పేరు (ఆంగ్లం) | Raptaati Obireddy |
పేరు (తెలుగు) | రాప్తాటి ఓబిరెడ్డి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | భక్త శ్రీసిరియాళ |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | రాప్తాటి ఓబిరెడ్డి |
సంగ్రహ నమూనా రచన | శా. ఏమేమీ చిరుతొండనంబి సతతం – బీరీతి సద్భక్తులన్ ఆమోదంబు జెలంగ, దృప్తిపడ – నాహారంబు లర్పించునే? ఈ మాడ్కి జెలువొందు త్యాగపరు నెందేని గనుంగొంటిమే? స్వామీ నామదిఁగోర్కె గల్గను భవద్భక్తు బరీక్షింపగ తదుపరి వీరి ‘భీమసౌగంధిక’ నాటక మెన్నదగినది. ఈ నాటకమును కవిగారందరికి అర్థమగునట్లు వ్రాసిరి. ఇందు భీమాంజనేయ సంవాదమొక రసవత్తర ఘట్టము. ఆంజనేయుడు, భీముని పరాక్రమమును పరీక్షించి, ఇట్లవహేళన జేయుచున్నాడు. |
రాప్తాటి ఓబిరెడ్డి
ఓబిరెడ్డిగారు నిరాడంబరులు వినయ గుణశీలురు, ఒక మారుమూల కుగ్రామమునందు బడిపెట్టుకొని, వారికి పాఠము జెప్పుచు, తీరిక సమయములందు తమకు తోచిన విషయములపై, కవిత్వము జెప్పుచు మఱియొక ప్రక్క సేద్యము చేసెడివారు.
ఓబిరెడ్డి గారు తమ తొలి రచనలుగా శతకములు, హరికథలు వ్రాసిరి. తదుపరి నాటకములు వ్రాయుట కుపకరించిరి. పద్యరచనయందు, చిత్రబంధకవితారీతులతో, అంత్యప్రాసలతో, నూత్నపదబంధములతో వ్రాయుట వీరి కభిరుచి వీరి ‘భక్త శ్రీసిరియాళ’ హరికథను సాహితీపోషకులైన, శ్రీ భోగి పెట్టి జోగప్పగారు ప్రచురించి కవిని ప్రోత్సహించిరి. వీరి పద్యనడక చూడుడు.
శా. ఏమేమీ చిరుతొండనంబి సతతం – బీరీతి సద్భక్తులన్
ఆమోదంబు జెలంగ, దృప్తిపడ – నాహారంబు లర్పించునే?
ఈ మాడ్కి జెలువొందు త్యాగపరు నెందేని గనుంగొంటిమే?
స్వామీ నామదిఁగోర్కె గల్గను భవద్భక్తు బరీక్షింపగ
తదుపరి వీరి ‘భీమసౌగంధిక’ నాటక మెన్నదగినది. ఈ నాటకమును కవిగారందరికి అర్థమగునట్లు వ్రాసిరి. ఇందు భీమాంజనేయ సంవాదమొక రసవత్తర ఘట్టము. ఆంజనేయుడు, భీముని పరాక్రమమును పరీక్షించి, ఇట్లవహేళన జేయుచున్నాడు.
గీ. ఇంక సౌగంధి కంబులం చెన్నడేని
స్వప్నమందైన దలపకు – సత్వరమున
నుని కేగుము ప్రాణంబు లున్నజాలు
భామినుల, నెందఱిననైన బడయవచ్చు.
అందులకు కోపగించిన భీముడు రుద్రుడై ఇట్లు పలికినాడు
గీ. ముదుసలి వటంచు, కనికరమెద దలంచి
యింతవఱకును మదిని శాంతించి యుంటి,
నింక నోరెత్తి మాటాడితేని, నీదు
మూతి విఱుగంగ బొడుతు నా ముష్టిచేత
కవులందఱు, మొట్టమొదట శతకములనే వ్రాసినట్లు తెలియవచ్చును. ఆ శతకములందు, భక్తి, నీతి, వైరాగ్యములకే ప్రాధాన్యమొసంగిరి. మన రెడ్డిగారు తమ ‘‘కృష్ణశతకము’’నందు పెదవులు, తగలని పద్యములనే వ్రాసిరి. పెదవులు తగిలిన పాపమని భావించిరేమో? ఖడ్గ బందకందము, శైలబంధకందము, రతిబంధము, త్పల పాదగర్భకందము, మున్నగు చిత్రబంధ కవిత్వములున్నవి. ఈ క్రిందిపద్యము చూడుడు.
