యం. బాల విశ్వనాథశర్మ (M. Bala Vishwanathasharma)

Share
పేరు (ఆంగ్లం)M.Bala Vishwanatha Sharma
పేరు (తెలుగు)యం. బాల విశ్వనాథశర్మ
కలం పేరు
తల్లిపేరుచెన్నకృష్ణమ్మ
తండ్రి పేరుయం. విశ్వనాథశాస్త్రి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ08/01/1933
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలుబి.ఏ.,
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుప్రకృతి ప్రభాకరము (2) వ్యుత్పత్తి భాస్కరము (3) సంస్కృతవల్లరి (4) వివేకానంద జయము (సంస్కృ పద్యములు) (5) సంస్కృత వ్యాకరణ ప్రవేశిక (6) అలంకార శబ్దామశాసనము (తెలుగు వ్యాకరణము) (7) వ్యాస సంపుటి (సంస్కృత వ్యాసములు) (8) గురుదక్షిణ (సంస్కృత నాటిక) (9) శ్రీ శారదా సుప్రభాతము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికయం. బాల విశ్వనాథశర్మ
సంగ్రహ నమూనా రచనశ్రీ శర్మగారు గొప్ప కవిపండిత కుటుంబమునకు చెందినవారు, పౌండరీక వాజపేయాదులు చేసిన, తపస్సంపన్నమైన వంశము వీరిది. సారస్వత ప్రియులు, వేదవిద్యయందు, సాహిత్యమునందు, పితామహులు, తపస్వులునైన, శ్రీరొద్దం మొదలి కృష్ణశాస్త్రిగారు వీరి గురువులు, తరుశాత కొంతకాలము చెంగల్పట్టు జిల్లా కాకవాక అగ్రహార సమీసమున బ్రహ్మశ్రీ గోడా సుబ్రహ్మణ్యశాస్త్రి గారివద్ద కావ్యనాటకముల నభ్యసించిరి.

యం. బాల విశ్వనాథశర్మ

శ్రీ శర్మగారు గొప్ప కవిపండిత కుటుంబమునకు చెందినవారు, పౌండరీక వాజపేయాదులు చేసిన, తపస్సంపన్నమైన వంశము వీరిది. సారస్వత ప్రియులు, వేదవిద్యయందు, సాహిత్యమునందు, పితామహులు, తపస్వులునైన, శ్రీరొద్దం మొదలి కృష్ణశాస్త్రిగారు వీరి గురువులు, తరుశాత కొంతకాలము చెంగల్పట్టు జిల్లా కాకవాక అగ్రహార సమీసమున బ్రహ్మశ్రీ గోడా సుబ్రహ్మణ్యశాస్త్రి గారివద్ద కావ్యనాటకముల నభ్యసించిరి. తరువాత నెల్లూరు వేద సంస్కృత కళాశాలలో విద్యాభ్యాసము చేసి ‘సాహిత్య శిరోమణి’ ‘భాషాప్రవీణ’ పరీక్షలయందు పట్టభద్రులై బి.ఏ., డిగ్రీని కూడా అందుకొనిరి. యజుర్వేదమున శీతి ద్వయమును అధ్యయనము చేసినారు.
సంస్కృతాంధ్రముల యందు చక్కని కవిత చెప్పగలరు. గ్రంథకర్తలు. ఆగమ విద్యను బాగుగా నభ్యసించిరి. ప్రసిద్దులైన వక్తులగా ఆంధ్రదేశమునందు కీర్తి గడించిరి. గమ శాస్త్ర విషయమున కార్యనిర్వహణమునకై ఎండోమెంటు వారిచే భద్రాచలమునకు ఆహూతులైరి. 1973 లో న్యూఢిల్లీలో జరిగిన అఖిలభారత వేద విద్యన్మహా సమ్మేళనము నందు పాల్గొనిరి. వేద శాస్త్రములందు బహుళ పాండితిని గడించిరి.
ఈనాడు వీరి శిష్యులనేకులు దేశమునందంతట అధ్యాపకులై, ఉపనాయసకులై కళాశాల అధ్యక్షులై యున్నారు. శ్రీ బాల విశ్వనాథశర్మగారు సత్త్వగుణ సంపన్నులు. వీరి గ్రంథములు (1) ప్రకృతి ప్రభాకరము (2) వ్యుత్పత్తి భాస్కరము (3) సంస్కృతవల్లరి (4) వివేకానంద జయము (సంస్కృ పద్యములు) (5) సంస్కృత వ్యాకరణ ప్రవేశిక (6) అలంకార శబ్దామశాసనము (తెలుగు వ్యాకరణము) (7) వ్యాస సంపుటి (సంస్కృత వ్యాసములు) (8) గురుదక్షిణ (సంస్కృత నాటిక) (9) శ్రీ శారదా సుప్రభాతము (10) ఆదిశంకర భగవత్పాద జీవిత చరిత్రము (తెలుగు పద్యములు) (11) సోమవార వ్రతమహాత్మ్యము.
ముఖ్యముగా వీరు చేయుచున్న సంస్కృతసేవ దేశమునందు గణనీయము. 1970వ సం. నుండి ఇంతవరకు సుమారు 600 శిష్యులు వీరి వద్ద సంస్కృతాధ్యయనము చేసినారు. వీరిటీవల ఉచిత సంస్కృత పాఠశాల నెలకొల్పి దానిని నిర్వహించుచు ఏడగ్రంథములను సమితి పరముగా ప్రచురించిరి. ఇప్పుడు వీరు రచించిన ‘‘నిత్యానుష్ఠాన చంద్రిక’’ ముద్రణమగుచున్నది. వీరు ప్రస్తుతము అనంతపురము శ్రీ సాయిబాబా జూనియర్ కళాశాలయందు సంస్కృతోపన్యాసకులుగా పనిచేయుచున్నారు. వీరి సాహితీ సేవ, సంస్కృతభాషా సేవ, వేద పారశాలపోషణ, మున్నగునవి మిక్కిలి ప్రశంసార్హములు. దేశమునందలి సుప్రసిద్ధ విద్వాంసుల చేత మన్నన లందుకొనిన వీరి జీవితము ధన్యము. వీరికి శంకరుడు ఆయురారోగ్య భాగ్యములిచ్చి, కాపాడుగాత.

రాయలసీమ రచయితల నుండి…

———–

You may also like...