గరుడంపల్లి రోషన్ (Garudampalli Roshan)

Share
పేరు (ఆంగ్లం)Garudampalli Roshan
పేరు (తెలుగు)గరుడంపల్లి రోషన్
కలం పేరు
తల్లిపేరుమెహబూబీ
తండ్రి పేరుముష్కీన్వలీ
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ9/11/1942
మరణం
పుట్టిన ఊరుగరుడంపల్లి, ధర్మవరం తా. అనంతపురం జిల్లా.
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికగరుడంపల్లి రోషన్
సంగ్రహ నమూనా రచనభారతరత్న, శాంతిదూత, భారత ప్రియతమ నాయకుడు శ్రీ చాచానెహ్రూ, దివంగులైనప్పుడు యావద్భారతదేశమే శోకసముద్రములో మునిగింది. అనంతపురంలో, ఆ ప్రియతమ నాయకునకు శ్రద్ధాంజలి ఘటించడానికి ఒక సంతాపసభ జరిగింది. ఆ సభకు ప్రముఖులందరూ హాజరయ్యారు. శ్రీ కల్లూరు సుబ్బరావుగారు ఆ సభకధ్యక్ష్లు. పెక్కుమంది కవిపండితులు తమ ప్రగాఢ సంతాపమును వెల్లడించి జోహార్లు అర్పించిరి.

