గొల్లాపిన్ని రామకృష్ణ శాస్త్రి (Gollapinna Ramakrishna Sastry)

Share
పేరు (ఆంగ్లం)Gollapinni Ramakrishnasatry
పేరు (తెలుగు)గొల్లాపిన్ని రామకృష్ణ శాస్త్రి
కలం పేరు
తల్లిపేరుసుబ్బమ్మ
తండ్రి పేరుగొల్లాపిన్ని సీతారామశాస్త్రి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1922
మరణం2001
పుట్టిన ఊరుచిన్నముష్టూరు, అనంతపురం జిల్లా.
విద్యార్హతలు
వృత్తిఆయుర్వేద, జ్యోతిష పండితుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికగొల్లాపిన్ని రామకృష్ణ శాస్త్రి
సంగ్రహ నమూనా రచనసీ. కాకతి క్ష్మాపతి కాంచుచున్నాడు హ
ర్షాశ్రు ముక్తామాల సంతరించి,
హరిహర బుక్కరాయలు కాంచుచున్నారు
తెలినవ్వు చలువ వెన్నెలల బరసి
ఘనుడు విద్యారణ్యముని పల్కుచున్నాడు
సిరిలొల్క వైదికాశీస్సు గురిపి
శ్రీకృష్ణరాయలు నాకొనుచున్నాడు
శక్రుతో నాంధ్ర ప్రశస్తియేమొ

గొల్లాపిన్ని రామకృష్ణ శాస్త్రి

సీ. కాకతి క్ష్మాపతి కాంచుచున్నాడు హ
ర్షాశ్రు ముక్తామాల సంతరించి,
హరిహర బుక్కరాయలు కాంచుచున్నారు
తెలినవ్వు చలువ వెన్నెలల బరసి
ఘనుడు విద్యారణ్యముని పల్కుచున్నాడు
సిరిలొల్క వైదికాశీస్సు గురిపి
శ్రీకృష్ణరాయలు నాకొనుచున్నాడు
శక్రుతో నాంధ్ర ప్రశస్తియేమొ
గీ. గురుని కెఱిగించు చుండె తిమ్మరుసుమంత్రి
ఆంధ్రమంత్రుల సాహసౌదార్యములను
గతచరిత్రకు నీకు దార్కాణవారె
వచ్చియున్నారు నీయుత్సవంబుఁజాడ
అనుచు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవమున ‘మహాంధ్రోదయ’మను పేరు పద్యములను వ్రాసి కమ్మగాపడి వినిపించిన కవివరేణ్యులు శ్రీ గొల్లాపిన్ని రామకృష్ణశర్మగారు. వీరు గొల్లాపిన్ని సోదరత్రయంలో కరు. పెద్దవారు శ్రీ గొల్లాపిన్ని వాసుదేవశాస్త్రిగారు, రెండవవారు శ్రీ గొల్లాపిన్ని రామచంద్రశాస్త్రిగారు. వీరిది పండితవంశము. శ్రీరామ కృష్ణశాస్త్రిగారికి కవిత్వము ఉగ్గుపాలతోనే అబ్బినది. ఆయుర్వేదశాస్త్రము నందుకూడ అనుభవము సంపాదించుకొన్నారు. ఆబ్కారీ డిపార్టుమెంటులో పలుతావులందు మఱియు కడపలో చాలాకాలము పనిచేసిరి.
శ్రీ రామకృష్ణశాస్త్రిగారు ‘‘బుద్ధదేవా నమః’’ అను శీర్షిక క్రింద వ్రాసిన పద్యములు కడురమ్యముగా నున్నవి. గమనింపుడు.
సీ. కొనకొమ్మ కోయిల – కొసరు కూతలలోన
ప్రియురాలి పిలుప – విన్పింప లేదె?
నిండు జాబిల్లి పండించు, వెన్నెలలోన
వెల్లనొ మొము కాన్పింపలేదె?
చేరువ సరపిలో – చెంగల్వ రేకులో
చెమరించు, కనుల లక్షింపలేదె?
రాయంచ నడలోన – రవళించు పల్కులో
నినదించు నందెల వినగలేదె?
గీ. నీవు తపియించు చుండ, మైనీడబోలె
ప్రకృతిలో, లీనమౌచు, నద్వైతభక్తి
జంటఁబాయక నీవెనువెంటనున్న
నీ యశోధరనైన మన్నింప లెమ్ము.
ఉ. వృద్ధుఁడు తండ్రి – నిన్ను కనిపెంచిన వాడికమీద, నీకె-యా
వద్ధరణీ భరమ్ముఁదలపై నిడి, ఐహికకాక్షవీడి, ఏ
సిద్ధపదాశ్రమమ్ములనొ, శేషవయస్సు, వ్యయింపజేయ, స
న్నద్ధత నుండ – నీకు దగునా యిలువీడగ శాక్యదీపకా?
ఇట్టి కవిగారిని గూర్చి మనమెఱిగినది కొంత. అతడు లోకమునకు చెప్పినది కొండంత; అతనిలో దాగియున్న భావములు సంద్రమంత. లోకమతనికిచ్చు ప్రతిఫల మిసుమంత. అందులకాతడు ఆశింపకుండుట కడువింత. కవులనై జగుణములిట్టివేగదా; వీరిప్పుడు ఉద్యోగవిరమణానంతరము అనంతపురములో విశ్రాంతి తీసుకొనుచు, ఉన్నంతలో సాహిత్యసేవ సల్పుచున్నారు. వీరికి భగవంతుడు ఆయురారోగ్య భాగ్యములిచ్చుగాత.

———–

You may also like...