శ్రీనివాసపురం రామాచార్యులు (Srinivasapuram Ramacharyulu)

Share
పేరు (ఆంగ్లం)Srinivasapuram Ramacharyulu
పేరు (తెలుగు)శ్రీనివాసపురం రామాచార్యులు
కలం పేరురమ్యశ్రీ
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1935
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తితంతి తపాలాశాఖ
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలురఘునాథవిజయము, దీవికోట, జ్ఞాతికలహము, రాజ్యక్షయము.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికశ్రీనివాసపురం రామాచార్యులు
సంగ్రహ నమూనా రచనఈ సోదరపంచకములో వీరు ఐదవవారు. జననం 1935. కలంపేరు ’’రమ్యశ్రీ’’. తంతి తపాలాశాఖలో ఉద్యోగం చేసిరి. వీరు తమ 15వ ఏటనే కథారచనను ప్రారంభించిరి. వీరిది ఆవేశపూరిత హృదయము. రచనాశైలి సరళముగా నుండి సునిశితమైన హాస్యము మిళితమై చమత్కారముగా వ్రాయుట వీరికిగల నేర్పు. వీరికి వచనరచనమీద మక్కువ మెండు. వీరు వందకు పైగా కథలు వ్రాసిరి. అన్ని పత్రికలలోను అవి వెలుగుచూచినవి.

శ్రీనివాసపురం రామాచార్యులు

ఈ సోదరపంచకములో వీరు ఐదవవారు. జననం 1935. కలంపేరు ’’రమ్యశ్రీ’’. తంతి తపాలాశాఖలో ఉద్యోగం చేసిరి. వీరు తమ 15వ ఏటనే కథారచనను ప్రారంభించిరి. వీరిది ఆవేశపూరిత హృదయము. రచనాశైలి సరళముగా నుండి సునిశితమైన హాస్యము మిళితమై చమత్కారముగా వ్రాయుట వీరికిగల నేర్పు. వీరికి వచనరచనమీద మక్కువ మెండు. వీరు వందకు పైగా కథలు వ్రాసిరి. అన్ని పత్రికలలోను అవి వెలుగుచూచినవి.
సోదరులు తలపెట్టిన ‘‘విజయనగర నవలా మాలిక’’ రచనా కార్యక్రమములో వీరిరచన నాంది పలికినది. ఆ నవలా మాలికలోని 11వ సంపుటమైన ‘‘జగన్మోహిని’’ని వీరు తొలుత ఆంధ్ర పాఠకలోకమునకు అందించిరి. ఈ నవలల ధాషాంతరీ కరణకు వీరు ప్రధానకర్తలు. ఈ సంపుటములలోని మరికొన్ని భాగములగు ‘‘కుమారరాముడు, తౌళవేశ్వరుడు, అమాత్య రత్నము, జ్ఞాతికలహము’’లకు వీరు ప్రధాన సంచాలకులు. ‘‘ప్రణయబంధము-మీరాబాయి-కన్నీటికడలి’’ వీరి మరికొన్ని నవలలు. తండ్రి వద్ద అంతేవాసిగా మెలగి 15 ఏండ్లు ఆయుర్వేద వైద్యమును నేర్చి – ప్రభుత్వ పట్టముపొంది, ఆంధ్ర ప్రభుత్వంలో అర్హతగల వైద్యులుగా గుర్తింపబడిరి.

విద్యానగర నవలామాలిక
ఈ సోదర పంచకముచే రచింపబడిన, ఈ సంపూర్ణ విజయనగర సామ్రాజ్యేతిహాసము 20 సంపుటములు. క్రీ.శ. 1224 నుండి క్రీ.శ. 1656 వరకు గల చరిత్ర యిది. ఇందలి మొదటి ఐదు భాగములు విజయనగర సామ్రాజ్యోదయ ఘట్టమును (1224 నుండి 1336) వివరించు నవలలు. అవి 1) దేవగిరి దుర్గము, 2) దేవగిరి పతనము, 3) కంపిలరాయలు, 4) కుమారరాముడు, 5) రాజ్యోదయము.
6 నుండి 12 భాగములు సామ్రాజ్య వైభవ ఘట్టముల (1336-1528) ను విశదపరచు నవలలు. అవి 6) రాయపరాభవము, 7) సమ్రాట్ ప్రౌఢ దేవరాయలు, 8) రాజ్యక్రాంతి, 9) తాళవేశ్వరుడు, 10) నాగలాదేవి, 11) జగన్మోహిని, 12) శాంతివాది.
13 నుండి 15 భాగములు ‘‘సామ్రాజ్య దురంతఘట్టము’’ (1528-11565)లను తెలుపు నవలలు. అవి 13) రాజద్రోహి, 14) అమాత్యరత్నము, 15) పిచ్చి ప్రభువు, 16) రాక్షసి-తంగడి.
17 నుండి 20 భాగములు ‘‘సామ్రాజ్య పతనఘట్టము’’ (1565-1656) వరకు వ్రాయబడిన సంపుటములు. అవి 17) రఘునాథవిజయము, 18) దీవికోట, 19) జ్ఞాతికలహము, 20) రాజ్యక్షయము.
ఈ నవలా మాలికకు, శ్రీ కొరటి శ్రీనివాసరావు గారు రచించిన కన్నడ నవలలు మూలము. కాని, ఈ సోదరపంచకము మూలమున లేని అమూల్యములగు అంశములతో, మూలమును మించిన, జిగిబిగితో వీరి రచనలు నొప్పారుచున్నట్లు ప్రముఖ సాహితీవేత్తలు – పరిశోధనాకర్తలు ప్రశంసించిర. భీహార్ గవర్నరుగా నుండిన శ్రీమాన్ మాడభూషి అనంతళయనం అయ్యం గారు వీరి పుస్తకాలను గూర్చి వ్రాసిన అభిప్రాయ మిట్లున్నది. ‘‘డా. శేషాచార్లు – వీరి సోదరులు నల్వురు, కూడా వీరితో సమానముగా రచనా వ్యాసంగంలో కృషిసల్పినారు. వీరందరూ కలిసి వ్రాసిననూ, ఈ సాహిత్యం ఏక కంఠంతో వినిపించినట్లున్నది. శ్రీనివాసపురం సోదరపంచకము, మిక్కిలిగా శ్రమించి జీవితము నర్థంచేసికొని, బ్రతుకుతో రాజీపడి, కాలంతోకిలిసి మనకు సంతరించియిచ్చిన ఈ ‘‘విజయనగర సామ్రాజ్య చారిత్రక నవలా సంపుటిని తెలుగు పాఠకలోకం సహృదయంతో ఆదరించగలదని విశ్వసిస్తున్నాను.’’
ఈ సోదర పంచకము ఈ కృషి తరువాత కలసి సాగించిన కృషి మరొకటేదియులేదని తెలియుచున్నది. ఈ రచనాయజ్ఞమును బహుప్రయాసలకోర్చి పరిసమాప్తి గావించిన ఈ సోదరులకు ఆంధ్రులెంతయో, ఋణపడి వున్నారు. 1968 తరువాత ఈ నవలలు మరలా పునర్ముద్రింపబడలేదని తెలియుచున్నది. ఇవి పునర్ముద్రింపబడినచో అది ఆంధ్రుల మహద్భాగ్యముగా నెంచవచ్చును. ఈ సోదరులకు శారదామాత ఆయురారోగ్యభాగ్యము లొసంగుగాత.

———–

You may also like...