గుంటి లక్ష్మీకాంతమ్మ (Gunti Lakshmikantamma)

Share
పేరు (ఆంగ్లం)Gunti Lakshmikantamma
పేరు (తెలుగు)గుంటి లక్ష్మీకాంతమ్మ
కలం పేరు
తల్లిపేరుచిదంబరమ్మ
తండ్రి పేరుకాశీభట్ల పెద్ద సుబ్బయ్య
జీవిత భాగస్వామి పేరుగుంటి నంజండశర్మ
పుట్టినతేదీ7/21/2017
మరణం
పుట్టిన ఊరువ్రజకరూరు – గుత్తి తా. – అనంతపురం జిల్లా
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలునక్షత్రమాల, మందారమాల
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికగుంటి లక్ష్మీకాంతమ్మ
సంగ్రహ నమూనా రచనశ్రీమతి గుంటి లక్ష్మీకాంతమ్మ గారు గేయ రచయిత్రి. వ్రజకరూరు చిన్న గ్రామమమగుట చేత, పెద్ద చదువుల కాస్కారంలేదు. పుట్టినిల్లు వేదాధ్యయన సంపన్నమైనది. కాన బాల్యము నుండియే, ఈమెకు దైవభక్తి అలవడినది. మెట్టిన ఇల్లు కూడా దైవభక్తి సంపన్నమై యుండుటవల్ల, ఈమెకు బాంరుకు పరిమళ మబిబనట్లు, దైవభక్తికి ప్రోత్సాహ మబ్బుటవల్ల అనేక భక్తి రస గేయములను రచించి, తమ ఇంట పాడుకొనెడివారు.

గుంటి లక్ష్మీకాంతమ్మ

శ్రీమతి గుంటి లక్ష్మీకాంతమ్మ గారు గేయ రచయిత్రి. వ్రజకరూరు చిన్నగ్రామ మగుట చేత, పెద్ద చదువుల కాస్కారంలేదు. పుట్టినిల్లు వేదాధ్యయన సంపన్నమైనది. కాన బాల్యము నుండియే, ఈమెకు దైవభక్తి అలవడినది. మెట్టిన ఇల్లు కూడా దైవభక్తి సంపన్నమై యుండుటవల్ల, ఈమెకు బాంరుకు పరిమళ మబ్బినట్లు, దైవభక్తికి ప్రోత్సాహ మబ్బుటవల్ల అనేక భక్తి రస గేయములను రచించి, తమ ఇంట పాడుకొనెడివారు.
1964లో ‘‘నక్షత్రమాల’’ వ్రాసి ప్రకటించిరి. శ్రీమతి టుకూరు లక్ష్మీకాంతమ్మగారు, ఈమె వాగ్గేయ కారుల కోవకు చెందినదని ప్రశంసించిరి. ‘‘మందారమాల’’ ఈమె వ్రాసిన రెండవ గేయరచన. 1968లో హైదరాబాదులో జరిగిన ‘‘అఖిల భారత రచయితల మహాసభ’’లో ఈమె కవితాగోష్ఠిలో పాల్గొని ‘‘మందారమాల’’ గేయములను, పాడి వినిపింపగా, అకాడమీ కార్యదర్శి శ్రీదేవులపల్లి రామానుజంరావుగారు, సంతోషపడి ఆ పుస్తక ముద్రణమునకు సహాయపడిరి.
‘‘రచనాపాటవ మున్నవారికి గాత్ర సౌలభ్యము లేక పోవుట, గాత్ర సౌలభ్య మున్నవారికి రచనా సౌలభ్యము కొఱవడుట సహజము. కాని, ఈ కవయిత్రికి రచనా పాటవముతో బాటు గాత్రసౌలభ్యము భగవంతుడు ప్రసాదించుట బంగారుకు పరిమళ మబ్బినట్లున్నది.’’ అని తిరుపతి సంస్కృత కళాశాల రిటైర్డు ప్రిన్సిపాలు గారైన శ్రీ చేబ్రోలు సుబ్రహ్మణ్యశర్మగారు ప్రశంసించిరి.
ఈ కింద, ‘‘మందారమాల’’లోని కొన్ని గేయములను ‘‘స్తుతిమాల’’ లోని రెండు కీర్తనలను, అముద్రితములైన, ‘‘రుక్మిణీకల్యాణము’’లోని రెండు గేయములను పాఠకులు చదువుగలరు.
‘‘మందారమాల’’లో కొన్ని గేయములు.
1
అలుక ఏలనొ? అలివేలమ్మా పలుకగా రావమ్మా.
పిలిచి పిలిచి నిను – అలసితినమ్మా- అలుక మానవమమ్మా.
దేవీ పలుకగ రావమ్మా.
2
కనివిని యెరుగని – కరుణాలయవని విన్నానొయమ్మా.
కరుణజూపి – శరణన్న వారికి దరిశనమేయిమ్మా. దరిశనమిమ్మా.
3
కరుణించుతల్లీ శరణంటిగౌరీ శర్వాణీ గీర్వాణీ కల్యాణి
తల్లి నీవే తండ్రివి నీవే గురుదైవము నీవే దయనుజూపి దరిని జేర్చు దాతవు నీవే
కర్పూరహారతిదె గౌకొనవమ్మా శ్రీకాంతా
‘‘శ్రీ రుక్మిణి కల్యాణము’’లోని రుక్మిణి ప్రార్థన (గేయము)
4
నీ చరణంబుల – నీడనుజేరి శరణంటిని – నీ కరుణగల్గదా?
తరుణము మించక – తరరి రానిచో మరణమె – శరణము – కరుణాభరణా
5
‘‘అమ్మ’’ను గని యామమ్మె – అమ్మయని ‘‘అమ్మా’’ నిను మది నమ్మితినమ్మా
నా మనోహరుని నా కొసగూర్పుము లేకుండిన, ను నీలో జేర్చుము.
ఈ కవయిత్రి మఱికొన్ని భక్తి గేయములను వ్రాసి ఆంధ్రలోకమన కర్పించుగాత.

రాయలసీమ రచయితల నుండి……..

———–

You may also like...