పేరు (ఆంగ్లం) | Bodapati Ramesh |
పేరు (తెలుగు) | బోడపాటి రమేష్ |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | అఖిలాంద్ర ఆఫీసర్ల (!) సమావేశం, అపశృతిలో శృతి, అమ్మకూచి , అర్థంలేనిది ఆరంభం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | బోడపాటి రమేష్ |
సంగ్రహ నమూనా రచన | ‘‘ఛ ఛ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతోంది’’ ‘‘ఇల్లంటూ ఉంటే కదా ఏదైనా ఉండటానికి’’ ‘‘వా డ్డూయూ మీన్? మనం ఉన్నది ఇల్లే కాదంటావా?’’ ‘‘అదే నే ననేదీను’’ ‘‘అంటే ఇల్లే కాదంటావా?’’ ‘‘అవును పొద్దునే నిద్రలేవటం, రోజంతా మీకు కావలసినవి అంగలార్చుకుంటూ చేసిపెట్టడం, మీరు ప్రతిదానికీ ఏదో ఒక వంక పెట్టడం ఇదే గదా ఇక్కడ జరుగుతున్నది’’ ‘‘అంటే, నాకేం కావాలో చూడటం కూడా నీకు కష్టమైపోతున్నదన్నమాట’’ ‘‘అవును. ఎంతకాలమూ మీకు చేసిపెట్టడమేనా? నా గురించి మీ రెపపుడైనా పట్టించుకున్నారా’’ ‘‘ఇప్పుడు నీకేం తక్కువయిందని?’’ ‘‘అసలేముందని? ఎక్కువ తక్కువల లెక్కలు చూసుకోటానికి’’ |
బోడపాటి రమేష్
కలహం కింకారణం?
‘‘ఛ ఛ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతోంది’’
‘‘ఇల్లంటూ ఉంటే కదా ఏదైనా ఉండటానికి’’
‘‘వా డ్డూయూ మీన్? మనం ఉన్నది ఇల్లే కాదంటావా?’’
‘‘అదే నే ననేదీను’’
‘‘అంటే ఇల్లే కాదంటావా?’’
‘‘అవును పొద్దునే నిద్రలేవటం, రోజంతా మీకు కావలసినవి అంగలార్చుకుంటూ చేసిపెట్టడం, మీరు ప్రతిదానికీ ఏదో ఒక వంక పెట్టడం ఇదే గదా ఇక్కడ జరుగుతున్నది’’
‘‘అంటే, నాకేం కావాలో చూడటం కూడా నీకు కష్టమైపోతున్నదన్నమాట’’
‘‘అవును. ఎంతకాలమూ మీకు చేసిపెట్టడమేనా? నా గురించి మీ రెపపుడైనా పట్టించుకున్నారా’’
‘‘ఇప్పుడు నీకేం తక్కువయిందని?’’
‘‘అసలేముందని? ఎక్కువ తక్కువల లెక్కలు చూసుకోటానికి’’
‘‘ఛీ ఛీ ఇది ఇల్లే కాదు.’’
‘‘అదే నే ననేది కూడా’’
‘‘నోర్ముయ్’’
‘‘మీరే ఆ పని చేయండి’’
ఇద్దరూ విసురుగా అవతలికి వెళ్లిపోయారు.
ఈ సంభాషణలో పాత్రదారులు అమల, కరుణాకర్. వారు భార్యాభర్తలు. అంతే ఇద్దరూ బాగా చదువుకున్నవాళ్లే. పెద్దలు కుదిర్చిన సంబంధానికి బుద్ధిగా లాంఛనాలతో సమా పెళ్లి చేసుకున్నవాళ్లే. కానీ ఇద్దరికీ ఒకళ్లంటే ఒకళ్లకి పడదు. అటువంటి అనుకూల దాంపత్యం వాళ్లది.
‘‘మనం ఇలా ప్రతి చిన్న విషయానికీ రోజూ పోట్లాడుకోవటం ఏమీ బాగాలేదండీ’’ అన్నది అమల ఒక రోజు భర్తతో.
ఏ కళనున్నాడో మానవుడు, ‘‘నిజమే, అమలా నాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఏ కారణమూ ఉండదు కాని ఎందుకు పోట్లాడుకుంలామో తెలియదు.’’
‘‘అంటే కారణం లేకుండా మీతో పోట్లాట వేసుకుంటాననే కదా మీరనేది?’’
‘‘అదిగో అదే నీతో వచ్చిన ఇబ్బంది. నీకసలు పిలిస్తేనే పలుకుతుంది కోపం.’’
‘‘అవునులెండి మీరు అపర ధర్మరాజులు. నేనే…’’ అమల కళ్ళు జలపాతాలవుతున్నాయి.
‘‘ఇప్పుడు నే నేమన్నానని’’ కరుణాకర్ లాలనగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు.
‘‘ఒక పనిచేద్దామండీ ఒక నెలరోజుల పాటు ఒకళ్లనొకళ్లు కనిపెట్ చూద్దాం. ఇదిగో ఇది నీ తప్పు అని ఎదుటివాళ్ల చెపితే వెంటనే ఒప్పేసుకుని ఎవళ్లకి వాళ్లు ఆలోచించుకోవాలి. అంతేకాని ఎదురు తిరిగి పోట్లాడకూడదు. సరేనా.’’