కం. నక్షత్రనేత ఖద్యో
తాక్షా రణరంగదక్ష ఆశ్రితరక్షా
రాక్షస గజహర్యక్షా
ఆక్షీణ దయా కవితకటాక్షా కృష్ణా
వీరి తరువాత కృతి, రాప్తాటి నిర్వచన రామాయణము. వీరు శ్రీరామకథను సర్వజనులకు ర్థమగురీతి సులభశైలిలో వ్రాయదలంచిరి. ఇందు కౌసల్యాపరిణయముకూడ, సంక్షిప్తముగా చేర్చిరి. రావణుడు కౌసల్యా పరిణయము దశరధునితో జరుగకుండ, భగ్నము చేయదలచినాడు. విధిని దాటితినని గర్వపడినాడు. తుదకు తానే భగ్నపడినాడు. అందుకు సాగరునిట్లు దూషించినాడు.
శా. ఏరా సాగర యింతనీకు పొగరా మీరీతి నాయానతి
మేరంజాలతివా దురాత్మ కుటిలా మిథ్యానులాపా నిను
ఘోరప్రక్రియ ఖండఖండములుగా, గోయించి భూతాళికా
హారం బౌ నటులే నోనర్తు ననగా – నాతండు భీతాత్ముఁడై
విరామ సమయములో కూడా, వీరు కాలమును సద్వినాయోగము చేయుచున్నారు. తన వద్దకు వచ్చుచున్న విద్యార్థులకు విద్యాదానము చేయుచున్నారు.
హిందూపురము తా. దాని గ్రామములు కవులకు, పుట్టినండ్లుగా వెలసినని. కల్లూరు, కగగ్గల్లు, మణేసముద్రము, కోడిపల్లి, కిరికెర, బేవినహళ్ళి, కొండాపురము మొదలైన గ్రామములలో కవులుద్భవించినారు. మణూరు మలుగూరు కవులుకూడి ప్రసిద్ధులు. సంగీత సామిత్య సరస్వతులు. కీ.శే. రొద్దము రాజారావుగారు, హిందూపురములో ప్లీడరుగా వుండి, ఆంధ్రసాహిత్య సంగీతములకు, చేయూతనొసంగిరి. శ్రీ కృష్ణదేవరాయ వర్థంతుల నెఱపి, సాహిత్య సంగీతసభలను ప్రోత్సహించినారు, కీ.శే. కల్లూరి సుబ్బరావుగారి జీవితములో, ఏటేట వసంతోత్సవముల జరిపి అనేక కవి పండితులను పిలిచపించి వారిచే సాహిత్యోపన్యాసముల నిప్పించి వారిని ఘనముగా సత్కరించినారు. ఈ సందర్భమునందే మణూరువారికి కవితారామ వసంత బిరుదమును శ్రీ జనమంచి వారిచ్చిరి.
శ్రీ మణూరు రామారావుగారు ఈ క్రింది గ్రంథముల రచించినారు. (1) రామశతకము (2) ముక్తాక్షరగ్రస్త రామాయణము – 1936 (3) శ్రీ ఆదినారాయణస్వామి చరిత్ర – 1940 (4) లీలారంగనాథము-1952 (5) స్వాతంత్ర్య విజయము – 1957.
శ్రీ ఆదినారాయణస్వామి చరిత్ర
‘ఇది యొక స్థలపురాణము. ఇందుఁబేర్కొన్న కూర్మగిరి ‘డాది నారాయణ కొండ’ యందురు. ఇయ్యది మైసూరు రాజ్యమున ‘‘గుడిబండ’’ కుత్తరమున నాఱుమైళ్ళ దూరమున యల్లోడను గ్రామము చెంత గలదు. ఇద్దరాధరంబుపై వేంచేసియుండు శ్రీ మన్నారాయణుండు భక్త ఫల ప్రదాతయని చాలాకాలమునుండియు లోకమున సువ్యక్తము. ప్రతి మాఘమాసమునను తనగోడును, మొఱపెట్టుకొన్నాడు.
వీరి ‘శబ్దాలంకార శతకము’నందు, అత్యనియమము, అంత్య ప్రాప, ద్విప్రాస, త్రిప్రాస, లాటానుప్రాసముగల పద్యము లనేకములున్నవి. వీరి ఈ కృషి ప్రశంసింపదగినది.
వీరి అముద్రిత గ్రంథములు చాలగలవు ఇట్టి అజ్ఞాతకవులు, మన రాయలసీమలో అనేకులున్నారు. వీరు కీర్తికాములుకారు. వీరు చిరంజీవులై సాహిత్యలోకమున ఆతారార్కచంద్రులవలె ప్రకాశించెదరు గాత.
రాయలసీమ రచయితల నుండి…
———–