కోటంరాజు సత్యనారాయణ శర్మ (Kotamraju Satyanarayana Sharma)

Share
పేరు (ఆంగ్లం)Kotamraju Satyanarayana Sharma
పేరు (తెలుగు)కోటంరాజు సత్యనారాయణ శర్మ
కలం పేరు
తల్లిపేరుకోటరాజు సుబ్బరాయమ్మ
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/4/1926
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలుఇంటర్మీడియేట్‌
వృత్తిలాయర్‌
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుగాయత్రి బ్రహ్మవిద్య, శ్రీరామ నామవైభవం, భగవాన్‌ శ్రీ రమణ మహర్షి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకోటంరాజు సత్యనారాయణ శర్మ
సంగ్రహ నమూనా రచనశర్మగారు ఆధాయం పన్ను శాఖలో స్టెనోగా జీవితం ప్రారంభించి, ఆం.ప్ర. హైకోర్టులో మాస్టర్‌గా, లాయర్‌గా ఎన్నో శిఖరా లు అధిరోహించినా, తమ సాహిత్య జీవితానికి ప్రాధాన్యత ఇస్తూనే వచ్చారు. అనేక రచనలు చేశారు. పద్యాలు, వ్యాసాలు, ఆధ్యాత్మిక రచనలూ పాఠకులకు అందిం చారు. గాయత్రి బ్రహ్మవిద్య, శ్రీరామ నామవైభవం, భగవాన్‌ శ్రీ రమణ మహర్షి వీరి ముద్రిత రచనలు భక్తకల్పద్రుమ శతకం, కల్యాణి నాటకం, భగవద్గీతపై ఆధ్యా త్మిక విశ్లేషణా వ్యాస పరంపర అముద్రిత రచనలు. అతని సహస్రపూర్ణచంద్రదర్శనోత్సవ సందర్భంగా అతని రెండో కూతురు, ప్రసిద్ధ కవయిత్రి డా. చిల్లర భవానీదేవి అతను రాసిన వ్యాసాలన్నిటినీ సేకరించి చిన్న పుస్తకంగా అచ్చు వేయించారు

కోటంరాజు సత్యనారాయణ శర్మ

భవానీదేవి తండ్రిగారు శ్రీ కోటంరాజు సత్యనారాయణ శర్మ గారు బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రసిద్ధులు. 1926వ సం|| జనవరి 4వ తేదీన జన్మించిన శర్మగారు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారికి సహాధ్యాయి. భద్రిరాజుగారి మాటల్లో చెప్పాలంటే ‘అతను ఉద్యమశీలి, సంస్కృతభాషా ప్రచారిణీసభకు కార్యదర్శిగా చాలా ఏళ్ళుండి ఆ భాషా వ్యాప్తికి ఎంతో కృషి చేశాడు. అతని వ్యాసాలు తెలుగు సాహిత్యాభిలాషను, సంస్కృతభాష, సమకాలీన విద్యా విధానంలోనిలోపాల గురించిన వ్యాసాలు అతని స్వతంత్రా లోచనా విధానాన్ని ఆవిష్కరిస్తాయి. నా కంటే రెండేళ్ళు పెద్ద. నన్ను ప్రేమతో తమ్ముడూ అని పిలిచేవాడు’ – అన్నారు. శర్మగారు స్టెనోగా జీవితం ప్రారంభించి, ఆం.ప్ర. హైకోర్టులో మాస్టర్‌గా, లాయర్‌గా ఎన్నో శిఖరా లు అధి రోహించినా, తమ సాహిత్య జీవితా నికి ప్రాధాన్యత ఇస్తూనే వచ్చారు. అనేక రచనలు చేశారు. పద్యాలు, వ్యాసాలు, ఆధ్యాత్మిక రచనలూ పాఠకులకు అందిం చారు. గాయత్రి బ్రహ్మవిద్య, శ్రీరామ నామవైభవం, భగవాన్‌ శ్రీ రమణ మహర్షి వీరి ముద్రిత రచనలు భక్తకల్పద్రుమ శతకం, కల్యాణి నాటకం, భగవద్గీతపై ఆధ్యా త్మిక విశ్లేషణా వ్యాస పరంపర అముద్రిత రచనలు.

ఎందరో ప్రముఖ సాహిత్యవేత్తలు శర్మగారితో ఆత్మీయ తానుబంధాలు కలిగి ఉండేవారు. చిల్లర భవానీదేవి శర్మగారికి ద్వితీయకుమార్తె అయినా, అద్వితీయ సాహిత్య వారసత్వాన్ని తండ్రి నుండీ స్వీకరిం చింది. బహుశః శర్మ గారి సంతానంలో ఈ అదృష్టం భవానీదేవికే దక్కి ఉం డాలి. పుట్టినింటి సాహిత్య సౌరభం, మెట్టినింట కూడా ఆమెకు లభించింది. ఆమె పినమామ గారు, చిల్లర భావ నారాయణగారు ప్రముఖ సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞా శాలి. ఇదికూడా ఆమెకు అదనపు బలం చేకూర్చింది.

———–

You may also like...