయ” అనేవాళ్ళం గర్వంగా.
ఆ వచ్చినవాళ్ళు అందరు సగంజాడి తినేసి, ఆగమ జాడీ ఇంటికి పట్టుకు పోయేవాళ్ళు తలా కాస్తా.
“అయిన అంత ఆవకయపతికేల్లిపోఎవారు! ఈ సంవత్సరం మన ఇంటికి చాల్తుందో లేదో” అని నేను అనుకుంటుంటే “అబ్బ! చాలకపోతే పోనిస్తు! ఎంతని తినటం ఆవకాయ! నాకు వద్దనే వద్దు. నీక్కావాలంటే మిగిలిన ఆవకాయ దాచిపెట్టి తిన్తుండు” అన్నారు మావారు ఎగాతాల్లీ, అలంటి మావారు ఈ సంవత్సరం ఆవకాయ ఇంట్లో లేదని తెలిసిన తరవాత తేనేమన్నదికుడా మరచి పోయి , “అయ్యగారుగాడు చేస్తే యి పచ్చళ్ళు తింటాం చాలా కష్టం. ఆవకాయ వుంటే బావుండేది” అంతం మొదలుపెతారు. మా అతగారు మదిలోవుంచిన నిమ్మకాయ వూరగయథప్ప ఇంట్లో వేరే ఏ ఊరగాయ లేదు. మా అతగారు కారంలేని నిమ్మకాయ ఊరగాయ తింటుంది. మాకు సైన్చాడు. అదే ఆమె మదితో ఒకముఉల దాచిన బుజ్జుపట్టిన నిమ్మకాయ జాడిని ఎవరు ముట్టుకోక పోవడానికి కారణం.
మావారు ఒకరోజు మద్యాన్నం బొంచేస్తుండగా “కొడుకు ఆవకయలేదని పలవరిస్తునాడే” అని ఎంతో ప్రమగా మదినిమ్మకాయ ఊరగాయ తెచ్చి కొడుకు కంచంలో వడ్డించారు మా అత్తగారు. కొడుకు ఆ నిమ్మకాయ వురగాయను ముట్టుకోక పోగా కంచంలోంచి తీపి కిన్ధపదేసారు. “అబ్బాయి వురగాయఎట్లా ఉందన్నాడు?” అని.
“చాలా బావుందన్నారు కానీ, ఆవకాయ వురగాయంటేనే ఆయన కెక్కువ ఇష్టం. ఈ సంవత్సరం ఆవకాయ రాలేదే, ఏం చేయడం, ఎవరిని అడగడం అన్న దిగులు పట్టుకుంది” అన్నాను.
“ఆ, నిదంతా చోద్యమే మరినూ! ఎవర్నో ఎందుకదగడం? ఆవకాయ పెటడం ఏం బ్రహ్మవిద్యా గనకనా, తెలీకదుగుథా! అయినా అంతా కారం, అంత నునే వేసిన ఆ వుత్తరదివండ్లు ఆవకాయ మీరంతా లోత్తలేస్తూ తింటుంటే నా కల్లవెంతనిల్లె కారతాయి. అయిన మన కెందుకులే అని వురుకునన్ను. అసలు అంతకరంగా వుండే ఆవకాయ తింటే మి ఒళ్ళు గతి ఏం కానుమ్త!”
“ఏదో వారికిష్టం” అన్నాను నేను.
“నే పెటిస్స్తనుండు ఆవకాయ” అన్నారు మా అత్తగారు, దర్జాగా కూర్చుంటూ.
నా ప్రాణం లేచి వచ్చినట్లువుంది. “అంతకంటేనా? మిరూ గనక ఆవకాయ పెదితే యింక మనకు ఆవకాయ లేదన్న లోటు ఉండదు ఈ సంవత్సరం” అన్నాను సంతోషంగా.