‘‘సరే, అలాగే చేద్దాం’’ అంటూ తన అంగీకరం తెలిపాడు కరుణాకర్.
నిజానికి అతనికి ఇదేదో సరదాగా అనిపించింది. పైగా తన భార్యలో తప్పులు కనిపెట్టడం చాలా తేలిక అనుకున్నాడు. అదీ కాక, ‘ఇది తప్పు’ అని ఒకరంటే ఎదుటివాళ్లు ఎదురు చెప్పకుండా ఒప్పందం చేసుకున్నారు కాబట్టి కనిపెట్టే తప్పు అనేది తోసిపుచ్చగలిగేదిగా తేలిగ్గా ఉండకూడదు అనుకున్నాడు. అయినా నెలరోజులు ఎంతలో గడచిపోతాయి అని సరిపెట్టుకున్నాడు.
అమల క్కూడా ఈ పందెం బాగానే ఉంది. మొదటి కారణం ఇది తనే ఆలోచించినది కావటం, రెండవది తను చెప్పిన దానికి తన భర్త సరేననటం.
అయితే ఇద్దరికీ కూడా ఎదుటివాళ్లు చెప్పే బదులు తమ తప్పులు తామే బయటపెట్టుకోవడం సబబనిపించింది.
‘‘సారీ, అమలా ఈ రోజు ఆఫీసు నుంచి రావటం ఆలస్యమయింది’’ అన్నాడు కమలాకర్ ఆ ప్రయత్నంలో భాగంగా.
‘‘దాన్దేముందిలెండి ఆఫీసన్న తర్వతా అట్లాంటివి తప్పవు. మీ ఆరోగ్యం గురించే నేను బెంగపడేది. రండి, మీ కోసమే చూస్తున్నాను. ఆకలి మండిపోతోంది’’ అన్నది అమల తేలిగ్గా తీసుకుంటూ.
ఇదే ఇదివరకటి రోజుల్లో అయితే ‘‘ఇవాళ వింతేముందీ ఏ రోజు తిన్నగా వచ్చారు కనుక’’ అని ఆమె అనేది.
‘‘అంటే నీ ఉద్దేశం కావాలనే నేను తొందరగా ఇంటికి రావటంలేదనేనా’’ అని అతననేవాడు.
అంతే పరిస్థతి కర్ఫ్యూదాకా వచ్చి కనిపిస్తే చూపులతో కాల్చుకునేదాకా వచ్చేది.
డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ సద్దుకుని భోజనానికి ఉపక్రమించారిద్దరూ.
ఉన్నట్టుండిభోజనం మధ్యలో అమల అన్నది ‘‘ఇంకొకసారి కూర వేసుకోండి, పులుసు వద్దు’’
‘‘అదేం?’’ అన్నాడు కమలాకర్.
‘‘ఈ రోజు ఏదో తేడా వచ్చింది, రుచిగా లేదు.’’
‘‘ఏదీ, నన్నూ చూడనీ పులుసుకేం బ్రహ్మాండంగా ఉంది. ఎటొచ్చీ పులుపుకి, ఉప్పుకి జత కుదరలేదు. మనలాగే వేటికవే అన్నట్లు ఉన్నాయి’’ అన్నాడు నవ్వుతూ.
అమల వింతగా చూస్తోంది.
ఇదే ఇంకొకరోజైతే ’’నీ ముఖంలా ఉందనుకో ఇది మనుషులు తినేదేనా’’ అనేవాడు.
తనేమో, ‘‘నేను మనుషుల కోసం చేశాను. మీరూ తింటారని నాకేం తెలుసు’’ అనేది.
దానితో అతని రుసరుసలు, తనకు బాష్పవాయువు లేకుండానే కన్నీళ్లు.
‘‘ఏమండోయ్ ఇవాళ్టితో మనం అనుకున్న నెలరోజులు అయిపోయాయి’’ అన్నది అమల ఒక సాయంత్రం.
‘8అవును, అమలా నువ్వు నాలో ఏం లోపాలు గమనించావు’’ రిజల్ట్స కోసం పేపరు తిరగేస్తున్న విద్యార్థిలాగా ఉన్నది అతని పరిస్థతి.
‘‘మీరు చాలా మంచివారు.’’
‘‘అంటే, అదే నాలో లోపమా అయితే చూసుకో’’
అమల గలగలా నవ్వేసింది.
‘‘అది కాదండీ, బాబూ మిమ్మల్నేదైనా తప్పుపడదామనుకుంటే మీరు చేసే ప్రతి పనీ నా కోసమే అనిపిస్తోంది. ఇందులో తప్పేముంది చెప్పండి మరి మీకు?’’
‘‘నేనూ అలాగే అనుకుంటున్నాను. మరయితే మనం రోజూ ఎందుకు పోటాలడుతకుంటూంటాం?’’
ఈ ప్రశ్నకు సమాధానం ఏ ఇంట్లోని దొరకదు.
———–