గరుడంపల్లి రోషన్

భారతరత్న, శాంతిదూత, భారత ప్రియతమ నాయకుడు శ్రీ చాచానెహ్రూ, దివంగులైనప్పుడు యావద్భారతదేశమే శోకసముద్రములో మునిగింది. అనంతపురంలో, ఆ ప్రియతమ నాయకునకు శ్రద్ధాంజలి ఘటించడానికి ఒక సంతాపసభ జరిగింది. ఆ సభకు ప్రముఖులందరూ హాజరయ్యారు. శ్రీ కల్లూరు సుబ్బరావుగారు ఆ సభకధ్యక్ష్లు. పెక్కుమంది కవిపండితులు తమ ప్రగాఢ సంతాపమును వెల్లడించి జోహార్లు అర్పించిరి. వీరందరిలోను ఒక యువకవి వ్రాసిన ‘‘పంచాశ్రువులు’’ అందరి మన్ననల నందుటేగాక కల్లూరు సుబ్బరావుగారి మెప్పును ఆశీస్సులను పొందడం జరిగింది. ఆ కవి వ్రాసిన పద్యమిది.
ఉ. నెత్తురు లింకినట్టి ధరణీస్థలి, నీతియు దేశభక్తియున్
గిత్తలగట్టి ధర్మమును కేల హలంబుగ బట్టి, సత్యపున్
సత్తువబెట్టి, సాత్త్వికపు సస్యములన్ మొలిపించి, శాంతి సం
పత్తిని పెంచినట్టి ‘‘కృషిపండితు’’డా జవహారు డుర్వరన్.
ఈ పద్యమువిన్న ప్రతిఒక్కరు, ఆనాడె ఈ యువకుడు మంచి కృషి గావించిన చక్కటి రచనలుచేయగలడని తలచిరి. ఆ కృషిని విడువక ఆ యువకుడు తెలుగు సాహిత్య నందనోద్యానవనంలో, సుగంధ కవితా పుష్పములను పూయించినాడు. మహమ్మదీయ కుటుంబమున పుట్టిన ఆ కవిపేరు గరుడంపల్లి రోషన్.
శ్రీ రోషన్ చిన్నతనంనుండి భారతీయ జాతి సమైక్యతా భావమును కలిగిన అభ్యుదయవాది. వీరి తండ్రి ముష్కీన్వలీ ఉపాధ్యాయ వృత్తిని నిర్వర్తిస్తూ, కవిత్వాన్ని కైవశం చేసుకొని, ఎన్నో ఖండికలు ‘‘నానార్థపద్యరత్నాకరము’’ అను వేయి కందములుగల గ్రంథము రచించినవారు. ఈతని పెద్దతల్లి యం. రాబీయాబీ (చియ్యేడు) అనంతపురం డిస్ట్రిక్టు బోర్డు మెంబరుగా పేరు గడించి, ‘‘క్విట్ ఇండియా’’ ఉద్యమంలో కారాగార శిక్ష అనుభవించిన తొలి మహమ్మదీయ వనిత. శ్రీ పొట్టి శ్రీ రాములుగారు ఈమెను, ‘‘మహమ్మదీయ ఆదర్మమహిళ‘‘గా ప్రశంసించిరి.
ఈ కవికి కులమంతముల యెడ సంకుచిత భావములేదు. పుట్టింది మహమ్మదీయ మతంలోనైనా తొలుత వినాయకునికి సలాములు చేసి కవిత ప్రారంభించును. తిరుపతి వేంకటేశ్వరుని తన యిష్టదైవంగా భావించును. అల్లాను రాధించును. అందుకే ఆయనంటాడు ‘‘నాది భారతజాతి’’ అని. ‘‘నేను-నాదేశం’’ అనే ఖండికలో యిట్లా చెప్పుకొంటాడు.
తే. సంకుచిత వర్ణభేదముల్ సమయజేసి
పరగు సువిశాల దీర్ఘ దృక్పథము నాది
మతము, కులమను, నంధతమస్సు బాసి
ప్రభలు జిందెడి దృఢ మనోరథము నాది.
శ్రీ రోషన్ కవిత్వము, శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి కవిత్వాన్ని జ్ఞప్తికి తెస్తుంది. ఈతని కవిత్వం అతి మృదుమధురంగా, సరళంగా, భావయుక్తంగా, రమ్యతగా ఉషఃకాలంలో వీచే మలయమారుతంగా సాగిపోతుంది. ఇతనిది జీవమున్న కవిత్వము. సహజ సుందరంగా పూచి, మొగ్గతొడిగి, వికసించి, గుబాళించే గులాబీ సొబగులావుంటుంది వీరి రచన. ‘‘రాగసుందరి’’ ఖండికలో వీరి సుందరమైన రచన యిలా సాగింది.
ఉ. కొమ్మలమాటులో, కొదమకోయిల, కమ్మగ పాడసాగె రా
రమ్ముసఖీ సుఖింతమనురాగ సుధాంబుధిలోనదేలి, ప్రా
యమ్మికరాదు; రేపనెడి యాసలు జూపగనేల నింక? నీ
కమ్మనిమోని పానమును, కాన్కగ నీయవె; రాగసుందరీ
వీరు వ్రాసినవన్నీ ఖండికలే. అన్నీ అముద్రితాలే. పుస్తకరూపమున కింకా ఎక్కలేదు. సాహితీ మిత్రుల ప్రోద్భలముతో వీరు ‘‘చంద్రవదన – మోహియార్’’ అను ‘‘ప్రేమైక్యజీవుల’’ చారిత్రాత్మక కథావస్తువును గైకొని కావ్యముగా వ్రాసిరి. ఇందలి పద్యములు రసగుళికలు. ఆ కావ్యము వెలుగు జూచెడి భాగ్యము కవిగారికి భగవంతుడు కలిగించుగాత.
‘‘సత్యభామ సాంత్వనము’’ – ‘‘మణిమేఖల’’ – ‘‘భావతరంగాలు’’ మరికొన్ని నాటికలు – పాటలు – పద్యాలు, వీరి అముద్రిత రచనలు. వృత్తి రీత్త్యా ఉపాధ్యాయులగుటచే, పుస్తకములు స్వంతముగా ముద్రించుకొని ఆర్థికస్తోమత వారికి లేదు. చిన్న తనమునుండి సంగీతము – సాహిత్యములమీద అభిమానం మెండు. తాను వ్రాసిన పాటలు, పద్యాలకు చక్కటి బాణీలను రాగాలను కూర్చి పాడగల నేర్పరి. కొందరి తేనెమాటలు నమ్మ, సినిమా రచయితగా పైకి రావాలని ఉబలాటపడి, అక్కడి వారి స్వార్థ బుద్దులను పసిగట్టి, ‘‘వారు ఉన్నత స్థితికి రావడానికి మనల్ని నిచ్చెనలుగా ఉపయోగించుకొంటారే తప్ప మనల్ని పైకి రానీరు’’ అని తెలుసుకొన్న కవి రోషన్. ఈతనికి భగవంతుడు భవిష్యత్తులో, ఆయురారోగ్య భాగ్యములనిచ్చి కాపాడుగాత.

———–

You may also like...