“ఆ, నిదంతా చాదస్తమే మరినూ! ఏ సంవత్సరమైన మనింట్లోనే పెట్టుకోవాచ్చు ఆవకాయ. ఏం బ్రహ్మవుధ్యంతాను? నిమ్మకయెంతో ఆవకాయ అంతే” అన్నారు తేలిగ మా అత్తగారు. “అంతే, అంతే” అన్నాను ఆవిడే మన్నదో అర్ధంకాక నేను. కాని-
నాకో సందేహం కలిగింది. మా అత్తగారి పుట్టినిల్లు చెంగల్ పాట్; మెట్టినిల్లు నంద్యాల. ఆవకాయకు మా అత్తగారి ఎలాంటి సంభంధం వుంటుందా అని చాలాసేపు ఆలోచించాను. అడుగుదామనుకున్నాను. మళ్ళి “ఆక్షేపిస్తుంది” అనుకుంటుందని పురుకున్నాను.
“అయితే ఏమేం వస్తువులు కావల్సుంటాయి ఆవకాయ వేయడానికి” అని అడిగాను తెల్ల కాగితం, పెంసిల్లుచేత పుచ్చుకున్ని, ఆవిడగారి గుమస్తలాగా. వెంటనే మా అత్తగారు కాలుమీద కాలు, ముతిమిద వేలు వేసుకుని ఒక్క క్షణం ఆలోచించారు.
“మామిడికాయల కావలిగా?” అన్నాను, మా అత్తగారి ఆలోచనకు అంతరాయం “అబ్బే! ఎందుకే?” అన్నారు అలక్ష్యంగా” చప్పరిస్తూ. నేను తేలబోయి ఆమెకేసి చూసాను.
“పదిహేనేకరాల మామిడితోటలో మనం ఉంటూ, లక్ష్యంగా కస్తే మామిడిచెట్లు పెట్టుకుని, యింక కాయలేందుకే మనకు” అన్నారు చిరునవ్వు లోల్కబోస్తూ.
“అయితే మనతోటలోని పండ్లకయలె వేస్తానంటారా ఆవకాయ?” అన్నాను.
“ఓ! బెశ్గ్గా వెయ్యొచ్చు. ఆవకాయకు కావాల్సింది మామిడికాఎగా! ఎకాయైతేనేం! మనతోతలో దక్షిణం వైపు చెట్లన్నీ బెశైన కాయలుకాస్తై. పడమటివైపు చెట్లు ఎంత కందగాకాయలనుకున్నావు పోయిన సంవత్సరం తోటంతా విరగాకసాయి కాయలు. “మరి నాలుగు వందలు ఎక్కువ చెప్పి కౌలు కివ్వవే” అంటే విన్నావు కాదు. వాడికెంత లాభం వచ్చిందో తెలుసా” మన తోటవాడు చెప్పాడు. ఈ సంవత్సరమూ అంతే. వాడికింకా లాభం వస్తుంది…..అట్లా కాసింది తోటంతా.”
“పోనిలెండి. ఏటా కౌలుకు తీసుకునేవాడు నాలుగు డబ్బులు సంపదిన్చ్కోన్నివండి. పై సంవత్సరం అడగవచ్చు ఎక్కువదబ్బు” అన్నాడు.
“హా-యిస్తాడు! మల్లి ఏ నష్టమో వచ్చిన్దంటాడు. అందుకే యిప్పుడు ఆవకాయ పెట్టబోతున్ననుగా. అయిదు వేల కయలూ అడిగి పుచ్చుకుంటే సరి” అన్నారు మా అతగారు, దిట్టంగా బాసీపెట్టు వేసి కూర్చుంటూ.
“అయితే అయిదువేలు కాయలూ ఆవకాయ పెడతానంటారా?” అన్నాడు ఆశ్చర్యంగా.
“కాకపోతే! మి చెల్లలల ఇండ్లకు, యింకా తెలిసిన వందల ఇండ్లకు పంపల్సిమ్వుంతున్డిగా! కొద్దిగా పెడితే ఏం చాలుతుంది మనింటికి? వాదినిమటుకు అయ్దువేల కాయలూ అడగాల్సిందే! డబ్బు తక్కువచ్చి, కాయలూ ఇవ్వకపోతే ఎట్లా?” అన్నారు కౌలువదిమిధ కత్తికట్టిన మా అత్తగారు.
———–